I CET
-
ఈనెల 20న ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశా ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కమిటీ సమావేశాలు బుధవారం నుం చి మొదలు కానున్నాయి. ఒక్కొక్క సెట్ కమిటీ సమావేశాన్ని ఒక్కో రోజు నిర్వహించేందుకు సెట్స్ కన్వీనర్లు తేదీలు ఖరారు చేశారు. ఆయా సెట్స్‌కు సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం ఐసెట్, 17న ఎడ్‌సెట్, 19వ తేదీన పీఈ సెట్ సమావేశాలను నిర్వహించేందుకు చర్య లు చేపట్టనున్నాయి. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎంసెట్ కమిటీ సమావేశాన్ని ఈనెల 15న లేదా 18న నిర్వహించే అవకాశముంది. అదే రోజు ఈసెట్ కమిటీ స మావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వా త లాసెట్ కమిటీ సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆ యా సెట్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనున్నారు. వాటితోపాటు అర్హతలు, ఇతర నిబంధనలను కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 20 లేదా 21న జారీ చేసే అవకాశం ఉంది. మార్చి 2న పాలిసెట్ నోటిఫికేషన్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2020 నోటిఫికేషన్‌ను మార్చి 2వ తేదీన జారీ చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. ఇందులో పరీక్ష ఫీజు, ఇతర నిబంధనలను, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనుంది. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనుంది. -
రేపటి నుంచి ఐసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
పోచమ్మమైదాన్ :ఐసెట్‌లో అర్హత సాధించిన వారు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. జిల్లాలో రెండు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ, స్పోర్ట్స్, ఎన్సీసీ, అంగ్లో ఇండియన్ విద్యార్థులు హైదారాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో గల సాంకేతిక విద్యా భవన్లో హాజరుకావాలి. అలాగే జిల్లాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులు వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. విద్యార్థులు ఇవి తీసుకురావాలి... ఐసెట్ హాల్ టికెట్, ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ మెమోలు స్టడీ, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, టీసీ ఓసీ, బీసీలు రూ1000, ఎస్సీ, ఎస్టీలు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. పాలిటెక్నిక్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 26న ఉదయం 1 నుంచి–3వేలు 3001 నుంచి 6వేల వరకు మధ్యాహ్నం 6001 నుంచి 9 వేలు 9001 నుంచి 12 వేలు 27న ఉదయం 12001 నుంచి 15వేలు 15001 నుంచి 18 వేలు మధ్యాహ్నం 18001 నుంచి 21వేలు 21001 నుంచి 24 వేలు 28న ఉదయం 24001 నుంచి 27000 27001 నుంచి 30వేలు మధ్యాహ్నం 30001 నుంచి 33వేలు 33001 నుంచి 36 వేలు 29న ఉదయం 36001 నుంచి 39500 39501 నుంచి 43 వేలు మధ్యాహ్నం 43001 నుంచి 46500 46501 నుంచి 50 వేలు 30న ఉదయం 50001 నుంచి 53500 53501 నుంచి 57వేలు మధ్యాహ్నం 57001 నుంచి 60500 60501 నుంచి చివరి ర్యాంక్ -
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభ ం
♦ మొదటి రోజు 150 మంది విద్యార్థులు హాజరు ఎచ్చెర్ల: ఎంబీఏ, ఎంసీఏ పోస్టు గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. మొదటి రోజు కౌన్సెలింగ్‌కు 1 నుంచి 11,000 ర్యాంకుల మధ్య 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీ విద్యార్థులు 145 మంది, ఎస్సీ, ఎస్టీలు ఐదుగురు ఉన్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 29 వరకు కొనసాగనుంది. 30న విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చు. మంగళవారం 11,001 నుంచి 22,000 మధ్య ర్యాంకుల విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 1 నుంచి 33,000 మధ్య ర్యాంకు వారు ఈ నెల 28న ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కౌన్సెలింగ్‌ను ప్రిన్సిపాల్ త్రినాథరావు, సహాయ కేంద్రం ఇన్చార్జి టీవీ రాజశేఖర్ పర్యవేక్షించారు. -
ఏప్రిల్ 27న పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్కోర్సులకు సంబంధించి 2016 ఏప్రిల్ 27న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు సాంకేతిక విద్యామండలి తేదీని నిర్ణయించింది. ఈ పరీక్ష ఫలితాలను మే 9న ప్రకటించి అనంతరం ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఇలా ఉండగా ఐసెట్ కన్వీనర్‌గా ఆంధ్రాయూనివర్సిటీ మేనేజ్మెంటు విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎం.రామ్మోహనరావును నియమించారు. లాసెట్ కన్వీనర్‌గా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారెడ్డిని నియమిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కీలకమైన ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన వివిధ కమిటీలను ఈనెలాఖరులోగా ఏర్పాటుచేయనున్నారు. నాగార్జునవర్సిటీ వీసీగా మురళీకృష్ణ పేరు ఖరారు ఇలా ఉండగా నాగార్జునవర్సిటీ ఉపకులపతిగా ఆచార్య అయ్యంకి వెంకట మురళీకృష్ణ పేరును ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూలో రిమోట్‌సెన్సింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాగార్జున వర్సిటీ వీసీ ఎంపికకు సంబంధించి సెర్చికమిటీ ఇంతకు ముందు ఆచార్య ఆర్.వెంకటరావును ఎంపికచేయడం, ఆయన బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడం తెలిసిందే. దీంతో అదే సెర్చికమిటీని మరోసారి సమావేశమై ప్రభుత్వానికి మళ్లీ నివేదికను అందించింది. ఇందులోని మురళీకృష్ణ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదంతో త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
ఏపీ ఐసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
ఏయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్ 2015ను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 78,755 మంది హాజరుకానున్న ఈ పరీక్షకు 16 రీజినల్ కేంద్రాల పరిధిలో 136 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ రీజియన్‌లో అత్యధికంగా 88,896, కుప్పం రీజియన్ నుంచి అత్యల్పంగా 347 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, హాల్‌టికెట్లు అందని వారు ప్రాంతీయ సమన్వయకర్తలను సంప్రదించాలన్నారు. రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, రూ. 50 నగదు చెల్లించి హాల్ టికెట్లను పొందవచ్చని తెలిపారు. -
నేడు ఐసెట్ షెడ్యూల్ విడుదల
కరీంనగర్: ఐసెట్ - 2015 షెడ్యూల్ బుధవారం విడుదల చేయనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ కడారు వీరారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కేయూకు అప్పగించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ వీసీ వీరారెడ్డి కేయూ ఇన్చార్జి వీసీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం శాతవాహన యూనివర్సిటీ పరిపాలన విభాగంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, రిజిస్ట్రార్ కోమల్రెడ్డిలు హాజరు కానున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు.