ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చు
వైద్య శాఖ అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటెల్
కాళోజీ సెంటర్ : ప్రభుత్వ సర్వీసుల్లో సేవ చేయడం ఇష్టం లేని వారు స్వచ్ఛందగా వెళ్లిపోవచ్చని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. మంçగళవారం కలెక్టరేట్ కార్యాలయలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పీహెచ్‌పీ డాక్టర్లతో జిల్లాలో అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు అందిస్తు ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్యుల పనిచేయాలన్నారు. కొన్ని చోట్ల డాక్టర్లు విధుల్లో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి విషయంలో పూర్తిగా వెనుక బడిన బానోజీపేట పీహెచ్‌పీలోని ఇద్దరు వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మేడేపల్లి, అలాంకార్‌పేట, నల్లబెల్లి, పీహెచ్‌సీల పనితీరు సక్రమంగా లేదన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ అశోక్‌అనంద్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనురాధ, వెంకటరమణ, పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.
చెరువు కట్టలపై మొక్కలు నాటాలి..
హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలంలో ఉన్న చెరువు కట్టలపై మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఇరిగేషన్, ఎక్సైజ్‌శాఖలకు సమానంగా కేటాయించడంతో పాటు, చెరువు కట్టలపై ఈత, తాటి, కర్జూర మొక్కలు నాటే విధంగా కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ పురుషోత్తం, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిషన్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ మహేందర్‌జీ, రవి పాల్గొన్నారు.