పీహెచ్‌సీల్లో కాన్పుల సంఖ్య పెంచాలి
సమీక్షలో కలెక్టర్ వాకాటి కరుణ
ఎంజీఎం : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో సేవలు మెరుగపరుచుకుని కా న్పుల సంఖ్యను పెంచకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కరుణ హె చ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రోగ్రాం అధికారులతో పాటు ఎన్‌పీహెచ్ , పీహెచ్‌సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 36 పీహెచ్‌సీలలో కేవలం 8 నుంచి 10 పీహెచ్‌సీలలో మాత్రమే కాన్పులు జరగడమేమిటని ప్రశ్నించారు. మిగతా వాటిలో కూడా కాన్పు లు తక్కువగా జరగడానికి కారణాలను సమీక్షించుకుని తగిన సౌకర్యాలు మెరుగుపరచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎం హెచ్‌ఓ సాంబశివరావు, అడిషనల్ డీఎంహెచ్‌ఓ శ్రీరాం, డీఐఓ హ రీశ్‌రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దయానందస్వామి పాల్గొన్నారు.
వైద్యసేవల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి
హన్మకొండ అర్బన్ : కమ్యూనిటీ హెల్త్ సెంట ర్లకు చెందిన డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్‌లో సీహెచ్‌సీ సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులతో శ నివారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీక్షల ద్వారా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు కొంత మెరుగు పడిందన్నారు. దాదాపు అన్ని సీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో లేబర్ టేబుల్స్ కొనుగోలు చేశామన్నారు.
డోర్ కర్టెన్లు, బెడ్‌షీట్లు అందుబాటులో ఉన్న నిధులతో కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల ఆవరణలో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని 8 సీహెచ్‌సీలు, 2 ఏరియా ఆస్పత్రుల్లో 6 హెల్త్ సెంటర్లు నిర్ణీత లక్ష్యాలు సాధించాయని వివరించారు. చేర్యాల, పరకాల, గూడూరు, చిట్యాల హెల్త్ సెంటర్ల పనితీరు సరిగాలేదని, చేర్యాల ఆస్పత్రిని తాను ఇటీవల మూడు సార్లు సందర్శిస్తే.. సిబ్బంది, డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చేర్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పరకాల గైనకాలజిస్టును బదిలీ చేయాలని పేర్కొన్నారు.
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు..
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యాధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వాకాటి కరుణ హెచ్చరించారు. ఆస్పత్రులకు వచ్చే పేదలకు మానవత్వంతో వైద్యసేవలు అందించాలన్నారు. త్వరలో జనగామ, ములుగు, నర్సంపేట ఆస్పత్రులకు స్కా నింగ్ మిషన్లు కొనుగోలు చేస్తామన్నారు. న ర్సంపేటలో బ్లడ్‌స్టోరేజీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏప్రిల్, మే, జూన్ నె లలకు సంబంధించి డ్రగ్స్ ఆవశ్యకతపై నివేదిక అందజేయాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉ న్నందున అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఏసీలు కొనుగోలు చేస్తామన్నారు. డీసీహెచ్‌ఎస్ సంజీవయ్య, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సూపరింటెండెంట్లు,ై గెనకాలజిస్టులు పాల్గొన్నారు.