అనంతపురం అర్బన్ : యువతని, విద్యార్థులను రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేర్చి, ప్రజాసేవలో భాగస్వాములను చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, కలెక్టర్, కోన శశిధర్ అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రెడ్‌క్రాస్ సంస్థ పనిచేస్తోందన్నారు. జిల్లాలో 800 మంది సభ్యులు ఉన్నారన్నారు.
రెడ్‌క్రాస్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలనే సంకల్పంతో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ చాప్టర్‌లను పాఠశాల, కళాశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులతో జూనియర్ రెడ్ క్రాస్, డిగ్రీ, పీజీ విద్యార్థులతో యూత్ రెడ్‌క్రాస్ ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నుంచే విద్యార్థులను సభ్యులుగా నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశామన్నారు. ఈ నెల 22న రాష్ట్ర కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేఛల్ ఛటర్జీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని ఈ లోగా ప్ర