
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 21 పోలాండ్‌లో పర్యటించనున్నారు. ఆగష్టు 23న యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి తన్మయలాల్ సోమవారం ప్రకటించారు.
కాగా భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చించనున్నారు.
మరోవైపు రష్యాతో వివాదం తర్వాత ఉక్రెయిన్‌లో ప్రధాని తొలి పర్యటన ఇది. గత 30 ఏళ్లలోనూ భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన నెల రోజుల తర్వాత మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.
2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య రాజధానులు మాస్కోపై ఆంక్షలు విధించారు. అయితే భారతదేశం వంటి స్నేహపూర్వక దేశాలు దానితో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment