
నేటితో ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల గడువు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం చేపట్టిన చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు ఈనెల 28 రాత్రి 10 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి 29వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత సీట్లు కేటాయిస్తామని, సీట్లు వచ్చిన వారు 31లోగా కాలేజీల్లో చేరాలని సూచించారు.