హైదరాబాద్: ఏపీ లాసెట్, పీజీ ఎల్ సెట్ -2015 తుదివిడత కౌన్సెలింగ్ అక్టోబర్ 5వ తేదీనుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్ధులు అయిదో తేదీన సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాలని పేర్కొన్నారు.
5, 6 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలని, అడ్మిషన్ల ప్రాసెసింగ్‌ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యరుధలు 450, ఇతరులు 900 చెల్లించాలన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెబ్‌కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ , గుంటూరు నాగార్జునవర్సిటీలలో ఈ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు http://aplawcet.apsche.ac.in వెబ్ సైట్ సందర్శించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9490332169ను సంప్రదించాలన్నారు.
5 నుంచి లాసెట్ తుది విడత కౌన్సెలింగ్
Published Wed, Sep 30 2015 10:22 PM | Last Updated on Thu, Mar 28 2019 5:35 PM
Advertisement
Advertisement