శ్రీకాకుళం న్యూకాలనీ: పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రెవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాకే తలమానికంగా గుర్తింపు పొందిన ఈ కళాశాలలో ఇటీవల మంజూరైన రెండు కోర్సులను కలుపుకొని మొత్తం 16 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 760 సీట్లు అందుబాటులో ఉండగా.. తొలివిడత కౌన్సెలింగ్‌లో 350 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఫీజు సైతం చెల్లించారు. ఆయా విభాగాల అధిపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియను ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీసు పర్యవేక్షించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులకు శనివారం కౌన్సెలింగ్ జరగనుంది. తగిన అర్హత ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటల నుంచి జరగనున్న కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని పోలీసు కోరారు.
ప్రభుత్వ మహిళా కళాశాలలో...
పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో మొదటి జాబితా కౌన్సెలింగ్‌లో వివిధ కోర్సుల్లో 70 శాతం మేర ప్రవేశాలు పూర్తయ్యాయి. వీటిని ప్రిన్సిపాల్ మైథిలి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా కళాశాలల్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఇక్కట్లకు గురయ్యారు. తాగునీటి కోసం పరుగులు తీశారు.
డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం
Published Sat, Jun 27 2015 1:56 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement