బాలీవుడ్ భామ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'ఆర్టికల్ 370'. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ నిర్మాతగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు అంశమే తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో యామి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
అయితే తాజాగా ఈ మూవీలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో శ్రీరాముని పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరుణ్ గోవిల్. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో ఆయన కనిపించారు. చాలా మంది అభిమానులు ట్రైలర్‌లో ప్రధాని మోడీగా కనిపించిన అరుణ్ గోవిల్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రలో కనిపించిన కిరణ్ కర్మాకర్‌ని నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదల కానుంది.
#ArunGovil as Modi Ji in Upcoming movie #Article370 #YamiGautam
पहचान गए तो एक लाइक तो बनता है pic.twitter.com/A4mfbLCF6r— 📍 (@ghatnachakr) February 8, 2024
Symbolism galore. Arun Govil who played Lord Ram playing PM Modi.
Trailer looks quite amazing. Looks like a high octane action drama. If things work out can be a great hit. Yami is too good an actress. #Article370 https://t.co/n9pUvpyXYn— Ujjawal Pratap Singh (@pratap_pablo) February 8, 2024
Comments
Please login to add a commentAdd a comment