25నుంచి ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్:
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కేటాయించారు. కౌన్సిలింగ్ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు హాజరైయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్టు, ర్యాంకుకార్డు, డిగ్రీ, ఇంటర్, పదో తరగతి మార్కుల జాబితా, 9వ తరగతి నుంచి డీగ్రీ వరకూ స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలి. పత్రాలను పరిశీలించుకున్న అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కళాశాలలకు కోసం ఆప్షెన్‌ను ఇచ్చుకోవచ్చు. ఎస్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలించనున్నారు.
ఫీజు వివరాలు:
ఓసీ, బీసీ అభ్యర్థులకు పరిశీలన రుసుం రూ. 1000, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ. 500, ఎన్‌సీసీ, పీహెచ్, కాప్,స్పోర్ట్స్ కాటరిగీలకు చెందినఅభ్యర్థులు షెడ్యూల్ ప్రాకారం విజయవాడ బెంజిసర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెన్నిక్ కళాశాలలో ఉంటుంది. వివరాలకు ఏపీఐసెట్. ఎన్‌ఐసి.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దళారీలనునమ్మొద్దు:
మా కళాశాలలో చే రండి ఫీజులు అవసరం లేదు. మా కళాశాలలో చేరితే ల్యాబ్‌లాబ్ ఇస్తామని దళారులు చెబుతుంటారు. సంబంధిత విషయాల గురించి అభ్యర్థులు నమ్మి వారికి మీ మొబైల్ నెంబర్ లేదా ఇతర సమాచారాన్ని (ఐసెట్ హాల్‌టికెట్టు నెంబర్, ర్యాంకులను)
తెలియజేయవద్దన్నారు.
– డాక్టర్ పీకే ప్రకాష్‌రెడ్డి, ఐసెట్ కోర్డినేటర్, కడప