విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న కౌన్సెలింగ్ సిబ్బంది
ఎచ్చెర్ల: బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మాడీ ప్రవేశాలకు బైపీసీ స్ట్రీం విద్యార్థుకు నిర్వహించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. మూడు రోజులుగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిపారు. చివరిరోజు బుధవారం 80 మంది విద్యార్థులు హాజరయ్యారు.
వీరిలో ఓసీ, బీసీలు 41 మంది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 39 మంది ఉన్నారు. మొత్తం మూడు రోజుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు. వీరిలో 189 మంది ఓసీ, బీసీ, 54 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది 245 మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియను విభాగాధిపతులు మేజర్ కె.శివకుమార్, టీవీ రాజశేఖర్, మురళీకృష్ణ పర్యవేక్షించారు.