ఇంజనీరింగ్‌లో ప్రవేశాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ తేదీలను మరో పది రోజుల్లోగా ఖరారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ తనిఖీలు పూర్తయ్యాయని, లోపాలపై యాజమాన్యాలకు నోటీసులు పంపిస్తోందని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ శాఖ తనిఖీలు చేపట్టాల్సి ఉందని, అవి పూర్తి కాగానే విజిలెన్స్, జేఎన్‌టీయూహెచ్ నివేదికలు రెండింటిని పోల్చి చూస్తామని వెల్లడించారు. ఆ తర్వాతే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఈ కారణంగానే గురువారం ప్రకటించాల్సిన ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలును వాయిదా వేసినట్లు తెలిపారు. మొత్తానికి ఆగస్టు 1 నాటికి తరగతులను ప్రారంభిస్తామన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. కాలేజీల్లో తనిఖీలు పూర్తయి, వాటిని జేఎన్‌టీయూహెచ్ నివేదికలతో పోల్చి చూసి అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు చేపట్టేందుకు వెబ్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచుతారు. మొత్తానికి ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో 15 రోజల సమయం పట్టేలా ఉంది.
15 రోజుల్లో చాన్స్‌లర్లు, వీసీల నియామకాలు
వచ్చే 15 రోజుల్లో యూనివర్సిటీలకు చాన్స్‌లర్లు, ైవె స్ చాన్స్‌లర్లను నియమించనున్నట్లు కడియం తెలిపారు. దీనికి సంబంధించిన చర్యలు ప్రారంభించామన్నారు. చాన్స్‌లర్లు, వీసీల పేర్లను ఖరారు చేసి, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేందుకు ఈ సమయం పడుతుందని వివరించారు.
పది రోజుల్లోగా ప్రవేశాల షెడ్యూలు
Published Fri, May 27 2016 3:08 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement