తిరుపతి: తిరుపతిలోని పద్మావతి మెడికల్ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం జరగాల్సిన మెడికల్ కౌన్సెలింగ్ ను అధికారులు నిలిపివేశారు. దీంతో కౌన్సెలింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ రోజు 10 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అయితే 18 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడటంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.