Web options
-
ఇంజనీరింగ్ సీట్లు 98,296
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల లెక్క పాక్షికంగా తేలింది. ఆఖరి నిమిషంలో కాలేజీలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు లభించింది. దీంతో ఈఏపీసెట్ అర్హత పొంది, కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 15 వరకు ఈ అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యా విభాగం అందించిన సమాచారం ప్రకారం తొలిదశ ఆప్షన్లు ఇచ్చే నాటికి 173 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. మొత్తం 98,296 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.18 లక్షల ఇంజనీరింగ్ సీట్లు వివిధ విభాగాల్లో ఉండాలి. కానీ కొన్ని కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ వంటి బ్రాంచీల్లో సీట్లు, సెక్షన్లు తగ్గించుకున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సులు కావాలని దరఖాస్తు చేసుకున్నాయి. పెరిగే సీట్ల వివరాలకు ఇంకా ప్రభుత్వం అనుమతి లభించలేదు. దీంతో కోత పడే సీట్లుపోను మిగతా వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చారు. సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో 60 శాతానికిపైగా సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులుశాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
కోరుకున్న కాలేజీ.. కోర్సు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సేవలు, తెలంగాణ (దోస్త్) ద్వారా తొలిదశ డిగ్రీ సీట్ల కేటాయింపు శుక్రవారం పూర్తయింది. మొత్తం 1,05,935 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 78,212 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 73,226 మందికి సీట్లు కేటాయించారు. 4,992 మంది తక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వడం వల్ల వారికి సీట్లు కేటాయించలేదు. ఎక్కువ మందికి కోరుకున్న కోర్సులు, కాలేజీల్లోనే సీట్లు వచ్చాయి. 53,032 (72శాతం) మందికి వారు పెట్టుకున్న తొలి ప్రాధాన్యత ప్రకారమే సీట్లు దక్కాయి. ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో తొలి దశ సీట్ల కేటాయింపు వివరాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. కామర్స్‌కు ఫుల్ క్రేజ్ దోస్త్‌లో మొత్తం 889 కాలేజీలు పాల్గొన్నాయి. 512 కోర్సులకు మొత్తం 3,56,258 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు 3,43,102 ఆప్షన్లు ఇచ్చారు. 63 కాలేజీలకు ఒక్క ఆప్షన్ కూడా రాకపోవడం గమనార్హం. కాగా సీట్లు దక్కిన వారిలో బాలురు 29,107 మంది ఉంటే, బాలికలు 44,119 మంది ఉన్నారు. కామర్స్ కోర్సుకు డిమాండ్ పెరుగుతోందని మరోసారి రుజువైంది. దోస్త్‌లో ఈ కోర్సుకు 1,04,687 ఆప్షన్లు అందాయి. తొలిదశలో 33,251 సీట్లు కేటాయించారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ కోర్సుకూ పోటీ ఎక్కువే ఉంది. ఈ కోర్సు అందుబాటులో ఉన్న 14 కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటే, అన్నీ తొలి దశలోనే భర్తీ అయ్యాయి. బీఎస్సీ (ఆనర్స్) బయో టెక్నాలజీ కోర్సును సిటీ కాలేజీలో ప్రవేశపెట్టారు. ఇక్కడ 60 సీట్లూ తొలి విడతలోనే భర్తీ అయ్యాయి. ఆర్ట్స్‌లో 1771, లైఫ్సైన్సెస్లో 16,434, ఫిజికల్ సైన్స్‌లో 13,468, డేటా సైన్స్ (ఏఐఎంఎల్)లో 1955, డి ఫార్మసీలో 254, ఇతర కోర్సుల్లో 87 మందికి సీట్లు కేటాయించారు. 30న రెండోదశ కేటాయింపు: మిత్తల్ దోస్త్ ద్వారా తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. ఇలా చేయని పక్షాన సీటు మాత్రమే కాకుండా, దోస్త్ రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్వల్పంగా ఫీజు ఉంటుందని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ విద్యార్థులు తదుపరి దశల్లో మెరుగైన బ్రాంచీలో, కాలేజీల్లో సీటు కోసం ప్రయత్నించవచ్చన్నారు. అప్పటివరకు కాలేజీల్లో సర్టీఫికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రెండో దశ సీట్ల కేటాయింపు ఈ నెల 30న ఉంటుందన్నారు. ఈ సారి 83 మంది విద్యార్థులు ఇల్లు కదలకుండానే ఆధార్ అనుసంధానంతో ఓటీపీ ద్వారా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. జూలై 17 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రక్రియ విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం నుంచే ఆప్షన్ల ప్రక్రియ మొదలవ్వాలి. కడపటి వార్తలు అందే సమయం వరకూ ఇది ప్రారంభం కాలేదు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీల జాబితా అందకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వనందునే కాలేజీల జాబితా సకాలంలో ఇవ్వలేదని యూనివర్సిటీలు అంటున్నాయి. అఫిలియేషన్ ఇవ్వకపోయినా, గత ఏడాది ఏ కాలేజీలున్నాయో వాటినే కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు, ఫీజుల వ్యవహారంపైనా దోబూచులాట కొనసాగుతోంది. ఇన్ని అస్పష్టతల మధ్య ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈసారి ఎలా ఉంటుందోనని విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలు? ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 1,26,140 మంది అర్హత పొందారు. వీరిలో ఇప్పటివరకు 40 వేల మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 వేల మంది సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తిచేశారు. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రక్రియకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. 145 కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించినా, గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వలేదు. ఉస్మానియా సహా మిగతా వర్సిటీలూ ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు గుర్తింపు విషయాన్ని పక్కనబెట్టి, గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 175 కాలేజీలను ఆప్షన్ల జాబితాలోకి తేవాలని నిర్ణయించారు. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో ఆ కాలేజీలను తొలగించి, ఆ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఫీజులపై పీటముడి ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలోనూ ఇంతవరకూ స్పష్టత రాలేదు. పాత ఫీజులే ఈ ఏడాది వర్తించేలా రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇంకా జీవో విడుదల కాలేదు. ఈలోగానే ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కమిటీ తొలుత అనుమతించిన పెంపు ఫీజునే కాలేజీలు వసూలు చేసుకునేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తుది నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ధారిత ఫీజుకన్నా ఎక్కువ ఉంటే దాన్ని విద్యార్థులకు ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ లెక్కన ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది? రీఎంబర్స్‌మెంట్‌కు అనుమతించేది ఎంత? అనే గందరగోళం వెంటాడుతోంది. సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు వచ్చిన వాళ్లు అదే నెల 13కల్లా ఫీజులు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అప్పటివరకైనా క్లారిటీ వస్తుందా అనే సందేహాలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. ఏ కోర్సులు? ఎన్ని సీట్లు? వెబ్ ఆప్షన్ల వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేరుకున్నా.. ఏ కాలేజీలో ఏ కోర్సులుంటాయో తెలియదు. గత ఏడాది లెక్క ప్రకారం ప్రస్తుతం 67 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో చేరుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ సంవత్సరం చాలా కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ సీట్ల వివరాలేంటో ఆప్షన్ల సమయంలో విద్యార్థులకు తెలిసే అవకాశం కల్పించడం లేదు. అఫిలియేషన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ గత ఏడాది ఉన్న కోర్సుల లెక్కనే చూపించడం వల్ల నచ్చిన కోర్సులో సీటు పొందినా... ఆఖరులో అది ఉంటుందో? ఉండదో? తెలియక విద్యార్థులు అయోమయపడుతున్నారు. అధికారులు మాత్రం రెండో విడత కౌన్సెలింగ్‌కు సీట్లపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. -
వైద్యకోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. https://ug.ntruhsadmissions.com వెబ్సైట్లో ప్రాధాన్యత క్రమంలో అన్ని కళాశాలలకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేయాలి. అన్ని విడతల కౌన్సెలింగ్‌లలో సీట్ల కేటాయింపునకు ఈ ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆప్షన్లు నమోదు చేసి సబ్మిట్ చేసే సమయంలో రిజిస్టర్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్‌చేసి సబ్మిట్ చేయాలి. ఏ కళాశాలలో సీటు లభించిందన్న సమాచారం విద్యార్థుల మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురైతే 7416563063, 7416253073, 8333883934, 9063500829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. సలహాలు, సందేహాలకు 08978780501, 07997710168 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
మెడికల్ సీట్లకు ఒకేసారి ఆప్షన్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్లను ఇచ్చే ప్రక్రియలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. వైద్య సీట్లకు దరఖాస్తు చేసుకునేవారు ఒకేసారి అన్ని కాలేజీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలన్న నిబంధనను తాజాగా ప్రవేశపెట్టింది. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండదని స్పష్టం చేసింది. మొదటిసారిగా రాష్ట్రంలో ఈ నిబంధనను తీసుకురావడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. గతేడాది వరకు కన్వీనర్ కోటా మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియలో విద్యార్థులకు ప్రతీ కౌన్సెలింగ్ సందర్భంగా కళాశాలలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండేది. కాలేజీలు, పరిస్థితిని బట్టి ప్రాధాన్యక్రమంలో తమకు నచ్చిన కొన్ని కాలేజీలను ఎంపిక చేసుకునేవారు. అలా ఎంపిక చేసిన వాటిల్లో ఎందులో సీటొచ్చినా చేరాల్సిందే. అయితే తర్వాత జరిగే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు, మళ్లీ ఆప్షన్లు పెట్టుకునేందుకు అనుమతి ఉండేది. దీంతో తమకు నచ్చిన కాలేజీల్లో సీటు వచ్చే వరకు రెండు, మూడు, మాప్‌అప్ రౌండ్ కౌన్సెలింగ్‌ల వరకు కూడా దరఖాస్తు చేసుకునే, ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు ఉండేది. దీనివల్ల ఇష్టమైన కాలేజీలో సీటు దక్కించుకునేవారు. కానీ ఈ ఏడాది నుంచి తీసుకురానున్న కొత్త నిబంధనతో విద్యార్థులకు చిక్కులు వస్తాయని వైద్య విద్య నిపుణులు అంటున్నారు. అన్ని కళాశాలలకు ఒకేసారి ఆప్షన్లు ఇవ్వాల్సి రావడంతో అవగాహన లేక ప్రాధాన్యాలను సరిగా ఇచ్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటా సీటు వస్తే, చేరాక మరో కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలో సీటు వస్తే చెల్లించిన ఫీజును తిరిగి వెనక్కిస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. తదుపరి కౌన్సెలింగ్‌ల్లోనూ ప్రాధాన్యం ప్రకారం సీటు ఉదాహరణకు ఒక విద్యార్థికి తానిచ్చిన ప్రాధాన్యంలోని పదో కాలేజీలో మొదటి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిందని అనుకుందాం. అతను ఆ కాలేజీలో తప్పక చేరాల్సిందే. తర్వాత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేయకున్నా, తన ప్రాధాన్యంలోని పై తొమ్మిది కాలేజీల్లో ఎందులోనైనా సీటు వచ్చే అవకాశముంటే కేటాయిస్తారు. అప్పుడు చేరకుంటే, మూడో కౌన్సెలింగ్‌లో మళ్లీ ప్రాధాన్యంలోని పై కాలేజీల్లో కేటాయిస్తారు. కాబట్టి దీనివల్ల విద్యార్థులకు నష్టం ఉండదు. కానీ కొత్త మార్పులపై విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ప్రాధాన్యాల్లో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
ఏపీఈఏపీ సెట్లో 89వేల మంది ఆప్షన్ల నమోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల నమోదు శుక్రవారం రాత్రితో ముగిసింది. శనివారం ఆప్షన్లను సవరించుకోవచ్చు. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించగా, కౌన్సెలింగ్‌కు 90,606 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 89,232 మంది వెబ్ ఆప్షన్లలో పాల్గొన్నారు. గత ఏడాదికన్నా ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 83,014 మంది ఆప్షన్లు నమోదు చేసుకోగా, ఈసారి అంతకంటే ఎక్కువే పాల్గొన్నారు. ఈసారి ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల, కౌన్సెలింగ్ ప్రారంభం ఆలస్యం కావడంపై కొన్ని పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చాయి. ఈ ఆలస్యం వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు నష్టపోతున్నారని, ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలకు వెళ్లిపోతున్నారంటూ ప్రచురించాయి. ఈ కథనాలు తప్పని నిరూపిస్తూ గత ఏడాదికంటే ఈసారి వెబ్ ఆప్షన్లలో ఎక్కువమంది పాల్గొనడం విశేషం. సీట్లు ఖాళీ కాకుండా మెరిట్ విద్యార్థులకు అవకాశం ఐఐటీ, ఎన్ఐటీ, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా ఉంటుందని అంచనా. వీరు ఏపీ ఈఏపీసెట్‌లోనూ మెరిట్లో ఉన్నారు. వీరంతా జాతీయ సంస్థల్లో చేరేందుకే ప్రాధాన్యమిస్తారు. జేఈఈ ప్రవేశాలకన్నా ముందే రాష్ట్ర కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించడం వల్ల ఈ విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందేవారు. తరువాత వారు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అ«థారిటీ) కౌన్సెలింగ్‌లో జాతీయ సంస్థల్లో సీట్లు పొందితే రాష్ట్ర కాలేజీల్లోని సీట్లను వదులుకోవడం ద్వారా అవి ఖాళీ అయ్యేవి. దీనివల్ల ఈఏపీసెట్‌లో వారి తరువాత మెరిట్లో ఉండే విద్యార్థులకు మొదటి కౌన్సెలింగ్‌లో నష్టం వాటిల్లేది. ఇçప్పుడు జోసా కౌన్సెలింగ్ అనంతరం ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల వారికి తొలి కౌన్సెలింగ్‌లో మేలు జరుగుతుంది. జేఈఈలో ర్యాంకులు పొందిన వారు జాతీయ విద్యా సంస్థలకు వెళ్లిపోవడంతో వారి తర్వాత మెరిట్లో ఉన్న వారికి అవకాశం కలుగుతోంది. ప్రైవేటు వర్సిటీల్లోనూ కన్వీనర్ కోటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ఈ ఏడాది నుంచి ప్రైవేటు యూనివర్సిటీల్లోని కోర్సుల్లో 35 శాతం సీట్లు పేద మెరిట్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వర్సిటీలతో సంప్రదింపులు జరిపి, కన్వీనర్ కోటా సీట్లకు ఒప్పించడంతో పాటు అది తక్షణమే కార్యాచరణలోకి వచ్చేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయించారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – అమరావతిలో 1,264 సీట్లు, ఎస్ఆర్ఎం– విజయవాడలో 413 సీట్లు, బెస్ట్ యూనివర్సిటీ– అనంతపురంలో 168 సీట్లు, సెంచూరియన్ యూనివర్సిటీ – టెక్కలిలో 273 సీట్లు మొత్తం 2,118 సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విద్యార్థులకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటివరకు ఈ వర్సిటీల్లో కోర్సులకు వారు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించడంతోపాటు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు వంటి కోర్సులకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. వీటిలో చదివిన వారిలో అధికశాతం విద్యార్థులకు అత్యుత్తమ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ చొరవ కారణంగా పేద మెరిట్ విద్యార్థులు తొలిసారిగా ప్రైవేటు వర్సిటీల్లో అడుగిడబోతున్నారు. రాష్ట్రంలో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి రాష్ట్రంలోని కాలేజీల్లో చేరడానికి ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేపట్టిన సంస్కరణలతో ఉన్నత విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందుతోంది. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయంబర్స్మెంటు, వసతి, భోజనాల ఖర్చు కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేస్తుండడంతో ప్రవేశాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి -
ఇంజనీరింగ్, ఫార్మసీలో 1.45 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. వెబ్ కౌన్సెలింగ్‌కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్‌కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌లో ఉన్నాయి. నేటినుంచి వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో ఈనెల 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
టీఎస్ ఎంసెట్: నేటి నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్స్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్‌కు సంబంధించి నేటి నుంచి 16 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలవనుంది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ 161 కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఇంజనీరింగ్ కోటాలో 85,149 సీట్లకు గానూ 60, 697 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇక అడ్మిషన్ష్ కౌన్సిలింగ్ లిస్టులో పలు ఇంజనీరింగ్ కాలేజీలు లిస్టులో చోటు దక్కించుకోలేదు. ఇక 91 బీ ఫార్మసీ కాలేజీల్లో 7,640 సీట్లు ఉండగా.. అందులో 2,691 కన్వీనర్ కోటా ఉన్నాయి. 44 ఫార్మా డీ కాలేజీల్లో 1295 సీట్లు ఉండగా.. 454 కన్వీనర్ కోటా ఉన్నాయి. -
ఏపీ: నేటి నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం (నేటి) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కలి్పస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ కానివారికి కూడా ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సరి్టఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు. అభ్యర్థుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాలను జనవరి 1వ తేదీవరకు కొనసాగించాలని కనీ్వనర్ నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలనను ఈనెల 29న విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో చేపట్టనున్నారు. రిజిస్టర్ అయి ఉన్న వారు మొబైల్ నంబరు మార్పు, లాగిన్ ఐడీ తదితర అంశాలపై హెల్ప్‌లైన్ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ను చూడవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే వాటిని నివృత్తి చేసేందుకు కమిషనరేట్‌లో మూడు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వాటికి ఫోన్‌చేసి తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చు. జనవరి 1వ తేదీన అభ్యర్థులు తమ ఆప్షన్లలో పొరపాట్లు సవరించుకునే అవకాశం ఉంది. అనంతరం 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రయివేటుకు సంబంధించి 257 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,29,016 సీట్లు, 120 ఫార్మసీ కాలేజీల్లో 10,675 బీఫార్మసీ సీట్లు, 62 కాలేజీల్లో 1,860 డీఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా ఇంజనీరింగ్‌లో 82 కాలేజీలు, బీఫార్మసీలో 19 కాలేజీలు, డీఫార్మాలో 7 కాలేజీలు యూనివర్సిటీలకు వివిధ రుసుములు బకాయి ఉండడంతో వాటిలోని 35,347 ఇంజనీరింగ్, 1,660 బీఫార్మసీ సీట్లు, 210 డీఫార్మా సీట్లను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ఆ కాలేజీలనుంచి అఫిడవిట్లు తీసుకుని ఆ సీట్లను కూడా విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అవికూడా జత అయితే సీట్లసంఖ్య ఆ మేరకు పెరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ వర్సిటీల పరిధిలోని 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో 5,212 సీట్లు, 9 బీఫార్మసీ కాలేజీల్లో 520 సీట్లు, 1 డీఫార్మసీ కాలేజీలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాక మిగిలిన సీట్లు ప్రయివేటు కాలేజీలకు సంబంధించినవి. 4 లేదా 5 నుంచి తరగతులు ఈనెల 3వ తేదీ సాయంత్రానికి సీట్ల కేటాయింపు పూర్తిచేసి 4 లేదా 5వ తేదీనుంచి తరగతుల ప్రారంభించాలని సూచిస్తున్నాం. మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాక రెండు, మూడో విడత సీట్ల కేటాయింపు చేస్తాం. ఎంపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక జనవరి 9 నుంచి బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ చేపడతాం. ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కలి్పస్తాం. – ఎం.ఎం.నాయక్, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ స్ట్రీమ్ కోర్సులకు వెబ్ ఆప్షన్లు గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ కోర్సులకు ఏపీ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్‌కృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు: 1,85,936 ఎంసెట్‌కు హాజరైన వారు: 1,56,953 క్వాలిఫై అయిన వారు: 1,33,072 ఆప్షన్ల నమోదు షెడ్యూల్ తేదీ ర్యాంకు నుంచి ర్యాంకు వరకు డిసెంబర్ 28, 29 1 60,000 డిసెంబర్ 30, 31 60,001 చివరి వరకు జనవరి 1 –– ఆప్షన్లలో సవరణ జనవరి 3 – సీట్ల కేటాయింపు వర్సిటీల వారీగా అందుబాటులో ఉన్న వర్సిటీ, ప్రయివేటు సీట్లు మొత్తం యూనివర్సిటీ ఇంజనీరింగ్ బీఫార్మసీ డీఫార్మా ఏఎన్‌యూ 3,420 1,840 300 జేఎన్టీయూఏ 38,637 3,285 780 జేఎన్టీయూకే 81,757 3,360 480 ఏయూ 3,190 1,750 270 కేయూ –– 260 30 ఇతర వర్సిటీలు 2,012 180 –– మొత్తం 1,29,016 10,675 1,860 వర్సిటీల వారీగా జీరో అడ్మిషన్ల కాలేజీలు ఇలా వర్సిటీ ఇంజనీరింగ్ బీఫార్మసీ ఏఎన్‌యూ 1 –– జేఎన్టీయూ–ఏ 21 2 జేఎన్టీయూ–కే 26 2 ఏయూ –– 1 హైల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995681678 ఈమెయిల్ ఐడీ: ‘సీఓఎన్‌వీఈఎన్‌ఈఆర్‌ఏపీఈఏఎంసీఈటీ2020:జీమెయిల్.కామ్’ను మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. -
రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లను రేపు(శుక్రవారం) అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 18 తేదీ అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామని పేర్కొన్నారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 4008 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. (చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) మొత్తంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74, 418 మంది ఐచ్ఛికాలను ఇచ్చారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు గత ఏడాది తరహాలోనే ఉండే అవకాశముందని, తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలును రేపు ప్రకటిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) -
రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..
-
నత్తనడకన మెడికల్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ప్రవేశాలకు ప్రకటన వెలువడి దాదాపు 3 వారాలు పూర్తయినా ఇప్పటికీ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆలిండియా కోటాలో మొదటిదశ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఆలిండి యా కోటాలో మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన వెంటనే, రాష్ట్రంలోనూ మొదటి విడత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వాలి. ఈసారి మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతోంది. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విద్యార్థుల సమక్షంలో జరగ్గా, ఇప్పుడు కరోనా కారణంగా ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతోంది. దీంతో విద్యార్థులు ధ్రువపత్రాలు అప్లోడ్ చేయలేదంటున్నారు. చాలావరకు తప్పుల తడకగా ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉంటాయి. కానీ కొందరు సంబం ధిత జిల్లాలో లేని కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో ధ్రువపత్రాల్లోనూ తప్పులు ఉన్నాయి. కొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా ఈడబ్లు్యఎస్ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేశారు. వారికి ఈడబ్లు్యఎస్‌కు సంబంధం లేకున్నా తహసీల్దార్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు ఉండాల్సి ఉండగా, రూ.10 లక్షలకు పైగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కొందరు ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి వాటిని గుర్తించి, విద్యార్థులకు ఫోన్లు చేసి చక్కదిద్దడానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. (చదవండి: ఎంబీబీఎస్ రాక.. బీడీఎస్ ఇష్టం లేక..) 28 నుంచి వెబ్ ఆప్షన్లు... రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ ఆప్షన్లను ఈ నెల 28 నుంచి నిర్వహించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యే అవకాశాలున్నాయని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటిస్తారు. జాబితాపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించడానికి మరో రెండ్రోజులు సమయం తీసుకుంటారు. అనంతరం మెడికల్ కాలేజీని ఎంచుకోవడానికి వచ్చే సోమవారం నుంచి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నెలాఖరులో మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. కన్వీనర్ కోటాలో తొలివిడత పూర్తయిన తర్వాత ప్రైవేటు వైద్యకళాశాలల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల భర్తీకి ప్రకటన జారీచేస్తారు. (చదవండి: పక్కింటి పద్మావతితో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా) రెండో విడత ప్రవేశాలు.. ఆలిండియా మెడికల్ ప్రవేశాల్లో రెండో విడత శుక్రవారం నుంచి నిర్వహిస్తారు. ఈ నెల 24 వరకూ రెండో విడతలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 27న సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. 28 నుంచి వచ్చే నెల 8లోగా కేటాయించిన మెడికల్ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల వల్ల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
రేపటి వరకు డిగ్రీ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా మూడో దశ కౌన్సెలింగ్ సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చివరి తేదీని ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పొడిగించినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ నెల 28వ తేదీలోగా దోస్త్ వెబ్సైట్ ద్వారా (ఆన్లైన్) సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థుల సీట్లు రద్దు అవుతాయని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదలు, సెలవుల కారణంగా ఈ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. అలాగే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును కూడా ఈనెల 28వ తేదీ వరకు పొడిగించామని వివరించారు. కాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపును ఈనెల 31వ తేదీన ప్రకటిస్తామని, విద్యార్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అలాగే అన్ని దశల కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆయా కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని వెల్లడించారు. చదవండి: మెదక్‌లో అరుదైన జీవజాతి.. మూషిక జింకలు -
మొదలైన వెబ్ ఆప్షన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్ ఆప్షన్లు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 176 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97,741 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేశాయి. శనివారం ప్రభుత్వం కొత్త కోర్సుల్లో సీట్లకు ఆమోదం తెలుపగా, ఆదివారం మధ్యాహ్నం వరకు యూనివర్సిటీలు కొత్త కోర్సులతోపాటు పాత కోర్సులకు అనుబంధ గుర్తింపును జారీ చేస్తాయని ప్రవేశాల క్యాంపు అధికారులు, యాజమాన్యాలు ఎదురుచూశాయి. చివరకు ఆదివారం రాత్రి జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును ఇస్తూ కాలేజీల వారీగా బ్రాంచీలు, ఆయా బ్రాంచీల్లో సీట్ల వివరాలను ప్రవేశాల కమిటీలకు అందజేశాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులను బట్టి 176 కాలేజీల్లో 97,741 సీట్లకు ఆమోదం తెలిపినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. దీంతో ప్రవేశాల క్యాంపు కార్యాలయం సీట్ మ్యాట్రిక్స్ రూపొందించి ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. మొత్తం 176 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 69,365 సీట్లను (14 యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం... 3,152 సీట్లు) భర్తీ చేయనుంది. కన్వీనర్ కోటాలో సీట్ల కోసం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. అయితే ఆప్షన్లు ఇచ్చేప్పుడు కాలేజీల ప్రాధాన్యం పక్కాగా చూసుకోవాలని, తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇక మరో 28,376 సీట్లను 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో (అందులో 15 శాతం ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా) యాజమాన్యాలు భర్తీ చేయనున్నాయి. 25 కాలేజీలు.. 13,132 సీట్లకు కోత రాష్ట్రంలోని 201 కాలేజీల్లోని 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలుపగా, అందులో 176 కాలేజీల్లో 97,741 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు జారీ చేశాయి. అంటే 25 కాలేజీల్లోని 13,132 సీట్లకు యూనివర్సిటీలు కోత పెట్టాయి. అందులో 14 కాలేజీలు మూత పడగా, మరో 11 కాలేజీల్లో సీట్లు తగ్గిపోయాయి. కోర్సుల వారీగా జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇచ్చిన ప్రధాన బ్రాంచీల సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ – 6960, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – 180, సైబర్ సెక్యూరిటీ – 2580, డేటా సైన్స్ – 4500, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ – 1770, కంప్యూటర్ సైన్స్ బిజినెస్ అనలిటిక్స్ – 360, కంప్యూటర్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్) – 120, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ – 300, సీఎస్‌ఐటీ – 480, కంప్యూటర్ సైన్స్ – 20913, ఈసీఈ – 16893, ఈఈఈ – 8130, సివిల్ – 7140, మెకానికల్ – 6648, ఐటీ – 4980, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 300, కెమికల్ ఇంజనీరింగ్ – 120, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ – 240, మెటలర్జి – 360, మైనింగ్ – 60, ఆటోమొబైల్ – 60, బయోమెడికల్ – 30, కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ – 60, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ – 300, ఈటీఈ – 60, ఐటీ అండ్ ఇంజనీరింగ్ – 60, మెకట్రానిక్స్ – 60. -
దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ ప్రవేశాల్లో చేరేందుకు బుధవారం నుంచి 21 వరకు దోస్త్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. అలాగే బుధవారం (నేటి) నుంచి ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. 26వ తేదీన ప్రత్యేక విడత సీట్లు కేటాయిస్తామని.. 26 నుంచి 29 తేదీల్లో కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుందని చెప్పారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారితో పాటు గతంలో ఇచ్చినా సీటు దక్కని వాళ్లు కూడా ఈ ప్రత్యేక విడతలో మరోసారి ప్రయత్నం చేయొచ్చని ఆయన వెల్లడించారు. సీటు వచ్చిన కాలేజీల్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు మళ్లీ రూ.400 చెల్లించి తాజాగా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సీటు వచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు మెరుగైన సీటు కోసం ప్రయత్నిస్తే మూడో విడత వెబ్ ఆప్షన్లనే మళ్లీ సమర్పించాల్సి ఉంటుందని లింబాద్రి వివరించారు. -
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రివైజ్డ్ షెడ్యూలును ప్రవేశాల కమిటీ జారీ చేసింది. విద్యార్థులు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం 54,836 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా, అందులో 53,795 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారంతా శుక్రవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు మిగతా కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్ వివరించారు. అలాగే కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు. ఫీజుల ఖరారు.. లేదంటే షరతులతో ముందుకు! రాష్ట్రంలోని 189 ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు ఫీజుల ఖరారు కోసం కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలతో ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. మిగతా 108 కాలేజీల ఫీజల ఖరారు ప్రక్రియను గురువారం చేపట్టింది. అర్ధరాత్రి వరకు కొనసాగించింది. మరోవైపు శుక్రవారం ఉదయం నుంచే ఆయా కాలేజీలతో హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటికే 81 కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఫైలును ప్రభుత్వానికి పంపించింది. గురువారం సాయంత్రమే ఆ ఫైలును సీఎం ఆమోదం కోసం విద్యాశాఖ పంపించింది. దీంతో శుక్రవారం ఆయా కాలేజీల ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం సమావేశమై 4గంటల పాటు చర్చించారు. శుక్రవారం సాయంత్రం వరకు మిగతా కాలేజీలకు సంబంధించిన ఫీజుల ఫైలును కూడా పంపించాలన్న ఆలోచనల్లో ఉన్నారు. సీఎం ఆమోదం ఆలస్యమైతే! ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించిన ఫైలుకు ఆమోదం లభించడంలో ఆలస్యమైతే.. ఎలా ముందుకెళ్లాలన్న కార్యాచరణపైనా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఎలాగూ కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీలకు 20%, రూ.50వేలకు పైగా ఫీజు ఉన్న కాలేజీలకు 15% పెంపునకు ప్రతిపాదించడం.. దీనికి మెజారిటీ కాలేజీలు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేయవద్దని, యాజమాన్యాలకు ఏఎఫ్ఆర్సీ చేసిన ఫీజు పెంపు ప్రతిపాదనల అమలుతో ముందుకు సాగాలని నిర్ణయించారు. సీఎం కనుక శుక్రవారం ఓకే చేస్తే ఎలాంటి సమస్యా ఉండదన్న భావనకు వచ్చారు. అది జరక్కపోతే మాత్రం కండిషనల్‌గా 15%, 20% పెంపును వర్తింపజేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి ఫీజులపై ఉత్తర్వులు వచ్చాక వాటిని అమలు చేస్తామని, ఈ అంశాలన్నింటిని తెలియజేస్తూ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫీజుల పెంపుపై స్పష్టత! తల్లిదండ్రుల్లో ఇప్పటికే ఫీజుల పెంపుపై ఓ స్పష్టత వచ్చిందన్న అభిప్రాయానికి అధికారుల వచ్చారు. ఏఎఫ్ఆర్సీ హియరింగ్ సీబీఐటీకి రూ.1.34 లక్షలు వార్షిక ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే శ్రీనిధి, వాసవి కాలే జీలకు రూ.1.30 లక్షలుగా, ఎంజీఐటీకి రూ.1.08 లక్షలుగా ఫీజును ఖరారు చేసినట్లు సమాచారం.దీంతో టాప్ కాలేజీల్లో గరిష్టంగా ఫీజు ఎంత ఉండొచ్చన్న అంచనా ఉంది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకు ఫీజు పెంపు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఈ ఫీజులకు శుక్రవారం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోతే షరతులతో ముందుకు సాగనున్నారు. కన్వీనర్ కోటాలో 64,709 సీట్లు ఇప్పటివరకు అన్ని సరిగ్గా ఉన్న 183 కాలేజీల్లో మొత్తంగా 91,270 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కమిటీ ప్రకటించింది. అందులో 169 ప్రైవేటు కాలేజీల్లో 88,199 సీట్లు అందుబాటులో ఉండగా, 14 యూనివర్సిటీ/ప్రభుత్వ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 70% సీట్లను (64,709) కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 26,561 సీట్లు మేనేజ్మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కాలేజీలు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. శనివారం నాటికి మరిన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీల వారీగా ప్రభుత్వ కాలేజీలు, సీట్లు యూనివర్సిటీ కాలేజీలు సీట్లు ఉస్మానియా 2 420 జేఎన్టీయూ–హెచ్ 4 1,410 కాకతీయ 3 825 మహత్మాగాంధీ 1 180 జేఎన్ఏఎఫ్ఏయూ 1 160 అగ్రికల్చర్ యూనివర్సిటీ 2 54 వెటర్నరీ యూనివర్సిటీ 1 22 మొత్తం 14 3,071 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల వివరాలు.. యూనివర్సిటీ ఆమోదం లభించిన మొత్తం కన్వీనర్ కోటాలో సీట్లు కాలేజీలు సీట్లు కాలేజీలు సీట్లు ఉస్మానియా 13 7,760 13 5,411 జేఎన్టీయూ–హెచ్ 151 78,729 151 55,030 కాకతీయ 5 1,710 5 1,197 మొత్తం 169 88,199 169 61,638 యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో 14 3,071 మొత్తంగా కన్వీనర్ కోటాలో... 183 64,709 కన్వీనర్ కోటాలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు.. కోర్సు యూనివర్సిటీ ప్రైవేటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 27 – ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ – 84 ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 294 ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 84 బయోటెక్నాలజీ – 21 బయోమెడికల్ ఇంజనీరింగ్ 30 21 కెమికల్ ఇంజనీరింగ్ 120 126 సివిల్ ఇంజనీరింగ్ 130 7,949 కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం – 42 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 550 16,614 సీఎస్‌ఐటీ – 42 డైరీయింగ్ 22 – డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్ 60 – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 500 14,955 ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ – 16 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 490 7,792 ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేనేషన్ ఇంజనీరింగ్ – 322 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమ్యాటిక్స్ – 42 ఫుడ్‌సైన్స్ 27 – ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ 20 – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 240 3,717 ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ – 112 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ – 42 మెకానికల్ (మెకట్రానిక్స్) ఇంజనీరింగ్ – 42 మెకానికల్ ఇంజనీరింగ్ 420 8,833 మెటలర్జికల్ ఇంజనీరింగ్ 60 – మైనింగ్ ఇంజనీరింగ్ 55 168 మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ – 42 పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ – 84 ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ – 42 ప్లానింగ్ 40 – టెక్స్టైల్ టెక్నాలజీ 20 – మొత్తం 3,071 61,638 -
వెబ్ ఆప్షన్లు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే అన్ని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేశాకే ముందుకెళ్లాలన్న నిర్ణయం నేపథ్యంలో.. 5నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలా? వద్దా? అన్న ఆలోచనల్లో అధికారులున్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలంటే కాలేజీ వారీగా వివరాలన్నీ అందుబాటులోకి తేవాల్సి ఉంది. అయితే ఈనెల 5వ తేదీ నాటికి సాధ్యం అవుతుందా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. గత వారం వరకు ఫీజులను ఖరారు చేయకపోవడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి, ఫీజులను ఖరారు చేయాలి.. లేదా యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలన్న ఉత్తర్వులను పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగమేఘాలపై ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్‌ను నియమించడం, ఫీజుల ఖరారు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధవారంతో కోర్టును ఆశ్రయించిన 81 కాలే జీల్లో 79 కాలేజీలకు ఏఎఫ్ఆర్సీ హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. అంతేకాదు కోర్టుకు వెళ్లని మరో 108 కాలేజీల ఫీజులను ఈనెల 4వ తేదీ నుంచి చేపట్టి రోజుకు 36 కాలేజీల చొప్పున హియరింగ్ నిర్వహించి 6వ తేదీనాటికి అన్నింటికి ఫీజులను ఖరారు చేసేందుకు ముందుకు సాగుతోంది. ఆ తరువాత బీ–ఫార్మసీ ఫీజులను కూడా ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీజులతో వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలంటే ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇందుకు మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల పాటు వెబ్ ఆప్షన్లు వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. లేదా కోర్టును ఆశ్రయించిన కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులపై ఉత్తర్వుల కోసం గురువారం ప్రభుత్వానికి పంపి, మిగతా కాలేజీలు ఎలాగూ ఫీజు రూ.50 వేలకు పైగా ఉంటే 15%, రూ.50 వేల లోపు ఉంటే 20% పెంచేందుకు అంగీకరించిన నేపథ్యంలో వాటిని అమలు చేయాలా? అన్న ఆలోచనల్లో అధికారులున్నారు. దీనిపై గురువారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారీగా ఫీజుల పెరుగుదల ఏఎఫ్ఆర్సీ వివిధ కాలేజీలతో నిర్వహిస్తున్న హియరింగ్ సందర్భంగా కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి వచ్చే మూడేళ్లలో అమలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేస్తోంది. ఇప్పటివరకు 79 కాలేజీలకు హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. ఇందులో కొన్ని ప్రముఖ కాలేజీలున్నాయి. ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజుకు ఆయా కాలేజీలు అంగీకరించినట్లు తెలిసింది. శ్రీని«ధి, సీబీఐటీ కాలేజీల ఫీజులను గురువారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొన్ని టాప్ కాలేజీల్లో ఫీజులు గతంలో కంటే ఈసారి ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని కాలేజీల్లో ఫీజుల పరిస్థితి (కొంత మార్పు ఉండవచ్చు) కాలేజీ పాత ఫీజు కొత్త ఫీజు వాసవి 86,000 1,30,000 వర్ధమాన్ 1,05,000 1,25,000 సీవీఆర్ 90,000 1,15,000 కేఎంఐటీ 77,000 1,03,000 సీవీఎస్ఆర్ 93,000 1,20,000 -
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జూలై 5 నుంచి నిర్వహించేలా ప్రవేశాల కమిటీ ఆదివారం రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారం పూర్తిగా తేలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 27 నుంచి జూలై 4 వరకు ఆప్షన్లకు అవకాశం కల్పించేలా కమిటీ షెడ్యూల్ జారీ చేసింది. అయితే కాలేజీల ఫీజుల వ్యవహారం తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో 27 నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్లను జూలై 1కి వాయిదా వేసింది. ఆదివారం వరకూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల ఫీజుల వ్యవహారం తేలకపోవడంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్లను 5 నుంచి ప్రారంభిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. అంటే 5వ తేదీ నుంచి మరో నాలుగైదు రోజులు వెబ్ ఆప్షన్లకు, చివరి రోజున ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశమిస్తారు. ఈ లెక్కన 10వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈలోగా ఫీజులు ఖరారు! సవరించిన షెడ్యూల్ ప్రకారం మొత్తానికి 10 రోజుల సమయం ఉండనుంది. ఈలోగా కోర్టును ఆశ్రయించిన కాలేజీల ఫీజులను ఖరారు చేయాలన్న నిర్ణయానికి ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) వచ్చింది. శనివారం కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఏఎఫ్ఆర్సీ.. రూ. 50 వేల లోపు ఫీజు ఉన్న కాలేజీలకు 20%, రూ. 50 వేలకు పైగా ఫీజు ఉన్న కాలేజీలకు 15% ఫీజులను పెంచుతామని ప్రతిపాదించగా.. మెజారిటీ కాలేజీలు అంగీకరించాయి. కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లోనూ చాలావరకు అంగీకారం తెలిపాయి. కోర్టును ఆశ్ర యించిన 81 కాలేజీల్లో ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజుకు గరిష్టంగా 20 కాలేజీలు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ 20 కాలేజీలకు నాలుగైదు రోజుల్లో ఫీజులను ఖరారు చేసే అవకాశం ఉంది. వీలైతే అన్నింటి ఫీజు ఖరారు.. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 వరకు సమయం లభించనుంది. దీంతో కోర్టును ఆశ్రయించినవే కాకుండా వీలైతే మిగతా అన్ని కాలేజీల ఫీజులనూ ఖరారు చేయాలన్న ఆలోచనల్లో ఏఎఫ్ఆర్సీ ఉంది. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 12 వరకు పనిచేసేలా షెడ్యూల్ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతోంది. ఇప్పటికే అన్ని కాలేజీల రెండేళ్ల ఆదాయ వ్యయాలు, ఇప్పటి నుంచి మూడేళ్లు వసూలు చేయాల్సిన కొత్త ఫీజుల ప్రతిపాదనలు ఏఎఫ్ఆర్సీ వద్ద ఉన్నాయి. కాలేజీల వారీగా అన్ని లెక్కలను క్రోడీకరించి ఏఎఫ్ఆర్సీ తరఫున ఉన్నత విద్యా మండలి సిద్ధం చేసి ఉంచింది. దీంతో 197 ఇంజనీరింగ్, 122 బీఫార్మసీ కాలేజీల ఫీజుల ఖరారుకు పెద్దగా సమయం పట్టదన్న ఆలోచనల్లో ఉంది. కోర్టునాశ్రయించిన కాలేజీలే కాదు.. వీలైతే కోర్టును ఆశ్రయించని కాలేజీల ఫీజులనూ త్వరగా ఖరారు చేసేలా కసరత్తు ప్రారంభించింది. తాత్కాలిక పెరుగుదల కాకుండా తరువాత ఎంత పెరుగుతుందోనన్న ఆందోళన లేకుండా చూడాలని ఆలోచిస్తోంది. చివరి తేదీ నాటికి కాకపోతే.. ఈ నెల 10 నాటికి అన్ని కాలేజీల ఫీజు ఖరారు చేయలేకపోతే యాజమాన్యాలు అంగీకరించిన 20 శాతం, 15 శాతం ఫీజు పెంపును అమలు చేయాలని భావి స్తోంది. కోర్టును ఆశ్రయించిన కాలేజీలతోనూ సోమ వారం భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో తమ పెంపునకు అంగీకరిస్తే సులభంగా ముందుకు వెళ్లవచ్చని, కౌన్సెలింగ్ సజావుగా నిర్వ హించవచ్చని యోచిస్తోంది. లేదంటే వాటికి ఫీజును నిర్ణయించి, మిగతా వాటికి తాము ప్రతిపాదించిన పెంపును అమలు చేయనుంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 53,364 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోగా, ఆదివారం నాటికి 37,413 మంది వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ నెల 3 వరకు వెరిఫికేషన్‌కు సమయం ఉంది. -
నేటి నుంచి ఎంసెట్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి జూలై 1 వరకు విద్యార్థులు ఆన్లైన్లో (tseamcet.nic.in)రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకునేలా ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. అలాగే ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కాగా, ఫీజులు పెంచాలని ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, వాటిపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 27 నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలంటే కాలేజీల వారీగా ఫీజుల వివరాలను అందుబాటులో ఉంచా ల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈలోగా ఫీజుల వ్యవహా రంపై స్పష్టత వస్తే 27 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. లేదంటే కొంత ఆలస్యం కానుంది. ఎంచుకున్న సమయంలో వెరిఫికేషన్.. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్ణీత తేదీల్లో నిర్ణీత ర్యాంకుల వారు, వారికి కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో చేయించుకునే వారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. స్లాట్ బుకింగ్ ద్వారా తమకు సమీపంలో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎంచుకొని నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు 27వ తేదీ నుంచి జూలై 3 వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ప్రతి గంటకు ఒక స్లాట్‌గా విభజించి వెరిఫికేషన్ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్ణీత తేదీలో నిర్ణీత సమయంలో తాము ఎంచుకున్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రవేశాల క్యాంపు కార్యాలయ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. లక్ష మంది హాజరు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం గత నెల 3, 4, 6 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ రాసేందుకు 1,42,216 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వాటి ఫలితాలను ఎంసెట్ కమిటీ ఈ నెల 9న విడుదల చేసింది. అందులో 1,08,213 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,989 మంది రిజిస్టర్ చేసు కోగా 68,550 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది అర్హత సాధించారు. ఎంసెట్ అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేలా (లేటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి 26 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఈసెట్ ద్వారా 10,221 సీట్లను ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో కంప్యూటర్ సైన్స్‌లో 2,421 సీట్లు, ఈసీఈలో 2,291, మెకానికల్‌లో 1,398, ఈఈఈలో 1,183, సివిల్‌లో 1,154, ఫార్మసీలో 1,015 సీట్లు, ఐటీలో 530 సీట్లు, ఇతర విభాగాల్లో మిగతా సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఈసెట్ వెబ్ఆప్షన్లు కూడా 24వ తేదీ నుంచి 27 వరకు ఇచ్చుకునేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాలేజీల వారీగా వివరాలు చూసుకొని విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. -
డిగ్రీలో లక్ష మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా మొదటి దశ సీట్ల కేటాయింపు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ప్రకటించింది. డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,21,363 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 1,11,429 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో మొదటి దశలో 1,05,433 మంది దోస్త్ సీట్లను కేటాయించింది. 5,996 మంది విద్యార్థులు సరిపడా ఆప్షన్లు ఇచ్చుకోని కారణంగా ఏ కాలేజీలోనూ వారికి సీట్లు లభించలేదని పేర్కొంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలిసి దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వివరాలు ప్రకటించారు. మొదటి పది సీట్లు అమ్మాయిలకే.. ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులతో మొదటి 10 సీట్లు అమ్మాయిలు సాధించారు. మొత్తం 75,184 మంది విద్యార్థులు తాము ఇచ్చుకున్న మొదటి ఆప్షన్ ప్రకారమే సీట్లు లభించాయి. మరో 30,459 మంది విద్యార్థులకు రెండో ఆప్షన్ ప్రకారం సీట్లు కేటాయించారు. సొంత జిల్లాల్లోని కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్న 424 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా సీట్లు పొందిన విద్యార్థుల్లో 40,375 మంది (38.3 శాతం) బాలురు ఉండగా, 65,058 మంది బాలికలు ఉన్నారు. 15లోగా వెబ్ ఆప్షన్లు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కూడా సోమవారం నుంచే దోస్త్ ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 15లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకుముందు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని 15లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వారికి ఈనెల 20న రెండో దశ సీట్లు కేటాయిస్తామని వెల్లడించింది. ఎంసెట్ తరహాలో సెల్ఫ్ రిపోర్టింగ్: మిట్టల్ ఎంసెట్, ఈసెట్ తరహాలోనే డిగ్రీలోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ విధానాన్ని ఈ సారి అమల్లోకి తెచ్చినట్లు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు. కాలేజీల్లో ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వొద్దని స్పష్టం చేశారు. తర్వాత కూడా టీసీ మినహా ఏ ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా కాలేజీల్లో ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమకు లభించిన కాలేజీలో చేరాలనుకుంటే జూలై 1 నాటికి కాలేజీలో చేరాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. దోస్త్ పరిధిలోని కాలేజీల్లో చేరితే నో ఫీజు: పాపిరెడ్డి దోస్త్ పరిధిలో లేకుండా, కోర్టును ఆశ్రయించిన సొంతంగా ప్రవేశాలు చేపట్టే కాలేజీల్లో విద్యార్థులు చేరితే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దోస్త్ కన్వీనర్ ద్వారా చేపట్టే ప్రవేశాలకే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్నారు. అయితే మైనారిటీ కాలేజీలను మాత్రం ప్రభుత్వమే దోస్త్ నుంచి మినహాయించిందన్నారు. కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్లను స్పాట్ అడ్మిషన్లుగా యాజమాన్యా లు భర్తీ చేసుకునే అంశం ప్రభు త్వం పరిశీలనలో ఉందన్నారు. 15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్లు లభించిన విద్యార్థులు తమ దోస్త్ వెబ్సైట్ ద్వారా (ఆన్లైన్లో) ఈనెల 15లోగా సెల్ఫ్ రిపోర్టి ంగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. లేకపోతే ఆ సీటు రద్దు అవుతుందన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే సమయంలో ప్రభుత్వ కాలేజీల్లో సీటు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీటు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ రాని వారు రూ.వెయ్యి చెల్లించాలని సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు రూ.500, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాని వారు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఆ కాలేజీ వద్దనుకుంటే, వేరే కాలేజీకి వెళ్లాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్‌లో అంతకంటే మెరుగైన కాలేజీలకు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీటు లభించని వారూ రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. -
నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2018–19 సంవత్సరానికి ‘ఎ’కేటగిరీ కన్వీనర్ కోటా సీట్లకు తొలి విడత వెబ్ కౌన్సెలింగ్‌కు శుక్రవారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ఓ ప్రకటన జారీచేశారు. కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని, తుది మెరిట్ జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు కూడా తొలి విడత కౌన్సెలింగ్‌లోనే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు ఎన్ని వెబ్ ఆప్షన్లు అయినా ఇచ్చుకోవచ్చని చెప్పారు. వచ్చిన కాలేజీలో చేరాల్సిందే..! సీటు కేటాయించాక సంబంధిత అభ్యర్థికి కేటాయించిన కాలేజీలో చేరకపోతే వచ్చే కౌన్సెలింగ్‌కు అనర్హులుగా ప్రకటిస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు వారి ప్రాధాన్యం, కాలేజీ, కోర్సుల ఎంపికలో జాగ్రత్త వహించాలని సూచించారు. క్రీడలు, ఎన్సీసీ, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధిత అధికారుల నుంచి ప్రాధాన్య జాబితా వచ్చాక ఆయా కోటాకు సంబంధించిన వెబ్ అప్షన్లకు మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www. knruhs. inను సందర్శించాలని సూచించారు. నీట్లో 1 నుంచి 5 వేల ర్యాంకుల అభ్యర్థులు 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 11 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. 5,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్లను మార్చుకోవాలనుకునే వారికి 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం ఇస్తామని చెప్పారు. వెబ్ ఆప్షన్లకు సంబంధించిన పేజీని ప్రింటు తీసుకోవాలని పేర్కొన్నారు. సీటు కేటాయించిన తర్వాత విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం అందజేస్తామన్నారు. సీటు కేటాయింపు తర్వాత సంబంధిత లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మొదటి జాబితా విడుదల.. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మొదటి విడతకు సంబంధించిన తుది జాబితాను కాళోజీ ఆరోగ్య వర్సిటీ విడుదల చేసింది. మొత్తం 10,847 మందితో జాబితాను విడుదల చేశారు. అందులో నీట్లో 16వ ర్యాంకు సాధించిన మెండ జైదీప్ నుంచి 7,56,526 ర్యాంకున్న విద్యార్థికి కూడా జాబితాలో పేరు దక్కింది. -
ముగిసిన సవరణ గడువు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల సవరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. సాంకేతిక సమస్యలతో టీచర్లు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల ప్రాధాన్యతా క్రమం ఒక్కసారిగా అస్తవ్యస్తమవడంతో క్షేత్రస్థాయిలో ఆందో ళన వ్యక్తమైంది. దీంతో వెబ్ ఆప్షన్లను సవరించుకునేందుకు ప్రభుత్వం రెండ్రోజులపాటు అవకాశం కల్పించింది. మంగళవారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం ఇవ్వగా 11,749 మంది తమ ఆప్షన్లను సవరించుకున్నారు. బుధవారం సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులకు ఎడిట్ సౌకర్యం కల్పించింది. రాత్రి 11.59 గంటల వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో 10 వేల మందికిపైగా టీచర్లు తమ ఆప్షన్లను సవరించుకున్నారు. ఎడిట్ అవకాశం ముగియడం తో బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను విద్యా శాఖ జారీ చేయాల్సి ఉంది. ఉత్తర్వులను ఒకేసారి ఇవ్వాలా లేక కేటగిరీల వారీగా ఇవ్వాలా అనే అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో గురు లేదా శుక్రవారాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నెల 10లోగా బదిలీల ప్రక్రియకు ముగింపు పలకాలని ఆ శాఖ నిర్ణయించింది. నేటితో ముగియనున్న ఐసెట్ వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు గురువారం రాత్రి 11:59 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో తెలి పింది. బుధవారం వరకు 24,975 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని, అందులో 7,548 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొంది. మిగతావారు గడువులోగా ఆప్ష న్లు ఇచ్చుకోవాలని సూచించింది. -
నేడు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం విద్యార్థులకు సీట్లను కేటాయించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం విద్యార్థులకు సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. ఆ సమాచారాన్ని ఠీఠీఠీ. ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థులకు ఎస్సెమ్మెస్ రూపంలో తెలియజేయనుంది. ఈసారి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారందరికీ సీట్లను కేటాయించినా కన్వీనర్ కోటాలో మరో 6,898 సీట్లు మిగిలిపోనున్నాయి. మొత్తంగా ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 96,703 మంది అర్హత సాధించినా ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు 59,033 మంది పాల్గొన్నారు. అందులో 58,048 మంది విద్యార్థులు గతనెల 28 నుంచి ఈనెల 5 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మాత్రమే సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలోని 70% సీట్లను (64,946), మిగతా 30% సీట్లను యాజమాన్య కోటాలో కాలేజీలు భర్తీ చేస్తాయని తెలిపారు. -
నేటి నుంచి లాసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 7,630 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. వారంతా ఈ నెల 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. ఎట్టకేలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) లా కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వడంతో వెబ్ ఆప్షన్లకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. మొత్తంగా 47 కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 4,358 సీట్లు అందుబాటులో ఉన్నట్లు రంగారావు వెల్లడించారు. అందులో మూడేళ్ల ఎల్ఎల్బీ కాలేజీలు 20 ఉండగా, వాటిల్లో 2,738 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సును నిర్వహించే 13 కాలేజీల్లో 1,064 సీట్లు, ఎల్ఎల్ఎం కోర్సు నిర్వహించే మరో 14 కాలేజీల్లో 556 సీట్లు ఉన్నట్లు వివరించారు. వెబ్ ఆప్షన్లు, కాలేజీల వివరాలను http://lawcetadm.tsche.ac.in/ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించారు. వెబ్ ఆప్షన్ల తర్వాత సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. -
33 డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల్లేవు
వెబ్సైట్లో పేర్కొన్న డీఎడ్, బీఎడ్ కాలేజీల్లోనే చేరాలి: ఎన్సీటీఈ ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ విద్య కాలేజీలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కొరడా ఝలిపించింది. 33 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలతో పాటు మరో 15 వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ఈ సారి ప్రవేశాలకు కోతపెట్టింది. నిర్ణీత సమయంలో కాలేజీల సమగ్ర సమాచారంతో కూడిన డేటాబేస్‌ను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని పేర్కొంది. విద్యార్థులు కాలేజీల్లో చేరేటప్పుడు ఆ కాలేజీ డేటాబేస్కు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేసిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకున్నాకే చేరాలని స్పష్టం చేసింది.153 కాలేజీల్లోనే ప్రవేశాలు: రాష్ట్రంలో ఉన్న 212 డీఎడ్ కాలేజీల్లో 8 కాలేజీలు క్లోజర్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. మరో 18 కాలేజీల్లో ఏ మీడియంలో కోర్సు నిర్వహిస్తారని విద్యాశాఖ లేఖలు రాసినా స్పందించలేదు. దీంతో వాటిని పక్కన పెట్టారు. ఎన్‌సీటీఈకి సమాచారమివ్వని 33 కాలేజీలు సహా 59 కాలేజీలను పక్కన పెట్టారు. మొత్తం 153 కాలేజీల్లో ప్రవేశాలకు ప్రవేశాల కమిటీ ఆమోదం తెలిపింది. 18 నుంచి వెబ్ ఆప్షన్లు..: డీఈఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 11న ప్రారంభమైన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 15తో ముగియనుంది. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులకు ఈనెల 18 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 10,200 సీట్లు భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాలేజీలు ఇచ్చిన ఆమోదం ప్రకారం ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో 600 ఇంగ్లిష్ మీడియం సీట్లు, తెలుగు మీడియంలో 7,750 సీట్లు , ఇతర మీడియంలో మరో 450 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 10 ప్రభుత్వ డైట్లలో ఇంగ్లిష్ మీడియంలో 500 సీట్లు, తెలుగు మీడియంలో 500 సీట్లు, ఉర్దూ మీడియంలో 400 సీట్లు భర్తీ చేయనున్నారు. -
నేటితో ముగియనున్న ఎంసెట్ కౌన్సెలింగ్
నంద్యాల అర్బన్: ఈనెల 8న ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్ నేటితో ముగియనుంది. స్థానిక ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం 1,30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. 17, 18 తేదీల్లో 90,001 ర్యాంకు నుంచి 1,20,000, 19, 20 తేదీల్లో 1,20,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. 21, 22తేదీల్లో ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 25న కోర్సులు, సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. -
ఇంజనీరింగ్ సీట్లు 90,011
♦ 36 వేల సీట్లకు కోత ♦ టాప్ కాలేజీల్లో సీట్లు యథాతథం ♦ ఓ మోస్తరు కాలేజీలకు భారీగా దెబ్బ ♦ కన్వీనర్ కోటాలో 61,441 సీట్లు... నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ♦ మిగతావి యాజమాన్య కోటాలో భర్తీ ♦ ప్రభుత్వం సరేనంటే కొత్త కోర్సుల్లో మరో 500 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు యూనివర్సిటీలు ఎట్టకేలకు అనుబంధ గుర్తింపును ఖరారు చేశాయి. మొత్తంగా 90,011 సీట్లకు గుర్తింపు జారీ చేశాయి. 70 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈనెల 16వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) 250 కాలేజీల్లో 1,26,315 సీట్లకు గుర్తింపు ఇవ్వగా, వర్సిటీలు 201 కాలేజీల్లోని 90,011 సీట్లకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చాయి. వీటిలో 187 ప్రైవేటు కాలేజీల్లో 86,951 సీట్లు, 14 ప్రభుత్వ కాలేజీల్లో 3,060 సీట్లున్నాయి. ఈసారి ప్రవేశాలు వీటిలోనే జరుగనున్నాయి. ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చిన సీట్లలో సదుపాయాలు, అధ్యాపకుల కొరత తదితర లోపాలతో 36 వేలకు వర్సిటీలు కోత పెట్టాయి. గతేడాది ఏఐసీటీఈ 1.39 లక్షల సీట్లకు గుర్తింపునివ్వగా, వాటిలో 1.04 లక్షల సీట్లకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. గతేడాదితో పోలిస్తే వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లలో 14 వేలకు కోత పడింది. ఈసారి కొన్ని కాలేజీలు కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే మరో 500 దాకా సీట్లు అందుబాటులోకి వస్తాయి. అనుబంధ గుర్తింపులో ఈసారి మధ్య తరహా కాలేజీలకు దెబ్బ పడింది. కొన్నింటికి గుర్తింపే లభించలేదు. ఏఐసీటీఈ 250 కాలేజీలకు గుర్తింపు ఇస్తే లోపాల కారణంగా 49 కాలేజీల్లో ప్రవేశాలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. వీటిలో 11 కాలేజీలు ప్రవేశాలొద్దని వేడుకున్నాయి. టాప్ కాలేజీల్లో సీట్లకు యథాతథంగా ఆమోదం తెలిపారని, డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లనే తగ్గించారని సమాచారం. వెబ్ ఆప్షన్లు నేటి నుంచి వర్సిటీలు ఆమోదం తెలిపిన కాలేజీల్లో 9 ముస్లిం మైనారిటీ, అదర్ మైనారిటీ కాలేజీలు తమ పరిధిలోని దాదాపు 8 వేల సీట్లకు సొంత ప్రవేశ పరీక్ష ద్వారా సింగిల్ విండో (ఎస్డబ్ల్యూ)–1, 2 విధానంలో ప్రవేశాలు చేసుకోనున్నాయి. ఇవి పోను 83,432 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటాలో 58,381 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,060 సీట్లు కలిపి మొత్తం 61,441 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. 15 శాతం ఓపెన్ మెరిట్ ఉంటుంది. ఇందులో ఏపీ విద్యార్థులకు, నాన్ లోకల్స్‌కు (గతంలో తెలంగాణలో 10 ఏళ్లు నివాసమున్న కుటుంబాల పిల్లలకు) కూడా అవకాశమిస్తారు. శుక్రవారం నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఇప్పటికే లాగిన్ ఐడీలను ప్రవేశాల క్యాంపు కార్యాలయం పంపింది. మిగతా 28,570 సీట్లలో యాజమాన్యాలు 15 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో, మరో 15 శాతాన్ని ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో భర్తీ చేసుకుంటాయి. రెండు రోజుల్లో 36,000 ర్యాంకు దాకా ఆప్షన్లు ఇంజనీరింగ్ ప్రవేశాల్లో తొలి రెండు రోజుల్లో 1–36 వేల దాకా ర్యాంకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 11 నుంచి 18న ఉదయం 11 గంటల ్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీ nలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కాలేజీలు, బ్రాంచీలవా రీగా సీట్ల వివరాలను సైట్లో పొందవ చ్చు. ఆ తర్వాత ఆప్షన్లు ఇచ్చుకునే వారికి తేదీలవారీ షెడ్యూలును ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఖరారు చేసింది. గురువారం దాకా 36 వేల ర్యాంకు లోపు 24,259 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. శుక్రవారం 36,001 నుంచి 46 వేల ర్యాంకు దాకా విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ర్యాంకులవారీగా వెబ్ ఆప్షన్ల తేదీలు తేదీలు ర్యాంకు 16–6–2017, 17–6–2017 1 నుంచి 36 వేలు 18–6–2017, 19–6–2017 36001 నుంచి 56 వేలు 20–6–2017, 21–6–2017 56001 నుంచి 80 వేలు 21–6–2017, 22–6–2017 80001 నుంచి చివరి ర్యాంకు దాకా 22–6–2017, 23–6–2017 వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 28–6–2017 సీట్లు కేటాయింపు, వెబ్సైట్లో వివరాలు 3–7–2017లోగా: కాలేజీల్లో చేరడం ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు తేదీలు ర్యాంకు 16–6–2017 36,001 నుంచి 46,000 17–6–2017 46,001 నుంచి 56,000 18–6–2017 56,001 నుంచి 68,000 19–6–2017 68,001 నుంచి 80,000 20–6–2017 80,001 నుంచి 92,000 21–6–2017 92,001 నుంచి చివరి ర్యాంకు దాకా -
డిగ్రీలో 1.4 లక్షల సీట్లు భర్తీ
సీట్ల కేటాయింపు ప్రకటించిన ఉన్నత విద్యామండలి 20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలి సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా 1,40,033 మంది విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి సీట్లను కేటాయిం చింది. ఆరు యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గత నెల 15న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. వాటి సీట్ల కేటాయింపును గురువారం ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్లు, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కన్వీనర్ (దోస్త్), కోకన్వీనర్ వెంకటాచలం, మల్లేష్ ప్రకటించారు. వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్న 1,52,900 మందిలో 1,40,033 మందికి సీట్లను కేటాయించినట్లు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన 14 కాలేజీలు ఆన్లైన్ పరిధిలో లేవని, 28 కాలేజీలు ఉన్నా కోర్టు కేసు ఉన్నందునా వాటిల్లో ఆప్షన్లు ఇచ్చిన 7,500 మందికి సీట్ల కేటాయింపు చేయలేదని వెల్లడించారు. కోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామన్నారు. విద్యార్థులు ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని, ఈ నెల 20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. నచ్చకపోతే మరో కాలేజీకి వెళ్లొచ్చు... సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీటు కన్ఫర్మేషన్ కోసం కాలేజీలకు వెళ్లే విద్యార్థులను తమ కాలేజీల్లోనే చేరాలంటూ ఒత్తిడి చేస్తే, ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని వెంకటాచలం, మల్లేష్ చెప్పారు. అయితే ప్రతి విద్యార్థి ముందుగా సీటు వచ్చిన కాలేజీకి వెళ్లి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నారు. ఒకవేళ ఆ కాలేజీలో చేరడం ఇష్టం లేకపోతే ముందుగా కన్ఫర్మ్ చేసుకున్నాకే రెండో దశ కౌన్సెలింగ్‌లో స్లైడింగ్‌కు వెళ్లాలన్నారు.విద్యార్థులు ముం దుగానే కాలేజీల్లో ఫీజులు చెల్లించవద్దని, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వవదన్నారు. 17 నుంచి అథెంటికేషన్... ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఇప్పటివరకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోని వారు శనివారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఈసేవా/హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఆధార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలన్నారు. ఆ తరువాత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ నెల 21 నుంచి 24 లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇప్పటికే సీట్లు పొందిన వారు స్లైడింగ్‌కు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఈనెల 28న వారికి సీట్లను కేటాయిస్తామన్నారు. రెండో దశ, చివరి దశ కౌన్సెలింగ్ వివరాలు... జూన్ 17 నుంచి 20 వరకు: హెల్ప్‌లైన్/ఈసేవా కేంద్రాల్లో కొత్త విద్యార్థుల ఆధార్, బయోమెట్రిక్ అథెంటికేషన్; రిజిస్ట్రేషన్. జూన్ 21–24: ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం జూన్ 28: సీట్లు కేటాయింపు జూన్ 29– జూలై 3: సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్టింగ్ జూలై 4–8: చివరి దశ వెబ్ ఆప్షన్లు జూలై 13: చివరి దశ సీట్లు కేటాయింపు జూలై 14–18: సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్టింగ్ -
రేపటినుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు!
- 15న రాత్రికి విద్యార్థులకు లాగిన్ ఐడీ - 22 నాటికి పూర్తికానున్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ - 28న సీట్లను కేటాయించే అవకాశం - నేడు కాలేజీలు, సీట్ల వివరాలు అందుబాటులోకి.. - జేఎన్టీయూ నుంచి 75 వేలు.. మొత్తం 90 వేల వరకే సీట్లు? సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎంసెట్ ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నాటికి 26 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కాగా, గురువారం 36 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కానుంది. దీంతో ఈనెల 15న సాయంత్రం 7 గంటలకు ఆయా విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు లాగిన్ ఐడీలను పంపించనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు లాగిన్ ఐడీ ఉపయోగించి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు బుధవారం వరకు కూడా ఎన్ని కాలేజీలు, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్న వివరాలు తేలలేదు. 16 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఎట్టి పరిస్థితుల్లోనైనా వర్సిటీల నుంచి వివరాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. 5 శాతం సీట్లు కలిగిన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి కాలేజీల జాబితా ఇప్పటికే ఉన్నత విద్యా మండలికి అందింది. 95 శాతం సీట్లు కలిగిన జేఎన్టీయూహెచ్ నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కొన్ని కాలేజీలు, వాటిల్లోని సీట్లకు సంబంధించిన వివరాలు బుధవారం సాయంత్రం వరకు అందలేదని అధికారులు చెబుతున్నా.. మధ్యాహ్నానికే వివరాలను ఉన్నత విద్యా మండలికి అందజేసినట్లు తెలిసింది. మిగిలిన కాలేజీలు, సీట్ల వివరాలను బుధవారం అర్ధరాత్రిలోగా అందజేస్తామని జేఎన్టీయూ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. అనుబంధ గుర్తింపుపై చర్చ కాలేజీల అనుబంధ గుర్తింపునకు సంబంధిం చిన అంశాలపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డితో ఓయూ వీసీ రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ యాదయ్య, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ బుధవారం సమావేశమై చర్చించారు. జేఎన్టీయూ నుంచి 180 వరకు కాలేజీల్లో 75 వేల వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటికి తోడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోని 11 వేల సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లోని 3,030 సీట్లు కలుపుకొని మొత్తం 88 వేల వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నేడు 26,001 నుంచి 36 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో భాగంగా ఈనెల 15న 26,001వ ర్యాంకు నుంచి 36 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. వీరికి హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుందని, ఎన్సీసీ కేటగిరీ వారికి మాత్రం (ఒకటో ర్యాంకు నుంచి 36 వేల ర్యాంకు వరకు) సాంకేతిక విద్యా భవన్లో వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. 1వ ర్యాంకు నుంచి 16 వేల ర్యాంకు వరకు 10,279 మందికి వెరిఫికేషన్ నిర్వహించగా, బుధవారం 16,001 నుంచి 26 వేల ర్యాంకు వరకు విద్యార్థులు 7,031 మందికి వెరిఫికేషన్ నిర్వహించినట్లు తెలిపారు. మొత్తంగా బుధవారం నాటికి 26 వేల ర్యాంకు వరకు 17,310 మంది వెరిఫికేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. 36 వేలలోపు ర్యాంకు విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్లకు ఈనెల 15న రాత్రి 7 గంటలకు లాగిన్ ఐడీలను పంపిస్తామని, 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. వన్‌టైం పాస్‌వర్డ్‌తో.. ఎంసెట్ వెబ్ ఆప్షన్లను ఇచ్చుకునేందుకు వన్‌టైం పాస్వర్డ్ విధానాన్ని ప్రవేశాల క్యాంపు కార్యాలయం అమల్లోకి తెచ్చింది. విద్యార్థుల పేర్లతో ఇతరులెవరూ ఆప్షన్లు ఇవ్వడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టింది. విద్యార్థి సొంతంగా ఆప్షన్లు ఇచ్చేకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. గణనీయంగా సీట్ల తగ్గింపు గతేడాది 1.04 లక్షల సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అయితే ఈసారి అన్ని సీట్లకు ఇచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని సీట్లూ భర్తీ కావడం లేదని, అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్న నేపథ్యంలో ఈసారి గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి గురువారం ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టే కాలేజీలు, సీట్లు అందుబాటులోకి వస్తే శుక్రవారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఏర్పడనుంది. 16, 17 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 36 వేల ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెల 22వ తేదీ నాటికి చివరి ర్యాంకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడంతోపాటు 22, 23 తేదీల్లో అప్షన్లలో మార్పులకు అవకాశం కల్పించి 28వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలంటే.. విద్యార్థులు ఎంసెట్ వెబ్ సైట్లోకి వెళ్లి తమ మొబైల్‌కు వచ్చిన లాగిన్ ఐడీతో పాటు హాల్‌టికెట్ నంబర్, ర్యాంకు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి వెబ్ పేజీలోకి వెళ్లాలి. పాస్వర్డ్ జెనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగ్ అవుట్ కావాలి. లాగిన్ ఐడీ ఆ ఒక్కసారే పని చేస్తుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఫారంపై ఉండే నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ర్యాంకు, జెనరేట్ చేసుకున్న పాస్వర్డ్ వివరాలను ఎంటర్ చేసి పేజీలోకి వెళ్లాలి. అందులోకి వెళ్లగానే విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్‌కు వన్‌టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాగానే వెబ్ ఆప్షన్ల పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజీలు, బ్రాంచీలను ఎంపిక చేసుకోవాలి. -
తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు నిర్వహించిన ఎస్కేయూసెట్–2017లో ర్యాంకర్లకు 19 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 30న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, పీహెచ్, సీఏపీ కేటగిరి విద్యార్థులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నామన్నారు. తొలిసారిగా వెబ్ ఆప్షన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. 21 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. మొదటి దఫా సీట్లు అలాట్మెంట్లకు జూలై 4 నుంచి 6వ తేదీ వరకు షెడ్యూల్ కేటాయించారు. సీట్లు అలాట్మెంట్ అయిన విద్యార్థులు జూలై 4 నుంచి 6వ తేదీలోపు ఆన్లైన్లో కోర్సు ఫీజు చెల్లించాలి. జూలై 8 నుంచి 12 వరకు రెండో దఫా సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రెండో దఫా సీట్లు కేటాయింపు జూలై 16న నిర్వహిస్తారు. ఇందులోనూ మిగిలిన సీట్లకు జూలై 22, 23, 24న స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక ఒక స్కాచ్ కార్డును ఇస్తారు. ఇందులో పాస్వర్డ్ ఉంటుంది. ఆప్షన్స్ ఎంచుకోవడానికి ఈ పాస్వర్డ్ దోహదపడుతుంది. కళాశాల ఆప్షన్లు ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. వెబ్సైట్ ఠీఠీఠీ. టజుuఛీ్చౌ.జీn అనే వెబ్సైట్ ద్వారా వెబ్ఆప్షన్లు ఇవ్వాలి. తీసుకురావాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు : హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కులిస్ట్, టీసీ, డిగ్రీ వరకు 7 సంవత్సరాలు తగ్గకుండా స్టడీ సర్టిఫికెట్లు, తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం. సర్టిఫికెట్ల పరిశీలన ఇలా : తేదీ ఉదయం (9 గంటలకు) మధ్యాహ్నం (2గంటలకు) 19 బయోకెమిస్ట్రీ ,బయోటెక్నాలజీ, బోటనీ, జువాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, జియాలజీ 20 కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్సెస్ 21 పాలిమర్ సైన్సెస్, ఫిజిక్స్ మైక్రోబయాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సెరికల్చర్ 22 జువాలజీ స్టాటిస్టిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 23 ఎకనామిక్స్ ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, హిందీ 24 పొలిటికల్ సైన్సెస్ హిస్టరీ, అడల్ట్ ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎల్ఐఎస్సీ 25 తెలుగు రూరల్ డెవలప్మెంట్, సోషల్ వర్క్ ,సోషియాలజీ 26 మేథమేటిక్స్ (1–250వ ర్యాంకు వరకు) మేథమేటిక్స్ (251–500వ ర్యాంకు) 27 కామర్స్ (1–250వ ర్యాంకు వరకు) కామర్స్ (251–500) 28 కామర్స్ (501–750) కామర్స్ 751–1000 29 కామర్స్ (1001–1250) కామర్స్ 1251–1406 -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం
కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ కాలేజీల ప్రవేశాల కోసం మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియను కర్నూలులో జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి ప్రారంభించారు. మొదటి రోజు 1నుంచి 10 వేల ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల 28న పాలీసెట్–2017 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 10న ఫలితాలు విడుదలయ్యాయి. వచ్చే నెల 6వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. 2వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, 8న ఆప్షన్ల మార్చునకు అవకాశం ఉంటుంది. 10న సీట్లు కేటాయించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి తెలిపారు. -
డిగ్రీ ప్రవేశాలకు ఇంటి నుంచే వెబ్ ఆప్షన్లు
- విద్యార్థులకు వెసులుబాటు కల్పించిన ఉన్నత విద్యామండలి - వివరాల నమోదు మాత్రం ఈ–సేవా/మీ–సేవా కేంద్రాల్లోనే - అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ విద్యార్థులకు చివరి దశలో అవకాశం సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా విద్యార్థులు ఇంటి నుంచి, ఇంటర్నెట్ కేంద్రాలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఉండనున్న నేపథ్యంలో వెబ్ ఆప్షన్లు ఎక్కడి నుంచైనా ఇచ్చుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే డిగ్రీలో ప్రవేశాలకు మాత్రం ఈ–సేవా/మీ–సేవా కేంద్రాలకు విద్యార్థులు స్వయంగా వెళ్లి తమ వివరాలు నమోదు చేయించుకుని వేలి ముద్రలు ఇవ్వాలని డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్ వివరించారు. అలాగే విద్యార్థులు తమ ఆధార్, ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్, ఫోన్ నంబర్లను ఈ–సేవా/మీ–సేవా కేంద్రాల్లో ఇవ్వాలని తెలిపారు. ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను ప్రలోభపెట్టకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ఈ–సేవా/మీ–సేవా కేంద్రం ఇచ్చే యూనిక్ ఐడీ/టోకెన్ నంబరు సహాయంతో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల వెబ్సైట్లోకి వెళ్లి ఆ వివరాలతో తమ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం రూ. 100 ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు (కాలేజీలను ఎంచుకోవాలని) ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. రిజర్వేషన్ కేటగిరీల వారు 2017 మార్చి తర్వాత జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు చివరి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని అన్నారు. వారి ఫలితాలు వచ్చాక, ఆలస్య రుసుము లేకుండానే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత జారీ చేస్తామని తెలిపారు. -
పీజీ సెట్ వెబ్ ఆప్షన్లకు ముగిసిన గడువు
∙ఈనెల 16న సీట్ల కేటాయింపు ∙20లోపు ప్రవేశాలు పొందాలి కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ ఏడాది జులై 21 నుంచి ప్రారంభం కాగా ఈనెల 12తో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ముగి సింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంసీజే, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్‌సైన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, జీయాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ, పీజీ సెరికల్చర్ డిపో్లమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జూవాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, ఎంఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జనరల్‌స్టడీస్, ఎమ్మెస్సీ బాటనీ, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. కేయూ పీజీ సెట్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. కేయూడివోఏ.ఇన్ ద్వారా విద్యార్థులు తమ తమకు ఇష్టమైన కళాశాల, కోర్సులను ఎంపిక కోసం వెబ్ఆప్షన్లు ఇచ్చారు. ఈనెల16న మొదటిదశలో విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగబోతుంది. ఏఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆయా విద్యార్థులకు సెల్‌కు మెస్సేజ్‌తో పాటు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. ఈనెల 20 లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని సంబంధిత అధికారులు తెలిపారు. కేయూ వెబ్సైట్æడైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ వెబ్సైట్లో చూసుకోవాలన్నారు.ఎస్బీఐ ద్వారా ఫీజు వివరాలు చలానా ద్వారా చెల్లించి సం బంధిత కళాశాల ప్రిన్సిపాల్స్కుకు రిపోర్ట్ చేయాలన్నారు. -
పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు ముగిసిన గడువు
l 10న సీట్ల కేటాయింపు కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ఆప్షన్ల ఇచ్చుకునే ప్రక్రియ ఆది వారం ముగిసింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంసీజే, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, జియాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ, పీజీ సెరికల్చర్ డిప్లొమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్‌సైన్స్, ఎంఈడీ, ఎంఎస్డబ్లూ్య, ఎంఏ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జెండర్æస్టడీస్, ఎమ్మెస్సీ బాటనీ, ఎంపీఈడీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 10న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఏఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆయా విద్యార్థులకు సెల్ఫోన్లకు మెస్సేజ్తోపాటు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎన్ని రోజుల్లో తమకు కేటాయించిన కళాశాలల్లో జాయిన్ కావాలో కూడా అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఇదిలా ఉండగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ఈనెల 10న ఉండడం లేదని తెలుస్తోంది. -
నేటితో ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల గడువు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం చేపట్టిన చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు ఈనెల 28 రాత్రి 10 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి 29వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత సీట్లు కేటాయిస్తామని, సీట్లు వచ్చిన వారు 31లోగా కాలేజీల్లో చేరాలని సూచించారు. -
నేటి నుంచి బీ-ఫార్మసీ కౌన్సెలింగ్
15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 18 వరకు వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మ్-డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 13 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు 20న సీట్లు కేటాయించనుంది. రాష్ట్రంలోని 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో బీఫార్మసీలో 2,060, ఫార్మ్-డీలో 330, బయో టెక్నాలజీలో 42 సీట్లు భర్తీ చేయనుంది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, ఇంటర్మీడియెట్ మెమో, టీసీ, 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్, కులం, నివాస ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఇదీ షెడ్యూల్.. 15న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 15, 16న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16, 17న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17,18న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 18న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు. ఇవీ హెల్ప్‌లైన్ కేంద్రాలు.. మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం (రుద్రంపూర్), వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వరంగల్‌లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్‌లోని బీఆర్ ఆంబేడ్కర్ జీఎంఆర్ మహిళా పాలిటెక్నిక్, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, చందూలాల్ బారాదరిలోని క్యూ క్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్, రామంతాపూర్‌లోని జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్, సాంకేతిక విద్యా భవన్. -
16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు!
- వెబ్ ఆప్షన్ల గడువు మరో రెండు రోజులు పొడిగింపు - హైకోర్టు ఆదేశాలతో షెడ్యూలు మార్పునకు - ఉన్నత విద్యా మండలి కసరత్తు - ముందస్తు షెడ్యూలు ప్రకారమే చివరి దశ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల షెడ్యూలులో మార్పులు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వెబ్ ఆప్షన్ల గడువు మరో రెండు రోజులు పొడిగించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, 16వ తేదీన సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కోర్టు ఉత్తర్వుల కాపీ అందగానే ఒకటీ రెండు రోజుల్లో షెడ్యూలును అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది. ముందస్తు షెడ్యూలు ప్రకారం.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు 90,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఉంది. 10, 11 తేదీలు, 12వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని ర్యాంకుల వారు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, మార్పులు చేసుకునే ప్రక్రియ 12వ తేదీ ఉదయం 10 గంటలకు ముగియాల్సి ఉంది. 14న సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్లను ఈనెల 14 వ తేదీ ఉదయం 10 గంటలవరకు పొడిగించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో సీట్ల కేటాయింపును 14న కాకుండా 16వ తేదీన ప్రకటించేందుకు సిద్ధమైంది. హైకోర్టు ఉత్తర్వుల కాపీ అధికారికంగా అందగానే వెబ్ ఆప్షన్ల గడువు పెంపు ప్రకటనను జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. కాలేజీల్లో చేరే షెడ్యూలుకు, చివరి దశ కౌన్సెలింగ్‌కు దీనితో ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి, కాలేజీల్లో చేరవచ్చని, ఈ షెడ్యూలులో మార్పు ఉండకపోవచ్చని, అవసరమైతే 23వ తేదీ వరకు కూడా ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఇచ్చే వీలుంటుందని వెల్లడించారు. ఇక చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి, ఆయా తేదీల్లోనే వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు 27న సీట్లను కేటాయించి, 29 వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించ నున్నారు. ఆప్షన్లు ఇచ్చిన వారు 63,067 మంది ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం వరకు 68,118 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా 63,067 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల సంఖ్య 30,78,057 కు చేరింది. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు. -
సీట్లు అధికం...చేరికలు స్వల్పం
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల తీరిది * తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినా చేరని 58,280 మంది విద్యార్థులు * రెండో దశలోనూ చేరింది తక్కువే * రేపట్నుంచి 12 వరకు చివరిదశ వెబ్ ఆప్షన్లు * 14న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు గందరగోళంగా తయారయ్యాయి. లక్షల మందికి సీట్లు కేటాయించినా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంది. కోర్టును ఆశ్రయించి ఆన్లైన్ ప్రవేశాల నుంచి మినహాయింపు పొందిన 13 కాలేజీల యాజ మాన్యాలు తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభిం చిన విద్యార్థులను చేర్చుకునేందుకు నిరాకరించగా.. మరోవైపు సీటు లభించిన కాలేజీల్లో చేరేందుకు ఇష్టంలేక మరికొందరు విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదు. ఇంకొందరికి ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సీట్లు లభించలేదు. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్నా భర్తీ అయిన సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు చివరి దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారం భం కానుంది. ఇందుకోసం కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఈ నెల 14న సీట్లు కేటాయిస్తామని, 18వ తేదీలోగా వారంతా కాలేజీల్లో చేరాలని స్పష్టం చేసింది. తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులను ఈ నెల 4 నుంచి ప్రారంభించింది. 1.47 లక్షలకు చేరింది 89,327 మందే.. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా 3,97,430 సీట్ల భర్తీకి కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలి దశ ప్రవేశాల్లో భాగంగా కాలేజీల్లో చేరేందుకు 1,74,744 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 1,71,900 మందే గత నెలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలోనూ 1,47,607 మందికి సీట్లు కేటాయించగా 1,28,453 మందే అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో 89,327 మందే కాలేజీల్లో చేరారు. అంటే సీట్లు పొందిన విద్యార్థుల్లో 58,280 మంది కాలేజీల్లోనే చేరలేదు. ఇక గత నెల 29 నుంచి ఈ నెల 1 వరకు చేపట్టిన రెండోదశ కౌన్సెలింగ్‌లో 68,337 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా (ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, గతంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు) 65,726 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులోనూ సీట్లు లభించిన వారిలో అధికశాతం విద్యార్థులు చేరలేదు. -
పాలిసెట్ వెబ్ ఆప్షన్లకు నేడు ఆఖరు
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 4వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని విద్యార్థులు 4న కూడా ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. చివరి దశ వెబ్ ఆప్షన్లలో భాగంగా 11,911 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. వారికి 6న సీట్లను కేటాయిస్తామని, 8వ తేదీలోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇక మొదటి దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి, సీట్లు పొందిన విద్యార్థులు చివరి దశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఇప్పుడు సీటు అలాట్ అయితే మొదటి దశ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు ఆటోమెటిక్‌గా రద్దవుతుందని పేర్కొన్నారు. కాబట్టి మొదటి దశలో వచ్చిన సీటును వద్దనుకుంటనే ఈ చివరి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. -
రేపట్నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు!
నేడు కాలేజీల అనుబంధ గుర్తింపు, ఫీజుల ఖరారు 29 నుంచి తరగతుల ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉస్మానియా, కాకతీయ పరిధిలో అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, కాలేజీల వారీగా ఫీజుల వివరాలతో కూడిన జీవో ఆదివారం రాత్రి వరకు కూడా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి చేరలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఎలా ప్రారంభించాలన్న అంశంపై క్యాంపు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సోమవారం మధాహ్నం వరకు కాలేజీల జాబితా, ఫీజుల వివరాలు అందితే.. మంగళవారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపడతామని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అ దిశగా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. కాలేజీల వారీగా ఫీజులకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి కసరత్తు పూర్తి చేసింది. సోమవారం మధ్యాహ్నంకల్లా ఈ జీవోను జారీ చేసేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని విద్యార్థులు, అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఉత్తీర్ణులై ర్యాంకులు పొందిన విద్యార్థులు ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ వివరాలు తేదీలు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన ర్యాంకుల వారు 5-7-2016, 6-7-2016 1 నుంచి 45 వేలు 7-7-2016, 8-7-2016 45,001 నుంచి 90 వేలు 9-7-2016, 10-7-2016 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు 10-7-2016, 11-7-2016 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లలో మార్పులకు అవకాశం 14-7-2016 సీట్ల కేటాయింపు 21-7-2016 ఫీజు చెల్లింపుతోపాటు కాలేజీల్లో రిపోర్టింగ్ =================== చివరి విడత ప్రవేశాలు 24-7-2016, 25-7-2016 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 27-7-2016 సీట్ల కేటాయింపు 29-7-2016 తరగతుల ప్రారంభం -
ఓయూ సెట్లో సత్తా చాటిన అబ్బాయిలు
హైదరాబాద్: ఓయూసెట్-2016 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలు ఒక శాతం అధికంగా అర్హత సాధించారు. పలు పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఓయూసెట్-2016 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మొత్తం 94.26 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఓయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ. సురేష్‌కుమార్, అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ డి. అశోక్‌లు కలిసి ఫలితాలను వెల్లడించారు. మొత్తం 40 పీజీ, 10 పీజీ డిప్లొమా, 3 ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పలు కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కంటే.. దర ఖాస్తులు తక్కువగా అందడంతో.. ఆయా కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించ లేదు. మొత్తం 45 కోర్సులకు ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 65,494 మంది పరీక్ష రాయగా.. 61,732 మంది ప్రవే శాలకు అర్హత పొందారు. అన్ని కోర్సుల్లో కలిపి దాదాపు 18,800 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. నెలాఖరులో వెబ్ ఆప్షన్లు.. ర్యాంకు కార్డులను ww.osmania.ac.in, www.ouadmissions.com వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ర్యాంకు కార్డులను అభ్యర్థులకు నేరుగా చేరవేయడం లేదు. అందరూ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఈ నెలాఖరులో సమయమిస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వచ్చేనెల రెండో వారంలో నిర్వహిస్తామన్నారు. ఖరారు చేసిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
కాకినాడ: ఇంజినీరింగ్ కళాశాలలో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ అప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,79,465 మంది హాజరు కాగా, వీరిలో లక్షా 31 వేల 580 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు రాష్ర్టంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా అభ్యర్థులు హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలనతోపాటు వెబ్ అప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్లు మార్పు, చేర్పులు ఈ నెల 19,20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న చేస్తారన్నారు. పాస్‌వర్డ్‌ను గోప్యంగా ఉంచాలి... ప్రభుత్వ హెల్ప్‌లైన్ సెంటర్లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ అప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్‌కేఫ్‌లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్‌టైం పాస్వర్డ్ ఎవ్వరికీ తెలియకూడదని, ఈ పాస్వర్డ్ చాలా కీలకమని చెప్పారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరుకాలేకపోయినా తరువాత రోజు హాజరుకావచ్చన్నారు. ఎన్ని అప్షన్లు ఎక్కువగా ఇస్తే అంత మంచిదని, ఆసక్తిలేని కళాశాల పేర్లను అప్షన్లుగా ఇవ్వకూడదన్నారు. -
5 నుంచి లాసెట్ తుది విడత కౌన్సెలింగ్
హైదరాబాద్: ఏపీ లాసెట్, పీజీ ఎల్ సెట్ -2015 తుదివిడత కౌన్సెలింగ్ అక్టోబర్ 5వ తేదీనుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్ధులు అయిదో తేదీన సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాలని పేర్కొన్నారు. 5, 6 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలని, అడ్మిషన్ల ప్రాసెసింగ్‌ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యరుధలు 450, ఇతరులు 900 చెల్లించాలన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెబ్‌కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ , గుంటూరు నాగార్జునవర్సిటీలలో ఈ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు http://aplawcet.apsche.ac.in వెబ్ సైట్ సందర్శించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9490332169ను సంప్రదించాలన్నారు. -
నేటితో ఐసెట్ వెబ్ ఆప్షన్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఐసెట్ వెబ్ ఆప్షన్లు సోమవారం పూర్తి కానున్నాయి. ఆప్షన్ల ప్రక్రియ ముగియనుండటంతో అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. ఇప్పటివరకు 28,121 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకున్నట్లు తెలిపారు. -
రూ.10 వేలు ఇస్తాం.. కాలేజీకి రానక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా.. అయితే వెబ్ ఆప్షన్లలో మా కాలేజీని ఎంచుకోండి.. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు.. మేమే మీకు రూ.10 వేలు ఇస్తాం’ అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభ పెడుతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్ల్దిండ్రుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. ప్రధాన కాలేజీలు తప్ప చిన్న చిన్న కాలేజీలు మా కాలేజీలో చేరండంటే.. మా కాలేజీలో చేరండి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. కన్వీనర్ కోటాలో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత మొత్తం ఇస్తామని విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. పైగా కాలేజీకి రానవసరం లేదని అటెండెన్స్, మార్కులు తామే వేస్తామంటూ ప్రలోభ పెడుతున్నాయి. ఈ విషయం కాస్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దృష్టికి వెళ్లింది. అంతేకాదు ఆయన ఓ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్లాగా ఫోన్ చేసి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ‘ఇదేమీ టెక్నికల్ కోర్సు కాదు కదా.. కాలేజీకి రానవసరం లేదు. మా కాలేజీలో చేర్చితే రూ.10 వేలిస్తాం’ అని యాజమాన్యం చెప్పడంతో పాపిరెడ్డి అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంతోపాటు యాజమాన్యాల తప్పిదాలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 250 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 28,228 సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసీఏ కాలేజీల్లో 2,181 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. -
ఆ విద్యార్థులకు మరో కౌన్సెలింగ్?
ఇంజనీరింగ్‌లో ఆప్షన్లు సరిగా ఇవ్వకుండా నష్టపోయిన విద్యార్థులపై సర్కారు తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోకుండా నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సోమవారం డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దీనిపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా ఫీజు చెల్లించకుండా చివరి విడత ప్రవేశాల కోసం వేచి చూసి.. ఆప్షన్లు సరిగ్గా ఇవ్వని కారణంగా కొందరు విద్యార్థులు ఉన్న సీటును కోల్పోయారు. ఆప్షన్ల ప్రాధాన్య క్రమాన్ని సరిగ్గా ఇవ్వలేక, మొదటి, తుది విడత కౌన్సెలింగ్‌లలో ఎందులోనూ సీటు దక్కనివారూ ఉన్నారు. ఇలా నష్టపోయిన విద్యార్థులు దాదాపు 3,430 దాకా ఉన్నట్లు తేల్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే ఇంజనీరింగ్ చదవగలమని, నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు న్యాయం చేయాలని అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో కౌన్సెలింగ్ నిర్వహించకుండా.. స్పాట్లో యాజమాన్యాలే మిగిలిన సీట్లను భర్తీ చేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమవుతామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీరికి ఎలా న్యాయం చేయాలన్న అంశంపై మంత్రి కడియం శ్రీహరి.. ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తదితరులు సమావేశమై చర్చించారు. న్యాయ నిపుణులతో చర్చించాకే..! స్పాట్ ద్వారా యాజమాన్యాలే ఆ విద్యార్థులను భర్తీ చేస్తే రీయింబర్స్మెంట్ ఇవ్వాలా..? ఒకవేళ అలా చేస్తే యాజమాన్యాలు తప్పిదాలకు పాల్పడే అవకాశం ఉంటుందా అన్న అంశాలపై భేటీలో చర్చించారు. ఇలా కాకుండా మరో కౌన్సెలింగ్‌ను నిర్వహించాలన్న ఆలోచన కూడా చేశారు. అయితే అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డంకిగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ణీత గడువులోనే మొదటి దశ ప్రవేశాలను పూర్తి చేసి, తరగతులు ప్రారంభించినందున.. ఆ సమస్య ఉండకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఏదేమైనా మరోసారి అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. భేటీ అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇతర అధికారులు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని కలిసి చర్చించినట్లు తెలిసింది. అయితే ఆయన కూడా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సుప్రీంకోర్టు అడ్వొకేట్, అక్కడి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కన్వీనర్ కోటాలోనే భారీగా మిగులు
ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్లు 86,103 వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 61,662 మందే హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లకుపైగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు ఉండగా.. 62,457 మంది విద్యార్థులు మాత్రమే వెబ్ఆప్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 61,662 మంది మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లు మిగిలిపోనున్నాయి. అసలు ఈసారి అందుబాటులో ఉండనున్న మొత్తం సీట్లు 1,34,783కాగా.. కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు, యాజమాన్య కోటాలో 39,499 సీట్లు అందుబాటులోనున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లోని 2,110 సీట్లను వాటి యాజమాన్యాలే కన్సార్షియంగా ఏర్పడి భర్తీ చేసుకుంటాయని, సొంత పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే ఎస్డబ్ల్యూ-3లో 3,304 సీట్లు అందుబాటులో ఉంటాయని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ఈనెల 17 నుంచి చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 22 రాత్రి వరకు ఆప్షన్లలో మార్పులతో పాటు కొత్త ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 24న సీట్లను కేటాయిస్తారు. వెబ్ఆప్షన్ల వివరాలు.. ►సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 66,362 మంది ►ఆప్షన్లకు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నవారు 62,457 ► మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చినవారు 61,133 ► పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నా ఆప్షన్లు ఇవ్వని వారు 1,324 ► మొత్తం విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లు 22,91,583 ►ఒక విద్యార్థి అత్యధికంగా ఇచ్చిన ఆప్షన్లు 594 -
ఎట్టకేలకు వెబ్ ఆప్షన్లు షురూ..
ఇంజనీరింగ్ విద్యార్థుల ఎదురు చూపులకు బ్రేక్ కోర్టు తీర్పుతో మార్గం సుగమం ఖమ్మం : ఎట్టకేలకు ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నెల రోజులుగా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తున్న ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కళాశాలల వివరాలు, అందులో ఉన్న కోర్సులు, సీట్ల సంఖ్య, ఫీజుల వివరాలతోపాటు పలుకోర్సుల కోసం కోర్టులను ఆశ్రయించిన కళాశాలలు, యూనివర్సిటీకి స్పెషల్ పర్మీషన్ కోసం నమోదు చేసుకున్న కళాశాలల వివరాలను పొందు పరుస్తూ శుక్రవారం సాయంత్రం తుదిజాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని 25 కాలేజీల్లో పలు కళాశాలలకు పూర్తిస్థాయి కోర్సులకు అనుమతులు రాగా, కొన్ని కళాశాలల్లో కొన్ని కోర్సులు యూనివర్సిటీకి అప్పీల్ చేసుకోవడం వల్ల అనుమతి లభిం చిం ది. గత ఏడాది తనిఖీలు నిర్వహించిన కళాశాలలకు ఒక కలర్, కోర్టు పరిధిలో ఉన్న కోర్సులకు మరో కలర్, యూనివర్సిటీ ప్రత్యేక అనుమతితో మంజూరైన కోర్సులకు మరో కలర్ కేటాయించడం తో ఆయా కళాశాలల్లో చేరాలా..? వద్దా అనే విషయమై విద్యార్థులు స్పష్టంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్లు ఇలా.. వెబ్ ఆప్షన్లను విద్యార్థులు దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్లోగానీ, హెల్ప్‌లైన్ సెంటర్లోగానీ, ఇంటర్నెట్ అందుబాటు లో ఉన్న ఎక్కడి నుంచి అయినా వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివా రం సాయంత్రం 5 గంటల వరకు 1 నుంచి 44 వేల ర్యాంకుల విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అలాగే 19వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 21వ తేదీ 7 గంటల వరకు 44001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 21వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆప్షన్లను మార్చుకోవచ్చు. 24వ తేదీ రాత్రి 6 గంటల నుంచి సీట్ల కేటాయింపు వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం సాయంత్రం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది.tseamcet.nic.in ద్వారా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించిన మొదటి రెండు గంటల్లోనే 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాలేజీలు, బ్రాంచీల వారీగా, సీట్ల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తంగా రాష్ట్రంలోని 260 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,22,786 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటాలో 86,862 సీట్ల (70 శాతం) భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులోప్రభుత్వ కాలేజీల్లో 3,041 సీట్లు ఉండగా, ప్రైవేటు కాలేజీల్లో 83,821 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇక మేనేజ్మెంట్ కోటాలో 35,923 సీట్లు ఉన్నట్లు తెలిపింది. కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలకు ఆకు పచ్చ (లైట్ గ్రీన్) రంగు కేటాయించారు. వీటిని ఎలాంటి వివాదం లేని, అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీలుగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఈనెల 20 నుంచి చేపట్టబోయే తనిఖీ నివేదికలకు లోబడి వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చిన కాలేజీలకు నీలి రంగు (లైట్ బ్లూ) కేటాయించారు. తనిఖీల్లో అన్ని ఫ్యాకల్టీ అన్ని సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే వాటికి అనుబంధ గుర్తింపు లభిస్తుంది. కోర్టును ఆశ్రయించకుండా త్వరలో చేపట్టే తనిఖీ నివేదికలకు కట్టుబడి ఉంటామని లేఖలు అందజేసిన కాలేజీలకు ఉదారంగు (లైట్ పర్పుల్) కేటాయించారు. వీటిల్లోనూ ఫ్యాకల్టీ సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే అనుబంధ గుర్తింపు వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆయా రంగుల్లోని కాలేజీల జాబితాలను పరిశీలించుకున్నాకే కాలేజీలను ఎంచుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు ఆయా కాలేజీలకు, వాటిలోని కోర్సులకు కూడా పైన పేర్కొన్న రంగులు ఉంటాయని, వాటిని పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఏ రోజు ఎంత ర్యాంకు వరకు..? శుక్రవారం నుంచి ఈనెల 19 సాయంత్రం 5 గంటల వరకు ఒకటో ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 19 సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు 44,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అన్ని ర్యాంకుల వారు 22వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. మరోవైపు 44 వేల ర్యాంకులోపు వారిలో 32,857 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఉన్నారని, అందులో శుక్రవారం మొదటి రెండు గంటల్లో 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
టీ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం వెబ్ ఆప్షన్ల కౌన్సిలింగ్ మొదలైంది. ఈ నెల 21 వరకూ వెబ్ ఆప్షన్లు కొనసాగుతాయి. 22 వ తేదీన ఆప్షన్స్ మార్చుకునే వెసులు బాటు కల్పించారు. ఆ తదుపరి రెండు రోజులకు అంటే 24 వ తేదీన సీటు అలాట్ మెంట్ ఉండగా, 25 వ తేదీన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఫేజ్ లో పాల్గొనని విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ 29 వ తేదీగా నిర్ణయించారు. వీరికి 29, 30 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తుండగా, 31 వ తేదీన అలాట్ మెంట్, ఆగస్టు 1 వ తేదీన కాలేజీ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. -
మూడు కేటగిరీల్లో వెబ్ ఆప్షన్లు
-
మూడు కేటగిరీల్లో వెబ్ ఆప్షన్లు
నేటి సాయంత్రం 5 నుంచి ప్రక్రియ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ‘అఫిలియేషన్ల’ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం బుధవారమే తీర్పు ఇచ్చినా.. దాని కాపీ ప్రభుత్వానికి గురువారం అందింది.దానికి అనుగుణంగా ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ముందే జేఎన్టీయూహెచ్ అనుమతి పొంది ఎలాంటి వివాదం లేని కాలేజీలతో పాటు కోర్టు ఆదేశాల మేరకు కొన్ని కాలేజీలు, స్వచ్ఛందంగా తనిఖీలకు ముందుకు వచ్చే కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. తనిఖీల్లో లోపాలున్నట్లు గుర్తిస్తే ఈ కాలేజీల్లో ప్రవేశాలు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు ముందు జాగ్రత్తగా ఈ మూడు రకాల కాలేజీలు, వాటిల్లోని బ్రాంచీలను మూడు రంగుల్లో వేర్వేరుగా సూచిస్తారు. విద్యార్థులు tseamcet.nic.in వెబ్సైట్లో వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, సాంకేతిక విద్యా కమిషనర్ వాణిప్రసాద్, జేఎన్టీయూహెచ్ తాత్కాలిక వీసీ శైలజా రామయ్యార్ తదితరులు సమావేశమై కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అనంతరం కడియం శ్రీహరి ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. కోర్టుకు వెళ్లని కాలేజీల యాజమాన్యాలు కూడా తాజా తనిఖీలకు ఒప్పుకుంటే వాటిని వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చుతామని.. ఇందుకోసం గురువారం రాత్రి వరకు జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. కోర్టుకు వెళ్లిన వారికి వర్తించే నిబంధనలే వీటికి వర్తిస్తాయన్నారు. ఇక కోర్టుకు వెళ్లిన 121 కాలేజీల్లో 73 కాలేజీలు తమకు అదనపు సీట్లు అవసరం లేదంటూ జేఎన్టీయూకు లేఖలను అందజేశాయన్నారు. మరికొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలు వద్దని, మరికొన్ని బ్రాంచీలకు తనిఖీలు చేయాలని కోరాయన్నారు. 3 రంగుల్లో.. 3 కేటగిరీలుగా.. 1. జేఎన్టీయూహెచ్ మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, బ్రాంచీలు, సీట్లు.. 82,759 ఉన్నాయి. వీటితోపాటు ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు కలుపుకొని 257 కాలేజీల్లోని 95,629 సీట్లు వెబ్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవీ ఏ వివాదం లేనివి. వీటిని సాధారణంగా ఉంచడం లేదా ఆకుపచ్చ రంగులో చూపించే అవకాశం ఉంది. 2. హైకోర్టు ఆదేశాల మేరకు పలు కాలేజీలు, బ్రాంచీలు, సీట్ల వివరాలను వెబ్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో పెడతారు. ఈ కాలేజీలకు, బ్రాంచీలకు మరొక రంగు (ఎరుపు లేదా పసుపు) ఇస్తారు. వీటిలో ప్రవేశాలు ఈనెల 20 నుంచి చేపట్టే ఏఐసీటీఈ, జేఎన్టీయూ సంయుక్తంగా తనిఖీ నివేదికలపై ఆధారపడి ఉంటాయి. వీటిల్లో ఏవైనా కాలేజీలు, బ్రాంచీలకు అనుమతి రాకపోతే... వాటిలో చేరే విద్యార్థుల ఫీజులను వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తారు. మరో కాలేజీలోకి మార్చుతారు. 3. కోర్టుకు వెళ్లని వారి కాలేజీలు, బ్రాంచీలను యాజమాన్యాలు కోరుకుంటే కౌన్సెలింగ్‌లో చేర్చుతారు. వాటిల్లోనూ తనిఖీలు చేసి.. లోపాలున్నట్లు తేలితే అనుమతివ్వరు. కోర్టుకు వెళ్లిన కాలేజీలకు సంబంధించి వర్తింపజేసే నిబంధనలు వీటికి కూడా వర్తిస్తాయి. ఈ కేటగిరీకి మరో రంగును కేటాయిస్తారు. జాగ్రత్తగా ఆప్షను ఇవ్వాలి ‘‘కాలేజీలను, బ్రాంచీలను ఎంచుకునే సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వెబ్సైట్లో పేర్కొన్న రంగులను చూసి, నిబంధనలు చదువుకొని కాలేజీలను ఎంచుకోవాలి. కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకుంటే అవి కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలేజీలలోని కోర్సుల వివరాలను జేఎన్టీయూహెచ్, కౌన్సెలింగ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు.’’ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇదీ షెడ్యూల్ మొదటి దశ ప్రవేశాలు ⇒ ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ⇒ 22న ఆప్షన్లను మార్చుకునే అవకాశం ⇒ 24న సీట్ల కేటాయింపు ⇒ 25వ తేదీ నుంచి 27 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు రెండోదశ ప్రవేశాలు ⇒ 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (మొదటి దశలో పాల్గొనని వారికి) ⇒ 29 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులకు అవకాశం ⇒ 31న సీట్ల కేటాయింపు ⇒ ఆగస్టు 1వ తేదీన కాలేజీల్లో చేరేందుకు అవ కాశం, ఇదే రోజునుంచి తరగతులు ప్రారంభం -
వెబ్ ఆప్షన్లు రేపటి నుంచి !
-
వెబ్ ఆప్షన్లు రేపటి నుంచి !
* ఇంజనీరింగ్ ప్రవేశాలపై నేడు అధికారిక ప్రకటన * ప్రవేశాలకు మార్గం సుగమం చేసిన హైకోర్టు ధర్మాసనం * సింగిల్ జడ్జి తీర్పు సవరణ.. పిటిషన్లు దాఖలు చేసుకున్న కాలేజీలకు వెబ్ కౌన్సెలింగ్‌లో చోటు * తనిఖీల అనంతరం అఫిలియేషన్లపై తుది నిర్ణయం * ఏఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ నుంచి ఒకరితో 25 బృందాలు.. ఆగస్టు 1కల్లా తనిఖీలు పూర్తిచేయాలి * అఫిలియేషన్ రాని కాలేజీల్లో చేరే విద్యార్థులను మరో కాలేజీలోకి మార్చాలని ఆదేశం * తదుపరి విచారణ ఆగస్టు 3కు వాయిదా * కోర్టు తీర్పు అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష * నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం శుక్రవారం (ఈనెల 17) నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాలేజీలకు అఫిలియేషన్ల వ్యవహారంపై బుధవారం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, జేఎన్టీయూహెచ్ ఇన్చార్జి వీసీ శైలజారామయ్యర్, రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తదితరులు హాజరైన ఈ సమావేశంలో... కోర్టులో జరిగిన వాదనలు, తీర్పు సారాంశం ప్రకారం ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే హైకోర్టు తీర్పు కాపీ బుధవారం రాత్రి వరకు అధికారికంగా అందకపోవడంతో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తీర్పు ప్రతిలో ఏముంటుందో తెలియదు కనుక.. అది అందిన వెంటనే దానిలోని అంశాలను బట్టి గురువారం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో చర్చించి ప్రకటన జారీ చేయనున్నారు. ఇక ఎంసెట్‌లో అర్హత సాధించిన 90,556 మంది విద్యార్థుల్లో 66,308 మంది ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఇక తదుపరి ప్రక్రియ వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు చేపట్టడమే. ఈ నేపథ్యంలో 17 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించి.. ఒకటీ రెండు దశల్లో ప్రవేశాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈనెల 31 నాటికి ప్రవేశాలను పూర్తిచేసి, ఆగస్టు 1న తరగతులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తీర్పు ప్రతి కోసం.. మొదటి దశ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తర్వాతి రెండో దశ ప్రక్రియ తేదీలను గురువారం ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించనుంది. బుధవారమే కోర్టు తీర్పు ప్రతి అందితే షెడ్యూల్ ప్రకటించి గురువారం నుంచి ప్రక్రియ చేపట్టాలని షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ కోర్టు తీర్పు ప్రతి అందనందున 17 నుంచి ప్రక్రియ కొనసాగించేలా మార్పులు చేస్తున్నారు. దాని ప్రకారం... ఈ నెల 17 నుంచి 20 వరకు వెబ్ఆప్షన్లు, 21న ఆప్షన్లలో మార్పులు, 23న సీట్ల కేటాయింపు జరిపే అవకాశముంది. విద్యార్థులు 27 వరకు కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టనున్నారు. రెండోదశలో 28, 29 తేదీల్లో వెబ్ఆప్షన్లు, 30న సీట్ల కేటాయింపు, 31న కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొత్తంగా ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించెందుకు యోచిస్తున్నారు. 20వ తేదీ నుంచి సంయుక్త తనిఖీలు హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ నుంచి ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ల ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలను చేపట్టనున్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలపై జేఎన్టీయూహెచ్ దృష్టి సారించింది. అఫిలియేషన్లు కోరుతూ, సీట్ల కోతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో దాదాపు 25 బృందాలు ఈ తనిఖీలను చేపట్టనున్నాయి. ప్రతి కాలేజీకి తనిఖీలకు వెళ్లే తేదీ వివరాలను 48 గంటల ముందే తెలియజేసి మరీ సంయుక్త బృందాలు తనిఖీలకు వెళ్లేలా జేఎన్టీయూహెచ్ కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు పూర్తి వివరాలు తెలిసేలా.. మరోవైపు అదనపు సీట్లు, అఫిలియేషన్లు కోరుతూ కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలకు సంబంధించిన సమగ్ర సమాచారం విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలోనే తెలిసేలా చేర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. తనిఖీలు వద్దు.. సీట్లూ వద్దు 66 కాలేజీల రాతపూర్వక విజ్ఞప్తులు సాక్షి, హైదరాబాద్: అఫిలియేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన కాలేజీలు.. ఇప్పుడు కోర్టు తీర్పు పర్యవసానాన్ని తలచుకుని వణికిపోతున్నాయి. ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన బ్రాంచీలకు సంబంధించిన ఫ్యాకల్టీ తదితర సదుపాయాల తాలుకు వివరాలను కూడా తెలుసుకునే వెసులుబాటును సంయుక్త తనిఖీ బృందాలకు హైకోర్టు ఇచ్చింది. దీంతో అదనపు బ్రాంచీలు, సీట్ల కోసం చూసుకొని ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ బృందాల తనిఖీలకు ఒప్పుకుంటే... ఇప్పటికే గుర్తింపు ఉన్న బ్రాంచీలు, సీట్లలో లోపాలు బయటపడతాయేమోనని కాలేజీలు ఆందోళనపడుతున్నాయి. దీంతో కోర్టును ఆశ్రయించిన 120 కాలేజీల్లో 66 కాలేజీలు తమకు అదనపు సీట్లు వద్దు, సంయుక్త బృందాల తనిఖీలు వద్దంటూ జేఎన్టీయూహెచ్కు రాతపూర్వకంగా తెలియజేశాయి. కోర్టు తీర్పు వచ్చిన బుధవారమే 66 కాలేజీలు సీట్లు వద్దంటూ లేఖలు ఇవ్వగా.. తనిఖీలు ప్రారంభించే 20వ తేదీ నాటికి మరెన్ని కాలేజీలు ఇలా లేఖలు ఇచ్చే అవకాశముంది. దీనిని బట్టే ఇంజనీరింగ్ కాలేజీల్లో అనేక లోపాలు ఉన్నాయంటూ జేఎన్టీయూహెచ్ మొదటి నుంచీ చేస్తూ వస్తున్న వాదన వాస్తవమేనని స్పష్టమవుతోంది. ‘బ్రాంచీలు, సీట్లపై స్పష్టత ఇవ్వాలి’ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి కోరారు. కోర్టు తీర్పు మేరకు వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టే కాలేజీలు, వాటిల్లోని బ్రాంచీలు, సీట్ల వివరాలు వెబ్ ఆప్షన్ల సమయంలోనే విద్యార్థులకు తెలిసేలా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సీట్లను ఎంచుకుంటే ఏయే షరతులు వర్తిస్తాయన్న వివరాలు అందులో ఉండేలా సాఫ్ట్వేర్ రూపొందించాలన్నారు. వీలైతే వాటిని ప్రత్యేకంగా, వేరుగా వెబ్ ఆప్షన్లలో పెట్టాలని చెప్పారు. -
రేపు తేలకపోతే కష్టమే!
హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌పై సోమవారం కూడా స్పష్టత రాలేదు. అన్ని కాలేజీలకు సంబంధించిన కేసులను జేఎన్టీయూహెచ్ ఫైల్ చేయనందున ఈ కేసు విచారణను హైకోర్టు బుధవారానికి (ఈనెల 15కు) వాయిదా పడింది. మరోవైపు ప్రవేశాల ముగింపు, తరగతుల ప్రారంభ గడువు సమీపిస్తోంది. బుధవారం నాటి విచారణలో ప్రవేశాలపై స్పష్టతరాకపోతే.. ఈ నెలాఖరుకు ప్రవేశాలు పూర్తయి, వచ్చే నెల 1న తరగతులు ప్రారంభం కావడం కష్టమనే అభిప్రాయాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలేజీల అఫిలియేషన్ల కేసులో సోమవారం స్పష్టత వస్తుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎదురుచూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. కౌన్సెలింగ్‌కు అనుమతి వస్తేనే.. ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారంలో ఈనెల 15వ తేదీన స్పష్టత వస్తేనే నెలాఖరుకు ఒకటి, రెండు దశల ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తి చేయవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. 16న వెబ్ ఆప్షన్లు ప్రారంభించినా.. ఆ తరువాత 3 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని, తర్వాతే సీట్లను కేటాయించాల్సి ఉంటుందని, విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియకు పది రోజులు పడుతుందని చెప్పారు. ఇక రెండోదశ కౌన్సెలింగ్‌కు కనీసం ఐదు రోజులు పడుతుందన్నారు. 15న స్పష్టత రాకపోతే ఆగస్టు 1న తరగతుల ప్రారంభం కష్టమేనని, ఇందుకు గడువు కోసం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. -
ఈసారీ లేటే?
ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర గందరగోళం * హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలుతో జాప్యం * గురువారమే లిస్ట్‌లో ఉన్నా నిర్లక్ష్యం చేసిన జేఎన్టీయూహెచ్ * సోమవారం నుంచి విచారణ చేపడతామన్న ధర్మాసనం * వచ్చే నెల 1వ తేదీ నాటికి తరగతుల ప్రారంభం కష్టమే! * ఆందోళనలో 70 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు * సకాలంలో తరగతుల ప్రారంభానికి చర్యలు: ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. కోర్టు కేసు ఎప్పుడు తేలుతుందో, వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఇటు కాలేజీల యాజమాన్యాలు, అటు ప్రభుత్వం, జేఎన్టీయూహెచ్ వ్యవహరిస్తున్న తీరు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనలో పడేస్తోంది. గతంలోలాగా ఈసారీ జాప్యం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టేలా చేస్తోంది. ఏఐసీటీఈ అనుమతి ఉన్న అన్ని కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై జేఎన్టీయూహెచ్ అప్పీలుకు వెళ్లడంతో.. ఇంజనీరింగ్ ప్రవేశాలు సకాలంలో జరిగే అవకాశం కనిపించడం లేదు. అప్పీలుకు వెళ్లిన జేఎన్టీయూహెచ్ కనీసం కేసు విచారణకు వచ్చే విషయంలోనూ పక్కాగా వ్యవహరించ లేకపోయింది. గురువారం కేసు లిస్ట్‌లో ఉన్నా పట్టించుకోలేదు. అత్యవసర అంశమని కోర్టుకు విజ్ఞప్తి చేసి, విచారణ జరిపేలా చూడడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో శుక్రవారం కేసు లిస్ట్ అయినా సోమవారం విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. జేఎన్టీయూహెచ్ గానీ, అడ్వొకేట్ జనరల్గానీ గురువారమే స్పందించి కోర్టుకు విజ్ఞప్తి చేసి ఉంటే.. శుక్రవారమే విచారణ జరిగే అవకాశం ఉండేది. ఈ విషయంలో జేఎన్టీయూహెచ్ తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికి పూర్తయ్యేనో..? సోమవారం కేసు విచారణ ప్రారంభమైనా వాదనలు ఎప్పటికి పూర్తయి, ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఒకవేళ ఆలస్యమైతే ఈనెలాఖరుకు ప్రవేశాలను పూర్తిచేయడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎంసెట్‌లో అర్హత సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న 62,777 మంది విద్యార్థులతోపాటు ఎంసెట్‌లో మంచి మార్కులు వచ్చినా ఇంటర్లో ఫెయిలైన వారు దాదాపు 12 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు, వారికి జేఎన్టీయూహెచ్ సప్లిమెంటరీ ర్యాంకులను ప్రకటించింది కూడా. వారికి ఈనెల 13న (సోమవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. అంటే 70 వేల మందికిపైగా విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నిరంతర చర్యలు చేపట్టాలి.. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలు, అన్ని సీట్లను వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలుచేస్తే ఈ గందరగోళం ఉండేది కాదని అధికారులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అప్పీలుకు వెళ్లడం వల్లే జాప్యం జరిగే పరిస్థితి నెలకొందని అంటున్నారు. సింగిల్ జడ్జి తీర్పును అమలు చేయడం వల్ల అనుబంధ గుర్తింపు ఇచ్చిన 220 కాలేజీల్లో మరిన్ని సీట్లు పెరగడంతోపాటు ‘గుర్తింపు’ నిరాకరించిన మరో 25 కాలేజీలకు మాత్రమే అవకాశం వస్తుందని, దానివల్ల పెద్దగా నష్టం ఉండే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు పాటించేలా చేయడమంటే సీట్లకు కోత పెట్టడం కాదని, ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం నిరంతర చర్యలు చేపట్టాల్సి ఉంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. నెలాఖరుకు పూర్తిచేసేలా చర్యలు.. ఇంజనీరింగ్ ప్రవేశాలను ఈనెలాఖరులో పూర్తి చేయాలన్నదే తమ ఉద్దేమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును ఎక్కువకాలం కొనసాగించకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలని కాలేజీ యాజమాన్యాలకు సూచిస్తున్నామని చెప్పారు. సోమవారం జేఎన్టీయూహెచ్తో తాము చర్చించనున్నట్లు తెలిపారు. అప్పీలుపై విచారణ చేపట్టండి * హైకోర్టు ధర్మాసనానికి జేఎన్టీయూహెచ్ విజ్ఞప్తి ఏఐసీటీఈ అనుమతి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నింటికీ తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై తాము చేసిన అప్పీల్‌ను విచారించాలని జేఎన్టీయూహెచ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈనెల 8వ తేదీనే ఈ అప్పీలు కేసుల విచారణ జాబితా (కాజ్లిస్ట్)లో ఉన్నా.. విచారణకు నోచుకోవట్లేదు. దీంతో తమ అప్పీలుపై విచారణ చేపట్టాలని జేఎన్టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. సింగిల్ జడ్జి తీర్పు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీటీఈ తరఫున రమాకాంత్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ అప్పీలును సోమవారం మొదటి కేసుగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
‘టాప్’ లేచిపోతోంది
గందరగోళంగా ఇంజనీరింగ్ విద్య ఇతర రాష్ట్రాల బాట పడుతున్న టాపర్స్ ఇప్పటికే రెండుసార్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా ఎప్పుడు చేపడతారో స్పష్టత కరువు తప్పెవరిదైనా బలవుతున్నది విద్యార్థులే వేలాదిగా మైగ్రేషన్ సర్టిఫికెట్లు తీసుకున్న వైనం ఈసారీ ఆగస్టులో తరగతుల ప్రారంభం అనుమానమే సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య గందరగోళంగా మారింది. దీంతో విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు. కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం కారణంగా ఎంసెట్‌లో టాపర్లు జేఈఈ ర్యాంక్ ఆధారంగా దూరప్రాంతమైనా సరే ఎన్ఐటీల్లో చేరిపోతున్నారు. ఎంసెట్‌లో 2,000 లోపు ర్యాంక్ సాధించి జేఈఈలో 5 వేల లోపు ర్యాంక్ సాధించిన విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో ఎన్ఐటీలు, జేఈఈ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహించే ఇతర రాష్ట్రాల కాలేజీల్లో చేరిపోతున్నారు. ఇక్కడ కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగానే దాదాపు 5 వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టారు. మరో 5 వేల మంది దాకా డీమ్డ్ యూనివర్సిటీల్లో చేరిపోయారు. చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 62 వేల మందిలో 50 వేల మంది ఇక్కడ చేరడం గగనమే. ఏటా ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. కాలేజీ యాజమాన్యాల ఇష్టారాజ్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇంజనీరింగ్ ప్రవేశాల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విద్యా మండలి గొడవల కారణంగా గతేడాది ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు విద్యార్థులకు రెండో దశ కౌన్సెలింగ్ లేకుండా పోయింది. ఫలితంగా ఇష్టంలేని బ్రాంచీల్లో విద్యార్థులు చేరాల్సి వచ్చింది. కాలేజీ, కోర్సును మార్చుకునే అవకాశం విద్యార్థులకు లేకుండా పోయింది. ఇక ఈసారి కాలేజీల అఫిలియేషన్ల గొడవతో గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతోంది?: ఈసారి ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా 1,28,162 మంది పరీక్ష రాశారు. అందులో 90,556 మంది విద్యార్థులే(70.65 శాతం) అర్హత సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 62,777 మంది హాజరయ్యారు. మరోవైపు ఎంసెట్‌లో అర్హత సాధించినా 12 వేల మంది ఇంటర్లో ఉత్తీర్ణులు కాలేదు. అందులో కనీసంగా ఆరేడు వేల మంది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. వారికి ఇంతవరకు ర్యాంకులు ఇవ్వలేదు. ఈలోగా జేఎన్టీయూహెచ్ పరిధిలో కాలేజీల అఫిలియేషన్ల గందరగోళం మొదలైంది. 220 కాలేజీల్లో మొదట 76 వేల సీట్లకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇచ్చింది. చాలా కాలేజీల్లో పలు కోర్సులకు కోత పెట్టింది. ఆ తరువాత కాలేజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని వివిధ కాలే జీల్లో కోర్సులకు అనుమతించడంవల్ల మరో 18 వేల వరకు సీట్లు వచ్చాయి. మొత్తానికి సీట్ల సంఖ్య 90 వేలు దాటింది. కానీ కోర్సులకు కోతపడిన కాలేజీలు, అనుబంధ గుర్తింపును నిరాకరించిన 25 కాలేజీలు, అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని మరో 45 కాలేజీలు, తమ కాలేజీల్లో అన్ని వసతులు ఉన్నా కోర్సులకు కోత పెట్టారని 50 కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. గురువారమే విచారణను కోరలేదెందుకు? గతనెల 28వ తేదీన జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను, సీట్ల వివరాలను ప్రకటించింది. దీంతో వెంటనే ఉన్నత విద్యామండలి ఈ నెల 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. కాని కాలేజీలు కోర్టును ఆశ్రయించడంతో దానిని 8వ తేదీకి వాయిదా వేసింది. చివరకు అదీ వాయిదా పడింది. మరోవైపు జేఎన్టీయూహెచ్కు కోర్సులను రద్దు చేసే అధికారమే లేదని, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలు, సీట్లను కౌన్సెలింగ్‌లో పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని అమలు చేస్తే మరో 50 వేల సీట్లు వచ్చేవి. సకాలంలో ప్రవేశాలు పూర్తయ్యేవి. కాని ప్రభుత్వ ఆదేశాలతో జేఎన్టీయూహెచ్ డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లింది. మొదట లంచ్ మోషన్‌కు వెళ్లింది. అడ్మిట్ కాలేదు. దీంతో సాధారణంగానే బుధవారం అప్పీల్ పిటిషన్ వేసింది. గురువారం లిస్ట్‌లో ఉంది. కాని ప్రభుత్వం అర్జెన్సీ ఉందని, విచారించాలని గురువారం కోర్టును కోరలేదు. ముందుగా లంచ్ మోషన్‌కు వెళ్లిన జేఎన్టీయూహెచ్ గురువారంనాడు ఎందుకు త్వరగా విచారించాలని కోరలేదన్న ప్రశ్నపై సమాధానం లేకుండా పోయింది. విద్యార్థుల ప్రయోజనాలు చూడాలి ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాల కోసమే పనిచేయాలి. యాజమాన్యాల కోసం కాదు. సకాలంలో ప్రవేశాలు చేపట్టాలి. కోర్టు తీర్పు ఇచ్చాక కాలేజీల నాణ్యతపై మళ్లీ అప్పీల్‌కు వెళ్లడం సరికాదు. పారదర్శకత లేకుండా, గోప్యత ప్రదర్శిస్తే గందరగోళం తప్పదు. - మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ కన్వీనర్ -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గడువు పెంపు
-
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గడువు పెంపు
నేటి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ) పేర్కొంది. తొలుత ఈ నెల 5 వరకే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన జేఓఎస్ఏఏ.. ఆదివారం ఉదయం మార్పు చేసిన షెడ్యూలును వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. 7వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకుంటారు. -
8 నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 8 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. వెబ్ ఆప్షన్లను ముందుగా 6వ తేదీ నుంచే ప్రారంభించాలని భావించినా రెండ్రోజులపాటు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అనుబంధ గుర్తింపుపై దాఖలు చేసిన కేసులో నిర్ణయాన్ని రెండ్రోజులు వాయిదా వేయాలంటూ అడ్వొకేట్ జనరల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీల్లో కూడా మార్పు చేశామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇప్పటికే సుమారు 62,777 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులకు కూడా ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఒకవేళ వీలు కాకపోతే రెండో దశ కౌన్సెలింగ్‌లో వారిని చేర్చుతామన్నారు. ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు నుంచి ఫలితాల వివరాలు తమకు రాలేదని, అవి రాగానే విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ రమణరావు తెలిపారు. -
జూలై 4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్) ర్యాంకర్లకు జూలై 4 వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. జూలై 6వ తేదీ వరకు సాగే ధ్రువపత్రాల పరిశీలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ర్యాంకులను బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవచ్చు. వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోగల సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం జూలై 5 వ తేదీ నుంచి 8వ తేదీ లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్ మార్పు
ఈనెల 25 బదులు 29 నుంచి వెబ్ ఆప్షన్లు * సవరించిన షెడ్యూలు జారీ చేసిన జాయింట్ సీట్ అల కేషన్ అథారిటీ సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీల్లో ఒకేసారి చేపట్టే ఉమ్మడి ప్రవేశాల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్లో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ మార్పులు చేసింది. ఐఐటీ బాంబే ముందుగా ప్రకటించిన ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచే ప్రారంభించాల్సిన వెబ్ ఆప్షన్లను (ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్) ఈనెల 29 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు ఈనెల 24నే విడుదల కావాల్సి ఉన్నా జాప్యం కావడంతో ఈ మార్పులు చేసింది. గురువారం ఢిల్లీలో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ అధికారులు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారులు సమావేశమై ఈ మేరకు మార్పులు చేశారు. తాజా షెడ్యూల్‌ను జేఈఈ అడ్వాన్స్డ్, జాయింట్ సీట్ అలకేషన్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఐఐటీల్లో జూలై 21 నుంచి, ఎన్ఐటీల్లో జూలై 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇతర వివరాలను వెబ్సైట్లో పొందవచ్చు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 81,808 ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆప్షన్లలో మార్పు చివరి గడువు మంగళవారంతో ముగిసింది. ఎంసెట్‌లో అర్హత సాధించి ధ్రువపత్రాలు పరిశీలింపచేసుకున్న 81,972 మందిలో 81,808 మంది ఎంసెట్ కోర్సులకు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. బుధవారం ఉదయం పది గంటలవరకు ఆప్షన్లు మార్చుకొనే అవకాశమున్నందున మొత్తం ధ్రువపత్రాలు సమర్పించుకున్న వారంతా ఆప్షన్లు ఇచ్చుకొనే అవకాశముంది. గతంతో పోలిస్తే ఈసారి ఆప్షన్లు ఇచ్చుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. నేటినుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్లు ఇలా ఉండగా పాలిసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు రావలసిన 25వేల మందికి గాను 15వేల మంది హాజరయ్యారని అధికారవర్గాలు వివరించాయి. ఈనెల 28వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఆ పై వెబ్ ఆప్షన్ల నమోదు, ఆప్షన్ల మార్పుల అనంతరం జులై 3వ తేదీన సీట్ల అలాట్‌మెంటు జరుగుతుందని పాలిసెట్ చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాధ్ తెలిపారు. -
ఈసారి మిగిలేవెన్నో?
* ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ‘గుర్తింపు’ గుబులు * 237 కాలేజీల విజ్ఞప్తుల మేరకు పునః పరిశీలన * ఈనెల 28న సాయంత్రానికి సీట్లు,కాలేజీలపై స్పష్టత * ఆ తరువాతే విద్యార్థులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. 2015-16లో ప్రవేశాలు చేపట్టేందుకు ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుంది, ఎన్ని కాలేజీలను పక్కన పెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా గతేడాది 145 కాలేజీలకే గుర్తింపు ఇచ్చిన హైదరాబాద్ జేఎన్టీయూ.. వివిధ లోపాల కారణంగా 143 కాలేజీలను నిరాకరించింది. ఆ కాలేజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నా.. మరోసారి చేసిన తనిఖీలోనూ లోపాలు బయటపడడంతో మిన్నకుండిపోయాయి. ఈసారి వాటిలోని పలు కాలేజీలు లోపాలను సరిదిద్దుకున్నాయి. అయితే ఈసారి దాదాపు 150 కాలేజీలు, లక్ష సీట్లకే గుర్తింపును పరిమితం చేస్తారన్న ఊహాగానాలతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఏదో ఒక లోపం.. జేఎన్టీయూహెచ్ తమ పరిధిలోని 237 కాలేజీల్లోని లోపాలను ఎత్తిచూపుతూ, రెండు రోజుల్లో వాటిని సవరించుకోవాలంటూ ఈనెల 9న నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పలు కాలేజీలు.. గతేడాది చూపిన లోపాలను సవరించుకున్నామని, ఇప్పుడు మళ్లీ లోపాలు ఉన్నాయని, అదీ రెండు రోజుల్లో సవరించుకోవాలని అంటే ఎలాగంటూ కోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు యాజమాన్యాలకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాలేజీలు నోటీసులపై ఈనెల 20 నాటికి జేఎన్టీయూకు అప్పీలు చేసుకోవాలని.. జేఎన్టీయూ వాటిపై ఈనెల 28 నాటికి పరిశీలన జరిపి పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాలేజీల నుంచి శనివారం వరకు అప్పీళ్లు స్వీకరించిన జేఎన్టీయూహెచ్.. సోమవారం నుంచి పరిశీలన జరపనుంది, ఆయా లోపాలపై ఏం సమాధానం ఇచ్చారు, ఏయే చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా కాలేజీల్లో మళ్లీ పరిశీలన జరుపనుంది. ఈ ప్రక్రియను ఈనెల 28 నాటికి పూర్తి చేసి.. అనుబంధ గుర్తింపు లభించే కాలేజీలు, సీట్ల వివరాలను వెల్లడించనుంది. ఆ తర్వాత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇప్పటికే 51 కాలేజీలు మూత జేఎన్టీయూహెచ్ పరిధిలో 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఈసారి గుర్తింపు కోసం 237 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లెక్కన 51 కాలేజీలు మూతపడి, వాటిలోని దాదాపు 30 వేల సీట్లు ఈసారికి లేనట్లే. ఇక ఈనెల 28 వరకు చేపట్టనున్న పునః పరిశీలనలో ఎన్ని కాలేజీల్లో లోపాలు బయట పడతాయి, ఎన్నింటికి గుర్తింపు రద్దుచేస్తారు, ఎన్నింటిలో బ్రాంచీలను రద్దు చేస్తారన్న విషయంపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆదివారం సమావేశమై చర్చించాయి. విద్యార్థులూ తక్కువే! ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1.28 లక్షల మంది హాజరుకాగా.. అందులో 90,556 మందే అర్హత సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆదివారం వరకు 60 వేల ర్యాంకు వరకు పిలవగా.. 45 వేల మందే హాజరయ్యా రు. ఇంకా 2 రోజులు వెరిఫికేషన్ గడువు ఉన్నందున మరో 15 వేల విద్యార్థులు రావొచ్చని అధికారులు భావి స్తున్నారు. ఈ లెక్కన ఈసారి 60 వేల నుంచి 65 వేల మంది మాత్రమే చేరే పరిస్థితి కనిపిస్తోంది. -
12 నుంచి ఏపీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
ఈ నెల 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 12 నుంచి ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. ఆ ప్రకారం.. ఈ నెల 20వ తే దీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లను మార్పుచేసుకునేందుకు 22, 23 తేదీల్లో అవకాశమిస్తున్నారు. 26న విద్యార్థులకు సీట్లను అలాట్ చేయనున్నామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అడ్మిషన్ల కమిటీ గురువారమిక్కడ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై అడ్మిషన్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కోసం గతంలో హైదరాబాద్‌లో నోడల్ కార్యాలయం ఉండేది. ఇప్పుడు దీన్ని విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేయనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. విద్యార్థులు ర్యాంకులు, హెల్ప్‌లైన్ సెంటర్లు, ధ్రువపత్రాల పరిశీలన తేదీలు, వెబ్ ఆప్షన్ల తేదీలు తదితర ముఖ్యమైన వివరాలకోసం http://apeamcet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ యథాతథం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజులను గతేడాది మాదిరిగానే అమలు చేయనున్నారు. గతంలో రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన మేరకు ఈ ఫీజులుంటాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి గతంలోని విధానాన్నే అమలు చేయనున్నట్టు వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులు ఈసారి ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లి చెల్లించనక్కర్లేకుండా నేరుగా కాలేజీల్లో అడ్మిషను పొందిన సమయంలోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు గతంలో రూ.600 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.800కు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి. -
నేటి నుంచి డీఎడ్‌లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్ఈడీ- గతంలో డీఎడ్) ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణలో 258 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉండగా, 10 ప్రభుత్వ డైట్ కాలేజీలు ఉన్నాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లో ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు ఉన్న 118 కాలేజీల్లోనే మొదటి దశలో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఈసేవా కేంద్రాల్లో బుధవారం నుంచి ఫీజు చెల్లించి, వారు ఇచ్చే జర్నల్ నంబరు సహకారంతో అందుబాటులో ఉన్న కాలేజీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మొదటి దశ వెబ్ ఆప్షన్లను 7 నుంచి 10వ తేదీ వరకు ఇచ్చు కోవచ్చు. -
అఫిలియేషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
జేఎన్టీయూహెచ్ మల్లగుల్లాలు మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపులు నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ వ్యవహారంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోపాలున్నాయంటూ.. ఈ ఏడాది 125 ఇంజినీరింగ్, 61 ఫార్మసీ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ గుర్తింపును నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఆయా కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినా, తుది తీర్పు వెలువడే వరకు సీట్ల అలాట్మెంట్ను విత్‌హెల్డ్‌లో పెట్టాలనడమే యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. యూనివర్సిటీ జారీచేసిన నోటీసుల మేరకు దాదాపు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు లోపాలను సరిదిద్దుకున్నట్టు (డెఫిషియన్సీ కంప్లెయిన్స్ రిపోర్టు)నివేదికలను సమర్పించాయి. అయితే.. ఆయా నివేదికలను పరిశీలించేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో కాలేజీల కథలో మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. వచ్చే నెల 16వరకు వర్సిటీ అధికారులకు హైకోర్టు గడువిచ్చింది. నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు.. ఇదిలాఉండగా, పీజీఈసెట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారంలోగా సీట్ల అలాట్మెంట్ చేయాల్సి ఉంది. అయితే.. హైకోర్టులో కేసు వాయిదా పడడంతో అధికారులకు ఏంచేయాలో తోచడం లేదు. ప్రస్తుతానికి విత్‌హెల్డ్ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీల కాలేజీల విషయంలో సమస్యలు లేకున్నా.. జేఎన్టీయూహెచ్ కాలేజీల కారణంగా మిగిలిన వర్సిటీ కళాశాలన్నింటిలోనూ సీట్ల భర్తీని నిలిపివే యక తప్పని పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల అయోమయం పీజీఈసెట్ సీట్ల అలాట్మెంట్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అభ్యర్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎంటెక్/ ఎం.ఫార్మసీ కోర్సుల్లో సీటు వచ్చేదీ, రానిదీ తేలితే వేరే దారి చూసుకుంటామని అంటున్నారు. నెలలతరబడి వేచి ఉండడంతో ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రైవేటు వర్సిటీల్లో పీజీ కోర్సుల తరగతులు నెలక్రితమే ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం వాతావరణాన్ని బట్టి ఇక్కడ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదంటున్నారు. కాగా, కాలేజీలకు అఫిలియేషన్‌పై వర్సిటీ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
ఆప్షన్లు ఇచ్చింది సగం మందే
హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత పొందిన వారిలో సగం మందే వెబ్ కౌన్సెలిం గ్ లో పాల్గొన్నారు. ప్రవేశపరీక్ష లో 97,640మంది అర్హత సా ధించగా, 50,030 మందే వెబ్ ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. రెండురాష్ట్రాల్లో 58వేల సీ ట్లుండగా, వాటిలో చేరేందు కు అభ్యర్థులే కరువయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న పీజీఈసెట్ అభ్యర్థులు.. తమ వెబ్ఆప్షన్లను మార్చుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తున్నామని కన్వీనర్ వే ణుగోపాల్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వెబ్ఆప్షన్ల ప్రక్రియ రివైజ్డ్ షెడ్యూల్‌ను జ్ట్టిఞ://ఞజ్ఛఛ్ఛ్టి.్చఞటఛిజ్ఛి.్చఛి.జీ వెబ్సైట్లో ఉంచినట్టు కన్వీనర్ తెలిపారు. రివైజ్డ్ షెడ్యూల్ ఇలా.. తేదీ ర్యాంకులు 20 గేట్/జీప్యాట్(నమోదైన) ర్యాంకర్లు/ పీజీఈసెట్‌లో 1-1000 వరకు 21 1001-5000 వరకు 22 5001-1000 వరకు 23 10001 నుంచి చివరి వరకు -
గేట్ ర్యాంక ర్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం
రెండు రకాల జాబితాలు పంపిన జేఎన్టీయుూహెచ్ మొదటి జాబితాలో 61 ఫార్మసీ, 145 ఇంజనీరింగ్ కాలేజీలు రెండో జాబితాలో 43 ఫార్మసీ,124 ఇంజనీరింగ్ కాలేజీలు ఆప్షన్లు ఇచ్చుకోవడంలో అభ్యర్థుల అయోమయం హైదరాబాద్: గేట్/జీప్యాట్ ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. ఈనెల 6,7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఆదివారం వరకు అవకాశం కల్పించా రు. అవసరమైన పక్షంలో గడువును పొడిగిస్తామని పీజీ ఈసెట్ అధికారులు తెలిపారు. జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా సకాలంలో కౌన్సెలింగ్ అధికారులకు చేరనందున ఈనెల 10 నుంచి ప్రారంభం కావాల్సిన గేట్/ జీ ప్యాట్ అభ్యర్థుల ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కాగా పీజీ ఈసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు ఇప్పటివరకు 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు రెండేసి జాబితాలు ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒక్కో యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క జాబితానే కౌన్సెలింగ్ అధికారులకు అందగా, జేఎన్టీయూహెచ్ రెండేసి జాబితాలను పంపడం విశేషం. పీజీ కళాశాలలకు అఫిలియేషన్ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొదటి జాబితాలో 145 ఇంజనీరింగ్, 61 ఫార్మసీ కళాశాలల పేర్లు ఉండగా, రెండవ జాబితాలో 124 ఇంజనీరింగ్, 43 ఫార్మసీ కళాశాలలున్నాయి. లోపాలున్న కళాశాలల్లో సిబ్బంది, మౌలిక వసతులపై వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీచేశామని అధికారులు తెలిపారు. నివేదికలు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగియగా, 60 కాలేజీలే స్పందించాయి. అభ్యర్థుల అయోమయం వెబ్ కౌన్సెలింగ్‌కు జేఎన్టీయూహెచ్ పంపిన అఫిలియేటెడ్ కళాశాలల జాబితాల్లో ఎలాంటి షరతులతో అఫిలియేషన్ ఇచ్చారో అధికారులు స్పష్టంగా పేర్కొనలేదు. అంతేకాదు.. ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంటూ అభ్యర్థులకు అవగాహన నిమిత్తం కొంత సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టారు. తాము ఆప్షన్లు ఇచ్చిన అన్ని కళాశాలలకు చివరి నిమిషంలో అఫిలియేషన్ రద్దు చేసినట్లైతే తమకు సీట్లు ఎలాగని అభ్యర్థులు వాపోతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పీజీ అడ్మిషన్ల విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం అధికారులు పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి ఈనెల 9న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలమేరకు ఎంటెక్/ఎంఫార్మసీ కోర్సు ల్లో ప్రవేశానికై వెబ్ కౌన్సెలింగ్‌కు అఫిలియేటెడ్ కళాశాల జాబితాలను రెండేసి చొప్పు న కౌన్సెలింగ్ అధికారులకు పంపాం. జేఎన్టీయూహెచ్/ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు ఆయా క ళాశాలల్లో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధించి అవసరమైన ఫ్యాకల్టీ, మౌలిక వసతుల నివేదిక ఆధారంగానే అఫిలియేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. అఫిలియేషన్ రాని కళాశాలల్లో చేరిన విద్యార్థుల విషయుంలో వర్సిటీ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ మేరకు ముందుగానే అండర్‌టేకింగ్ తీసుకుంటాం.హైకోర్టు ఆదేశాల ప్రకారం కళాశాలల నుంచి సమాచారం సేకరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది కోర్సుల నిర్వహణ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా అకడమిక్ కేలండర్‌ను అమలు చేయడం ఈ సారి మా నియంత్రణలో లేదు. ఈ విద్యా సంవత్సరం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్ల మేరకు సీట్ల కేటాయింపు(అలాట్మెంట్లెటర్) లను కేసు ముగిసేవరకు విత్‌హెల్డ్‌లో పెడతాం. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతాం. -
17 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
21 వరకు ధ్రువపత్రాల పరిశీలన 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన ప్రక్రియ 26న సీట్ల కేటాయింపు నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్)-2014 కౌన్సెలింగ్ ప్రక్రియకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికై ఐసెట్ ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఈనెల 17 నుంచి 21 వరకు కేంద్రీకృత ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అనుమతిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిమిత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 36 హెల్ప్‌లైన్ కేంద్రాలను, ఎన్సీసీ, స్పోర్ట్స్, వికలాంగులు, సైనికుల పిల్లలు.. తదితర ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల కోసం హైదరాబాద్ (మాసబ్‌ట్యాంక్)లోని సాంకేతిక విద్యాభవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లే అభ్యర్థులు తమవెంట హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఓసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హెల్ప్‌లైన్ కేంద్రాలు, వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ వివరాల కోసం జ్ట్టిఞట://జీఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో అర్హులైన వారికి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుందని, తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఫాస్ట్ పథకం కింద (త్వరలో వెలువడనున్న మార్గదర్శకాల ప్రకారం) ఇక్కడి ప్రభుత్వం ఆర్థికసాయం చేయనుందని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. -
బీఈడీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: బీఈడీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 21 నుంచి 28వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరపనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 23వ తేదీ నుంచి ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్ 3న అభ్యర్ధులకు సీట్లు కేటాయిస్తారు. అక్టోబర్ 6 నుంచి తరగతులు ప్రారంభవుతామయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కౌన్సెలింగ్ కోసం తెలంగాణ 23, ఆంధ్రప్రదేశ్ 17 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. -
నేడు ‘ఇంజినీరింగ్’పై హైకోర్టు తీర్పు
- హైకోర్టు అనుమతినిచ్చేనా..? - భరోసాలో యాజమాన్యాలు - ‘రేట్లు’ పెంచుతామంటున్న కళాశాలలు శాతవాహన యూనివర్సిటీ : జేఎన్టీయూ అనుమతి నిరాకరించిన వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు ఇంకా ఆశలపల్లకిలో ఊరేగుతున్నాయి. ఉన్నత విద్యామండ లి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూ అధికారులు తనిఖీలు చేసి.. అనుమతులను రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఆయా కళాశాల యాజమాన్యాలు హైకోర్టుకెళ్లాయి. కౌన్సెలింగ్‌కు కొద్దిరోజుల ముందే అనుమతి లేదంటూ వెబ్ ఆప్షన్స్‌లో పేర్లు తొలగించడం సరికాదని దావా వేశాయి. దీనిపై శుక్రవారం హైకోర్టు కళాశాలల అనుమతి రద్దు విషయమై తీర్పు వెలువరించనుంది. కళాశాలలో వసతులు లేకుంటే కొన్ని కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సి ఉంటుందని, మొత్తం కళాశాలనే రద్దు చేయడం ఉండదని, పైగా మేనేజ్మెంట్ కోటా కింద విద్యార్థులను చేర్చుకుంటామని ప్రకటించామని, ఇప్పుడు రద్దు చేస్తే ఎలా అంటూ యాజమాన్యాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని కళాశాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. షరతులు విధించైనా కళాశాలలకు అనుమతి ఇస్తుందంటూ యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చేయిదాటిన విద్యార్థులు జిల్లాలో ఎనిమిది కళాశాలలకు మాత్రమే అనుమతి ఉండడంతో మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులందరూ ఆయా కళాశాలల్లో చేరిపోయారు. ప్రస్తుతం అనుమతి లేని కళాశాలలకు హైకోర్టు అనుమతి ఇచ్చినా.. మెరికలు తప్ప ఆ తర్వాతి స్థానంలో ఉన్న విద్యార్థులే చేరే అవకాశముంటుందని ఆయా కళాశాలల ఫ్యాకల్టీ పేర్కొంటున్నారు. మెరుగైన ర్యాంకర్లు కళాశాలలో చేరకుంటే నష్టపోయేది కళాశాలేనని, వారు బాగా చదవకుంటే కళాశాలలకు భవిష్యత్తులో చుక్కెదురు తప్పకపోవచ్చని చర్చించుకుంటున్నారు. ఈనెల 26న విద్యార్థులు ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంది. ఆ లోపు అనుమతి వస్తేనే ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనుమతి వచ్చినా... పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. రేట్లు పెంచుతామంటున్న కళాశాలలు సందెట్లో సడేమియా అన్న చందంగా జిల్లాలో అనుమతి ఉన్న కళాశాలలు మేనేజ్మెంట్ సీట్లను అధిక రేట్లకు అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఎదుటి కళాశాలలో ఉన్న సమస్యలను ఫోకస్ చేస్తూ.. తమ కళాశాలల్లో చేరే విద్యార్థుల నుంచి అందినకాడికీ దండుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మేనేజ్మెంట్ సీట్ల కోసం వచ్చిన వారి నుంచి సర్టిఫికెట్స్ తీసుకుంటూ.. ‘జాగ్రత్త’గా డీల్ చేస్తున్నట్లు తెల్సింది. -
ఆప్షన్లు ఇచ్చిన 31వేల మంది
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఆది, సోమవారాల్లో 31,600 మంది విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు 32,272 మందికి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 31,600 మంది నమోదు చేసుకున్నారు. ఇక సోమవారం 75,001వ ర్యాంకు లక్ష ర్యాంకు వరకు 9,935 మంది విద్యార్థులను సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 6,627 మంది హాజరయ్యారు. మొత్తం ఒకటి నుంచి లక్షర్యాంకు వరకు 41,595 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 29,351 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. 24న పాలిసెట్ సీట్లు కేటాయింపు,ఆప్షన్ల మార్పునకు అవకాశం పాలిసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు. గతంలో వెరిఫికేషన్‌కు హాజరై ఆప్షన్లు ఇవ్వని వారు ఇపుడు ఆప్షన్లను ఇవ్వవచ్చు. ఒకటి నుంచి 76 వేల ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 22న, 76,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్ల నమోదు, మార్పులు చేసుకోవచ్చు. ఇక ఈనెల 24న రాత్రి 8 గంటల తరువాత సీట్లు కేటాయిస్తారు. ఆ వివరాలు జ్ట్టిఞట://ఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారిని తరువాతి దశ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు. ఈసెట్ ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం, 22న సీట్ల కేటాయింపు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు ఇపుడు మళ్లీ ఆప్షన్లు మార్చుకోవచ్చు. గతంలో ఆప్షన్లు ఇవ్వని వారు కూడా ఇపుడు ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు ఈనెల 20, 21 తేదీల్లో ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం కల్పించినట్టు ప్రవేశాల క్యాంపు ముఖ్యాధికారి రఘునాథ్ తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ మార్పులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 387 మంది హాజరు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దర్గామిట్ట ప్రభుత్వ మహిళాపాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జరుగుతున్న ఎంసెట్- 2014 కౌన్సెలింగ్ పక్రియలో ఆదివారం 387 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 159 మంది అభ్యర్థులు, బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 228 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,001 నుంచి 1,27,000 ర్యాంక్ వరకు, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 1,27,001 నుంచి 1,35,000 ర్యాంక్ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని ప్రిన్సిపల్స్ నారాయణ, రామ్మోహన్రావు తెలిపారు. అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. బ్రాంచ్, కళాశాల ఎంపికలో అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి ఎదురైంది. మంచి కళాశాల, ఇష్టమైన బ్రాంచ్ని ఎన్నుకోవాలని హెల్ప్‌లైన్ సెంటర్లకు వచ్చిన విద్యార్థులను మధ్యవర్తులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. తమవద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లలో వెబ్ ఆప్షన్ చేస్తామని విద్యార్థులను ఒత్తిడికి గురిచేశారు. ప్రక్రియపై పూర్తిగా అవగాహన లేని విద్యార్థులను ప్రలోభ పెట్టేందుకు గురిచేశారు. ప్రైవేటు కళాశాల ప్రతినిధులు తమ కళాశాలలో చేరితే అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. మరికొన్ని ప్రైవేటు కళాశాలలు మరి కొంత ముందుకెళ్లి ప్రక్రియకు ముందే విద్యార్థుల వద్ద నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకున్నారు. ఈ ప్రక్రియలో కళాశాలను మార్పించుకోవాలంటే ఆ విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కళాశాల పనితీరు, ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకునేలోపే వారి అడ్మిషన్లు అయిపోవడంతో చేసేదేమీలేక చాలా మంది విద్యార్థులు ముందుకెళ్లి పోయారు. రూల్స్‌కు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు చేసే ఆగడాలను మౌనంగా భరించాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు. దర్గామిట్ట బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 60 మంది, వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్‌లో 100 మంది ఆప్షన్ల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఆప్షన్ల ఎంపిక ప్రక్రియపై అవగాహన లేని అభ్యర్థులకు సహాయ పడతామని ప్రిన్సిపల్స్ పేర్కొన్నారు. ప్రైవేటు అభ్యర్థుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని, నేరుగా తనను సంప్రదించాలని వారు కోరారు. -
ఇంజినీరింగ్ కళాశాలలకు షాక్
నల్లగొండ/చిలుకూరు/కోదాడ టౌన్ :ఇంజినీరింగ్ కళాశాలలకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రామాణికాల ఆధారంగానే ఇంజినీరింగ్ కళాశాలలకు వెబ్ ఆప్షన్లకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 33 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఎంసెట్ రాసిన విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తోంది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్న వారికి వెబ్ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. కానీ జిల్లాలో 40 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా కేవలం ఏడు కాలేజీలకే అఫిలియేషన్లు(యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు పునరుద్ధరణ) ఇస్తూ వెబ్ ఆప్షన్లకు అందుబాటులో ఉంచింది. మిగతా 33 కాలేజీలు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనల మేరకు నిర్వహించడం లేదని పేర్కొంటూ కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. తగ్గనున్న సీట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ఇంజినీరింగ్ సీట్లు భారీగా తగ్గనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 17వేల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షల్లో ఇంజినీరింగ్‌కు అర్హత సాధిం చారు. ఒక్కొక్క ఇంజినీరింగ్ కళాశాలలో 300 నుంచి 500 వరకు సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా 70శాతం, మేనేజ్మెంట్ కోటా 30 శాతం సీట్లు కేటాయించనున్నారు. కాగా ప్రస్తుతం ఎంజీ యూనివర్సిటీతో పాటు ఆరు ఇంజినీరింగ్ కాలేజీలకే అనుమతి లభించడంతో సుమారు 5వేల మందికి మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంది. కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనలో పడిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ హౌస్‌మోషన్‌లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరికొంత మంది సోమవారం కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ఆందోళనలో విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎం సెట్ ఫలితాలు వెలువడగానే అనేక కళాశాలల యాజమాన్యాలు ఇంజినీరింగ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల ఇంటికి వెళ్లి వారితో ఒప్పందాలు చేసుకున్నాయి. సర్టిఫికెట్లతో పాటు కౌన్సెలింగ్‌కు హాజరైన వారి నుంచి స్క్రాచ్ కార్డులు తీసుకువెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం సదరు కళాశాలలకు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రెండో దశ కౌన్సెలింగ్ వరకైనా అనుమతులు వస్తాయా లేదా అన్న ఆందోళన కాలేజీల యాజమాన్యాల్లోనూ నెలకొంది. దీంతో అఫిలియేషన్ల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. -
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం
169 మంది విద్యార్థులు హాజరు సర్టిఫికెట్ల పరిశీలనకు 481 మంది హాజరు మోసపోవద్దు : క్యాంప్ ఆఫీసర్ శ్రీరంగం సాక్షి, విజయవాడ : జిల్లాలో ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల ఎంపిక ప్రకియ ఆదివారం ప్రారంభమయింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరడానికి, మంచి కళాశాల ఎంపిక చేసుకోవటానికి ఇదే కీలక ప్రకియ కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులూ వెబ్ ఆప్షన్లపై దృష్టి సారించారు. ఆదివారం మొదలైన ఈప్రకియ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 30వ తేదీకల్లా ఈప్రకియ పూర్తి చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆడ్మిషన్లు మొదలయ్యేలా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు నగరంలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో 169 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ల కార్యక్రమానికి హజరై కళాశాలల అప్షన్లు ఇచ్చారు. నగరంలోని ఆంధ్రలయోలా కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలల్లోని సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో వెబ్ ఆప్షన్ల ప్రకియను నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటిరోజున 1 నుంచి 50 వేల ర్యాంకుల వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చారు. దీనికి గానూ ఆంధ్రలయోలా కళాశాలకు 53 మంది విద్యార్థులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 45 మంది విద్యార్థులు, ఎస్ఆర్ఆర్ కళాశాలకు 71 మంది విద్యార్థులు హజరై ఆప్షన్లు ఇచ్చారు. విద్యార్థులు ఆప్షన్‌తో పాటు వారి మైబైల్ నెంబర్‌ను కూడా రిజిష్టర్ చేసుకోవాలి. దానికి ఉన్నతవిద్యా మండలి పంపే పాస్వర్డ్ ద్వారానే సంబంధిత వైబ్సైట్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మరో వైపు ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కొనగసాతుంది. ఆదివారం 95 వేల నుంచి లక్ష ర్యాంకుల వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరి శీలన ప్రకియ నిర్వహించగా 481 మంది విద్యార్థులు హజరయ్యారు. ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్ల ప్రకియ నిర్వహణ అనంతరం 26 నుం చి ఆప్షన్లలో కళాశాలలు మార్చుకోవటానికి మరో షెడ్యూల్‌ను నిర్ణయించారు. 26న 1నుం చి లక్ష వరకు ర్యాంకులు 27న లక్ష ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు కళాశాలలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అయితే ఈప్రకియ పూర్తిగా కొత్త విధానం కావటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మొదటి కౌన్సెలింగ్ తరహలో జరిగే వెబ్ ఆప్షన్ల ప్రకియ ద్వారా కళాశాలను ఏంపిక చేసుకొని ఫీజులు చెల్లించి ఆతర్వాత మరో కళాశాలలో చేరేందుకు కూడా ఈ పర్యాయం అవకాశం కల్పించారు. దీనికి చెల్లించిన పూర్తి ఫీజును కళాశాలలు తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. ఈనెల చివరి కల్లా ప్రకియ పూర్తి చేసి వచ్చే నెల 1 నుంచి ఆడ్మిషన్లు మెదలుపెట్టాల్సి ఉంది. ఇంజనీరింగ్ కళాశాల హడావుడి.. ఆంధ్రలయోలా కళాశాల వద్ద ప్రెవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి కొంత హడావిడి చేశారు. వెబ్ ఆప్షన్లకు హజరైన విద్యార్థులను ఫీజు రాయితీలు, డోనేషన్లు లేవంటూ అకర్షించే ప్రయత్నం చేసి కొందరు విద్యార్థుల వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లను స్వీకరించారు. కొందరు విద్యార్థులు ఈవిషయాన్ని ఎంసెట్ క్యాంపు ఆఫీసర్ శ్రీరంగం దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎంసెట్ కన్వీనర్‌కు విషయాన్ని ఫిర్యాదు చేశారు. దళారుల మాట నమ్మొద్దు... దళారుల మాట నమ్మి నాలుగేళ్ల బంగారు భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టవద్దని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీరంగం సూచించారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ప్రెవేట్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహరాన్ని ఎంసెట్ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దళారులు చెప్పే ఆఫర్లు, ప్యాకేజీల మాట నమ్మి విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లువారికివ్వడం మంచిది కాదని, మొదటి ఏడాది ఫీజులో తగ్గింపు ఇచ్చే కళాశాలలు ఆ మొత్తాన్ని వివిధ రూపాల్లో వచ్చే మూడేళ్లలో వసూలు చేస్తాయనితెలిపారు. -
వెబ్ ఆప్షన్లపై తస్మాత్ జాగ్రత్త
శాతవాహన యూనివర్సిటీ: జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు రెండు రోజులుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరవుతున్నారు. కొందరు విద్యార్థులు గతంలో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. ఎంసెట్ సర్టిఫికె ట్ల పరిశీలనతోనే ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం కాదు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాల ఎంపిక విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలిన ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ నితిన్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాంబయ్య సూచిస్తున్నారు. ఆదివారం నుంచే వెబ్ఆప్షన్లు ప్రారంభ మ య్యా యి.సందేహాలుంటే 9666670193నిసంప్రదించొచ్చు. కొత్తగా వన్ టైం పాస్వర్డ్.. గతంలో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టడానికి స్క్రాచ్ కార్డు ఇచ్చేవారు. అందులోని సీక్రెట్ కోడ్ ద్వారా విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేవారు. కానీ దీనిలో పీఆర్వోల జోక్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు విన్పించాయి. దీంతో ఈసారి పీఆర్వోలకు చెక్ పెడుతూ రాష్ర్ట ఉన్నత మండలి.. వన్‌టైం పాస్వర్డ్ అనే ఆప్షన్ తెచ్చింది. ఈ విధానంలో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థి ఇచ్చే ఫోన్ నంబరే కీలకం. ఒకసారే ఉపయోగించకునేలా ఒక సీక్రెట్ పాస్వర్డ్ విద్యార్థి సెల్‌ఫోన్‌కు మేసేజ్ రూపంలో వస్తుంది. ఆ పాస్ వర్డ్‌ను ఉపయోగించుకుని విద్యార్థి నచ్చిన కోర్సులో... కోరుకున్న కళాశాలలో చేరొచ్చు. కాబట్టి విద్యార్థి తన ఫోన్ నెంబర్విషయంలో గోప్యతను పాటిస్తూ కౌన్సెలింగ్ సెంటర్లో ఇవ్వాలి. విద్యార్థి ఎంచుకునే ఆప్షన్లను లేదా కళాశాలను మార్చాలనుకున్న మళ్లీ వన్‌టైం పాస్వర్డ్ మొదటి ఇచ్చిన నంబర్‌కు మాత్రమే వస్తుంది. తమ కళాశాలలో చేర్చుకోవడానికి యత్నించే పీఆర్వోలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇంజినీరింగ్ కోర్సులో చేరిన వారికి తాయిలాలిచ్చేందుకూ పలు కళాశాలల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న వెబ్ ఆప్షన్లు.... ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వెబ్ఆప్షన్లు చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల, ఉజ్వల పార్క్ సమీపంలోని పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ఈ ఆప్షన్లను ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ఆప్షన్తో కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 17, 18వ తే దీల్లో 1 నుంచి 50 వేల ర్యాంకు వరకు, 20, 21 తే దీల్లో 50001 నుంచి లక్ష ర్యాంకు వరకు, 22, 23 తేదీల్లో 100001 వ ర్యాంకు నుంచి 1,50, 000 ర్యాంకు వరకు, 24, 25 తేదీల్లో 1,50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థుల మొదట ఉంచిన ఆప్షన్లు మార్చాలనుకుంటే 26 వ తే దీన 1 వ ర్యాంకు నుంచి లక్ష లోపు ర్యాంకులు ఉన్న వాళ్లు, 27న లక్ష ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు వారి ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఈ నెల 30న విద్యార్థులకు ఏ కళాశాలల సీటు వచ్చిందనే మేసేజ్ వస్తుంది. సెప్టెంబర్ 1 సంబంధిత క ళాశాలకు వెళ్లి అన్ని విషయాలు కనుక్కోవచ్చు. విద్యార్థికి కళాశాల నచ్చకుంటే రెండో కౌన్సెలింగ్ మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. తనిఖీలతో ఆరు కళాశాలలు ఔట్.? కౌన్సెలింగ్‌కు ముందు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 6 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి రద్దు చేసినట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని 12 ఇంజనీరింగ్ కళాశాలలకే వెబ్ ఆప్షన్ పెట్టాలనే విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అనుమతి రాని కళాశాలల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. వసతులు సమకూర్చి మళ్లీ అనుమతులను తెచ్చుకునేందకు ఆయా కళాశాల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కౌన్సెలింగ్‌కు 699 మంది హాజరు ఆదివారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లావ్యాప్తంగా 699 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్సారార్ కళాశాల సెంటర్లో 348 మంది, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో 351 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 మంది ఉన ్నట్లు క్యాంపు ఆఫీసర్ తెలిపారు. -
వెబ్..డబ్..
నేటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక మొదటిసారిగా వన్ టైం పాస్వర్డ్ విధానం తొలి ప్రాధాన్య కళాశాలల వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి మొబైల్ ఇన్‌బాక్స్ ఖాళీ చేస్తే మేలు విజయవాడ : తీవ్ర ఉత్కంఠత మధ్య ప్రారంభమైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక దశకు చేరుకుంది. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పునర్విభజన బిల్లులో పేర్కొన్న విధంగానే ఈ ఏడాది ఉమ్మడిగా ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు కౌన్సె లింగ్ ప్రక్రియను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి ఈ నెల 17నుంచి వెబ్ ఆప్లన్ల ఎంపికకు షెడ్యూల్ ప్రకటించింది. గతంలో జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అభ్యర్థులను తప్పుదారి పట్టించిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో స్క్రాచ్ కార్డును రద్దు చేసి వన్ టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టింది. వన్ టైం పాస్వర్డ్ విధానంలో డేటాను హ్యాకింగ్ చేసే అవశాశం ఉండదు. ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కోసం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లయోల కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. అభ్యర్థులు ఆయా హెల్ప్‌లైన్ సెంటర్లలోనే వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకుంటే మంచిది. ఈ ఏడాది నుంచి హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విద్యార్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్సు కాపీలు అందజేస్తే సరిపోతుంది. వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ) వల్ల ప్రయోజనాలు గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ముందుగానే పాస్వర్డ్ ఉన్న స్క్రాచ్ కార్డును ఇచ్చేవారు. కౌన్సెలింగ్ పూర్తయి సీటు ఎలాంట్మెంట్ అయ్యేవరకు ఆ పాస్‌వర్డ్‌ను భద్రంగా ఉంచుకోవాల్సి వచ్చేది. అయితే బ్రోకర్లకు, కళాశాలల యాజమాన్యాలకు ఆ పాస్వర్డ్ ముందుగానే తెలియడం వల్ల అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కళాశాలల జాబితాను మార్చేసేవారు. ఈ పరిస్థితిని నివారించేందుకు వన్ టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో లాగిన్ అయిన వెంటనే వారు ముందుగా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరుకు పాస్వర్డ్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ విధంగా ఎన్నిసార్లు లాగాన్ అయితే అన్నిసార్లు మొబైల్ నంబరుకు వేర్వేరు పాస్వర్డ్లు వస్తాయి. ప్రలోభాలకు లొంగొద్దు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించే హెల్ప్‌లైన్ సెంటర్లు, నెట్‌కేఫ్‌ల వద్ద బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కళాశాలలకు సంబంధించిన బ్రోకర్లు, యజమానులు యూనిఫాం ఉచితమని, పాకెట్ మనీ ఇస్తామని, బస్‌పాస్ ఉచితమని ఆఫర్లు ఇస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి మొదటి సంవత్సరం ఫీజులో సగం వెనక్కి ఇచ్చేస్తామంటూ ఆకర్షించేందుకు ప్రయత్నిసున్నారు. అటువంటి వారి ప్రలోభాలకు గురికాకుండా సరైన కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. సొంతగా అప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఏయే కళాశాలలను ప్రాధాన్యత ఇచ్చారనే విషయం బయటకు వెల్లడించకపోవడం ఉత్తమం. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెబ్ అప్షన్లను ఎంపిక చేసుకునే సమయంలో మొబైల్ ఇన్‌బాక్స్‌ను ఖాళీగా ఉంచితే మేలు. కాలేజీ ఎంపిక చేసుకునేముందు అక్కడి సౌకర్యాలు, ఆధ్యాపకులు, లేబొరేటరీలు, ప్లేస్మెంట్ సౌకర్యం తదితర వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. టాప్ కాలేజీల జాబితాతోపాటు నచ్చిన బ్రాంచిల లిస్ట్ కూడా సిద్ధం చేసుకుంటే మంచిది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు( ఏ రాష్ర్టంలో వాళ్లు ఆ రాష్ట్రంలోనే కళాశాలలు ఎంపిక చేసుకోవాలని కొందరు దళారులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.) కాలేజీ, బ్రాంచిల ఎంపికకు సంబంధించి ఒక్కో ర్యాంకు వారికి రెండు రోజుల సమయం కేటాయించారు. మొదటి రోజు కొన్ని అప్షన్లు ఇచ్చి ఇతర కారణాల వల్ల లాగ్ అవుట్ కావాల్సి వస్తే ‘సేవ్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. వెబ్ ఆప్షన్లకు అదే చివరి రోజైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అపుడు మాత్రమే ఎంపిక చేసుకున్న కళాశాలలు, బ్రాంచిల జాబితా సబ్మిట్ అవుతుంది. అప్షన్లు మార్పుకు మరో రోజు అవకాశం కల్పిచడం జరిగింది. వన్ టైం పాస్వర్డ్ ఎంతో మేలు గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరిగే సమయంలో కొందరు నెట్ సెంటర్ల యజమానులు కీ బోర్డుకు ప్రత్యేకమైన గాడ్జెట్‌ను అమర్చి పాస్‌వర్డ్‌ను తెలుసుకునేవారు. తద్వారా అప్షన్లు మార్చేవారు. కొత్త విధానంలో ఎప్పటికప్పుడు పాస్వర్డ్ మారడం వల్ల అభ్యర్థి డేటాను తస్కరించేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఇది ఎంతో మేలు చేస్తుంది. అప్షన్లు ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థి ప్రతి కళాశాల సమచారం తెలసుకోవడం మంచిది. - కె.శ్రీధర్, కంప్యూర్ సైన్స్ ఫ్యాకల్టీ, పీబీ సిద్ధార్థ కాలేజీ