councelling
-
తాగి నడిపితే.. మాములుగా వుండదు..!
మహబూబ్‌నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి సెప్టెంబర్ 9 వరకు జిల్లాలోని 17 పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 4,809 కేసులు నమోదు చేయగా.. ఇందులో 2,922 మందికి రూ.46.62 లక్షల జరిమానా విధించగా మరో 55 మందికి జైలుశిక్ష విధించారు. ఇటీవల హౌజింగ్‌బోర్డుకు చెందిన రాములు అనే వాహనదారుడికి అత్యధికంగా 16 రోజుల సాధారణ జైలుశిక్ష పడింది. 2021లో 3,057 కేసులు నమోదు చేయగా 3,045 కేసులకు సంబంధించి రూ.38,00,700 జరిమానా విధించగా 12 మందికి జైలుశిక్ష పడింది. అలాగే 2022లో 4,628 కేసులు నమోదు చేసి రూ.36 లక్షల జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది ఇంకా ఐదు నెలలు ఉండగా.. మరో 3 వేల కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు.. బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30 మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తారు. ఇలా రెండుసార్లు వాహనం నడుపుతూ దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100 మి.గ్రా., పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం ఒక యూనిట్ లేదా 100 మి.లీ., రక్తంలో 0.03 శాతం లేదా 30 మి.గ్రా., మించి ఆల్కహాల్ ఉంటే మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2 వేలు జరిమానా, వారం నుంచి పదిరోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావృతం చేస్తే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటు రూ.3–5 వేల వరకు జరిమానా విధించవచ్చు. పాయింట్ల కేటాయింపు.. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీఓ 26 ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24 నెలల్లో 12 పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12 పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు. ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5 పాయింట్లు, ఆటోడ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకోవడం, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే ఒక పాయింట్ వేస్తారు. కఠిన చర్యలు తప్పవు.. డ్రంకెన్ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. మొదట వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ తర్వాతే కోర్టులో హాజరుపరుస్తున్నాం. ప్రస్తుతం డ్రైంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని ట్యాబ్‌లో ఫొటో తీస్తున్నాం. వారు బార్లో తాగారా.. శివారు ప్రాంతాల్లో తాగారా.. ఇలా ప్రతీది నమోదు చేస్తున్నాం. ఒక్కసారి పట్టుబడిన వ్యక్తి మరోసారి పట్టుబడితే సులభంగా తెలిసిపోతుంది. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపడుతున్నాం. – మహేష్, డీఎస్పీ, మహబూబ్‌నగర్ వినూత్నంగా శిక్షలు.. మొదట్లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతోపాటు కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవాళ్లు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదును పెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 1 నుంచి 7 రోజుల జైలుశిక్ష విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 30 రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు. -
ఔను.. వారిద్దరు మళ్లీ కలిశారు..
ఔను.. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఏకమయ్యారు. వీరి పదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. దీంతో భార్యకు సంబంధించిన తప్పులు భర్త, భర్తకు సంబంధించిన తప్పులతో భార్య స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఇద్దరం కలిసి ఉండలేమని నిర్ణయం తీసుకొని విడాకులు కావాలనుకున్నారు. పోలీస్ సిబ్బంది ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మూడు దఫాలుగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తిరిగి వారి తప్పులను తెలుసుకున్నారు. దీంతో వారు మళ్లీ కలిశారు. ఇలా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15 వరకు 197 ఫిర్యాదులు రాగా అందులో 144 కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. సాక్షి, మంచిర్యాలక్రైం: సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ. కానీ ప్రస్తుతం పలువురు దంపతులు చిన్నచిన్న సమస్యలనే పెద్దగా చూస్తూ గొడవలు పడుతున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు, ఆ తరువాత పోలీస్స్టేషన్ల వరకు చేరి విడిపోతున్నారు. పచ్చటి సంస్కారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తూ వారిలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏమైనా ఉమ్మడి కుటుంబంలో సర్ధిచెప్పేవారు ఉండేవారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాల్లో చెప్పేవారు లేక భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలకే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి పచ్చని సంసారాన్ని విచ్ఛినం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌తో ఏకమవుతున్నారు... క్షణికావేశంతో చిన్నచిన్న సమస్యలకే దంపతులు సమన్వయం కోల్పోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసేవారు. దీంతో కుటుంబంలో తగాదాలు రోడ్డున పడేవి కాదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం అనే ఊసే లేదు. కొందరు ఉద్యోగ రీత్యా, మరికొందరు వ్యాపారం ని మి త్తం, ఇంకొందరు అత్తమామ, కుటుంబ సభ్యులతో పడకపోవడం, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబా లు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబా ల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఇద్దరికి చె ప్పె వారు లేక కుటుంబాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... గతంలో పెళ్లైన కొంతకాలం పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసిఉండే వారు. ఇంటి యజమాని చెప్పిందే వేదం అన్నట్లుగా కుటుంబమంత నడుచుకునేవారు. ఇది కాస్త రానురాను ఉమ్మడి కుటుంబం కాస్త ఒంటరి కుటుంబంగా తయారైంది. దీంతో చిన్న చిన్న సమస్యలతో భార్యాభర్తలు పంతాలకు పోయి కాపురాన్ని కూల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు రోజుకు సుమారు 25నుంచి 30మంది వరకు కుటుంబ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పది మంది ముందు చులకన చేసుకోవడంతో పాటు వారి గౌరవాన్ని కించపరుచుకుంటున్నారు. సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వారు దీంతో ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. ఒక వేల వచ్చిన ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పంపించేవారు. అప్పుడు కుటుంబాల్లో విలువలు, మర్యాద, గౌరవం, భయం భక్తి ఉండేది. అవి ప్రస్తుతం లేకపోవడంతో కుటుంబాల్లో చిన్నచిన్న గొడువలకు, పంతాలకు వెళ్లి పెద్దగా చేసుకుంటున్నారు. మొదట క్షణికావేశంతోనే ఏవెవో మాట్లాడుతారు. కౌన్సెలింగ్ ద్వారా 80శాతం కుటుంబాలు కలిసి పోతున్నారు. – బి.శ్రీనివాస్, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్, మంచిర్యాల -
టీఎఫ్‌సీఓ.. ప్రజాసేవలో 11 వసంతాలు
గోల్కొండ: 11 ఏళ్లుగా పేద బడుగు వర్గాలకు, వితంతువులకు సేవలు అందిస్తున్నామని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ నజీబ్ అన్నారు. ఆర్గనైజేషన్ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన టోలిచౌకిలోని తన కార్యాలయంలో వితంతువులు, వృద్ధమహిళలకు నిత్యావసరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 ఏళ్లలో ఇప్పటి వరకు 4వేల మంది జంటలు, కుటుంబాలకు విజయవంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి వారిని కలిపినట్లు చెప్పారు. అంతేగాకుండా 150 మంది వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. కరోనా విజృంభించిన సమయంలో కోవిడ్–19 పాజిటివ్ వారికి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడంతో పాటు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
పీజీ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల నుంచి వివరాలను కోరినట్లు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వివిధ కారణాల వల్ల గతంలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సులకు సంబంధించిన 52 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్ప టివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే అందులో 24 వేలమంది ప్రవేశాలు పొందగా.. ఇంకా 28 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్ట్స్ గ్రూపుల్లో తక్కువ సంఖ్యలో చేరారన్నారు. అయితే, గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన కొంతమందికి బ్యాక్‌లాగ్స్ ఉండటంతో వీటిని ఇటీవల జరిగిన పరీక్షల్లో పూర్తిచేశారు. కానీ ఫలితాలు వచ్చే నాటికి పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యా మండలి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చాయి. ఫలితంగా అధికారులు చర్చించి చివరి దశ కౌన్సెలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. -
నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్
-
నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా 2021-22 ఏడాదికి సంబంధించి నీట్-పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓబీసీలకు 27 శాతం,ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోరర్ట పేర్కొంది. గతంలో మాదిరిగానే క్రిమిలేయర్.. సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది. -
నేటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్‌ను ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో ఈసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇందు కోసం ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లోనే ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. స్లాట్ బుక్ చేసుకున్న తేదీల్లోనే ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చామని తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు స్పెషల్ కేటగిరి విద్యార్థు లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, వారు కూడా ఫీజు చెల్లించినప్పుడే స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 26, 27వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ఎంపిక, 28వ తేదీన ఆప్షన్లు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. ఈనెల 29న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులంతా 31వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని పేర్కొంది. 31వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. రేపు ఐసెట్ సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 15న సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. ప్రవేశాల కోసం 16,800 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, అందులో 15,067 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీట్ల కేటాయింపు వివరాలను tsicet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. -
కరోనా వార్డులో పేషెంట్ల డ్యాన్స్..
-
నాట్ ఓకే బంగారం
‘నాన్నా.. నాకది కావాలి’’‘‘ఓకే బంగారం’’‘‘అమ్మా.. నాకిది వద్దు’’‘‘ఓకే బంగారం’’ఏం కోరితే అది. ఏం చెబితే అది.అయితే..‘ఓకే బంగారం’ అనలేని రోజొకటిప్రతి పేరెంట్‌కీ వస్తుంది.ఆ మాటను తట్టుకోలేని రోజు మాత్రంఏ పిల్లలకూ రాకూడదు. నాన్న బయటకెళ్తే వచ్చేటప్పుడు తమకేదో తెస్తాడని పిల్లలు ఎదురు చూసేవాళ్లు. నాన్న తెచ్చిన చిన్న మిఠాయి పొట్లంతో ఆకాశాన్నంటే ఆనందాన్ని పొందేవారు. నాన్న తిరునాళ్లలో కొనిచ్చిన బొమ్మంటే పిల్లలకు ప్రాణం. ఆ బొమ్మతో ఏళ్లకేళ్లు ఆడుకునేవాళ్లు. ఆ బొమ్మతో అనుబంధాన్ని పెంచుకునేవాళ్లు. మరో బొమ్మ కొనిస్తే ఆ బొమ్మకు తోడుగా కొత్త బొమ్మను జత చేసుకుని ఆనందాన్ని రెట్టింపు చేసుకునేవాళ్లు. నాన్న అడుగుల చప్పుడు కోసం ఎదురు చూడడంలో కూడా వారికి సంతోషం ఉండేది. ఇది ఎనభైలు, తొంభైల వరకు గడిచిన బాల్యం. తొంభైల తర్వాత రెండు వేలు సంవత్సరం వచ్చేసింది. ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చేశాం. కొత్త శతాబ్దం తెచ్చిన మార్పుల్లో బాల్యమూ మారిపోయింది. బాల్యంలో సున్నితత్వం లోపించింది. నాన్నలో తమకు అన్నీ అమర్చి పెట్టే ‘ఫెసిలిటేటర్’ ను మాత్రమే చూస్తున్నారు పిల్లలు. తాము అడిగినవి ఇప్పించకపోతే నాన్నలో శత్రువుని చూడడానికి కూడా వెనుకాడడం లేదిప్పుడు. ఈ దుష్పరిణామానికి తాజా నిదర్శనమే బెంగుళూరు ఘటన. బెంగళూరులోని రాజాజీ నగర్లో ఓ టీనేజ్ అమ్మాయి తండ్రిని చంపేసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి తండ్రికి విషం కలిపిన పాలు ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తండ్రి దేహం మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఎందుకిలా చేశావంటే... ‘‘నేను కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి పొందడానికి’’ అని చెప్పింది ఎంతో స్థిరంగా. ‘‘నువ్వు కోల్పోయిన స్వేచ్ఛ ఏమిటి’’ అని అడిగితే... ‘‘మా నాన్న నా దగ్గర నుంచి ఫోన్ తీసేసుకున్నాడు. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేశాడు. నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడితే ఒప్పుకోవడం లేదు. ప్రవీణ్‌తో మాల్స్‌లో కనిపిస్తున్నానని కోప్పడి బెల్ట్‌తో కొట్టాడు కూడా..’’ ఇదీ ఆ టీనేజ్ అమ్మాయి చెప్పిన కారణం. పదిహేనేళ్ల అమ్మాయి ఇలా మాట్లాడిందంటే ఆ తప్పు ఆ అమ్మాయిదా? ఆ అమ్మాయిని ప్రభావితం చేసిన సమాజానిదా? అంటే సమాజానికి ఎంత పాత్ర ఉందో తల్లిదండ్రులకూ అంతే పాత్ర ఉందంటున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. ముందే కళ్లు తెరవాలి ‘‘పిల్లల్లో యాంగర్ మేనేజ్మెంట్ పూర్తిగా లోపించింది. స్కూల్లో తోటి పిల్లలతో చిన్న విషయాలకే గొడవ పెట్టుకోవడం, ఆ గొడవ పెట్టుకున్న పిల్లాడు మెట్లు దిగుతుంటే వెనక నుంచి తోసేయడం వంటి క్రౌర్యపూరితమైన సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ దాకా వస్తే తప్ప కళ్లు తెరవడం లేదు. పిల్లల్లో వస్తున్న అనారోగ్యకరమైన మార్పుని పట్టించుకోవడం లేదు. సాధారణంగా రెండు తరాల మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఇప్పటి పేరెంట్స్‌కి – పిల్లలకి మధ్య ఒక్కసారిగా నాలుగైదు జనరేషన్ల గ్యాప్ వచ్చేసింది. పిల్లలకు అవసరం లేనంత ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చేస్తోంది. ఒకప్పుడు ఎవరైనా ఒక అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే ‘అమ్మో! ఆ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాట్ట’ అని ఆందోళన పడుతూ చెప్పుకునేవాళ్లు. అలాగే ఒక అబ్బాయికి గర్ల్‌ఫ్రెండ్ ఉన్నా సరే... అతడి ఫ్రెండ్స్ అతడిని రకరకాలుగా హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్పేవాళ్లు. ఎనభైల నాటి సమాజం అది. ఇప్పుడు సమాజం బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌ని తప్పు పట్టడం లేదు, స్వాగతిస్తోంది కూడా. ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ తమకు లవర్ లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడేటంతగా పిల్లల్ని ప్రభావితం చేసేసింది సమాజం. ‘బాయ్‌ఫ్రెండ్ లేడు’ అంటే ఆ అమ్మాయికి చెవి, ముక్కు వంటి దేహంలో ఉండాల్సిన భాగం లేనట్లు గేలి చేస్తున్నారు స్నేహితులు. గర్ల్‌ఫ్రెండ్ లేని అబ్బాయిల్లో కూడా ఫ్రెండ్స్ చిన్న చూపు చూస్తారని ఒత్తిడి పెరిగిపోతోంది. తల్లిదండ్రుల విషయానికి వస్తే... వాళ్లు పిల్లల ముందు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారో అవన్నీ నిజమనే అనుకుంటారు. తమ విషయంలోనూ అవి వర్తిస్తాయని భ్రమ పడతారు. కాలనీలో ఒక అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ ఉండడాన్ని సమర్థించినప్పుడు, తనకు బాయ్‌ఫ్రెండ్ ఉంటే కూడా స్వాగతిస్తారనే అనుకుంటారు. తల్లిదండ్రులు తమ దాకా వచ్చినప్పుడు మాత్రమే కళ్లు తెరుస్తున్నారు. అప్పుడు పిల్లల్ని కట్టడి చేస్తే వాళ్లు మరింత మొండిగా మారిపోతారు. తమ తల్లిదండ్రులు ఫెయిర్‌గా లేరు, డబుల్ స్టాండర్డ్స్‌తో వ్యవహరిస్తున్నారనుకుంటారు. దాంతో ద్వేషాన్ని కూడా పెంచుకుంటారు. ఎదురు చూడడం తెలియాలి సమాజంలో జీవిస్తూ సమాజం ప్రభావం మన మీద పడకుండా ఆపగలగడం కొంచెం కష్టమే. అయితే ప్రతి దానికీ ఒక లిమిట్ సెట్టింగ్ ఉంటుంది. ఆ పరిమితి తెలియకపోతే ఎదురయ్యే అనర్థాలే ఇవన్నీ. లిమిట్ సెట్టింగ్ తెలియాల్సింది పిల్లలకంటే ముందు తల్లిదండ్రులకే. వయసు రీత్యా కానీ పరిణతి రీత్యా కానీ ఆ మాత్రం విచక్షణ ఉండేది పెద్దవాళ్లకే. పేరెంట్స్ తమ పిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వదలుచుకున్నప్పుడు... దానికంటూ ఒక సందర్భం ఉండేలా చూసుకోవాలి. అంతేతప్ప ‘పక్కింటి పిల్లాడికి ఉంది కాబట్టి మన వాడికి కూడా ఇద్దాం’ అని మాట్లాడుకున్నారంటే పిల్లల్లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఎవరి దగ్గర ఏది చూస్తే దానిని తనకు కొనిపెడతారనే అనుకుంటారు. తన దగ్గర ఎన్ని బొమ్మలున్నా సరే... మార్కెట్లోకి కొత్తగా మరో బొమ్మ వచ్చింది కాబట్టి వెంటనే కొనేయాలనే తొందర కూడా ఒంటపట్టేస్తుంది. ఇవన్నీ పిల్లల్లో కుదురులేని తనానికి కారణమవుతున్నాయి.డాక్టర్ కల్యాణ్ చక్రవర్తికన్సల్టెంట్ చైల్డ్ సైకియాట్రిస్ట్ అన్నీ అరచేతిలోనే బాల్యంలో ఏవయితే రాకూడదో ఆ లక్షణాలన్నీ పిల్లలకు వొంటపట్టేస్తున్నాయి. మొదటిది ఇగో. మిగిలిన వారికంటే ఒక మెట్టు పైనుండాలనే తపన. తన ఫ్రెండ్స్ ఎవ్వరి దగ్గరా లేని గ్యాడ్జెట్స్ తన దగ్గర ఉండి తీరాలనే విపరీత కాంక్ష. ఇక రెండోది మొండిపట్టుదల. తమకు నచ్చని పని చేయమంటే ససేమిరా అన్నట్లు ఉంటారు. అంతటి మొండితనం తమను నచ్చిన పని చేసి తీరడంలోనూ ఉంటోంది. చదువుకోమని చెప్తే పుస్తకాన్ని తాకరు. స్మార్ట్ ఫోన్లలో గంటల కొద్దీ గడపడం, సోషల్ మీడియాలో చాటింగ్‌లు, ఫ్రెండ్స్‌తో తిరగడాన్ని ఇష్టపడతారు. పెద్దవాళ్లు మానమని చెప్తారు కాబట్టి ఇంకా ఎక్కువగా పంతం పట్టినట్లు చేస్తారు. ఇక దేనిమీదా కుదురులేకపోవడం కూడా ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇవన్నీ ఏడిహెచ్‌డి (అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్) లక్షణాలే. దీనికి తోడు తోటిపిల్లల ముందు తక్కువ అవుతామేమోననే పియర్ ప్రెషర్ కూడా పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తోంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హారర్‌ను ఎక్కువగా చూడడం. ఒకప్పుడు టీవీలో హింసాత్మక సంఘటనల సినిమాలు ఎప్పుడో ఒకటి వచ్చేవి. పిల్లలున్న ఇళ్లలో కొన్ని చానెల్స్ని లాక్ చేసే వీలుండేది. ఇప్పుడు టీనేజ్లోనే పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు పేరెంట్స్. ఆ ఫోన్లో ఏం చూడవచ్చు, ఏం చూడకూడదనే లిమిట్ సెట్టింగ్ వాళ్లకు ఆ వయసులో తెలిసి వస్తుందా? ఏ క్షణంలో ఏం జరగాలని కోరుకుంటే అది జరిగిపోవాలనే ధోరణి నరనరాన జీర్ణించుకుపోతోంది పిల్లల్లో. భావోద్వేగాలను ప్రదర్శించడం, అదుపులో పెట్టుకోవడం రెండూ తెలిసి రావడం లేదు. ‘తల్లిదండ్రులం కాబట్టి మేము ఎక్కువ, మా మాట మీరు వినాలి’ అంటే పిల్లలు వినే స్థితిలో ఉండడం లేదు. కాబట్టి పేరెంట్స్ తప్పని సరిగా పిల్లలకు స్నేహితులుగా మారాలి. పిల్లలు అడిగిన వెంటనే కొనివ్వకుండా ఎదురు చూసేటట్లు చేయాలి. స్మార్ట్ ఫోన్ కోసం పిల్లలు కార్చిన రెండు కన్నీటి బొట్లకు కరిగిపోయి... మంచి మనసున్న తల్లిదండ్రులం అనిపించుకునే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ మంచి పేరెంటింగ్ కాలేదు. తెలిసీ తెలియని వయసులో స్మార్ట్ ఫోన్ తాలూకు చెడు ప్రభావం చూపించేది పిల్లల జీవితం మీదనే. ఈ బెంగుళూరు సంఘటనలో ఆ టీనేజ్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు ఉండి ఉండవచ్చనే అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే... తల్లిదండ్రుల మీద ఇంత తీవ్రంగా ప్రవర్తించడం అనే లక్షణాన్ని ఇంత వరకు డ్రగ్ అడిక్ట్స్ విషయంలోనే కనిపిస్తుండేది’’ అని ముగించారు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. – ఇంటర్వ్యూ : వాకా మంజులారెడ్డి -
అమ్మా... నాన్నా... ఓ పారిపోయిన అమ్మాయి
ప్రతి ప్రయాణ నిర్ణయమూ ఫైనల్ కాదు. టికెట్ తీసుకున్నాక కేన్సిల్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాక అనీజీగా ఉంటే వెనక్కు వచ్చేయవచ్చు. ట్రైనెక్కేసినా పక్క స్టేషన్లో దిగిపోవచ్చు. ఆగకపోతే చైన్ లాగి దూకి పారిపోవచ్చు. మరి జీవితంలో తీసుకునే నిర్ణయాలకు ఈ ఆప్షన్స్ ఉండవా? ఒక నిర్ణయం తీసుకుంటే కేన్సిల్ చేసే వీలు ఉండదా? ఉండదు అన్న ఆలోచనేచాలా పెద్ద వ్యాధి అవుతుంది.లేదా ఈ అమ్మాయికథ అవుతుంది. ‘మీ అమ్మాయికి అందమైన జీవితం అంటే తెలుసు. అర్థవంతమైన జీవితం అన్నా తెలుసు. స్వేచ్ఛగా ఎగిరే పక్షి, గాలికి తలలూపే చెట్టు ఎంత అందమైనవో మీ అమ్మాయి భావుక ప్రపంచం అంత అందమైనది. ఆ అబ్బాయి బంగారు బోనులాంటి వాడు. బోను బంగారంతో చేసినా బోనే కదా. పెళ్లి కేన్సిల్ చేస్తే రెండు రోజుల పాటు మీ బంధువులకు అది న్యూస్ అవుతుంది. పెళ్లి చేస్తే ప్రతి రోజూ న్యూస్ అవుతుంది’ మొత్తం పదిహేను రోజుల తర్వాత దొరికిందా అమ్మాయి. పూణెలో ఒక వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటే పోలీసులు ట్రేస్ చేశారు.పదిహేను రోజుల పాటు ఆ అమ్మాయి ఫోన్ వాడలేదు. ఎవరికీ ఫోన్లు చేయలేదు. కాని ఇన్‌స్టాగ్రామ్‌ను ఒకసారి ఉపయోగించడం వల్ల పోలీసులు దాని ఆధారంగా ఎక్కడుందనేది కనిపెట్టారు.పూణెలో ఆ అమ్మాయి చాలా మామూలు ధోరణిలోనే తోటి హాస్టల్ మేట్స్‌కు కనిపించింది. దగ్గరిలోని స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా క్లాసులు చెప్పడానికి వచ్చానని చెప్పింది. క్లాస్ ఉన్నప్పుడు స్కూల్‌కు వెళ్లేది. లేదంటే రూమ్‌లో పుస్తకాలు చదువుకుంటూ ఉండేది.ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోతుందని ఊహించని తల్లిదండ్రులు అంతకు మించిన షాక్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న ఆ కాలనీ వారికి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి తిరిగి వచ్చిందని తెలియదు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడ్డారు. పోలీసుల ఫిర్యాదును కూడా బయటకు పొక్కకుండా చూసుకున్నారు. వయసొచ్చిన అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయిందని తెలిస్తే ఆ అమ్మాయి భవిష్యత్తుకు దెబ్బ.పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే కనుక ఇంకా దెబ్బ. ఎంగేజ్మెంట్ అయి ఉంటే ఇంక చెప్పే పనే లేదు. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయి నెల రోజులు. పెళ్లి మరో నెలలో. కాని ఈలోపు పారిపోయింది. తల్లీ తండ్రీ మంచి ఉద్యోగులు. ఒక్కగానొక్క అమ్మాయి. బాగా చదివించుకున్నారు. ఎప్పుడూ డబ్బుల గురించి కొంటున్న స్థలాల గురించి ఇతరులు ఎదుగుతున్న వైనం గురించి చెబుతుండేవారు. ఉద్యోగం చేస్తే కొన్ని మంచి సంబంధాలు తప్పిపోతాయని చెప్పి ఉద్యోగం వద్దని సలహా ఇచ్చారు. జీవితం సంతోషంగా ఉండాలంటే పెద్ద ఉద్యోగం హోదా ఉండే అబ్బాయిని చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ అమ్మాయి సరే అంది. తల్లిదండ్రులకు మించిన శ్రేయోభిలాషులు ఎవరుంటారు? మొదట ఒక ఐ.ఆర్.ఎస్ ఆఫీసర్‌ను చూశారు. కాని అతడు ఆ పోస్టు కొట్టడానికి చదివీ చదివీ ఇంకా ఆ చదువు నుంచి కోలుకోని వాడిలా కనిపించాడు. తల్లిదండ్రులే వద్దనుకున్నారు. ఆ తర్వాత ఒక డాక్టర్ని చూశారు. కాని అతడి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఫీజు తామే కట్టి చదివించాల్సి ఉంటుందని గ్రహించి వద్దనుకున్నారు. ఆ తర్వాత అమెరికా సంబంధం చూశారు. అబ్బాయి అక్కడకు వెళ్లి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. చూడటానికి బాగున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి. పైగా ట్రంప్ పెట్టే రూల్స్‌తో సంబంధం లేకుండా అన్ని విధాలా అక్కడ శేష జీవితం గడిపే అర్హతలతో ఉన్నాడు. ‘ఇది మంచి సంబంధం’ అని తల్లిదండ్రులు అన్నారు. సరే అంది. నిశ్చితార్థం అయ్యింది. అబ్బాయి తిరిగి పెళ్లినాటికి వస్తానని వెళ్లాడు. రెండు మూడువారాలు గడిచాయి. ఒకరోజు ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ‘నాకీ పెళ్లి ఇష్టం లేదు. కేన్సిల్ చేయండి’ అంది. ‘నోర్ముయ్’ అని తండ్రి అన్నాడు. ‘పిచ్చెక్కిందా’ అని తల్లి అంది. ‘మా పరువేంగాను’ అని ఇద్దరూ అన్నారు. ‘ఈ పెళ్లి జరక్కపోతే చస్తాం’ అని కూడా అన్నారు. అమ్మాయి పారిపోయింది. వెళ్లే ముందు చేసుకోను అంది. వెళ్లొచ్చాకా చేసుకోను అంది. అమ్మాయి పారిపోయాక, డీటాక్సినేషన్ కోసం ప్రకృతి వైద్యశాలలో చేరిందని అక్కడ ఫోన్లు అలౌ చేయరని అబ్బాయికి చెప్పి, ఏదో మేనేజ్ చేసిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలా అని తలలు పట్టుకున్నారు. ‘నాకు ఏదైనా ఎన్.జి.వోలో చేరి వీధి బాలల కోసం పని చేయాలని కోరిక మేడమ్’ అందా అమ్మాయి లేడీ సైకియాట్రిస్ట్‌తో. సైకియాట్రిస్ట్ వింటూ ఉంది. ‘అందుకు తగినట్టుగా ఎం.ఏ. సోషల్‌వర్క్ చదువుదామనుకున్నాను ఇంటర్లో ఉండగానే. కాని సాఫ్ట్‌వేర్‌కు తగిన చదువు చదివించారు. పోనీ ఆ ఉద్యోగమూ చేయనివ్వలేదు. ఎప్పుడూ డబ్బు గురించి చెప్తారు కాని నాకు చిన్నప్పటి నుంచి కళలు, పుస్తకాలు, సంగీతం ఇష్టం. వాటి పట్ల నా ఇష్టం చూపిస్తే తిడతారని దాచుకుని దాచుకుని పుస్తకాలు చదివేదాన్ని. పాటలు వినేదాన్ని. ఊళ్లో మంచి సాహిత్య కార్యక్రమం ఉంటే వెళ్లేదాన్ని. డబ్బు మనిషికి సౌకర్యం ఇవ్వొచ్చు. కాని మనిషికి వికాసం ఇచ్చేది కళే. దాని టచ్ లేనివాళ్లు వేస్ట్ అని నా ఉద్దేశ్యం. ఈ అబ్బాయి మంచివాడే. అక్కడకు వెళ్లాక రోజూ ఫోన్ చేసేవాడు. ఒకరోజు ఏం చేస్తున్నావ్ అని అడిగితే చలం పుస్తకం చదువుతున్నా అన్నా. ఎవరతను అన్నాడు. గతుక్కుమన్నాను. మరో రోజు ఒక పాట పాడనా అని అడిగి ‘నెమలికి నేర్పిన నడకలివీ’ పాడాను. అంతా విని ‘ఏ సినిమాలోదీ పాట’ అన్నాడు. సత్యజిత్ రే తెలియదు. కె.బాలచందర్ తెలియదు. కరుణశ్రీ తెలియదు. సరిగ్గా పది ఘంటసాల పాటలు కూడా వినలేదు. అలా ఎలా పెరిగాడో మరి. నేను కొంత సర్దుకోగలను గానీ మరీ ఇంత సర్దుకోలేను’ అందా అమ్మాయి. సైకియాట్రిస్ట్‌కు మొత్తం అర్థమైంది. తల్లిదండ్రులను పిలిచి మాట్లాడింది. ‘మీ అమ్మాయికి అందమైన జీవితం అంటే తెలుసు. అర్థవంతమైన జీవితం అన్నా తెలుసు. స్వేచ్ఛగా ఎగిరే పక్షి, గాలికి తలలూపే చెట్టు ఎంత అందమైనవో మీ అమ్మాయి భావుక ప్రపంచం అంత అందమైనది. ఆ అబ్బాయి బంగారు బోనులాంటి వాడు. బోను బంగారంతో చేసినా బోనే కదా. పెళ్లి కేన్సిల్ చేస్తే రెండు రోజుల పాటు మీ బంధువులకు అది న్యూస్ అవుతుంది. పెళ్లి చేస్తే ప్రతి రోజూ న్యూస్ అవుతుంది’ అంది. ఆ పెళ్లి జరగలేదు. ఇటీవల ఒక ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ఆమెకు పరిచయమయ్యాడని తల్లిదండ్రులకు తెలిసింది.వాళ్లిద్దరూ కలిసి ట్రావెల్ చేద్దామనుకుంటే వద్దనలేదట కూడా. బహుశా వాళ్లిద్దరి పెళ్లిఫొటో కనుచూపు మేరలో ఉండొచ్చు. – కథనం: సాక్షి ఫ్యామిలీ -
హెల్త్ వర్సిటీ ఎదుట విద్యార్థుల ధర్నా
సాక్షి, విజయవాడ: ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య జాతీయ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుంచి 550 జీవో సక్రమంగా అమలు చేయకుండా, కౌన్సిలింగ్లో అవకతవకలకు పాల్పడి సుప్రీం కోర్టు జడ్జిమెంటును వీసీ ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికల్లో సైతం సరైన వివరాలను ఇవ్వలేదనీ, వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క రిజర్వేషన్ విద్యార్థికి అన్యాయం జరుగకుండా చూస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. తల్లిదండ్రులు స్పందిస్తూ పిల్లల మానసిక క్షోభకు వీసీనే కారణమని, రిజర్వేషన్ ప్రకారం రీ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించాలని కోరారు. -
హార్ట్ ఎటాక్ లాంటిదే ఈ ‘లెగ్’ అటాక్!
నా వయసు 60 ఏళ్లు. గతంలో పొగతాగే అలవాటు ఉండేది. నడుస్తున్నప్పుడు నాకు కాలునొప్పి వస్తోంది. పిక్కలు, తొడలు, తుంటిభాగంలోనూ నొప్పిగా ఉంటోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే నొప్పి, ఆగితే తగ్గుతోంది. నొప్పి సన్నగా, తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటోంది. కాళ్ల కండరాలు అలసిపోయినట్లుగా ఫీలవుతున్నాను. పిరుదులు కూడా నొప్పిగా ఉంటున్నాయి. నా సమస్యకు కారణం తెలపండి. –ఎమ్. రమణరావు, నెల్లూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాలిలోని రక్తనాళాలు పూడిపోయినట్లుగా అనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయిన గుండెపోటు వచ్చినట్లే... కాలిలో కూడా అదే పరిణామం సంభవించే అవకాశం ఉంది. గుండెపోటులో ఉంటే ప్రమాదం లాగే ఈ లెగ్ అటాక్స్ ప్రమాదకరం. కాలిపైన ఎంతకూ నయంకాని అల్సర్స్ వచ్చి, చివరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి దారితీయవచ్చు. లెగ్ అటాక్స్‌లో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం... వీటిని చివరిదశ వరకూ గుర్తించడం కష్టం. అంతకుమించి ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, 50 ఏళ్లు పైబడిన వారు, స్థూలకాయులు, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, పొగతాగే వారు ఈ లెగ్ అటాక్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు కాళ్లు లేదా పాదాలు క్రమంగా పాలిపోయినట్లుగా ఉండటం, కాళ్లు నీలిరంగులోకి లేదా ముదురు ఎరుపు రంగులోకి మారడం వంటివీ చోటుచేసుకుంటాయి. నడవకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించాలి. ఈ రక్తనాళాల జబ్బును నిర్ధారణ చేయడానికి యాంజియోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిర్ధారణలో మరింత కచ్చితత్వం కోసం అల్ట్రాసోనోగ్రఫీ, ఎమ్మారైలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా కాలి రక్తనాళాల్లో పూడిక పేరుకుందని తెలిసినప్పుడు ప్రాథమిక దశలో సరైన మందులు, జీవనశైలిలో మార్పుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. దీనికి ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి ముదిరాక డాక్టర్‌ను సంప్రదిస్తే ఒక్కోసారి కాలిని తొలగించే ప్రమాదమూ ఉండవచ్చు. అందుకే మీలో కనిపించిన లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు దీనికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ వంటి సమర్థమైన, సురక్షితమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వేరికోస్ వెయిన్స్విషయంలోనిర్లక్ష్యం వద్దు వాస్క్యులార్ కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఉన్న రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి. అవి ఎర్రటి, నీలం రంగులో ఉన్నాయి. వాటి వల్ల నాకు ఎలాంటి నొప్పి కలగడం లేదు. అయితే చూడటానికి ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. – ఎల్. రవికుమార్, నిజామాబాద్ సాధారణంగా మనిషి శరీరాన్నంతటికీ గుండె, రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మళ్లీ అవే రక్తనాళాల ద్వారా రక్తం గుండెకు చేరుతుంది. అయితే మిగతా భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ రక్తప్రసరణ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాకుండా వయసు పైబడటం, కుటుంబ నేపథ్యం, స్థూలకాయం, కూర్చొని పనిచేయటం, అదేపనిగా నిలబడి పనిచేయడం, బరువైన వృత్తిపనులు చేయడంతో జరిగినప్పుడు రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది. మహిళల్లో గర్భం దాల్చడం, హార్మోన్లు ప్రభావం వంటి అంశాలు రక్తప్రసరణ ఆలస్యమయ్యేలా చేయవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా ఈ సమస్య ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఇది ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి, ఆయన సూచనల మేరకు మీ కాలి దగ్గర ఒక ఎత్తయిన దిండు వేసుకుంటే సరిపోతుంది. అలాకాకుండా మీ కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా లేదా రక్తనాళాలు ఉబ్బి గుండెకు చేరాల్సిన రక్తసరఫరాను అది అడ్డుకుంటుంటే అప్పుడు మీరు ‘వేరికోస్ వెయిన్స్’ అనే కండిషన్ బారిన పడ్డట్లు చెప్పవచ్చు. మీరు మీ డాక్టర్‌ను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ మీరు ‘వేరికోస్ వెయిన్స్’ బారిన పడ్డా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ సమస్య మొదటి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్సల్లో వచ్చిన పురోగతి వల్ల మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. సర్జరీ వంటి ప్రక్రియలకు ఖర్చుచేయడం అనవసరం అనే అభిప్రాయంతో మీ సమస్య తీవ్రతను పెంచుకోవద్దు. అలాగే నొప్పి, దురద, వాపులాంటివి లేవనుకొని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి. డయాబెటిక్ ఫుట్ అంటే? నా వయసు 59. గత పదిహేనేళ్లుగా షుగర్‌వ్యాధితో బాధపడుతున్నాను. కొన్ని నెలల నుంచి నా కాళ్లు తరచూ తిమ్మిరెక్కుతున్నాయి. కాళ్లలో మంటలుగా అనిపిస్తున్నాయి. ఒక రోజు మరుగుతున్న నీళ్లు కాళ్ల మీద పడి బొబ్బలు కూడా వచ్చాయి. కానీ నాకు బాధ తెలియలేదు. నేను ఆందోళనతో డాక్టర్‌ను కలిశాను. డయాబెటిస్ ఫుట్ అని చెప్పి చికిత్స అందించారు. నాకు డయాబెటిస్ ఉందిగానీ... కాళ్లకు ప్రత్యేకంగా ఈ డయాబెటిస్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – జి. ప్రభావతి, నల్లగొండ డయాబెటిస్ ఫుట్ అంటే విడిగా కాళ్లకు డయాబెటిస్ సోకడం కాదు. డయాబెటిస్తో బాధపడే చాలామందిలో ఎదురయ్యే ప్రధానసమస్యల్లో కాళ్లపై పుండ్లు ఏర్పడే డయాబెటిక్ ఫుట్ ముఖ్యమైనది. దాదాపు ఆరోవంతు మంది వ్యాధిగ్రస్తుల్లో ఇది కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో కాకుండా... దేశవ్యాప్తంగా కాళ్లను తొలగించే పరిస్థితుల్లో 50 శాతానికి పైగా ఈ డయాబెటిక్ ఫుట్ కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. ఇక డయాబెటిస్ సమస్య తీవ్రమై కాలు తొలగించాల్సి వచ్చిన వారిలోనూ 40 శాతం మందిలో ఆ తర్వాత మూడేళ్లకే రెండో కాలు కూడా తొలగించాల్సి వస్తోంది. అయితే ఇలాంటి రోగులకు ఆశాజనకం, ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే... ఇలా కాలిని తొలగించాల్సిన కేసుల్లో కాస్త ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తే 85 శాతం మందిలో ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. డయాబెటిస్ కారణంగా వచ్చే ఈ పరిస్థితి గురించి తగిన అవగాహన లేకపోవడమే మనలో కాలు కోల్పోవడానికి ఒక ప్రధాన సమస్య. అందుకే డయాబెటిస్‌పై తగిన అవగాహన పెంచుకోవాలి. డయాబెటిస్ రోగులు... తమ కాలు తిమ్మిరిగా ఉండటం, నొప్పినీ... వేడి–చల్లదనాలను కాలు గుర్తించలేకపోవడం, కాళ్లమంటలు, కొద్దిపాటి బరువును కూడా భరించలేకపోవడం (పలుచని బెడ్‌షీట్ కాలి మీద పడ్డా అది చాలా బరువుగా అనిపించడం), కాలి కండరాలు బలహీనపడటం వంటి లక్షణాలతో డయాబెటిక్ ఫుట్‌ను ముందుగా గుర్తించవచ్చు. ఈ కారణాల వల్ల కాలికి దెబ్బతగిలినా రోగికి అది తెలియదు. మరోవైపు ఆ గాయం మానకుండా పెద్దదవుతుంది. పుండు పడుతుంది. డయాబెటిస్ వల్ల కాలికి జరిగే రక్తసరఫరాలో కూడా సమస్యలు ఎదురవుతాయి. తగినంత రక్తం సరఫరా కాకపోవడంతో గాయాలు పుండ్లు త్వరగా మానవు. అది గ్యాంగ్రీన్గా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో డయాబెటిక్ ఫుట్ నుంచి కాళ్లూ, పాదాలను కాపాడుకోవచ్చు. వెచ్చని నీళ్లు, సబ్బు ఉపయోగిస్తూ ప్రతిరోజూ పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. పాదాలను నీళ్లలో నాన్చి ఉంచకూడదు. వేళ్ల మధ్యభాగాలతో సహా మొత్తం కాలు, పాదాన్ని తుడిచి పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు, పాదాలపై పుండ్లు, బొబ్బలు, కమిలిన ప్రదేశాలు ఏమైనా ఏర్పడ్డాయా అని ప్రతిరోజూ చూసుకుంటూ ఉండాలి. కాళ్లల్లో రక్తప్రసరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయటే కాకుండా ఇంట్లో కూడా పాదరక్షలు ధరించి తిరగాలి. వీలైనంతవరకు సాక్స్ వేసుకోకపోవడమే మంచిది. వేళ్లను కప్పి ఉంచే పాదరక్షలను ధరించి తిరగాలి. మార్నింగ్ వాక్, ఇతర సమయాల్లో షూస్ ధరించేట్లయితే కాన్వాస్‌తో తయారుచేసిన వాటినే ఎంచుకోవాలి. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులార్ అండ్ఎండోవాస్క్యులార్æ సర్జన్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి
నా వయసు 56 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా?– బి. రామకృష్ణ, నెమ్మికల్ మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు : ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ మా బాబు వయసు మూడేళ్లు దాటుతోంది. ఇంకా మాట్లాడటం గానీ, పిలిస్తే పలకడం గానీ, పిల్లలతో ఆడటం కానీ చేయడం లేదు. చూడటానికి బాగానే ఉంటాడు. ఎవ్వరినీ కలవడు. పిల్లల డాక్టర్‌కు చూపిస్తే ఇది ఆటిజం కావచ్చని, అవే లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా?– ఎమ్. సుకుమార్, వైజాగ్ ఆటిజం ఇటీవల చాలా ఎక్కువ మంది పిల్లల్లో కనిపిస్తోంది. ఆటిజాన్ని ‘పర్వేజివ్ డెవలప్మెంట్ డిసార్డర్’ అంటారు. ఆటిజం అనేది ఒక లక్షణం కాదు. దీనిలో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజం అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ఆటిజం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని క్లాసికల్ ఆటిజం అంటారు. మకొంతమందిలో లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అది జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజం అంటారు. ఆటిజం ఉన్న పిల్లలందరూ ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిజం అనేది మెదడు, నాడీవ్యవస్థ ఎదగకపోవడం వల్ల పుట్టుకతో వచ్చే సమస్యే అయినా కొంతమంది పిల్లల్లో మూడేళ్ల వరకు దాన్ని గుర్తించకపోవచ్చు. ఆటిజం జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందని తెలిసినా, దానికి సంబంధించిన జన్యువును ఇంకా గుర్తించలేదు. కారణాలు: ∙జన్యుసంబంధిత కారణాల వల్ల ∙గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకడం వల్ల ∙తల్లిదండ్రుల్లో మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఉంటే ∙డయాబెటిస్, థైరాయిడ్ లాంటి సమస్యలతో బాధపడుతూ సరైన చికిత్స తీసుకోని వారిలో ఆటిజం వచ్చే అవకాశం ఉంది. ∙మెదడులో సెరిటోనిన్, డోపమైన్ వంటి రసాయనాల మార్పులు కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చు. ∙తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవడం వల్ల పిల్లల్లో వచ్చే మానసిక ఎదుగుదల లోపాలు కూడా ఈ వ్యాధికి మూలం కావచ్చు. లక్షణాలు: ∙ఎదుటివారి మనోభావాలు అర్థం చేసుకోలేకపోవడం ∙నలుగురిలో కలవలేకపోవడం లేదా ఆనందాలు, బాధలు పంచుకోలేకపోవడం ∙చేతులు, కాళ్లు కదపడం ∙కొత్తదనానికి తొందరగా అలవాటు పడలేకపోవడం, రొటీన్‌గా ఉండటాన్నే ఇష్టపడటం ∙అలవాటు పడ్డ వ్యక్తులతో మాత్రమే ఉండటం. చికిత్స: ఆటిజం వ్యాధికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను, ఆహారపు అలవాట్లను, జీవనవిధానం, వ్యక్తిత్వం చూసి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి కోసం కార్కినోసిస్, తుజా, సిక్రెటిన్ వంటి మందులను లక్షణాలను ఇవ్వాలి. వ్యాధిని త్వరగానూ, ముందుగానే గుర్తిస్తే మంచి ఫలితం ఉంటుంది. -డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ నా వయసు 41 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా?– కె. బాలకృష్ణ, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. లక్షణాలు : ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. కారణాలు: వంశపారంపర్యం; అధిక ఒత్తిడి; ఆటోఇమ్యూన్ డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణాలు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది.డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
సాక్షి, బల్లికురవ (ప్రకాశం): మైనర్ బాలికకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న సంతమాగులూరు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు సిబ్బందితో కలిసి బాల్య వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి బల్లికురవ ఎస్సీ కాలనీలో వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన బొంతా శ్యాంబాబు, బాణమ్మల కుమార్తె కోమలి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతానని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు తమ వద్ద చదివించే స్థోమత లేదని గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన ఇండ్ల కృష్టోఫర్ సింగమ్మల కుమారుడు ప్రభాకర్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. శుక్రవారం ఉదయం జొన్నలగడ్డలో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐతే, గురువారం రాత్రి బాలిక ఇంటి వద్ద వివాహ వేడుకలు జరుగుతుండగా అధికారులకు మైనర్ వివాహం జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో సంతమాగులూరు ఐసీడీఎస్ సీడీపీఓ బి. విజయలక్ష్మి, సూపర్వైజర్ వి. నాగమణి, అంగన్వాడీ కార్యకర్త కె. రాజకుమారి బల్లికురవ ఎస్సై పి. అంకమ్మరావు, వివాహ వేడుకలు జరుగుతున్న బాలిక ఇంటివద్దకు వెళ్లారు. బాలికతోనూ, తల్లిదండ్రులతోనూ వేర్వేరుగా మాట్లాడారు. బాలిక తాను ఇంటర్ చదువుతానని, చదివించాలని, అధికారులను వేడుకుంది. మేజర్ అయ్యే వరకు వివాహం చేయమని బాలిక తల్లిదండ్రులు శ్యాంబాబు, బాణమ్మల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాలిక నుంచి కూడా మేజర్ అయ్యేవరకు వివాహం చేసుకోనని స్టేట్మెంట్ తీసుకుని, బల్లికురవ కళాశాలలో చేర్పించాల్సిందిగా అంగన్వాడీ కార్యకర్తను ఆదేశించారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..
సాక్షి, విశాఖపట్నం : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నాలుగు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 10వ తరగతిలో ఉత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యా సంస్థల్లో రెండేళ్లపాటు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటివి బోధిస్తారు. ఈ రెండేళ్లు చదువును ఇంటర్మీడియెట్‌తో సమానంగా పరిగణించి.. ఆ తర్వాత ఇంటర్లో వచ్చే మార్కులు, సామాజిక వర్గాల రిజర్వేషన్ ప్రాతిపదికన ఇంజినీరింగ్‌లో శాఖలను కేటాయించి నాలుగేళ్లపాటు విద్యనందిస్తారు ప్రవేశాల షెడ్యూల్ ఇదే.. ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఈ ఏడాది కొత్తగా 4 వేల మందికి సీట్లు లభించనున్నాయి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు జూలై 1 వరకు ఆఖరు తేదీగా పరిగణించారు. వికలాంగ, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ క్రీడా కోటాల వంటి ప్రత్యేక కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీలను జూలై 1లోగా యూనివర్సిటీకి పంపాలి. ఇతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు ప్రింట్ ఔట్ కాపీలు పంపాల్సిన అవసరం లేదు. ప్రత్యేక కేటగిరీల అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూలై 14, 15వ తేదీల్లో నూజివీడులో నిర్వహిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా ఇతర అభ్యర్థుల ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను జూలై 23న ప్రకటిస్తారు. మొదటి విడతలో నూజివీడు, ఇడుపులపాయ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రవేశాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో ఆయా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో నిర్వహిస్తారు. ఆగస్టు 7, 8వ తేదీలలో ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ధ్రువపత్రాల పరిశీల న ఉంటుంది. ట్రిపుల్ ఐటీలలో వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్సీసీ క్రీడల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 20న ప్రకటిస్తారు. వీరికి జూలై 24, 25, 26, 27వ తేదీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువపత్రాల పరిశీలన , ప్రవేశాలు క ల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్టు 9 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయి. ప్రవేశ విధానం ఇలా.. 2019 పదో తరగతిలో సాధించిన జీపీఏ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి మండలానికి చెందిన విద్యార్థులకు ఈ ట్రిపుల్ ఐటీలలో అవకాశం కల్పిస్తారు. ఇడుపులపాయ, నూజి వీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో ఒక్కొక్క దానిలో 1000 మంది చొప్పున 4 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 85 శాతం సీట్లను ఆయా విశ్వవిద్యాలయాలు ట్రిపుల్ ఐటీల పరిధిలోని జిల్లాకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లలో ప్రతిభ ఆధారంగా ఏపీ, టీఎస్ రాష్ట్రాలకు చెంది న విద్యార్థులను ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేస్తారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు పంపాలి 2019లో ఉత్తీర్ణత సాధించిన 10వ తరగతి విద్యార్థులు ఆన్లైన్లో http://www.rgukt.in/ వెబ్సైట్లో జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్లో 10వ తరగతి హాల్ టికెట్, మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి తల్లిదండ్రుల ఫొటోలను సమర్పించాలి. వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్సీసీ, క్రీడ కోటా కింద ఎంపికైన వారు సంబంధిత అధికారులు ఇచ్చే ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు దరఖాస్తు ప్రింట్ ఔట్ కాపీలు, ఏపీ ఆన్లైన్ రసీదు, పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలన్నింటినీ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ వారే గుంటూరు జిల్లా తాడేపల్లెలోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు ప్రింట్ పత్రాలు పంపాలి. వికలాంగులు, ఎన్సీసీ, సైనికుల పిల్లలు, క్రీడా కోటా కింద దరఖాస్తు చేస్తున్న వారు ఆన్లైన్లో దరఖాస్తులను ద కన్వీనర్, యూజీ అడ్మిషన్స్, 2019 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి, టెక్నాలజీస్, ప్లాట్ నంబర్ 202, సెకండ్ ఫ్లోర్, ఎన్ఆర్ఐ బ్లాక్ సి, శ్రీమహేంద్ర ఎన్క్లేవ్, తాడేపల్లె, గుంటూరు జిల్లా 522501, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు జూలై 1లోగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం ఆన్లైన్లో పంపే దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఒకే దరఖాస్తు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అభ్యర్థులు ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు, ఫీజు, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 150, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులు రూ.100, అదనంగా రూ.25 ప్రాసెసింగ్ ఫీజు చెల్లిం చాలి. నాలుగు ట్రిపుల్ ఐటీలకు ప్రాధాన్యతను చూపుతూ ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ వారు మాత్రమే తమ రిజర్వేషన్ ప్రింట్ ఔట్లు, ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్ చేసి వాటిపై విద్యార్థి సంతకంతో పంపాలి. దరఖాస్తులో మొదటి, రెండు, మూడు, నాలుగు ప్రాధాన్యాలను వెల్లడి చేస్తూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ట్రిపుల్ ఐటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్థులకు ఈ–మెయిల్, సెల్ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. పోస్టల్ ద్వారా కూడా ఉత్తరం పంపుతారు. విద్యార్హతలు 2019లో పదో తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31 డిసెంబర్ 2019 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 21 ఏళ్లు. -
మారండి... మూసేస్తాం!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవరూ పుట్టుకతో నేరగాళ్లు కాదు. అవసరాలు, పరిస్థితుల ప్రభావంతోనే కొందరు అలా మారతారు’... ఈ విషయాన్ని విశ్వసిస్తున్న నగర పోలీసులు రౌడీషీటర్లకు ఓ గోల్డెన్ చాన్స్ ఇస్తున్నారు. ఎవరైనా తమ నడవడికను మార్చుకుంటే వారిపై ఉన్న షీట్లను మూసేస్తామంటూ నగర కొత్వాల్ అంజనీకుమార్ గురువారం ప్రకటించారు. అంబర్‌పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ‘పరివర్తన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన ఉత్తర, తూర్పు మండలాలకు చెందిన 180 మంది రౌడీషీటర్లు, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి బయటికి వచ్చిన వారిలో సమావేశమయ్యారు. అసాంఘికశక్తులుగా ముద్రపడిన వారిలో మార్పు తీసుకువచ్చేందుకు నగరపోలీస్ విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గణేష్ ఉత్సవాలు, హనుమాన్ జయంతి, బోనాలు... ఇలా నగరంలో ఏ కీలక ఘట్టం జరిగినా పోలీసుల కన్ను ‘షీటర్ల’ పైనే ఉంటుంది. ఆయా సమయాల్లో వారిని స్థానిక ఠాణాలు, టాస్క్‌ఫోర్స్ కార్యాలయాలకు పిలిచి కౌన్సిలింగ్ చేయడంతో పాటు మరో పక్క ఆయా ఘట్టాలు సజావుగా సాగేలా సహకరిస్తే షీట్లు ఎత్తివేస్తామని మాట ఇస్తుంటారు. ఏళ్లుగా ఈ రకంగా ‘షీటర్ల’ను వాడుకుంటున్నా... ఎత్తివేత మాత్రం జరగడం లేదు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ దిద్దుబాటు చర్యల ద్వారా రౌడీషీటర్లలో పూర్తి మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. అసాంఘికశక్తులను అదుపులో పెట్టడంతో పాటు నేరగాళ్లపై కన్నేసి ఉంచడానికి పోలీసు విభాగం వారిపై వివిధ రకాలైన షీట్లు తెరుస్తుంటారు. బెదిరింపులు, దాడులు తదితరాలు చేసే రౌడీలపై రౌడీషీట్, దొంగతనాలు చేసే చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్, ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలకు పాల్పడిన వారిపై కమ్యూనల్ షీట్, భూ కబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరుస్తుంటారు. వీటిని వారు నివసించే స్థానిక పోలీసుస్టేషన్లలో నిర్వహించే అధికారులు తరచు ఆయా నేరగాళ్లను పిలిచి కౌన్సిలింగ్ చేయడంతో పాటు సున్నిత సమయాల్లో అదుపులోకి తీసుకుని ఆ తరువాత విడిచి పెడుతుంటారు. ఆయా ప్రాంతాల్లో ఏ నేరం, ఘటన చోటు చేసుకున్నా పోలీసుల కన్ను ముందుగా వీరిపైనే పడుతుంది. ఇవే కాకుండా షీటర్లు తరచు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అటెండెన్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. పోలీసు మాన్యువల్ ప్రకారం రౌడీషీట్లను తెరుస్తారు. నిర్ణీత కాలంలో రెండు అంతకంటే ఎక్కువ నేరాలు చేసిన, ఉదంతాల్లో పాల్గొన్న వారిపై వీటిని ఓపెన్ చేసే అధికారం వారికి ఉంటుంది. మాన్యువల్‌లోని నిబంధనల ప్రకారం ఏటా ఈ షీట్లను పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉంటుంది. షీట్ తెరిచిన తరవాత ఏడాది పాటు మరో నేరానికి పాల్పడని వారిపై దానిని మూసేసే అవకాశమూ ఉంది. అయితే నగరంలో గడిచిన కొన్నేళ్లుగా ఈ సమీక్ష జరగట్లేదు. ఫలితంగా పరిస్థితుల ప్రభావం, అనుకోకుండా, క్షణికావేశంలో నేరాలు చేసి షీటర్లు మారిన వారిపై ఏళ్ల తరబడి ఇవి కొనసాగుతున్నాయి. దీని ప్రభావం వారి వ్యక్తిగత, సామాజిక జీవితాలపై పడుతోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ రౌడీషీట్లపై సమీక్షించడమేగాక వారికి మారడానికి అవకాశం కల్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో ‘పరివర్తన్ సమ్మేళన్’ పేరుతో వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్ తరుణ్ జోషి, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెనవర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ, అదనపు డీసీపీలు పి.రాధాకిషన్‌రావు, ఎస్.చైతన్యకుమార్‌తో పాటు ఆయా జోన్ల ఏసీపీలు, ఠాణాల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్లు ఎత్తివేస్తామని వారికి కొత్వాల్ హామీ ఇచ్చారు. కొందరు రౌడీషీటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓ వ్యక్తి 2002లో తాను చేసిన తప్పు కారణంగా రౌడీషీట్ తెరిచారని, ఇప్పటి వరకు మరో తప్పు చేయకున్నా అది అలానే ఉందని సీపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆ షీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమీక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
కట్నపాము
పెదవేగి మండలానికి చెందిన సునీత(పేరుమార్చాం)కు తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. రెండేళ్ల క్రితం వేధింపులు తారాస్థాయికి చేరడంతో భార్యాభర్తలు విడిపోయారు. బాధితురాలు సోమవరప్పాడు చల్లపల్లి చారిటబుల్ ట్రస్టు సభ్యులను ఆశ్రయించింది. వారు బాధితురాలి భర్త, అతని కుటుంబ సభ్యులకు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇప్పుడు సునీత భర్త, బిడ్డలతో ఆనందంగా జీవిస్తోంది. పశ్చిమగోదావరి, దెందులూరు: వరకట్నం.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారం. ఇది నానాటికీ పెరుగుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కట్నం లేనిదే పెళ్లి జరగని దుస్థితిలో ఇంకా యువతులు ఉన్నారు. జిల్లాలో వరకట్న వేధింపులకు ఎందరో అబలలు బలైపోతున్నారు. ఈ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. నియంత్రణకు చట్టాలున్నా.. సరిగా అమలు కావడం లేదు.. ఫలితంగామానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక సంబంధాలుగామారుతున్నాయి. మార్పు ఎక్కడ రావాలి! పిల్లల పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల్లో మార్పు రానిదే వరకట్న దురాచారం అంతం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులు కూతరు సుఖంగా ఉండాలంటే అల్లుడు లేదా అతని కుటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. అల్లుడు డాక్టరో, ఇంజినీరో అయితే పిల్ల సుఖపడుతుందని ఆశపడి అప్పులు చేసి కూడా కట్నాలు సమర్పించి పెళ్లిళ్లు చేస్తున్నారు. మగపిల్లల తల్లిదండ్రులూ కట్నం తీసుకోవడం సామాజిక గౌరవంగా భావిస్తున్నారు. ఎంత కట్నం వస్తే అంత గొప్ప అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కట్నం అడగకపోతే అబ్బాయిలో ఏం లోపం ఉందో అనే అనుమానాలు వస్తున్నాయని మగపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అత్యాశాపరుల వల్లే సమస్య! పిల్లలకు పెళ్లి సమయంలో లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. ఏదో స్తోమత కొద్ది ఇరువర్గాల అంగీకారంతో పెళ్లి జరిగితే ఇబ్బందేం లేదు. కానీ ఇదే ఆసరాగా తీసుకుని కొందరు అత్యాశకు పోతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల స్తోమతతో పనిలేకుండా కట్నాలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం కాకుండా పెళ్లయిన తర్వాత కూడా వధువును వేధిస్తున్నారు. దీనివల్ల ఎందరో వివాహితలు బలైపోతున్నారు. పెళ్లయి ఏళ్లు గడిచినా కట్నం కోసం వేధించే ప్రబుద్ధులున్నారు. పెళ్లయిన తర్వాత భర్త, అత్త, ఆడపడుచులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఎందరో మహిళలు పోలీస్టేషన్ బాట పడుతున్నారు. అయినా మన చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. వారికి జరుగుతున్న న్యాయం అంతంతే..! ఎన్నో కాపురాలు కట్నం దాహానికి కూలిపోతున్నాయి. ఎందరో మహిళలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. కౌన్సెలింగ్‌తో పరిష్కారం అదనపు కట్నం కేసుల్లో ఆత్మహత్యలు పరిష్కారం కాదు. భార్యాభర్తలు ఇద్దరినీ కౌన్సెలింగ్ చేస్తున్నాం. వివాదాలు పరిష్కరించి రాజీ చేసి అన్యోన్యంగా జీవించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా గ్రామాల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ప్రతి నెలా ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో సఖీ వన్‌స్టాప్ సెంటర్లో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం.– కె.శైలజ, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి చట్టాల అమలుకు కృషి వరకట్నం కోసం మహిళలను వేధించే భర్తలు, కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవు. ఫిర్యాదు అనంతరం విచారణ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. కొన్ని ఫిర్యాదుల్లో స్టేషన్ పరిధిలో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి మా వంతు పరిష్కార చర్యలు చేపడుతున్నాం.ఎం.రవిప్రకాష్, జిల్లా ఎస్పీ ఆలోచనా విధానం మారాలి కుమారుడిని పెళ్లిచేసుకుని ఇంటికి వచ్చిన కోడలిని తోటి మహిళగా గౌరవించి ఆదరించాలి. తమ సొంత బిడ్డలా చూసుకోవాలి. భర్త చిన్న చిన్న సమస్యలు పెద్దవి చేయకుండా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఈ విధానం అవలంబిస్తే కుటుంబ కలహాలు ఉండవు.శ్యామలాదేవి, ఫిజికల్ డైరెక్టర్ , పెరవలి ఉన్నత పాఠశాల మార్పు రావాలి పెళ్లి అనగానే మెట్టినింటి వారికి గుర్తుకు వచ్చేది కట్నం. ఈ విధానంపై సమాజంలోని ప్రతి ఒక్కరి ఆలోచన మారాలి. మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు వరకట్న దురాచారం నిర్మూలనకు కృషి చేయాలి. విస్తృతంగా ప్రచారం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. వరకట్నం తీసుకుంటే పడే శిక్షలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి.– సీహెచ్ గిరిజాదేవి, చైర్పర్సన్, చల్లపల్లి ట్రస్ట్ -
జీవసమాధికి యత్నించిన లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్
గుంటూరు, మాచర్లరూరల్:ఆధ్యాత్మిక భావనతో జీవసమాధిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వవలసివచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డి అనే వృద్ధుడు ఇహలోక ఈతిబాధల నుంచి విముక్తి పొందేందుకు సజీవ సమాధిలోకి వెళ్లనున్నట్టు కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపాడు. అందుకు గాను 10 అడుగుల గొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మాచర్ల తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్ఐ లోకేశ్వరరావు ఆగమేఘాలపై గన్నవరం గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మానవ జీవితం ఎంతో విలువైనదని, బతికుండగా జీవసమాధి చేసుకోవడం నేరమని లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. లచ్చిరెడ్డి మానసిక స్థితిని గమనించి, ఆయన మళ్లీ ఇటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా బాధ్యత తీసుకోవాలని కుమారులు రామకృష్ణారెడ్డి, అక్కిరెడ్డిలకు తెలిపారు. వీఆర్వో బి.వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
తాగి నడిపితే శిక్ష పడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మందుబాబులకు హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. తాగి వాహనాలు నడపడం సమాజానికి హానికరంగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మహమ్మారి వల్ల అనేకమంది అమాయకులైన పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మంగళవారం తీర్పునిచ్చారు. సికింద్రాబాద్, పార్సీగుట్టకు చెందిన చంద్రశేఖర్ గతేడాది జూన్ 15న మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చంద్రశేఖర్‌కు 10 రోజుల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. అలాగే మోటార్ వాహనాల చట్ట నిబంధనల ఉల్లంఘన కింద రూ.100 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేయగా, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విచారణ జరిపారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రశేఖర్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు విచారణ జరిపారు. పిటిషనర్ మద్యం తాగి వాహనం నడపడం ఇది రెండోసారని, కాబట్టి అతనిపై ఉదాసీనత చూపాల్సిన అవసరం లేదని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టేశారు. మొదటి శిక్షతో మార్పు రాలేదు.. పిటిషనర్‌కు తాగి వాహనం నడిపితే జరిగే పరిణామాలు తెలుసని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే అతడు రెండోసారి కూడా అదే తప్పు చేశారని చెప్పారు. ‘పిటిషనర్ గతంలో చేసిన తప్పు నుంచి పాఠం నేర్చుకోలేదు. ఈసారి కఠిన శిక్ష పడితే ఆ తప్పు మరోసారి పునరావృతం చేయడు’అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ చంద్రశేఖర్ పిటిషన్‌ను కొట్టేశారు. -
ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలి
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : బోగస్ వైద్య ధ్రువపత్రాలు సమర్పించి తప్పుడు పద్ధతుల్లో బదిలీ దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులపై తక్షణ చర్యలు చేపట్టాలనే కలెక్టర్ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆదివారం కలెక్టరేట్ ఎదుట టీఎస్టీయూ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేసేలా జిల్లాలో తప్పుడు వైద్య ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ దరఖాస్తులు చేసిన టీచర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 42 మంది నకిలీ వైద్య పత్రాలు సమర్పించారని తేల్చిన జిల్లా విద్యాశాధికారి కార్యాలయం టీఎస్టీయూ ప్రాతినిధ్యం మేరకు కలెక్టర్‌కు సమర్పించగా.. వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశించి వారం రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం సరికాదని అన్నారు. 2015 సంవత్సరంలో ప్రారంభమైన నకిలీ పత్రాల పరంపర 2018 బదిలీ వరకు వాటి సంఖ్య అనూహ్యంగా పెరగడానికి కారణం చర్యలుండవనే భరోసాతో ఉపాధ్యాయులు నకిలీ పత్రాలు సమర్పించడానికి వెనుకాడడం లేదన్నారు. అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకు టీఎస్టీయూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. డీఈవో కార్యాలయంలో బదిలీల దరఖాస్తులు పరిశీలన కోసం పని చేసిన టీచర్ తాను అంధున్ని అని దరఖాస్తు చేసుకోవడం, కరీంనగర్ మెడికల్ బోర్డులో నరాల సంబంధమైన డాక్టర్ల బృందం లేకున్నా ఆ వ్యాధుల సర్టిఫికెట్లు జారీ చేసిన విధానం చూస్తే ఎంత దిగజారుడు పద్ధతుల్లో పత్రాల జారీ జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. సర్వర్, సాఫ్ట్వేర్ సమస్యలతో బదిలీల సందర్భంగా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ఆప్షన్స్ ప్రాధాన్యక్రమం మారిపోయిందని, ఈ విషయంలో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నాయకులు కంకణాల రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎన్.కిరణ్‌కుమార్, గంగుల అంజిరెడ్డి, కటుకం అశోక్‌కుమార్, బండ నర్సింహారెడ్డి, గోపు శ్రీనివాస్‌రెడ్డి, మక్సూద్ అహ్మద్, రమణకుమార్, కృష్ణ, కె.సత్యనారాయణ, నారాయణరెడ్డి, దామోదర్, శ్రీనివాస్‌రెడ్డి, కోడూరి లక్ష్మిరాజం, నారాయణ, స్వరూపారాణి, మనోహర్‌రెడ్డి, గంగేశం తదితరులు పాల్గొన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి న్యాయపరంగా ఉన్నవాటిని సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుంటే నష్టపోయిన ఉపాధ్యాయులు కోర్టుకు పోక తప్పదని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కటుకం రమేశ్, ఎస్.ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 400 మంది ఉపాధ్యాయులు సవరణల కోసం దరఖాస్తు చేసుకున్నారని, న్యాయమైన వాటిని పరిష్కరించేందుకు ఎడిట్ ఆప్షన్లివ్వాలని డిమాండ్ చేశారు. స్పౌజ్ విషయంలో ఇప్పటికి గందరగోళం నెలకొందని, జీవో 16 మేరకే ఉపాధ్యాయ బదిలీలు జరగాలని అన్నారు. ఏకపక్షంగా ఆలోచించకుండా ప్రభుత్వం ఇకనైనా ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఇస్తూ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. -
విదేశీ మోజులో మరో మోసం
విదేశీ మోజులో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన బుధవారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ సీఐ మళ్ల శేషు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన 9 మంది యువకులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరంతా సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ కనస్ట్రక్షన్ పీటీఈ లిమిటెడ్‌లో ఉద్యోగాలొచ్చాయంటూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. విజిటింగ్‌పై విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఆసియా విమానంలో కౌలలాంపూర్‌కు వెళ్లి, అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరారు. అయితే బోర్డింగ్ పూర్తయిన తరువాత వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. వర్క్ ఆర్డర్‌పై తొమ్మిది మందికి ఒకే నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. ఒక్కో వ్యక్తికి వేర్వేరు వర్క్ ఆర్డర్ నంబర్ ఉండాలి. అందరికి ఒకే నంబర్ ఉండడంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటనతో నిరుద్యోగులు ఖంగుతిన్నారు. తామంతా మోసపోయామని లబోదిబోమన్నా రు. బాధితులను 6 గురు సబ్ ఏజెంట్లు మోసగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తు తం ఏజెంట్ల ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. సీహెచ్ శ్రీనివాస్ అనే ఏజెంట్‌కు నరేష్, ప్రసాద్‌లు రూ.80 వేల చొప్పున ముట్టజెప్పారు. శంకర్ అనే ఏజెంట్‌కు తెడ్డు గంగాధర్ రూ.70 వేలు, రాజేష్‌కు కాశీమని శ్రీనివాస్, అలువల మల్లేష్లు రూ.70 వేల చొప్పున ఇచ్చారు. ఏజెంట్ మురళీకి యర్ల శ్రీను 65 వేలు, ఏజెంట్ పోతన్నకు దేవల గంగాధర్ రెడ్డి, షేక్ సైదుళ్ల రూ.65 వేలు, ఏజెంట్ ఝాన్సీకి దత్తరావు రూ.65 వేలు సమర్పించుకుని మోసపోయారు. కాగా.. సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ సంస్థ లేదని ప్రాథమికంగా తేలింది. దీనిపై ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగులకు కౌనెల్సింగ్ బాధితులకు సీఐ మళ్ల శేషు కౌన్సెలింగ్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగాల మోజులో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. అయితే వేర్వేరు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు వేర్వేరు ఏజెంట్ల ద్వారా వచ్చినా.. వర్క్ ఆర్డర్ మాత్రం ఒకే వ్యక్తి వద్ద నుంచి వచ్చినట్టు గుర్తించామన్నారు. ఈ మోసానికి మూలమైన ఏజెంట్‌ను పట్టుకుంటామని విలేకరులకు తెలిపారు. -
ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో అవస్థలు
యూనివర్సిటీ క్యాంపస్: ఎంసెట్ ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. తొలిసారిగా ఇంటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ కౌన్సెలింగ్ తొలిరోజే ఇక్కట్లు తెచ్చిపెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు ఫీజు చెల్లించినా... ఫీజు చెల్లించినట్లు మొబైల్‌కు మెసేజ్‌లు రాలేదు. రెండోసారి, మూడోసారి ఫీజు చెల్లించినా ఫలితం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారంతా ఎస్వీయూలో హెల్ప్‌లైన్ సెంటర్లకు తరలివెళ్లారు. సర్వర్ సమస్య ఉందని.. వేచి చూడాలని హెల్ప్‌లైన్ సెంటర్లో సిబ్బంది సూచిస్తున్నారు. పనిచేయని సర్వర్ ఏపీ ఎంసెట్ –2018 కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ప్రకారం దరఖాస్తు చేసిన సమయంలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికెట్లను డేటా బేస్ ద్వారా అధికారులు ఇప్పటికే తనిఖీ చేశారు. దీనివల్ల కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లలో తప్పులున్నా.., కొన్ని అప్లోడ్ చేయకపోయినా దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లి తప్పులు సరిదిద్దుకోవాలి. అవసరమైన పక్షంలో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఇలాంటి వారికి మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. వారు మాత్రమే హెల్ప్‌లైన్ సెంటర్‌కు రావాలి. మిగలిన వారు ఇంటి నుంచి..లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం వారికి నిర్ధేశించిన తేదీల్లో బ్రాంచ్, కళాశాల ఎంపిక కోసం వెబ్ ఆప్సన్ ఇచ్చుకోవాలి. ఇదంతా చేసుకోవడానికి ముందు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీలు 1,200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు 600 రూ చెల్లించాలి. మధ్యాహ్నం 2 వరకు సర్వర్ పనిచేయలేదు. చాలా మంది రిజస్ట్రేషన్ ఫీజు చెల్లించలేకపోయారు. సరిగారాని ఎస్ఎంఎస్లు చాలా మందికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన మెసేజ్ రాలేదు. రెండో సారి, మూడోసారి చెల్లించినా రాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమ సర్టిఫికెట్లలో తప్పులు సరిదిద్దుకోవటానికి, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది. విద్యార్థులు ఆందోళనకు గురై హెల్ప్‌లైన్ సెంటర్‌కు తరలి వచ్చినా.. వారు ఏమీ చేయలేని పరిస్థితి. సాయంత్రం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య వంద దాటలేదు. హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించండి విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాక.. వారి మొబైల్‌కు ఎస్ఎంఎస్ రాక పోయినా ఆందోళనకు గురికావాల్సిన పని లేదు. తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టడంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఫీజు చెల్లించాక కాసేపు ఎదురు చూస్తే ఎస్ఎంఎస్ వస్తుంది. రెండు, మూడు సార్లు ఫీజు చెల్లించిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వారి అకౌంట్‌కు రీఫండ్ అవుతుంది. ఎలాంటి సందేహాలు ఉన్నా.. ఎస్వీయూలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సందర్శించండి. –ప్రొఫెసర్ జీఎన్.ప్రదీప్‌కుమార్, క్యాంప్ ఆఫీసర్, హెల్ప్‌లైన్ సెంటర్, ఎస్వీయూ -
స్టేషన్‌కు పిలిపించి‘కౌన్సెలింగ్’.. సిగరెట్‌తో వాతలు
కక్షలు, కార్పణ్యాల జోలికి వెళ్లకుండా గ్రామప్రజలందరితో కలిసిపోయి జీవిస్తున్న వ్యక్తిపై పోలీసులు రెచ్చిపోయారు. ఊరు నుంచే కాదు ఏకంగా మండలం వదిలి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. ఎందుకు వెళ్లాలని ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిపై చేయి చేసుకుని, స్టేషన్‌కు పిలిపించి మరీ తమదైన శైలిలో పోలీస్ కౌన్సెలింగ్ ఇచ్చారు. సిగరెట్‌తో శరీరంపై కాల్చి గాయపరిచారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం, యల్లనూరు: అచ్యుతాపురానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి పద్దెనిమిదేళ్ల కిందట గ్రామకక్షల కారణంగా ఊరు వదిలి వెళ్లాడు. రెండు నెలల కిందటే తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. కక్షల జోలికి వెళ్లకుండా వ్యవసాయం చేసుకుని ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. సొంతింటిని బాగు చేసుకుని అక్కడే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం యల్లనూరు ఎస్ఐ గంగాధర్, సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసుల సహాయంతో అచ్యుతాపురంలో నాకాబందీ నిర్వహించారు. ఈశ్వరరెడ్డి ఇంటిని కూడా తనిఖీ చేశారు. అనంతరం నువ్వు ఇక్కడ నివసించడానికి వీలు లేదని, మండలం వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. తానిప్పుడు ఎటువంటి కక్షలు, కార్పణ్యాలకు పోలేదని, అలాంటపుడు గ్రామం వదిలి ఎందుకు వెళ్లాలని ఈశ్వర్‌రెడ్డి ప్రశ్నించాడు. అంతే చిర్రెత్తిపోయిన ఎస్ఐ అందరి సమక్షంలో అతనిపై చేయి చేసుకున్నాడు. స్టేషన్‌కు పిలిపించి సిబ్బంది అమర్‌తో కలిసి కాళ్లతో తన్ని చితకబాదారు. అప్పటికీ కోపం తగ్గకపోవడంతో తొడ, ఇతర శరీర భాగాలపై సిగరెట్‌తో కాల్చారు. బాధితుడికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ పోలీసుల చేతిల్లో చిత్ర హింసలకు గురై సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరరెడ్డిని మధ్యాహ్నం వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి, శింగనమల సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పైలా నర్సింహయ్యలు వైద్యులతో ఈశ్వర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని పరామర్శించిన వారిలో యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు కొత్తమిద్దె వెంకటరమణ, ఎంపీపీ మునిప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ విషయంపై ఎస్ఐ గంగాధర్‌ను వివరణ కోసం ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు జిల్లాలో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ 20 నుంచి 25వ తేదీ వరకుఆప్షన్లకు అవకాశం 26వే తేదీ ఆప్షన్లు మార్చుకునేందుకు సౌలభ్యం 28న సీట్ల కేటాయింపుఉత్తర్వులు జారీ పాలిసెట్ జిల్లా కన్వీనర్ జెడ్.రమేష్‌బాబు ఒంగోలు: పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పాలిసెట్ జిల్లా కన్వీనర్, ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జెడ్.రమేష్‌బాబు తెలిపారు. తన చాంబర్లో సోమవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత కౌన్సెలింగ్‌కు, ఈ దఫా కౌన్సెలింగ్‌కు పలు మార్పులు జరిగాయని, అభ్యర్థులు కౌన్సెలింగ్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి: ♦ ఎస్ఎస్సీ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణతకు సంబం«ధించి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఒరిజినల్ మార్కుల మెమో ♦ ఆధార్ కార్డు( పరిశీలన సమయంలో ఒరిజినల్ కార్డు పరిశీలన) ♦ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (లేదా) నాలుగు నుంచి పది వరకు విద్యాసంస్థలలో చదవకపోయి ఉంటే వారు రెసిడెన్స్ సర్టిఫికెట్ అందజేయాలి. ఒక వేళ ఈ రాష్ట్రంలో నివాసం ఉండనివారు అయితే వారి తల్లిదండ్రులు కనీసం పది సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉన్నట్లు నిరూపించే రెసిడెన్స్ సర్టిఫికెట్ జతచేయాలి ♦ జనవరి 1వ తేదీ తరువాత జారీచేసిన «ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన తెల్లరంగు రేషన్ కార్డు(ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్నవారు) ♦ పర్మినెంట్/ ఆరు నెలలలోగా సంబంధిత అధికారి జారీచేసిన కుల ధృవీకరణ పత్రం ♦ అంగవైకల్యం కలిగిన వారు 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నట్లు జిల్లా మెడికల్ బోర్డు జారీచేసిన ధృవపత్రం ♦ చిల్డ్రన్ ఫర్ ఆర్మ్డ్ పర్సనల్(క్యాప్) అభ్యర్థులు మాజీ సైనికులకు సంబంధించి జిల్లా సైనిక సంక్షేమశాఖ జారీచేసిన ధృవపత్రం, ఐడెంటిటీ కార్డు, డిశ్చార్జిబుక్ వెరిఫికేషన్ నిమిత్తం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ♦ ఆంగ్లో ఇండియన్ కేటగిరీకి సంబంధించి వారు నివాసం ఉంటున్న ప్రదేశానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది ♦ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు కౌన్సెలింగ్ నిమిత్తం విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, విశాఖపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300, బీసీ/ఓసీ అభ్యర్థులు రూ.600 ఫీజు నగదు రూపంలో కౌన్సెలింగ్ సెంటర్లో చెల్లించవచ్చు. ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం పొందిన వారికి రూ.3800 , ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు రూ.15500 నుంచి రూ.21వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు పొందిన తరువాత ఏపీ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కు రూ.800 చెల్లించాలి. ఆప్షన్లు ఇలా..ఈ నెల 20వ తేదీ నుంచి ఆప్షన్లను ఒంగోలులోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ(ఈ కాలేజీ అవకాశం కల్పిస్తుంది), లేదా ఇతరత్రా ప్రైవేటు నెట్ సెంటర్ల నుంచి కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 20, 21 తేదీల్లో ఒకటవ ర్యాంకు మొదలు 30వేల వరకు, 22,23 తేదీల్లో 30001 మొదలు 60వేల వరకు, 24, 25 తేదీల్లో 60001 మొదలు చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా తమ ఆప్షన్లు మార్చుకోవాలని భావిస్తే ఈ నెల 26న మార్చుకోవచ్చు. 28వతేదీ సాయంత్రం 6గంటల తరువాత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. కేటాయించిన సీటుకు సంబంధించిన ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థి తప్పనిసరిగా ఐసీఆర్ ఫారం నెంబర్, హాల్‌టిక్కెట్ నెంబర్, పాస్‌వర్డు, పుట్టిన తేదీతో లాగిన్‌లో డౌన్లోడ్ చేసుకొని సీటు లభించిన కాలేజీలో రిపోర్టుచేయాల్సి ఉంటుంది. కోర్సులు ఇవి మాత్రమే:ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ : సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఈతముక్కల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ : ఈసీ, కంప్యూటర్స్, డీసీసీసీపీ కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ : సివిల్, ఎలక్ట్రికల్ అద్దంకి పాలిటెక్నిక్ కాలేజీ : కంప్యూటర్స్, ఈసీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో: సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఇ, ఈసీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇటీవల పలు కొత్తకోర్సులు వస్తున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే వాటికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రానందున గత ఏడాది ఏ కోర్సులు అయితే ఉన్నాయో వాటికి మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు. -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!
అతడికి పదహారు.. ఆమెకు ఇరవై ఎనిమిదేళ్లు. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబాలను ఒప్పించారు. పెద్దల సమక్షంలోనే అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక సమస్యేమీ లేదనుకున్న సమయంలో కథ అనుకోని మలుపు తిరిగింది. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాల్య వివాహమంటూ వధూవరులను వేరు చేసి ఎవరిళ్లకు వారిని పంపించేశారు. కర్నూలు : కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో కలిశారు. వారికి ఎవరిలో ఏ అంశం నచ్చిందో ఏమో తెలియదు కానీ వయస్సును పక్కనబెట్టి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అబ్బాయి కంటే అమ్మాయి వయస్సు దాదాపు 12 ఏళ్లు ఎక్కువ. కొన్నా ళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో గత నెల 27న వరుడి స్వగృహంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. పత్రి కల్లోనూ ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి వారి కోసం ఆరా తీశారు. వారు ఊళ్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక సోమవారం వధూవరులను, వారి తల్లిదండ్రులకు కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, జేసీ–2 రామస్వామి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరేళ్ల వరకు ఎవరింటి వద్ద వారు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా జరిగే రెవెన్యూ కోర్టులో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఐసీపీఎస్ అధికారి శారద, ఐసీడీఎస్ ఏపీడీ విజయ హాజరయ్యారు. -
ఇంటి నుంచి పారిపోయేందుకు బాలికల యత్నం
మంగళగిరి రూరల్:ముగ్గురు బాలికలు వారికి నచ్చిన వారితో బతకాలనుకున్నారు. ఒకేచోట పనిచేసే ఆ ముగ్గురూ ఒక మాటగా అనుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పార్క్ రోడ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు మెయిన్ బజారులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటారు. వీరు ముగ్గురూ కొద్దికాలంగా పట్టణానికి చెందిన ముగ్గురు యువకులతో స్నేహం చేస్తూ ప్రేమలో పడ్డారు. వారితో కలసి జీవించడం కోసం ఇంట్లో నుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. పక్కాగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలో నుంచి వచ్చేసి బస్టాండ్ సమీపంలో వారు ప్రేమించిన యువకుల కోసం తిరుగుతున్నారు. అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పట్టణ ఎస్.ఐ. బాలకృష్ణ వారి వద్దకు చేరుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ముగ్గురు ప్రేమించిన యువకులు కూడా మైనర్లే కావడం విశేషం. బాలికల నుంచి ఎస్ఐ తల్లిదండ్రుల సమాచారం తెలుసుకుని వారిని పిలిపించి అప్పగించారు. సోమవారం ఉదయం బాలికలతో సహా తల్లిదండ్రులను పట్టణ సీఐ హరికృష్ణ, ఎస్ఐ బాలకృష్ణ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అయితే, ఆ ముగ్గురు యువకుల వివరాలు మాత్రం తెలియలేదు. -
పోలీసులు దిద్దిన కాపురం..
విజయనగరం, బొబ్బిలి: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సాకుతూ వారి సంక్షేమాన్ని చూడాల్సిన కుమారుడికి పోలీసులు మంచి బుద్ధి వచ్చేలా చేశారు. ఆ కుమారుడ్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తల్లిదండ్రుల గొప్పతనం, వారి అవసరం, వారిపై మనకున్న బాధ్యతను వివరించారు. మొత్తంగా ఉదయం నుంచి కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలోనన్న ఆలోచన కల్పించారు. దీంతో సదరు కుమారుడు తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రులను క్షమించమని వారి కాళ్లమీద పడి కోరుకున్నాడు. బొబ్బిలి మండలం పాతపెంట గ్రామానికి చెందిన చనుమల్ల చిన్న, పార్వతి దంపతుల కుమారుడు ప్రసాదు నిత్యం హింసిస్తుండంతో ఆ తల్లిదండ్రులు పోలీసులనాశ్రయించారు. మద్యం తాగుతూ వచ్చి హింసిస్తున్న సంగతి పోలీసులకు తెలిపారు. మాకు డబ్బులిచ్చి ఇతోధికంగా సాయపడటం లేదని, భార్యను కూడా వదిలేశాడని చెప్పడంతో సీఐ వై.రవి, ఎస్ఐ ఎస్.అమ్మినాయుడులు ప్రసాదుకు తల్లిదండ్రులకిచ్చే గౌరవం ఎలా ఉండాలో తెలియజేశారు. చాలా సేపు అతని ప్రవర్తనలో మార్పు కనిపించిన తరువాత మళ్లీ వారిపై ఎటువంటి దాడి జరిగినా కఠిన చర్యలు ఉంటాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. దీంతో పరివర్తన చెందిన ప్రసాదు తల్లిదండ్రులను క్షమించమని కోరుకున్నాడు. వారి కాళ్లపై పడి మన్నించమని వేడుకున్నాడు. -
ఏఎన్ఎం అభ్యర్థులకు కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్: ఏఎన్ఎం కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మందికి అర్హత పత్రాలు అందజేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రోశన్న, సర్వజనాస్పత్రి ఆర్ఎంఓ లలిత, ప్రభుత్వ ఏఎన్ఎం ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపల్ సుజాత, ఏఓ రత్నకుమార్‌తో కూడిన కమిటీ సమక్షంలో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గోపాల్‌రెడ్డి, ఎస్ఓ అతావుల్లా, రాఘవేంద్ర, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘బీఏఎస్’ విద్యార్థులకు కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకం కింద 2017–18 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలల్లో చేరేందుకు అర్హత సాధించిన విద్యార్థులకు సెప్టెంబర్ 1, 4, 6 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావు తెలిపారు. 481 సీట్ల భర్తీకి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. 3వ తరగతి సుగాలీ విద్యార్థులకు 1న, ఎరికల విద్యార్థులకు 4న అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. 5వ తరగతి సుగాలీ, ఎరికల విద్యార్థులకు 5న, అలాగే 8వ తరగతి సుగాలీ, ఎరికల విద్యార్థులకు 6న కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 08554–220543కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. -
సైన్స్ సెంటర్ ఖాళీ
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైన జూల్ 22వ తేదీ నుంచి రోజూ వేలాదిమంది టీచర్లు, వారి బంధువులు, స్నేహితులతో సైన్స్ సెంటర్ కిటకిటలాడింది. ఒక్కోరోజు కనీసం లోపలికి అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండేది కాదు. రానురాను కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో టీచర్ల తాకిడి తగ్గుతూ వచ్చింది. చివరిరోజు బుధవారంతో సైన్స్ సెంటర్ ఖాళీగా కనిపించింది. -
వైద్య విద్య సీట్లకు 9 నుంచి దరఖాస్తులు
- 18న ముగియనున్న గడువు - మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు - ప్రకటించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో 2017–18 విద్యా సంవత్సరానికి కన్వీనర్ (కాంపిటెంట్ అథారిటీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకు ప్రకారం ఆన్లైన్లో జూలై 9 ఉదయం 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ గడువు జూలై 18న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపింది. http://medadm.tsche.in, www.knruhs.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మెరిట్ జాబితాను ప్రకటిస్తుంది. అనంతరం ర్యాంకుల ప్రకారం అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి మరోసారి మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఆప్షన్లను పరిశీలించి మెరిట్ ప్రకారం వర్సిటీ సీట్లను కేటాయిస్తుంది. -
గురుకులాల్లో సీట్ల భర్తీకి 5న కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. -
ఈసెట్ కౌన్సెలింగ్‌కు 3,072 మంది
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఈసెట్–17 కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు 1 నుంచి 4 వేల ర్యాంకుల వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగగా.. 3,072 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,001 నుంచి 10 వేల వరకు ధ్రువ పత్రాల పరిశీలన శనివారం నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ వాణీప్రసాద్ తెలి పారు. ప్రత్యేక కేటగిరీకి (క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్) అభ్యర్థులు (1 నుంచి చివరి ర్యాంకు వరకు) శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
ఇంటర్ ఉద్యోగుల బదిలీ
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 54 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. ప్రిన్సిపాళ్లతోపాటు అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులనూ బదిలీ చేశారు. ఈ మేరకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) సుగుణమ్మ ఆధ్వర్యంలో బుధవారం కడపలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బషీర్‌అహమ్మద్‌ను మదనపల్లికి బదిలీ చేశారు. అలాగే రొద్దం ప్రిన్సిపల్ నరహరిప్రసాద్‌ను పామిడికి, తలుపుల మహబూబ్‌బాషాను చిలమత్తూరుకు, మడకశిర బాలప్పను లేపాక్షికి, గుడిబండ సత్యవరప్రసాద్‌ను మడకశిరకు, ముదిగుబ్బ చెన్నకేశవ ప్రసాద్‌ను కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ చేశారు. అలాగే 14 మంది అధ్యాపకులు, నలుగురు పీడీలు, ఎనిమిది మంది లైబ్రేరియన్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 7 మంది రికార్డు అసిస్టెంట్లు, 8 మంది అటెండర్లు, ల్యాబ్ అటెండర్ ఒకరు బదిలీ అయ్యారు. -
కౌన్సెలింగ్ ప్రశాంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రధానోపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈఓలు)గా నియమించేందుకు ఆదివారం కడప నగరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జోన్ పరిధిలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి సీనియార్టీ ఆధారంగా అర్హులైన వారిని ఎంఈఓలుగా నియమించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఈ కౌన్సెలింగ్ జరిగింది. జిల్లా విద్యాశాఖ తరఫున సూపరింటెండెంట్ సురేష్, పార్థసారథి, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 63 మండలలకు గాను 11 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. తక్కిన 52 మండలాలకు ఇన్నిరోజులూ ఇన్‌చార్జ్‌లుగా హెచ్ఎంలు ఉన్నారు. వీరిలో 27 మందికి తిరిగి అవకాశం రాగా.. తక్కిన 25 మంది పాఠశాలలకు పరిమితం అయ్యారు. ఇదిలాఉండగా జోన్ పరిధిలో అనంతపురం జిల్లాలోనే ఎక్కువ పోటీ నెలకొంది. -
డైట్ సెట్ అభ్యర్థులకు 2న ప్రత్యేక కౌన్సెలింగ్
బుక్కపట్నం : 2016 డైట్ సెట్ అభ్యర్థులకు అక్టోబర్ 2న స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌నెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ సీట్లు కేటాయింపు జరుగుతుందని, సీట్లు కేటాయించిన వారు 4,5 తేదీల్లో డైట్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రయివేట్ డీఎడ్ కళశాలలకు శుక్రవారం నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని ఆయన తెలిపారు. -
4 నుంచి డైట్ కౌన్సెలింగ్
గార: డీఈఈ సెట్–2016 ప్రత్యేక కౌన్సెలింగ్ అక్టోబర్ 4, 5 తేదీల్లో నిర్వహిస్తామని వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకరరావు తెలిపారు. అక్టోబర్ 2న ఆన్లైన్లో సీట్లు కేటాయింపు జరుగుతుందని, 3న అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని, 4, 5 తేదీల్లో వమరవల్లి డైట్లో నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని కోరారు. -
తోక జాడిస్తే తోలుతీస్తా
రౌడీషీటర్లకు నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ హెచ్చరిక చంద్రదండు ప్రకాష్‌నాయుడుతో సహా 33 మందికి కౌన్సెలింగ్ అనంతపురం సెంట్రల్ : ‘‘దందాలు, దౌర్జన్యాలకు దూరంగా మంచిగా జీవించండి. నేనూ మంచిగా ఉంటా. లేదని తోక జాడిస్తే మాత్రం తోలుతీస్తా’నని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ రౌడీషీటర్లను హెచ్చరించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడుతో సహా 33 మంది రౌడీషీటర్లకు తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నెలరోజుల్లోపు స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో మార్పు రావాలని, ప్రశాంతవాతావరణం వచ్చేలా సహకరించాలని సూచించారు. ప్రతి నెలా ఒకటో తేదీన రౌడీషీటర్లు తప్పనిసరిగా స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలన్నారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించినా పరిస్థితి వేరేగా ఉంటుందన్నారు. సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకుంటే పైస్థాయి అధికారులతో మాట్లాడైనా సరే మీపై ఉన్న రౌడీషీట్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాదూ.. కూడదని పాత పద్ధతిలోనే ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ‘చంద్రదండు’ దురుసు ప్రవర్తన! రెండు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్న నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ శాంతిభద్రతలను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. మంగళవారం మొత్తం 33 మందిని స్టేషన్‌కు పలిపించారు. అయితే కౌన్సెలింగ్‌కు హాజరైన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు ఎస్ఐ శ్రీరామ్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. అయితే అదేస్థాయిలో ఎస్ఐ కూడా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిసింది. దీనిపై ఎస్ఐను వివరణ కోరగా.. రౌడీ షీటర్లందరినీ పిలిపించామని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నారు. ప్రకాష్‌నాయుడు అయినా మరొకరైన తన దష్టిలో సమానమేనని వివరించారు. -
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎస్కేయూ : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎడ్‌సెట్–2016 కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్ సెంటర్లో జరుగుతున్న సర్టిఫికెట్ల పరిశీలనకు 281 మంది విద్యార్థులు హాజరైనట్లు కోఆర్డినేటర్ ఆచార్య సుధాకర్ తెలిపారు. ఫైబర్‌గ్రిడ్ పనిచేయకపోవడతో ఎస్కేయూలోని ల్యాన్ (లోకల్ ఏరియా నెట్వర్క్) ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన సజీవుగా జరిపినట్లు పేర్కొన్నారు. -
17, 18 తేదీల్లో పార్మసీ, ఫార్మాడీ తుదివిడత కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఈ నెల 17, 18 తేదీల్లో తది విడత బైపీసీ స్ట్రీమ్, బీ ఫార్మసీ, ఫార్మా డీ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్‌లు ఆదివారం చెప్పారు. గతంలో హాజరుకాని విద్యార్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, సీట్లు పొందిన విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చని సూచించారు. -
17, 18 తేదీల్లో పార్మసీ, ఫార్మాడీ తుదివిడత కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఈ నెల 17, 18 తేదీల్లో తది విడత బైపీసీ స్ట్రీమ్, బీ ఫార్మసీ, ఫార్మా డీ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్‌లు ఆదివారం చెప్పారు. గతంలో హాజరుకాని విద్యార్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, సీట్లు పొందిన విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చని సూచించారు. -
డైట్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
గార: వమరవల్లి ప్రభుత్వ డైట్ కళాశాలలో ఆదివారం డైట్‌సెట్–2016 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని ఒక ప్రభుత్వ, సుమారు 25 ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను డైట్ ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకరరావు పరిశీలించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. పరిశీలనలో సీనియర్ అధ్యాపకులు పురుషోత్తం, ధర్మరాజు తదితరులు ఉన్నారు. -
టీచర్ల పదోన్నతులకు కౌన్సెలింగ్
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఉపాధ్యాయుల పదోన్నతులకు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సోషియల్ స్టడీస్‌లో ఇద్దరు, ఇంగ్లిష్‌లో ఇద్దరు, బయలాజికల్ సైన్స్‌లో ఒకరు, జిల్లా పరిషత్ పరిధిలో ఇంగ్లిష్‌లో ఐదుగురు, గణితంలో ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల, సోషియల్ స్టడీస్‌ల కౌన్సెలింగ్‌ను 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డీఈఓ తెలిపారు. వాయిదా వేయటం దారుణం కోర్టు కేసుల పేరు తో కౌన్సెలింగ్ వాయిదా వేయటం దారుణమని వైఎస్సార్‌టీఎఫ్ నాయకుడు ఓబుళపతి పేర్కొన్నారు. లిస్టు ప్రకారం ఇచ్చిన అన్ని ఖాళీలనూ భర్తీ చేయాలని కోరారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎమ్ 35, సోషియల్ స్టడీస్ 27, ఖాళీలు ఏర్పడ్డాయని, వాటి భర్తీ ని సత్వరమే జరపాలని డిమాండ్ చేశారు. -
కౌన్సెలింగ్ కేంద్రాల్లో విద్యార్థుల సందడి
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఐసెట్–2016 కౌన్సెలింగ్‌కు విద్యార్థులు పోటెత్తారు. ఎస్కేయూలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో 350 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో 325 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరయ్యారు. గురువారం నుంచి శనివారం వరకు వెబ్ఆప్షన్లు ఇవ్వడానికి నిర్ధేశించారు. గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురంలో 33001– 38500 ర్యాంకు వరకు, ఎస్కేయూలో 38501– 44000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. -
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభ ం
♦ మొదటి రోజు 150 మంది విద్యార్థులు హాజరు ఎచ్చెర్ల: ఎంబీఏ, ఎంసీఏ పోస్టు గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. మొదటి రోజు కౌన్సెలింగ్‌కు 1 నుంచి 11,000 ర్యాంకుల మధ్య 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీ విద్యార్థులు 145 మంది, ఎస్సీ, ఎస్టీలు ఐదుగురు ఉన్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 29 వరకు కొనసాగనుంది. 30న విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చు. మంగళవారం 11,001 నుంచి 22,000 మధ్య ర్యాంకుల విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 1 నుంచి 33,000 మధ్య ర్యాంకు వారు ఈ నెల 28న ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కౌన్సెలింగ్‌ను ప్రిన్సిపాల్ త్రినాథరావు, సహాయ కేంద్రం ఇన్చార్జి టీవీ రాజశేఖర్ పర్యవేక్షించారు. -
నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రప్ ఆలీ తెలిపారు. ఎస్కేయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురంలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజనల్ మార్క్స్కార్డులతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలన్నారు. -
25నుంచి ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కేటాయించారు. కౌన్సిలింగ్ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు హాజరైయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్టు, ర్యాంకుకార్డు, డిగ్రీ, ఇంటర్, పదో తరగతి మార్కుల జాబితా, 9వ తరగతి నుంచి డీగ్రీ వరకూ స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలి. పత్రాలను పరిశీలించుకున్న అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కళాశాలలకు కోసం ఆప్షెన్ను ఇచ్చుకోవచ్చు. ఎస్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలించనున్నారు. ఫీజు వివరాలు: ఓసీ, బీసీ అభ్యర్థులకు పరిశీలన రుసుం రూ. 1000, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ. 500, ఎన్సీసీ, పీహెచ్, కాప్,స్పోర్ట్స్ కాటరిగీలకు చెందినఅభ్యర్థులు షెడ్యూల్ ప్రాకారం విజయవాడ బెంజిసర్కిల్లోని ప్రభుత్వ పాలిటెన్నిక్ కళాశాలలో ఉంటుంది. వివరాలకు ఏపీఐసెట్. ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దళారీలనునమ్మొద్దు: మా కళాశాలలో చే రండి ఫీజులు అవసరం లేదు. మా కళాశాలలో చేరితే ల్యాబ్లాబ్ ఇస్తామని దళారులు చెబుతుంటారు. సంబంధిత విషయాల గురించి అభ్యర్థులు నమ్మి వారికి మీ మొబైల్ నెంబర్ లేదా ఇతర సమాచారాన్ని (ఐసెట్ హాల్‌టికెట్టు నెంబర్, ర్యాంకులను) తెలియజేయవద్దన్నారు. – డాక్టర్ పీకే ప్రకాష్‌రెడ్డి, ఐసెట్ కోర్డినేటర్, కడప -
ఆగస్టు 12న ఐటీఐ రెండో విడత కౌన్సిలింగ్
సీతంపేట: ఆగస్టు 12న రెండో విడ త కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్ ప్రసాద్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్రీ్టషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, డ్రెస్మేకింగ్,కోపా(కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్) ట్రేడుల్లో మిగులు సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వచ్చేనెల 10 వ తేదీలోగా దరఖాస్తు చే సుకోవాలని తెలిపారు. రూ.10 ఫీజు చెల్లించి దరఖాస్తులు పొందాలని సూచించారు. ఫోన్ నంబర్లు 8886882153, 8886990544కు సంప్రదించాలని కోరారు. -
ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ షురూ
♦షెడ్యూల్ విడుదల ♦ 23, 24 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ♦ 26న ఎలాట్ మెంట్లు ప్రకటన ♦ కళాశాలలు, బ్రాంచ్‌లు మార్పుకు చివరి అవకాశం ♦ గతంలో హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం ఎచ్చెర్ల: ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్–2016 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 6 నుంచి 18 వరకు జరగగా, జూలై ఒకటి నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఐఐటీ, ఎన్ఐటీ కౌన్సెలింగ్ పూర్తయి, తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. కళాశాలల్లో ప్రస్తుతం ఖాళీ సీట్లకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. బ్రాంచ్‌లు, ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న కళాశాలు సైతం మారవచ్చు. రెండో కౌన్సెలింగ్ విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యం. ఈనెల 23, 24 తేదీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. కొత్తగా ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు పరిశీలన అనంతరం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 26న ఎలాట్ మెంట్లు ప్రకటిస్తారు. ఇప్పటికే కళాశాలల్లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు సైతం ఆప్షన్లు మార్చు కోవచ్చు. జిల్లాలో ఇదీ పరిస్థితి... మొదటి విడత కౌన్సెలింగ్‌కు జిల్లా నుంచి 2,825 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని ఏడు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2,688 సీట్లు ఉండగా, 1816 సీట్లు నిండాయి. మరో పక్క ఎలాట్ మెంట్లు ఇచ్చిన విద్యార్థులు కళాశాలకు రిపోర్టు చేయలేదు. ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరిన విద్యార్థులతో ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటికోసం విద్యార్థులు కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి 22వ తేదీన అన్ని కళాశాలల్లో సీట్లు ఖాళీలు వివరాలు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్లో పెట్టనుంది. ఖాళీలు ఆధారంగా విద్యార్థులు కళాశాలలు, బ్రాంచ్‌లు మార్చుకునే అవకాశం లభిస్తుంది. -
ముగిసిన ఫార్మసీ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మాడీ ప్రవేశాలకు బైపీసీ స్ట్రీం విద్యార్థుకు నిర్వహించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. మూడు రోజులుగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిపారు. చివరిరోజు బుధవారం 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 41 మంది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 39 మంది ఉన్నారు. మొత్తం మూడు రోజుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు. వీరిలో 189 మంది ఓసీ, బీసీ, 54 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది 245 మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియను విభాగాధిపతులు మేజర్ కె.శివకుమార్, టీవీ రాజశేఖర్, మురళీకృష్ణ పర్యవేక్షించారు. -
18 నుంచి వైవీయూ రెండో విడత కౌన్సెలింగ్
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కౌన్సెలింగ్ రెండోదశ సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో హాజరుకాని, ర్యాంకు సాధించిన విద్యార్థులు రెండోదశ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అదే విధంగా కళాశాల మార్పు కోరుకునే అభ్యర్థుల కూడా రెండోదశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. అదే విధంగా రెండవ విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైవీయూడీఓఏ.ఇన్ వెబ్సైట్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
15 తర్వాత రెండో విడత ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌ను జూలై మూడోవారంలో నిర్వహించేందుకు అడ్మిషన్ల కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థల్లో ప్రవేశాలు, తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు సీట్ల కేటాయింపు పూర్తయ్యాక ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా, ఈ నెల 14న ఐఐటీ అడ్మిషన్లు, తెలంగాణ ఎంసెట్ సీట్ల కేటాయింపు జరగనుంది. అనంతరం 15నుంచి లేదా ఆ తరువాత ఒకట్రెండు రోజుల్లోరెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టే అవకాశముందని ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి రఘునాథ్ ‘సాక్షి’కి వివరించారు. -
జూలై 5 నుంచి ఎంసెట్ ఆప్షన్ల నమోదు
► 14న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ► 29 నుంచి తరగతుల ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జూలై 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థుల ర్యాంక్‌ను బట్టి 9వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వెసులుబాటు ఉంది. 10, 11 తేదీల్లో చివరగా తమ వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు అవకాశముంది. 14న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. మొదటి దశలో సీటు వచ్చినవారు, రానివారు కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 24 నుంచి రెండోదశ వెబ్ కౌన్సెలింగ్ చేపడతారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీలు కల్పించారు. 27వ తేదీన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అదేనెల 29 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా ఆగస్టు 1వ తేదీన ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాలి. తెలంగాణ ఎంసెట్-16 తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్(ఆప్షన్ల కోసం) క్ర.సం రోజులు తేదీ ర్యాంకులు నుంచి వరకు నుంచి వరకు 1 2 05-07-2016 06-07-2016 1 45000 2 2 07-07-2016 08-07-2016 45001 90000 3 2 09-07-2016 10-07-2016 90001 చివరి 4 ఆప్షన్ల మార్పు 10-07-2016 11-07-2016 1 చివరి 5 సీట్ల కేటాయింపు 14-07-2016 6 కళాశాల వద్ద రిపోర్టింగ్‌తోపాటు చలానా ద్వారా ఫీజుల చెల్లింపు 21-07-2016 తెలంగాణ ఎంసెట్-16 తుదిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్(ఆప్షన్ల కోసం) 1 ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లు 24-07-2016 25-07-2016 2 సీట్ల కేటాయింపులు 27-07-2016 3 తరగతుల ప్రారంభం 29-07-2016 -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల వెల్లడి
- 20వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆలిండియా ర్యాంకులు ఆదివారం (ఈ నెల 12న) విడుదల కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను గౌహతి ఐఐటీ పూర్తి చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1.98 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా.. 1.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 28,951 మందిలో (ఏపీ 14,703, తెలంగాణ 14,248) దాదాపు 21 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో దాదాపు 19 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలు, ఆలిండియా ర్యాంకులను 12న విడుదల చేయనుంది. అలాగే ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 15న ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆర్కిటెక్చర్ పరీక్ష, ఐఐటీ ప్రవేశాల షెడ్యూల్ - ఈ నెల 12, 13 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ - 15న ఉదయం 9 నుంచి మధాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష - 19న ఏఏటీ ఫలితాలు ప్రకటన - 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ -
పెళ్లికి పట్టుబడుతున్న.. కేసీఆర్ దత్తపుత్రిక
సాక్షి, హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా..? తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కన్నతల్లి మరణంతో, సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు చొరవతో ఆస్పత్రిలో చేర్పించటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హై కోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నఆమె యోగక్షేమాలను అధికారుల ప్రత్యేకంగా చూస్తూవస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వోకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. అయితే, బీఎస్సీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని మహిళ సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా ప్రత్యూష తెలిపారు. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలు మార్లు కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నపటికీ.. ప్రస్తుతం తనకు ఇరవై ఏళ్లని, మేజర్‌నంటూ.. నా ఇష్టప్రకారం నేను కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటి రెడ్డి.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారీకాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి(27) బీఎస్సీ చదివి ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న రెండు రోజుల ప్రత్యూష వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటినుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా ప్రత్యూష ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంలో సోడా ఉప్పు వేస్తున్నారని, ఉడకని బియ్యంతో అన్నం తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతోందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు ఆమె ఫోన్ చేసి చెప్పారు. మద్దిలేటిని పెళ్లి చేసుకున్నాకే తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని వివరించారు. తాను ప్రేమించిన మద్దిలేటితోనే వివాహం జరిపించాలని కోరారు. ఆమెనే పెళ్లి చేసుకుంటా: మద్దులేటిరెడ్డి అవును.. ప్రత్యూషను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మ తులసమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పే వాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు మేమంతా అంగీకరించాం. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి : అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్సభ్యులు ప్రత్యూషను ఆస్పత్రి నుండి తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత, ఆమెకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించ లేదు. పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె వాటన్నింటి నుంచి ఇప్పటికిప్పుడు బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
చింతపల్లి(నల్లగొండ): బాల్య వివాహం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు వివాహన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మొదుగుల మల్లెపల్లి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(15)కి నెల్వలపల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపిస్తుండగా.. అక్కడికి చేరుకున్న అధికారులు వివాహాన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. -
5 నుంచి లాసెట్ తుది విడత కౌన్సెలింగ్
హైదరాబాద్: ఏపీ లాసెట్, పీజీ ఎల్ సెట్ -2015 తుదివిడత కౌన్సెలింగ్ అక్టోబర్ 5వ తేదీనుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్ధులు అయిదో తేదీన సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాలని పేర్కొన్నారు. 5, 6 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలని, అడ్మిషన్ల ప్రాసెసింగ్‌ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యరుధలు 450, ఇతరులు 900 చెల్లించాలన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెబ్‌కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ , గుంటూరు నాగార్జునవర్సిటీలలో ఈ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు http://aplawcet.apsche.ac.in వెబ్ సైట్ సందర్శించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9490332169ను సంప్రదించాలన్నారు. -
'పద్మావతి' లో నిలిచిన కౌన్సెలింగ్
తిరుపతి: తిరుపతిలోని పద్మావతి మెడికల్ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం జరగాల్సిన మెడికల్ కౌన్సెలింగ్ ను అధికారులు నిలిపివేశారు. దీంతో కౌన్సెలింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ రోజు 10 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అయితే 18 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడటంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
కౌన్సెలింగ్‌లో గందరగోళం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైన రెండో, తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో కస్టోడియన్ సర్టిఫికెట్ల విషయమై కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఏపీ, తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఎంసెట్ పరీక్షలు నిర్వహించగా, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే వేర్వేరుగా మెడికల్ కౌన్సెలింగ్‌లను నిర్వహించిన విషయం విదితమే. ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో భాగంగా తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియగా, తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైంది. హెల్త్ వర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించిన (తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన) అభ్యర్థులు ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. అదే విధంగా మొదటి విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌కు హాజరై... ప్రభుత్వ/ప్రైవేటు ఎ-కేటగిరీ (కన్వీనర్) సీట్లతో పాటు బి-కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లు పొందిన అభ్యర్థులు కూడా హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన అడ్మిషన్ పత్రంతో (కస్టోడియన్ సర్టిఫికెట్‌గా పరిగణిస్తూ) మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని హెల్త్ యూనివర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇటీవల ముగిసిన తుది విడత తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్‌లో అప్పటికే సీట్లు పొందిన కొంతమంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్‌లో కూడా అర్హత సాధించి శుక్రవారం ప్రారంభమైన తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌కు నాన్-లోకల్ అన్ రిజర్వుడ్ కోటా కింద హాజరయ్యారు. వీరితో పాటు వెటర్నరీ, ఏజీ బీఎస్సీ కోర్సుల్లో చేరిన ఏపీకి చెందిన అభ్యర్థులు కూడా వారివారి ఒరిజినల్ సర్టిఫికెట్లకు బదులు ఆయా కళాశాలల నుంచి కస్టోడియన్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఇలా హాజరైన అభ్యర్థులను కౌన్సెలింగ్ అధికారులు తిరస్కరించారు. దీంతో కొద్దిసేపు అభ్యర్థుల తల్లిదండ్రులు కౌన్సెలింగ్ అధికారులతో వాదనకు దిగగా నోటిఫికేషన్లో ఇచ్చిన కస్టోడియన్ సర్టిఫికెట్ అర్థాన్ని వివరించి చెప్పడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. ఇటీవల ముగిసిన తుది విడత తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్‌లో కూడా ఇదే నిబంధనను అమలు చేశామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ విధంగా సై ్లడింగ్ అవుతూపోతే ప్రైవేటు కళాశాలల్లోని మిగిలిపోయిన కన్వీనర్ కోటా (ఏ-కేటగిరీ) సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో బదలాయింపునకు గురయ్యే ప్రమాదం ఉందని యూనివర్సిటీ వర్గాలు వివరించాయి. -
సిఫారసులు, పైరవీలతో బదిలీలకు బ్రేక్
నెల్లూరు కలెక్టరేట్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వీఆర్వోలు, ఆర్ఐలు, డీటీల బదిలీల కౌన్సెలింగ్ 15వ తేదీ అర్థరాత్రికే పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఒక్కో అధికారి నాలుగైదు సిఫారసు లేఖలు తీసుకుని వస్తున్నారు. దీంతోపాటు తమకు ఫలానా అధికారే కావాలంటూ టీడీపీ నేతలు కొర్రీలు పెడుతున్నారు. ఈ కారణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం వరకు సాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇంకా 300 వీఆర్వోలు, 18 ఆర్ఐలకు కౌన్సెలింగ్ చేయాల్సి ఉంది. -
బదిలీలలో ‘పనితీరు’ నిబంధనపై టీచర్ల ఆగ్రహం
ఏలూరు (పశ్చిమగోదావరి) : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పనితీరును ఆధారంగా చేసుకుని బదిలీల కౌన్సిలింగ్ చేపట్టడం వల్ల ఉపాధ్యాయుల్లో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
హిజ్రాలకు రైల్వే పోలీసుల కౌన్సెలింగ్
వరంగల్: చప్పట్లు కొట్టడం.. రూ.10 తక్కువ కాకుండా డబ్బులిస్తే సరేసరి.. లేకుంటే ఇవ్వని వారి చొక్కా పట్టుకుని దాడికి దిగడం.. హిజ్రాల దౌర్జన్యకర చర్యలు సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో రైలు ప్రయాణికులకు అనుభవమే. ఈ నేపథ్యంలో వరంగల్ రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) పోలీసులు ఆదివారం హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది హిజ్రాలతో సమావేశం అయ్యారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయటం, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం, చైన్ లాగి పారిపోవటం వంటి చర్యలు సరికాదని, వీటిని మానుకోవాలని సూచించారు. గౌరవంగా జీవించాలని, లేకుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హిజ్రాలను హెచ్చరించారు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీపీఎస్ అధికారులు
కర్నూలు: ఐసీపీఎస్ అధికారులు శనివారం రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వివరాలు...లింగమయ్య(19), రమేశ్(18) అనే ఇద్దరు యువకులకు మరో ఇద్దరు యువతులతో ఆదివారం రంగాపురం గ్రామంలో వివాహం జరుగనుంది. ఈ సమాచారం తెలిసిన ఐసీపీఎస్ అధికారులు గ్రామానికి చేరుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కనీస వయసు లేకుండా పెళ్లి చేస్తే రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష పడేలా చేస్తామని అధికారులు వారిని హెచ్చరించారు. (పెద్దకడుబూరు)