మెరుగైన వైద్యమే లక్ష్యం
► అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
► కలెక్టర్ ఇలంబరిది
► భైంసా ఆస్పత్రి తనిఖీ
భైంసా : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఇలంబరిది అన్నారు. శుక్రవారం భైంసా ఏరియా ఆస్పత్రిని ఆయ న తనిఖీ చేశారు. నిర్మల్ ఎంసీహెచ్, భైంసా ఏరియా ఆస్పత్రుల్లో ఏటా 300లకు పైగానే ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో డెలవరీ రూంలను మరింత విస్తరించి సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ఏరియా ఆస్పత్రికి అవసరమైన కొత్త మంచాలు, ఇస్తామని తెలిపారు. ఐసీయూలో అవసరం ఉండే పరికరాలను మంజూనే చేయిస్తామన్నారు. పేదల వైద్యం కోసం అవసరమయ్యే స్కానింగ్, వైద్య పరికరాలు మంజూరయ్యేలా చూస్తామని చెప్పా రు. భైంసా, నిర్మల్ ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. భైంసాలో నాలుగు, నిర్మల్‌లో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసే విషయంపై దృష్టిసారిస్తామని వివరించారు.
ఏరియా ఆస్పత్రికి వచ్చే వారికి మె రుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది కి సూచించారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో వార్డులు, ఆపరేషన్ థియేటర్‌లను పరిశీలించారు. ఆస్పత్రి వెనుకాల ఉన్న పరిసరాలను చూశారు. సెక్యూరిటీని పెంచుతామని తెలిపారు. అలాగే భైంసా, నిర్మల్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందే వైద్యం తదితర విషయాల ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. సి బ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించా రు. అత్యవసర సమయాల్లో అందరూ ఉండి అయినసరే మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, సేవలు అందించే వైద్యు లు, నర్సులతో ఈ సందర్భంగా సమావేశమయ్యారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ సురేశ్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోమురళీకృష్ణ ఉన్నారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు
నిర్మల్ టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలంబరిది పేర్కొన్నారు. నిర్మల్ ప్రభుత్వ ప్రసూతి వైద్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రసూతి వైద్య కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాలు, కొత్త లేబర్ వార్డులో బెడ్లు, సిజేరియన్ థియేటర్‌లో ఎయిర్ కండీషన్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్, వైద్యులు పాల్గొన్నారు.