పేద మహిళలకు నిత్యావసరాలు అందిస్తున్న మహ్మద్ నజీబ్
గోల్కొండ: 11 ఏళ్లుగా పేద బడుగు వర్గాలకు, వితంతువులకు సేవలు అందిస్తున్నామని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ నజీబ్ అన్నారు. ఆర్గనైజేషన్ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన టోలిచౌకిలోని తన కార్యాలయంలో వితంతువులు, వృద్ధమహిళలకు నిత్యావసరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
11 ఏళ్లలో ఇప్పటి వరకు 4వేల మంది జంటలు, కుటుంబాలకు విజయవంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి వారిని కలిపినట్లు చెప్పారు. అంతేగాకుండా 150 మంది వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. కరోనా విజృంభించిన సమయంలో కోవిడ్–19 పాజిటివ్ వారికి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడంతో పాటు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment