ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభ ం | i cet councelling get started | Sakshi
Sakshi News home page

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభ ం

Published Mon, Jul 25 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న కౌన్సెలింగ్‌ అధికారులు

విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న కౌన్సెలింగ్‌ అధికారులు

 మొదటి రోజు 150 మంది విద్యార్థులు హాజరు
 
ఎచ్చెర్ల: ఎంబీఏ, ఎంసీఏ పోస్టు గ్రాడ్యుయేషన్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌–2016 కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల సహాయ కేంద్రంలో ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. మొదటి రోజు కౌన్సెలింగ్‌కు 1 నుంచి 11,000 ర్యాంకుల మధ్య 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీ విద్యార్థులు 145 మంది, ఎస్సీ, ఎస్టీలు ఐదుగురు ఉన్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 29 వరకు కొనసాగనుంది. 30న విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చు. మంగళవారం 11,001 నుంచి 22,000 మధ్య ర్యాంకుల విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 1 నుంచి 33,000 మధ్య ర్యాంకు వారు ఈ నెల 28న ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కౌన్సెలింగ్‌ను ప్రిన్సిపాల్‌ త్రినాథరావు, సహాయ కేంద్రం ఇన్‌చార్జి టీవీ రాజశేఖర్‌ పర్యవేక్షించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement