poor facilities
-
టికెట్లకు రూ.4 లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుంది. సాంకేతిక లోపాలు, ప్రయాణికుల చేష్టలు, ఎమర్జెన్సీ ల్యాండిగ్ వంటి వివిధ తప్పిదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా తన కుటుంబంతో కలిసి సంతోషంగా ప్రయాణించాలనుకున్న ఓ మహిళకు ఎయిర్ ఇండియా విమానంలో చేదు అనుభవం ఎదురైంది. రూ. 4.50 లక్షలు పెట్టి టికెట్లు కొని ప్రయాణిస్తే.. విమానయాన సంస్థ సౌకర్యాలు చూసి షాకైంది. తనకు ఎదరైన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల శ్రేతి గార్గ్ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ నుంచి టొరొంటోకు ఎయిర్ ఇండియా విమానంలో బయలు దేరింది. తన ప్రయాణంలో ఆమె అనేక సమస్యలను ఎదుర్కొంది. తమకు కేటాయించిన సీట్ల హ్యాండిల్స్ విరిగిపోయి వైర్లు బయటకి వచ్చి ఉన్నాయని, ఎదురుగా ఉన్న స్క్రీన్లు సైతం పని చేయలేదని తెలిపింది. సిబ్బంది వాటిని రీబూట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. ఇవన్నీ చాలవన్నట్టు ఓవర్ హెడ్ లైట్లు పని చేయలేదు. దీంతో ఆమె తన చిన్నారులతో చీకట్లో గడపాల్సి వచ్చింది. వెలుతురు కోసం తన ఫోన్ టార్చ్‌లైట్‌ను ఉపయోగించింది. అయితే టిక్కెట్ల కోసం రూ.4.5 లక్షలు చెల్లించినప్పటికీ, నాసిరకం సేవలు అందించడంపై సదరు మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Shreyti Garg (@humpty02dumpty) ‘ఎయిర్ ఇండియాలో ముందుగానే టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రయాణికుల జర్నీని సాఫీగా సాగేలా చేయకుండా.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మాలాంటి తల్లిదండ్రులకు అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేశారు. తెగిన వైర్ల కారణంగా మా చిన్నారుల రక్షణపై ఆందోళన చెందాం. ఈ జర్నీ మాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ’ అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మూడు మిలియన్ల వ్యూస్ లభించాయి. ఆమె పోస్ట్‌పై ఎయిర్ ఇండియా స్పందించలేదు. -
టీఎఫ్‌సీఓ.. ప్రజాసేవలో 11 వసంతాలు
గోల్కొండ: 11 ఏళ్లుగా పేద బడుగు వర్గాలకు, వితంతువులకు సేవలు అందిస్తున్నామని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ నజీబ్ అన్నారు. ఆర్గనైజేషన్ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన టోలిచౌకిలోని తన కార్యాలయంలో వితంతువులు, వృద్ధమహిళలకు నిత్యావసరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 ఏళ్లలో ఇప్పటి వరకు 4వేల మంది జంటలు, కుటుంబాలకు విజయవంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి వారిని కలిపినట్లు చెప్పారు. అంతేగాకుండా 150 మంది వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. కరోనా విజృంభించిన సమయంలో కోవిడ్–19 పాజిటివ్ వారికి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడంతో పాటు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
రిజిస్ట్రేషన్.. ఫ్రస్టేషన్
ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వాటిల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. క్రయ–విక్రయాల నిమిత్తం ఈ కార్యాలయాలకు నిత్యం ఎంతో మంది వచ్చి వెళ్తారు. వీళ్లకు కావల్సిన సౌకర్యాలను అక్కడి సిబ్బంది సమకూర్చాల్సి ఉంది. కానీ మచిలీపట్నంలో అందుకు విరుద్ధంగా సాగుతోంది. లాక్డౌన్ సాకుతో ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన గేటుకు తాళాలు వేస్తున్నారు. దీంతో వచ్చే వారు లోపలకి వెళ్లేందుకు నానా ఇబ్బందీ పడుతున్నారు. ఇక్కడ అతి జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు, కార్యాలయం లోపల మాత్రం భౌతిక దూరం విషయంలో ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కార్యాలయానికి వచ్చే వారు వేచి ఉండేందుకు అందుబాటులో రేకులు షెడ్డు ఉన్నప్పటికీ, ఫ్యాన్లు తిరగకపోవటంతో, ఎండవేడిమి తాళలేక అక్కడి నుంచి వచ్చేసి, ప్రాంగణంలోని చెట్లు క్రింద కూర్చుంటున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం ఇక్కడ నెలకొన్న సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. –సాక్షి ఫొటోగ్రాఫర్, మచిలీపట్నం పనిచేయని ఫ్యాన్లు చెట్ల నీడే దిక్కు! -
సమస్యల్లో ‘సంక్షేమం’
ఇల్లెందు : జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. అనేక పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేవు. ప్రధానమైన తాగునీటి సౌకర్యం లేదు. డైనింగ్ హాళ్లు, బంకర్ బెడ్లు, డార్మెటరీ, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులు కరువయ్యాయి. విద్యార్థులకు పోషకాహారం కూడా సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం భద్రాచలం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 12 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం విదితమే. జిల్లాలో 9 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 3720 సీట్లు ఉండగా, ప్రస్తుతం సుమారు 3000 మంది చదువుతున్నారు. ఈ తొమ్మిదింటిలో ఐదు పాతవి, నాలుగు కొత్తవి ఉన్నాయి. నూతన గురుకులాల్లో నూటికి నూరు శాతం సమస్యలు తాండవిస్తున్నాయి. ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం బోధన.. భద్రాచలంలో బాలికలకు, మణుగూరులో బాలుర కోసం 5 నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియంలో గురుకులాలు ఏర్పాటు చేశారు. పాల్వంచలో మాత్రం డిగ్రీ కళాశాల ఉంది. ఇల్లెందులో ప్రస్తుతానికి 5 నుంచి 7వ తరగతి వరకే ఉన్నాయి. మణుగూరు, పాల్వంచ, భద్రాచలంలో రెండేళ్ల క్రితం, ఇల్లెందులో ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఒక్కో తరగతిలో 70 మంది(సెక్షన్‌కు 35 మంది చొప్పున) ఉన్నారు. గతంలో కొత్తగూడెంలో అద్దె భవనంలో ఉన్న డిగ్రీ కళాశాలను ఇప్పుడు పాల్వంచకు మార్చారు. ఇక్కడ 440 సీట్లు ఉండగా, 294 మంది మాత్రమే చదువుతున్నారు. అంతటా అరకొర వసతులే.. జిల్లాలోని గురుకులాల్లో సమస్యలు తిష్ట వేశాయి. ఇల్లెందులో భవనం లేక మంజూరైనా ఒక ఏడాది పాటు ఏర్పాటు చేయలేదు. ఈ విద్యాసంవత్సరంలో సింగరేణి రేడియో స్టేషన్ భవన్‌ను ఎంపిక చేయటంతో పాఠశాలను ప్రారంభించారు. అందులో 22 గదులుండగా 20 గదులు గురుకులానికి ఇచ్చారు. కిందనున్న గదుల్లో తరగతులు, పైన నివాసం కోసం కేటాయించారు. మణుగూరు, భద్రాచలంలో ఏర్పాటు చేసిన గురుకులాలకు సైతం సొంత భవనాలు లేవు. పాల్వంచలో ఉన్న గురుకులం గత ఏడాది వరకు కొత్తగూడెంలో అద్దె భవనంలో కొనసాగింది. ప్రస్తుతం పాల్వంచలో పాత భవనంలో కొనసాగుతున్నా కొత్తగూడెం లో భవనం పూర్తికాగానే తిరిగి అక్కడికి మార్చు తారు. కాగా, అద్దె భవనాల్లో అరకొర సదుపాయాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఏ ఒక్క చోటా డార్మెటరీలు, డైనింగ్ హాళ్లు, బంకర్బెడ్లు, కిచెన్‌షెడ్డు లేవు. మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా పీడిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు మాత్రమే రెగ్యులర్ వారు కాగా ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా కాంట్రాక్ట్ వారే. మెనూ అమలు తీరు ఇలా... విద్యార్థులకు ప్రతిరోజూ ఒకరమైన టిఫిన్, పాలు, బూస్ట్, నూడిల్స్ వంటి అల్పాహారాలతో పాటు నాణ్యమైన భోజనం అందించాలి. కానీ అవన్నీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. మటన్, చికెన్ నాణ్యత విషయాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టర్లు వాటిని సకాలంలో తేకపోవడంతో హడావిడిగా ఉడికీ, ఉడకని వంటలు అందిస్తున్నారు. పాలు, పెరుగు విషయంలో కొలమానాలు పాటించటం లేదు. నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు పెట్టడం లేదు. ఇక ఫిల్టర్ చేసిన నీరు లభించటం కూడా కష్టంగానే మారింది. ఫలితంగా ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. పర్యవేక్షణ పెంచుతాం జిల్లాలోని అన్ని గురుకులాలను త్వరలో సందర్శించి పర్యవేక్షణ పెంచుతాం. ప్రిన్సిపాల్లు ఎక్కడికక్కడే సదుపాయాలు కల్పించుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకుంటాం. సొంత భవనాలు లేక పోవటం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. రానున్న కాలంలో అన్ని గురుకులాలకు సొంత భవనాలు అందుబాటులోకి వస్తాయి. అద్దె భవనాల్లో ఉన్నప్పటికీ ఈ నెలాఖరు నాటికి సకల సదుపాయాలు కల్పిస్తాం. ప్రభుత్వం ఇప్పటికే మెనూ అమలుతో పాటు సదుపాయాల కల్పన మీద దృష్టి సారించింది. – కె.అలివేలు, ప్రిన్సిపాల్, డీసీఓ -
పైన పటారం లోన లొటారం
శామీర్‌పేట్ : సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలు కలిగిన మండలం... నూతనంగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాకు శామీర్‌పేట మండలంలో నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణం... హైదరబాద్–కరీంనగర్ జాతీయ రహదారి... కనీసం వారంలో ఒక్క రోజైన తెలంగాణ ముఖ్య మంత్రి ప్రయాణించే మార్గం... ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మండలానికి ప్రాథమి క ఆరోగ్య కేంద్రం ఓ మచ్చలా కనబడుతోందని స్థానికులే అంటున్నా రు. ఎందుకంటే ఆరోగ్య కేంద్రం ఎప్పుడూ అపరిశుభ్రత, వసతు లు లేమితో కనబడుతోంది. శామీర్‌పేట మండల ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదిలో రెండుసార్లు రంగులు వేశారు. ఆసుపత్రి బయటి నుంచి చూస్తే మాత్రం రంగులతో కళకళలాడుతోంది. కానీ ఆసుపత్రిలోని సౌకర్యాలు మాత్రం లేవు. రోగుల సౌకర్యార్థ ఏర్పాటు చేసిన మూత్రశాలలు అధ్వానంగా తయారయ్యాయి. ఆసుపత్రి వెనక భాగంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాడైన మాత్రలు, పత్తి, ఇతర చెత్తను ఆసుపత్రి ఆవరణలోనే పడేస్తున్నారు. ఆస్పత్రిలోని వాటర్ ప్లాంట్ పాడైపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నా ఏ అధికారి పట్టించుకున్న పాపానపోలేదు. రోగులతో దురుసుగా ప్రవర్తిస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నగరానికి చేరువలో ఉండటంలో మండలంలో వివిధ గ్రామాల ప్రజలే కాకుండా పక్క మండలాల ప్రజలూ వస్తుంటారు. ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనతో ఇక్కడికి వచ్చే రోగులు మానసికంగా కూడా బాధ పడుతున్నారు. ఈ తీరును వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మార్చుకోవాలి. – ఇర్రి రవీందర్‌రెడ్డి, జగన్‌గూడ గ్రామ ఎంపీటీసీ సీఎం హామీలు ప్రకటనలకే పరిమితం సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్క మండలమైన శామీర్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వానంగా ఉండటం బాధాకరం. ఇక్కడే ఇలా ఉందంటే రాష్ట్రం లో ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక నిధులు కేటాయించి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికైన సంబంధిత అధికారులు మేల్కొని ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలి. – వి.సుదర్శన్, కాంగ్రెస్ మండలం అధ్యక్షులు గాంధీ ఆసుపత్రి అందించే సేవలు ఇక్కడా ఉండేవి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయింది. రాజీ వ్రహదారి పక్కనే ఈ ఆసుపత్రి ఉం డటంతో రోగులు అధిక సంఖ్య లో వస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మెరుగైన సేవలు అందించడానికి చొరవ తీసుకోవాలి. – కృష్ణయాదవ్, తూంకుంట గ్రామస్తుడు -
ఒకటే గది..ఐదు తరగతులు
-
భయం గుప్పిట్లో చదువులు
► మరోసారి పెచ్చులూడిన వంగపల్లి పాఠశాల ► విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం ► పాఠశాలకు సెలవు ప్రకటించిన డిప్యూటీ ఈఓ నల్లగొండ: వర్షాకాలం వస్తే చాలు ఆ పాఠశాలలోని తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్ పాఠశాల భవనంలోని పైకప్పు మంగళవారం పెచ్చులూడి పడ్డాయి. ఉదయం పాఠశాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు చేరుకోగానే మొత్తం ఆరు గదులతో పాటు వరండాల్లో పైకప్పులూడిపడి ఉన్నాయి. దీంతో ఫర్నిచర్ ధ్వంసమైంది. భయభ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలోని చెట్ల కిందికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఈఓ పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సందర్శించిన ఈఈ.... పాఠశాలను సర్వశిక్ష అభియాన్ ఈఈ వైద్యుల భాస్కర్ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. ఇటీవల పాఠశాల శిథిలావస్థపై వచ్చిన కథనాలపై స్పందిం చిన ఆయన సందర్శించినట్లు తెలిపారు. పాఠశాలలోని 11 గదులు శిథిలావస్థకు చేరాయని, అంతే కాకుండా వరండా సైతం కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు పాఠశాల మరింత దెబ్బతిన్నదని, తరగతి గదుల్లో పెచ్చులు ఊడిపోయిన విషయంపై సర్పంచ్ చంద్రగాని నిరోష, జహంగీర్, ఎస్ఎంసీ చైర్మన్ రేగు బాలనర్సయ్య, ఇన్చార్జి హెచ్ఎం రమాదేవి వివరించారు. ఆయన వెంట ఏఈ సహదేవ్ ఉన్నారు. ముందుగానే హెచ్చరించిన ‘సాక్షి’.. జిల్లా పరిషత్ పాఠశాల శిథిలావస్థకు చేరిందని ‘సాక్షి’ ముందుగానే అధికారులకు సూచించింది. మే 27న ‘సమస్యల్లో సక్సెస్..’ ఈ నెల 13న ‘సమస్యల వలయంలో.. సరస్వతీ నిలయం’ అనే శీర్షికలతో ముందుగానే సాక్షి కథనాలను ప్రచురించింది. అయినా అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో సోమవారం కురిసిన వర్షానికి పాఠశాలలోని తరగతి గదుల్లో పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.