
వార్సా: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం(ఆగస్టు21) సాయంత్రం పోలెండ్ చేరుకున్నారు. రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం పలికారు.
భారత్, పోలెండ్ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలెండ్‌లో పర్యటిస్తున్నారు. పోలెండ్ పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు.