Deputy CM Kadiyam Srihari
-
ప్రైవేటు వర్సిటీల బిల్లుకు సభ ఓకే
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలను నీరుగార్చడానికే ఈ బిల్లు తెస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వర్సిటీల్లో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూ ఇప్పుడు ప్రైవేట్ బాట పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ, టీడీపీ, సీపీఎం వాకౌట్ చేశాయి. అయితే ప్రైవేటు వర్సిటీల విషయంలో ఎలాంటి ఆందోళన, అపోహలూ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ వర్సిటీలను కాపాడుకుంటూనే ప్రైవేటుకు అనుమతిస్తున్నామన్నారు. వచ్చే జూన్, జూలై నాటికి వర్సిటీల్లో 1,061 అధ్యాపక ఖాళీలను భర్తీ చేస్తామని, వాటిని బలోపేతం చేస్తామని వెల్లడించారు. బిల్లుపై ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య, జలగం వెంకట్రావు లేవనెత్తిన అంశాలకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతోనే బిల్లు తెచ్చామన్నారు. ‘‘రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం వర్సిటీలను బలహీనపరిచే చర్యలు చేపట్టదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వరంగంలో విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. గత ప్రభుత్వం వర్సిటీలిచ్చినా నిధులివ్వలేదు. పోస్టులు మంజూరు చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నిధులిస్తోంది. పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది’’అని చెప్పారు. ఉస్మానియా వర్సిటీపై ఎందుకంత కోపమని కె.లక్ష్మణ్ అనడాన్ని కడియం తప్పుబట్టారు. ‘‘రాష్ట్ర బీజేపీ నేతల ఆలోచనలు గ్రేటర్ హైదరాబాద్‌ను దాటడం లేదు. వారిది జాతీయ పార్టీ అని మరుస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వ భూమి ఇవ్వడం లేదు. మైనారిటీల కోసం వాటిలో ప్రత్యేకంగా చేపట్టాల్సిన చర్యలపై సభ్యులతో చర్చించి నిబంధనల్లో పొందుపరుస్తాం. అలాగే కార్పస్ ఫండ్ అంశాన్ని కూడా. ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే నిబంధన పెట్టాం’’అన్నారు. సామాజిక రిజర్వేషన్లు లేవంటూ వాకౌట్.. సామాజిక రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచలేదంటూ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రైవేటు వ్యాపారానికి బిల్లు అవకాశం కల్పించేలా ఉంది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలు పూర్తిగా దెబ్బతింటాయి. బిల్లులో రాష్ట్ర విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని ఉందే తప్ప, సామాజిక రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తావన లేదు. మంత్రి స్పష్టతా ఇవ్వలేదు. వర్సిటీలను బలోపేతం చేయాలన్న ఆలోచన ఉంటే నాలుగేళ్లుగా చేయలేదేం? ఉస్మానియా, కాకతీయ వర్సిటీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు వర్సిటీల్లో అన్ని కోర్సులకు అనుమతిస్తే మిగతావి ఏం కావాలి?’’అని ప్రశ్నించారు. బిల్లును ఉపసంహరించాలని సీపీఎం, సెలెక్ట్ కమిటీకి పంపి మార్పుచేర్పులు చేయాలని బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారి వాకౌట్ అనంతరం బిల్లును సభ ఆమోదించింది. -
కేజీబీవీల్లో ఇంటర్ విద్య
బాలికా విద్యకు ప్రాధాన్యమిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెంజల్(బోధన్): కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారాయి. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో ఆరో తరగతినుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందిస్తున్నారు. ఇంటర్ కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టాలని వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అంగీకారం తెలిపినట్లు డిప్యూటీ సీఎం కడియం ప్రకటించారు. దీంతో పేద విద్యార్థినుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో 25 కేజీబీవీలు.. పేద విద్యార్థినులు చదువు మధ్యలో మానేయకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందుతోంది. మధ్యలో బడిమానేసిన, అనాథ, నిరుపేద విద్యార్థినులకు ప్రవేశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థినులూ ఇందులో చదువుతున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో 3,855 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అయితే పదో తరగతి వరకే విద్య అందుతుండడం పేద విద్యార్థినులకు శాపంగా మారింది. చదువుకోవాలని ఉన్నా.. వసతితో కూడిన విద్య అందించే కళాశాలలు లేకపోవడంతో చాలామంది పదో తరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ కూడా ఇదే సిఫారసు చేయడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రయోజనాలు.. కేజీబీవీలలో ఇంటర్ ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లు తగ్గుతాయి. పదో తరగతి తర్వాత చదువుకోవడానికి వసతితో కూడిన కళాశాలలు లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు త్వరగా వివాహం జరిపిస్తున్నారు. ఇంటర్ ప్రవేశపెట్టడం వల్ల అలాంటి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బాల్య వివాహాలను నియంత్రించవచ్చు. డ్రాపవుట్లు తగ్గుతాయి.. పదో తరగతి తర్వాత చాలామంది బాలికలు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఫలితంగా డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. కేజీబీవీల్లో ఇంట ర్ వరకు అప్‌గ్రేడ్ చేయడం వల్ల డ్రాపవుట్లు తగ్గుతాయి. కేజీబీవీల్లో పదో తరగతి తర్వాత ఇంటర్ వరకు విద్యనభ్యసించవచ్చు. పై చదువులకు భరోసా ఏర్పడుతుంది. – మమత, ప్రిన్సిపాల్, కేజీబీవీ, రెంజల్ మంచి అవకాశం.. కేజీబీవీల్లో ఇప్పటి వరకు పదో తరగతి వరకే తరగ తులు ఉండేవి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ వరకు కూడా తరగతులు నిర్వహిస్తే మాలాం టి వారికి మంచి అవకాశం లభించినట్లే. బాగా చదువకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తాం. పేదరికం వల్ల మధ్యలో చదువు మానేసిన నాకు కేజీబీవీలో చదువుకునే అవకాశం లభించింది. – సమత, పదో తరగతి విద్యార్థిని ఆర్థికభారం తగ్గుతుంది.. కేజీబీవీల్లో ఇంటి కంటే మంచి వాతావరణం ఉంటుంది. నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నతమైన విద్య లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్య ప్రవేశపెట్టాలనే నిర్ణయం మంచిది. మాలాంటి నిరుపేద విద్యార్థులకు చక్కటి అవకాశం. నేను నా చెల్లెలు కస్తూర్బాలో చదువుకుంటు న్నాం. తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. – స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
ఓరుగల్లుకు నిరంతర సాగునీరు
హసన్‌పర్తి: రానున్న ఆరునెలల్లో ఓరుగల్లుకు నిరంతరం సాగునీరు, తాగునీరు అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 191–234 కిలోమీటర్ల వరకు సుమారు రూ.122.9 కోట్లతో చేపట్టనున్న శ్రీరాంసాగర్ మరమ్మతు పనులను శనివారం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును మానేరుకు అనుసంధానం చేసి కాకతీయ కాల్వలకు నీరు విడుదల చేస్తామన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద మొదటి విడత రూ.60 కోట్లతో పనులు పూర్తి చేశామని, రెండో విడతలో మరో రూ.270 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కడియం వెల్లడించారు. డీబీఎం కాల్వల ఆధునీకరణ ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలతో పాటు డీబీఎం, మైనర్ కాల్వలను కూడా ఆధునీకరించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారతో పాటు పూడికతీత పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే పలివేల్పుల గ్రామం గుండా ఎస్సారెస్పీ కాల్వపై వంతెన మంజూరు చేశామని, దాని నిర్మాణం కోసం రూ. 1.54 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు నీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ పోచయ్య, డీఈ బాలకృష్ణ, ఏఈ మాధవరావు, కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, నాగమళ్ల ఝాన్సీ, సర్వోత్తంరెడ్డి, సిరంగి సునీల్‌కుమార్, బానోతు కల్పన, వీర భీక్షపతి, ఎంపీపీ కొండపాక సుకన్య,రఘు, జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్, బిల్లా ఉదయ్‌కుమార్‌రెడ్డి, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మేర్గు రాజేష్, వల్లాల యాదగిరి, రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్, నాయకపు శ్రీనివాస్, గడ్డం శివరాంప్రసాద్, చకిలం చంద్రశేఖర్, దేవరకొండ అనిల్, రజనీకుమార్, రమేష్, సర్పంచ్ రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పోలవరంతో మనకు నష్టమే
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశాతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయ ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. భువనేశ్వర్‌లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం నవీన్ పట్నాయక్‌ను అక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నవీన్ పట్నాయక్ పోలవరం వల్ల ఒడిశాలో ముంపునకు గురవుతున్న గిరిజన గూడేలు, అటవీ భూముల గురించి కడియం, రామ్మోహన్‌తో చర్చించారు. పోలవరంపై తమ వైఖరిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియంను కోరారు. తెలంగాణలో కూడా గిరిజన గూడేలు ముంపునకు గురవుతున్నాయని నవీన్ పట్నాయక్ కు కడియం, రామ్మోహన్ తెలిపారు. -
సొమ్మసిల్లి పడిపోయిన కడియం
-
సొమ్మసిల్లి పడిపోయిన కడియం
- వరంగల్‌లో అవతరణ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం - వడదెబ్బకు గురై.. ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి ప్రసంగం వరంగల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఒక్కసారిగా సృహతప్పి పడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వరంగల్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం అవతరణ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన కడియం.. ప్రగతి నివేదిక చదువుతుండగా ఎండదెబ్బకు గురై కిందపడిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది, ప్రజలు ఏం జరిగిందోనని కలవరపాటుకు గురయ్యారు. గార్డులు తక్షణమే స్పందించి డిప్యూటీ సీఎంను ఆయన వాహనంలోకి ఎక్కించారు. నిమిషాల వ్యవధిలోనే కడియం కుదుట పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కోలుకున్న వెంటనే తిరిగి కాసేపు ప్రసంగించారాయన. ఇవాళ ఉదయం వరంగల్‌లో ఎండ అధికంగా ఉండటంతో వేడుకలకు హాజరైనవారు ఇబ్బందులు పడ్డారు. వెనక్కుతగ్గని వైనం అస్వస్థతకుగురైనప్పటికీ కార్యక్రమం నుంచి వెళ్లిపోయేందుకు నిరాకరించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఆస్పత్రిలో చేరాల్సిందిగా వేడుకున్నప్పటికీ ఆయన వినిపించుకోలేదు. కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ తాను ఇక్కడే ఉంటానని అధికారులకు స్పష్టం చేశారు. చాలా సేపటివరకు కడియం కారులోనే కూర్చుని వేడుకలను వీక్షించారు. -
శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక (2017–18) బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసన మండలికి వచ్చిన ఆయన ముందుగా బడ్జెట్ పత్రాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు అందజేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తరఫున తాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాని కడియం శ్రీహరి సభ్యులకు తెలిపారు. డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి ఐదు నిమిషాలు దాటినా బడ్జెట్ ప్రతులు సభ్యులకు చేరలేదు. దీంతో విపక్షనేత షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే శాసన సభ నుంచి బడ్జెట్ ప్రతులు వస్తున్నాయని, ముహూర్తం మించిపోతున్నందున ప్రసంగానికి అడ్డు చెప్పవద్దని షబ్బీర్ అలీని చైర్మన్ స్వామిగౌడ్ కోరారు. 36 పేజీల వార్షిక బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 1.15గంటలకు పూర్తి చేశారు. వరుసగా నాలుగోసారి ఆయనే - బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక భూమిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ల తయారీలో నాలుగు సార్లూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక పాత్ర పోషించారు. తొలి రెండేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా బడ్జెట్ రూపకల్పన చేసిన రామకృష్ణారావు.. గతేడాది ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సారి కొత్త పంథాలో తయారైన నాలుగో బడ్జెట్ రూపకల్పనలోనూ క్రియాశీల భూమిక నిర్వహించారు. రామకృష్ణారావుతో పాటు మూడు నెలల కింద ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్థిక సలహాదారు జి.ఆర్.రెడ్డిలు దాదాపు గత నెల రోజులుగా బడ్జెట్ తయారీ ప్రక్రియలోనే నిమగ్నమయ్యారు. మారిన మార్గదర్శకాల నేపథ్యంలో కొత్త బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగానే కసరత్తు చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ చాలా సమయం వెచ్చించి ప్రతి పద్దును చర్చించి కేటాయింపులు జరిపారు. -
'అర్చకుల వేతనాలపై సీఎంతో చర్చిస్తా'
సాక్షి, హైదరాబాద్: అర్చకుల వేతనాల విషయంలో ముఖ్య మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అర్చక సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తెలంగాణ అర్చక సమాఖ్య ముద్రించిన కొత్త డైరీని మంగళవారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, దేవాలయ ఉద్యోగుల సంఘం నేత మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కొండా లక్ష్మణ్ ఆదర్శప్రాయుడు
వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికొక బీసీ గురుకులం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యారణ్యపురి : తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయాలను సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని ఆయన కొనియాడారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని లష్కర్‌బజార్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోయడలో బాపూజీ పోషించిన పాత్ర కీలకమైందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు కొమురం భీమ్, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ వంటి గొప్ప వ్యక్తులను అధికారికంగా గౌరవిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక భవన నిర్మాణం, శిలా విగ్రహం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయానికి బాపూజీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాన్ని మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది 119 బీసీ గురుకులాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, బానోతు శంకర్‌నాయక్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీసీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సింహస్వామి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జె.రంగారెడ్డి, బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ ,తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆదుకోవాలి గోదావరి ఉధృతి మరింత పెరగనుంది ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలించాలి నిత్యావసర వస్తువులు, మందులు అందుబాటులో ఉంచాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశం ఏటూరునాగారంలో అధికారులతో సమీక్ష ఏటూరునాగారం : ఏజెన్సీలోని తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండల్లోని ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే అందించే విధంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు మండల కేంద్రాల్లో ఉండాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితిపై సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఎక్కువగా ఉన్నాయని, గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఏజెన్సీలోని మూడు మండలాల్లో నిత్యావసర సరుకులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సరిపడా నిల్వలు గ్రామాల్లో ఉంచాలని ఆర్డీఓ మహేందర్‌జీని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సేవలను విస్తృతం చేసి ప్రజలకు అనునిత్యం సేవలు అందించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావును ఆదేశించారు. 104, 108 వాహనాలను మండలానికి గ్రామాలకు మధ్యలోని ప్రాథమిక కేంద్రాలకు అందుబాటులో ఉంచితే రోగులకు తిప్పలు ఉండవన్నారు. ఐటీడీఏ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సరిపడా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 వేల కుటుంబాలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశామని, దీంతో రోగాల తీవ్రత తగ్గిందని కలెక్టర్ కరుణ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. 11 మీటర్లకు వస్తే ముంపు ప్రాంతాలను గుర్తించాలి గోదావరి నది 11 మీటర్ల స్థాయికి వస్తే నీటితో మునిగే ప్రాంతాలను గుర్తించాలని ఇరిగేష¯ŒS ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాంటి కుటుంబాలను గుర్తించి డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరయ్యే విధంగా చూస్తామన్నారు. ముందుగా కుటుంబాల వివరాల తర్వాత ప్రభుత్వ స్థలాల ఎంపిక అనంతరం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం లోతట్టు గ్రామాల ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలో 93 కుటుంబాలకు చెందిన 210 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, నీరు, భోజనం, వసతి సౌకర్యం కల్పించామని, మంగపేట పొదుమూరులో 12 కుటుంబాలకు చెందిన 48 మంది ప్రజలను జెడ్పీహెచ్‌ఎస్‌కు తరలించినట్లు ఆర్డీఓ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. రామన్నగూడెం, రాంనగర్ గ్రామాల మధ్యలోని లోలెవల్‌కాజ్‌వే పై నుంచి గోదావరి ప్రవహించడంతో రాంనగర్, లంబాడీతండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఆర్డీఓ వెల్లడించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, కావాల్సిన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ తెలిపారు. పోలీసులు, ఎ¯ŒSడీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడే ఉంటారని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని శ్రీహరి అన్నారు. ముఖ్యంగా రోడ్లను మరమ్మతు చేయాలని, ఆర్అండ్బీ ఎస్ఈ నర్సింహకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వెళ్లే ప్రధాన రోడ్డు బురదమయంగా మారిందని, ఇసుక లారీలను నిలిపివేశామని, 15 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఇందు కోసం రోడ్డు మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఎస్ఈని ఆదేశించారు. రోడ్డు పనులు వేగంగా చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పుర ప్రముఖుల సలహాలను పాటిస్తాం గ్రామ పెద్దల ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తామని కడియం శ్రీహరి అన్నారు. మంగపేట, ఏటూరునాగారం మండలాలకు చెందిన గ్రామ పెద్ద మనుషులను సమీక్షకు పిలిపించారు. గోదావరి చుట్టూ నిర్మించిన కరకట్టకు అమర్చిన గేట్ల ద్వారా వరద నీరు గ్రామాల్లో రావడం వల్ల పంటలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చక్రధర్‌రావు, నూతి కృష్ణ, ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కరకట్టకు ఉన్న గేట్లు ఎందుకు సరిగ్గా బిగించలేదని ఎస్ఈ శ్రీనివాసరెడ్డి ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బీడింగ్ సరిగ్గా లేదని ఎస్ఈ చెప్పగా వెంటనే చేయించాలని ఆదేశించారు. అలాగే మండల కేంద్రంలో సుమారు 200ల కుటుంబాలు వరద వల్ల ముంపు గురవుతున్నాయని జెడ్పీటీసీ వలియాబీ అన్నారు. వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని పీఓను డిప్యూటీ సీఎం ఆదేశించారు. గ్రామంలో సహాయక చర్యలు చేపట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఇర్సవడ్ల వెంకన్నను కలెక్టర్ అభినందించారు. మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో బ్యాక్‌వాటర్ వల్ల ప్రమాదం ఉందని, మంగపేట పుష్కరఘాట్ కోతకు గురికావడం వల్ల 60 ఎకరాలు నీట మునిగి నష్టపోయాయని శ్రీధర్ వివరించారు. ఒడ్డు కోతకు గురికాకుండా నాపరాయి, ఇసుక బస్తాలు, కాంక్రీట్‌తో రక్షణ చర్యలు చేపట్టాలని పీఓ, ఆర్డీఓలను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే ఐలాపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని టీఆర్ఎస్ నాయకుడు చంద్రం శ్రీహరికి విన్నవించారు. రోడ్డు నిర్మాణం జరిగే విధంగా చూస్తామన్నారు. హెల్ప్‌లై¯ŒS సెల్ ఏర్పాటు ఐటీడీఏ కార్యాలయంలో వరద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లై¯ŒS సెల్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ తెలిపారు. ఎవరికైనా ఏ అవసరం వచ్చినా, ఆపదలో ఉన్నా 08717–231246, సెల్ 94909 57006కు కాల్ చేయాలన్నారు. సమీక్షలో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ఓఎస్డీ శ్వేతారెడ్డి, ఏఎస్పీ విశ్వజిత్కాంపాటి, ఏపీఓ వసంతరావు, ఈఈ కోటిరెడ్డి, ఎంపీపీ మెహరున్నీసా, తహశీల్దార్ నరేందర్, ఎంపీడీ ప్రవీణ్ పాల్గొన్నారు. -
అధికారులూ శభాష్
వర్షాల్లో వారి సేవలు బాగున్నాయి వరద నష్టం అంచనాలపై నివేదికలు రూపొందించాలి అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి రబీకి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ అర్బన్ : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల్లో ప్రభుత్వం తరపున ప్రజలకు అధికారులు అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్కర పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, కలెక్టర్ వాకాటి కరుణ, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝాతో కలిసి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ పది రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు, చిన్న నీటి ప్రాజెక్టులు నీటితో నిండి ప్రవహిస్తున్నాయన్నారు. జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. నగరంలోని గోపాలపురం చెరువుకట్టపై నుంచి వరదనీరు పోతుందని, చిన్న వడ్డేపల్లి చెరువు మత్తడి పోసి లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయన్నారు. సాటునీటి పారుదల, ఇంజనీరింగ్, నగర పాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్కడి నుంచి నీటిని పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అధికారులు క్షేత్రస్థా«యిలో అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని కలెక్టర్‌కు సూచించారు. 66 చెరువులకు బుంగలు జిల్లా›లో వర్షాలతో 5550 చెరువుల్లో 66 చెరువులు బుంగపడ్డాయని డిప్యూటీ సీఎం తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని 22 రహదార్లు తెగిపోగా, 6 చోట్ల అర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిసిందన్నారు. పునారావాస సహాయక శిబిరాల్లో ఉంటున్న వారికి వసతి, భోజనం సదుపాయం కల్పించాలన్నారు.వ్యవసాయ అధికారులు వర్షం తగ్గిన వెంటనే పంట నష్టం వివరాలు పూర్తిస్థాయిలో అంచనా వేసి నివేదిక సమర్పించాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సర్ప్లస్ నీటిని రేపటిలోగా ఎల్ఎండీకి వదులుతున్నందున జిల్లాలో రెండో విస్తీర్ణం పెరుగుతుందన్నారు. రబీకి కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ అధికారులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలన్నారు. వైద్యఆరోగ్య శాఖ అధికారులు అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్సలు అందించాలన్నారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ నగరంలో 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ఐఎంఏ, ప్రైవేట్ నర్సింగ్‌హోంల సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫాతిమానగర్ వద్ద కొత్త ఆర్వోబీ నిర్మాణం
60 అడుగులతో ఫాతిమానగర్ ఆర్వోబీ నిర్మాణం రోడ్ల అభివృద్ధితోనే నగర సుందరీకరణ సెంట్రల్ లైటింగ్, ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షి, హన్మకొండ : కాజీపేట వద్ద రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపొందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందన్నారు. మునిసిపల్, ఎన్‌హెచ్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో పనులను గుర్తించి అనుమతులు పొందాలన్నారు. టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభించాలని గ్రేటర్ మేయర్, కమిషనర్లకు సూచించారు. అక్టోబర్ 15 నుంచి పనులు మొదలు పెట్టే విధంగా కృషి చేయాలన్నారు. రెండో ఆర్వోబీ హన్మకొండ నుంచి హైదరాబాద్ మార్గంలో కాజీపేట వద్ద ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలె త్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తక్షణం మే సైట్ ఇన్స్పెక్షన్ చేసి నెలరోజుల్లో డీపీఆర్ రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు కడియం చెప్పారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వైపు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి ఎడమ వైపున సమాంతరంగా కొత్త వంతెన కట్టేందుకు అవకాశం ఉందన్నారు.ఈ వైపు ప్రైవేట్ నిర్మాణాలు ఎక్కువగా లేవని రైల్వే, సెయింట్ గాబ్రియల్ విద్యా సంస్థలకు చెందిన స్థలం ఉన్నట్లు వెల్లడించారు. వీరి సహకారంతో ఆర్వోబీ నిర్మాణ పనులు చేపడతామన్నారు. రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ (వంతెనలు) అశోక్ మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. సెయింట్ గాబ్రియల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆర్వోబీ విస్తరణకు ఏ మేరకు ల్యాండ్ అవసరం ఉందో తెలియజేస్తే తమ సంస్థ చైర్మన్‌తో చర్చిస్తామని తెలిపారు. నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి మాట్లాడుతూ మరో ఆర్వోబీ నిర్మాణం అవసరం అని నెల రోజుల్లో డీపీఆర్ రూపొందించి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సమర్పిస్తామని తెలిపారు. ఆర్వోబీ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ అభ్యంతరాలు తెలిపితే రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు చేపడుతుందని ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ రవీందర్రావు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జి. పద్మ, మేయర్ నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరీ రమేశ్, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్ వాకాటి కరుణ, గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రహదారులు భవనాల శాఖ, జాతీయ రహదారుల శాఖ, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. లోపాలు లేని డీపీఆర్ ఇంజనీర్స్ డే రోజున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంజనీర్ అవతారం ఎత్తారు. నగర అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఇంజనీర్లకే ఇంజనీర్‌గా కడియం సూచనలు చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ రూపకల్పనలో లోటు పాట్లను గుర్తించి వాటిని సరిదిద్దారు. అలైన్మెంట్ రూపకల్పనతో చెరువులు, కుంటలు, ఆవాసాలకు ఇబ్బంది కలుగకుండా ఔటర్ రింగురోడ్డు అలైన్మెంట్ రూపొందించాలన్నారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపించి క్షేత్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కడియం సూచనల వల్ల ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు పొడవును తగ్గి, ప్రజలకు అనుకూలంగా అవుటర్ రింగురోడ్డు రూపుదిద్దుకోనుంది. సమీక్షలో చర్చించిన ఇతర అంశాలు – కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వయా కేయూసీ రోడ్ల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని డిప్యూటీ సీఎం అధికారులను ప్రశ్నించగా.. భూసేకరణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు సమాధానమిచ్చారు. గోపాలపురం క్రాస్ రోడ్డు వరకు ఎలాంటి సమస్య లేదు. గోపాలపురం ఎక్స్‌రోడ్డు నుంచి కేయూసీ వరకు భూసేకరణ సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. – అమరవీరుల స్థూపం నుంచి నాయుడు పెట్రోల్ పంపు రోడ్డు పనులు పూర్తయి, రెండు నెలలు గడిచినా ట్రాఫిక్ లైట్స్, డివైడర్లు, రోడ్లకు ఇరువైపులా లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పది రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. – కడిపికొండ నుంచి టయోటా షోరూం రోడ్డు పనులు నాలుగు నెలల్లో పూర్తి చేయాలంటూ గడువు నిర్ధేశించారు. – లేబర్‌కాలనీ–ఎస్ఆర్నగర్–గరీబ్‌నగర్–ఏనుమాముల మార్కెట్ రోడ్డులో ట్రాఫిక్ లైట్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయాలన్నారు. – హన్మకొండ చౌరస్తా వయా పద్మాక్షిగుట్ట శాయంపేట హంటర్‌రోడ్డు పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించగా భూసేకరణలో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెప్పారు. దీంతో 60 ఫీట్ల రోడ్లకి ప్రతిపాదనలు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. – రాంపూర్ నుంచి ధర్మారం, పోచమ్మమైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా రోడ్లకు డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పోచమ్మమైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా రోడ్లకు ఇప్పటికే టెండర్లు పిలిచామని అధికారులు వివరించారు. – హసన్‌పర్తి నుంచి నాయుడు పెట్రోల్ పంపు రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎం చెప్పిన పనులే కాలేదు సమావేశంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం అవుతున్నందున అక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపముఖ్యమంత్రి అందుకు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో కడియం మాట్లాడుతూ ‘ బాబూ... ఊరుకో... మైకుందని మాట్లాడితే ఎలా... వరంగల్ కే ఔటర్ దిక్కులేదు... మహబూబాబాద్‌కు కావాలా... స్వయంగా సీఎం నందనాగార్డెన్లో సమీక్షించి ఆదేశించిన పనులకే ఇంత వరకు డబ్బులు రాలేదు, పనులు మెదలుకాలేదు. అలాంటిది.. మహబూబాబాద్‌కు అంటే ఎలా.. కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి’ అంటూ సూచించారు. -
ఆర్టీసీని ఆదరించాలి
రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి జిల్లాకు మరిన్ని కొత్త బస్సులు డిప్యూటీ సీఎం కడియం, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి హన్మకొండ : ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి లాభాల బాటలో పయనించేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు మంజూరైన 24 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి బుదవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాకు 24 కొత్త బస్సులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం, చరిత్ర, వారసత్వ నగరం వరంగల్ అని అన్నారు. వరంగల్ మహానగరంలో ప్రజల రవాణ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆర్టీసీ యాజమాన్యం జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు మంజూరు చేసిందన్నారు. జిల్లాకు మరిన్ని బస్సులు అవసరమని అన్నారు. చిన్న బస్సులు ప్రవేశ పెడితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అన్నారు. కార్మికులు కూడా సంస్థ పరిర క్షణకు పాటుపడాలన్నారు. రాష్ట్ర రవాణ శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు రూ.9 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 24 బస్సులను ఇచ్చామన్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరమని, అందుకే ఈ జిల్లాకు మరిన్ని బస్సులు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పల్లెవెలుగు బస్సులతో నష్టాలు వస్తున్నా గ్రామీణ ప్రజలకు రవాణ సౌకర్యం కల్పించేందుకు ఈ సర్వీసులు నడుపుతున్నామన్నారు. దూరప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు ఏసీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ఆర్ఎం తోట సూర్యకిరణ్ మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌కు ఒకేసారి 24 కొత్త బస్సులు రావడం ఇదే ప్రథమమని అన్నారు. కొత్త బస్సులను వరంగల్ మహా నగరంలో తిప్పుతామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ నగర మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌బాస్కర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, జిల్లా రవాణ శాఖ అధికారి రాంచందర్, ఆర్టీసీ కరీంనగర్ ఈడీ గరిమిల్ల సత్యనారాయణ, డిప్యూటీ సీటీఎం జి.ఎస్.ఎస్.సురేష్, డిప్యూటీ సీఎంఈ జి.రాములు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, డిపో మేనేజర్లు అర్పిత, ఎస్.భూపతిరెడ్డి, భానుకిరణ్, శ్రీనివాస్, యేసు, మధుసూదన్, చంద్రయ్య, ఆయా యూనియన్ల నాయకులు పీఆర్ రెడ్డి, సి.హెచ్.జితేందర్‌రెడ్డి, ఈఎస్ బాబు, రాతిపల్లి సాంబయ్య, ఎం.డీ.గౌస్, ఈదురు వెంకన్న, జనార్దన్, సీహెచ్.రాంచందర్, ఎస్.యాదగిరి, రాజయ్య, యాకస్వామి, వడ్డాలపు కుమారస్వామి, జి.సారంగపాణి, మోహన్, ఎన్.వీ.రెడ్డి పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం ఇంటి ముట్టడి
నిరసన తెలిపిన రెండో ఏఎన్ఎంలు కేబినెట్ సమావేశంలో మాట్లాడుతానని కడియం హామీ హన్మకొండ : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు హన్మకొండ టీచర్స్ కాలనీలోని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం రెండో ఏఎన్ఎంలు డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న కడియం శ్రీహరి ఏఎన్ఎంల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, అప్పటి వరకు కనీస వేతనం చెల్లించాలని, పదో పీఆర్సీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా ఏఎన్ఎంలు కోరారు. దీంతో డిప్యూటీ సీఎం వెంటనే ఫోన్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడారు. త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రెండో ఏఎన్ఎంల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, నాయకులు నాగేశ్వర్రావు, నర్సింగం, రెండో ఏఎన్ఎంల అసోషియేష న్ జిల్లా అధ్యక్షురాలు కె.సరోజ, నాయకులు మంజుల, జమునా, సదాలక్ష్మి, మంజులాదేవి, కవిత, సుజాత, లక్ష్మి, భారతి, లత, అనిత, మాదవి, రజిత, భాగ్యలక్ష్మి, మీనా పాల్గొన్నారు. -
కడియంకు కీలక బాధ్యతలు
మంత్రివర్గ ఉప సంఘంలో చోటు జిల్లాల పునర్విభజన ప్రకియపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో కడియం శ్రీహరికి చోటు కల్పించింది. రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల ఎంపిక, జోనల్ వ్యవస్థ, శాఖల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలపై ఈ కమిటీ నివేదికలు ఇవ్వనుంది. -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి
ఉద్యోగాల భర్తీ, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం నాణ్యమైన విద్య కోసం 350 గురుకులాలు జయశంకర్ జయంతి వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : జయశంకర్ ఆలోచనలు, ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పనిచేస్తున్నారని ఉప ము ఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో శనివారం జయశంకర్ జయంతి వే డుకలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు పసునూరి దయాకర్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మేయర్ నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ తదితరులు ఏకశిల పార్కులోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారని తూర్పారబట్టారు. 25 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. త్వరలో 10వేల టీచర్ పోస్టులు, గురుకులాల్లో 4 వేల ఉపాధ్యాయ పోస్టులు, 4వేల పారా మెడికల్, మెడికల్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని, దీంతో జరిగే నష్టమేమిటని ప్రశ్నిం చారు. కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అం దించేందుకు రాష్ట్రంలో 350 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ విద్యాలయా ల ద్వారా 1.75 లక్షల మందికి విద్య అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండరాం వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ వ్యతిరేకులకు బలం చేకూరుస్తోందన్నారు. 2013 చట్టం, 123 జీఓలో ప్రాజెక్టు నిర్వాసితులు ఏది కోరుకుంటే ఆ ప్రకారం పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్యా, నÄæూముద్దీన్, మర్రి యాదవరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, జయశంకర్ దత్తపుత్రుడు బ్రహ్మం, కుటుంబ సభ్యు లు, డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్, కార్పొరేట ర్లు నల్ల స్వరూపారాణి, మిడిదొడ్డి స్వప్న, వీరగంటి రవీందర్, జోరిక రమేష్ పాల్గొన్నారు. -
ఐదు కోట్ల మెుక్కలు నాటాలి
హరితహారంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ: హరితహారంలో జిల్లాలో ఐదు కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మంది రంలో మంగళవారం హరితహారం కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ హరితహారంలో జిల్లా లక్ష్యం 4 నుంచి 5 కోట్ల మొక్కలకు పెరిగిందన్నారు. అధికారులు ప్రణాళికను తయారు చేసుకుని జిల్లాలో విరివిగా మెు క్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. గత ఏడాది హరితహారంలో మన జిల్లా మొదటì æస్థానంలో నిలిచిందన్నారు. ప్ర స్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున అన్ని వర్గాల ప్రజలను మెుక్కలు నాటడంలో భాగస్వాములను చేసి వరంగల్‌ను మరోసారి ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల, వరద కాల్వ ప్రాంతాల్లో, చిన్ననీటి పారుదల శాఖ స్థలాల్లో మొక్కలు పెద్ద ఎత్తున నాటాలన్నారు. డీ గ్రేడెడ్ ఫారెస్టులో యూకలిప్టస్ మెుక్కలను విరివిగా పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి రో డ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఖమ్మం జిల్లా లో మన సరిహద్దు నుంచి రోడ్డుకు ఇరువైపులా మెుక్కలు పెంచారని, మన జిల్లాలో కూడా అదే విధంగా రోడ్లకు ఇరువైపులా పెంచాలన్నారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనని సర్పంచ్‌లకు లేఖలు రాయాలని అధికారులకు సూచించారు. హరితహారంతో జిల్లాను పచ్చదనంతో నింపాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఇంటికి 5 పూలు, 5 పండ్ల మొక్కలు ఇవ్వాలన్నారు. ఈ నెల15 నాటికి ఎంచుకున్న లక్ష్యంలో 80 శాతం పూర్తి చే యాలన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడు తూ ఇప్పటి వరకు జిల్లాలో 2.11 కోట్ల మొక్కలు నాటామని.. 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. 142 ప్రదేశాల్లో 95 శాతం మొక్కలు బతికి ఉన్నాయని తెలిపారు. వచ్చే ఏడాది మొక్కల పెంపకానికి కూడా రెండు రోజుల్లో నర్సరీల వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమీక్షలో జెడ్పీ చైర్పర్సన్ జి. పద్మ, గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు రాజయ్య, కొండా సురేఖ, శంకర్‌నాయ క్, మునిసిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ, మం డల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
హరితహారం నిరంతర ప్రక్రియ
230 కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఖానాపురం : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, వచ్చే ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మరావుపేటలో రెవెన్యూ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పూల్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు ఎకరాల్లో 4,600 మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువును నివారించడానికి వనాలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అడవులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో అడవులు తగ్గుతున్నాయని గ్రహించిన సీఎం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చెన్నయ్య, రవి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అ«ధ్యక్షుడు జగన్మోహన్రావు, ఆర్జేడీ బాలయ్య, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎఫ్ఓ కిష్టాగౌడ్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పది రోజుల్లోగా ప్రవేశాల షెడ్యూలు
ఇంజనీరింగ్‌లో ప్రవేశాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ తేదీలను మరో పది రోజుల్లోగా ఖరారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్టీయూహెచ్ తనిఖీలు పూర్తయ్యాయని, లోపాలపై యాజమాన్యాలకు నోటీసులు పంపిస్తోందని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ శాఖ తనిఖీలు చేపట్టాల్సి ఉందని, అవి పూర్తి కాగానే విజిలెన్స్, జేఎన్టీయూహెచ్ నివేదికలు రెండింటిని పోల్చి చూస్తామని వెల్లడించారు. ఆ తర్వాతే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగానే గురువారం ప్రకటించాల్సిన ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలును వాయిదా వేసినట్లు తెలిపారు. మొత్తానికి ఆగస్టు 1 నాటికి తరగతులను ప్రారంభిస్తామన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. కాలేజీల్లో తనిఖీలు పూర్తయి, వాటిని జేఎన్టీయూహెచ్ నివేదికలతో పోల్చి చూసి అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు చేపట్టేందుకు వెబ్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచుతారు. మొత్తానికి ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో 15 రోజల సమయం పట్టేలా ఉంది. 15 రోజుల్లో చాన్స్లర్లు, వీసీల నియామకాలు వచ్చే 15 రోజుల్లో యూనివర్సిటీలకు చాన్స్లర్లు, ైవె స్ చాన్స్లర్లను నియమించనున్నట్లు కడియం తెలిపారు. దీనికి సంబంధించిన చర్యలు ప్రారంభించామన్నారు. చాన్స్లర్లు, వీసీల పేర్లను ఖరారు చేసి, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేందుకు ఈ సమయం పడుతుందని వివరించారు. -
నామినేటెడ్ పోస్టులపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు మొదలైంది. వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, బోర్డులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీసేందుకు మంత్రుల బృందం కార్యచరణ ప్రారంభించింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సారథ్యంలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విభాగాల వారీగా ఎన్ని కార్పొరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆరా తీశారు. వీటిలో ఎన్నింటికి పాలక మండళ్లు, బోర్డులు ఉన్నాయి? ఖాళీగా ఉన్న పదవుల సంఖ్య ఎంత? తదితర వివరాలన్నీ శుక్రవారం సాయంత్రం లోపు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటి తర్వాతే పార్టీ కమిటీల నియామకాలు దసరా కల్లా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ నెల 8న జరిగిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమించేందుకు రిజర్వేషన్లు ప్రకటించారు. మొత్తం 168 మార్కెట్లలో యాభై శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. వీటి భర్తీ కోసం మంత్రి హరీశ్.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలు, దేవాలయ కమిటీలను కూడా భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చాకే పార్టీ కమిటీలను నియామకాలు ఉంటాయని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులకు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డెరైక్టర్ పోస్టులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. కార్పొరేషన్లు, కమిటీలు, పోస్టుల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చేందుకే మంత్రుల బృందం అధికారులతో సమావేశమైనట్లు సమాచారం. -
‘పాలకుర్తికి ఎన్ని నిధులు తెచ్చిండో చెప్పాలి’
తొర్రూరు : పాలకుర్తి నియోజకవర్గానికి డిప్యూటీ సీఎంగా అనేకసార్లు వచ్చిన కడియం శ్రీహరి ఎన్ని కోట్ల నిధులు తెచ్చిండో ప్రజలకు చెప్పాలని టీటీడీపీ శాసన సభాపక్షనేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి వచ్చిన రూ.25 కోట్లు నిలిపివేసింది నిజం కా దా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి డిప్యూటీ సీఎంగా రోడ్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం, పాలకుర్తి గుట్ట రోడ్డు వంటి వాటికోసం ఇచ్చిన ఒక్క హమీకి కుడా నిధులు కేటాయించకుండా అమలు చేయాలేకపోయాడన్నారు. కేజీ టూ పీజీ వంటి అనేక పథకాలు అమలు చేయాడంలో కడి యం శ్రీహరితోపాటు మంత్రులంత పూర్తిగా విఫలం చెందరన్నారు. ప్రభు త్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా తను పాల్గొనే హక్కు ఉందని, ప్రతి శిలాఫలకంలో ప్రొటోకాల్ ప్రకారం ఉండాలన్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తే స్వాగతిస్తామే తప్ప, వచ్చిన నిధులను అడ్డుకుంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ నాయకులు జాటోతు నేహ్రునాయక్, లింగాల వెంకటనారాయణగౌడ్, రామచంద్రయ్య, ఎన్.ప్రవీణ్‌రావు, నరేందర్‌రెడ్డి, సోమన్న, విక్రంరెడ్డి, అంకూస్, నాగన్న, కిషన్‌యాదవ్, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌రావు, విక్రమ్‌యాదవ్ పాల్గొన్నారు. -
టీచర్లు లేని చోట విద్యా వలంటీర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్లు లేని పాఠశాలల్లో విద్యా వలంటీర్ల(అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల)ను నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 7వేల మందికి పైగా విద్యా వలంటీర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఎంత మంది విద్యా వలంటీర్లు అవసరం, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల స్థాయిల్లో ఎందరు అవసరమన్న వివరాలతో పాఠశాల విద్యాశాఖ ఇదివరకే ప్రభుత్వ ఆమోదం కోసం ఒక ఫైల్‌ను పంపింది. దీనిపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ లెక్కల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా 7వేల మందికి పైగా విద్యా వలంటీర్లు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే అందులో ఎక్కువ శాతం ఖాళీలు మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనే, అది కూడా ఎస్జీటీ స్థాయిలోనే ఉన్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో 623, నల్లగొండలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్ జిల్లాలో 826 ఎస్జీటీ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లుగా గుర్తించింది. అదనంగా ఉన్న ఈ పోస్టులను స్కూళ్లలో ఉంచకుండా డీఈవోల ఆధీనంలోకి తెచ్చింది. మరోవైపు ఈ ఆరు జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలతో పాటు మొత్తం పది జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. 20 రోజుల్లో నియమిస్తాం: కడియం జనగామ: ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల స్థానంలో హైకోర్టు ఆదేశాలకు లోబడి 20 రోజుల్లో విద్యా వలంటీర్లను నియమించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం వరంగల్ జిల్లా జనగామలో తెలిపారు. రేషనలైజేషన్‌లో అవకతవకల ఆరోపణల మేరకు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక పాఠశాలల్లో ఖాళీల భర్తీకి వచ్చే ఏడాది డీఎస్సీ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. -
పుష్కరాల స్ఫూర్తితో ‘మేడారం’
వ్యవసాయూనికి 9 గంటల విద్యుత్ వచ్చే ఖరీఫ్ నుంచి పగటి పూటే సరఫరా గ్రామాల రూపురేఖలు మార్చేందుకే గ్రామజ్యోతి ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ 2 వేల పడకల ఆస్పత్రిగా ఎంజీఎం వచ్చే సంవ త్సరం నుంచి కేజీ టు పీజీ విద్య స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ అర్బన్ : పుష్కరాల స్ఫూర్తితో మేడారం జాతర నిర్వహిస్తామని, మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు, గ్రామ సీమల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీస్ వందనం స్వీకరించి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాం.. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలముందుంచారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి.. అందుకోసం రూ.600 కోట్లతో ఏర్పాట్లు చేసి అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఫిబ్రవరిలో మేడారం జాతర ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జిల్లాలో రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపట ప్రాంతాల్లో రూ.35 కోట్లతో పుష్కర ఘాట్లు నిర్మించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. ఈసారి 25 లక్షల మంది భక్తులు పుణ్యస్నాలు చేసినట్లు తెలిపారు. 17న గ్రామజ్యోతి ప్రారంభం ఈనెల 17న గీసుకొండ మండలం గంగిదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి కడియం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందని అన్నారు. 180 మంది అమరుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసిందన్నారు. ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 5,839 చెరువులకు గాను మొదటి దశలో రూ.409 కోట్లతో 1,173 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి కడియం తెలిపారు. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ఫేస్-2, వరద కాలువలు, కంతనపల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలోని ప్రతీ నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చే స్తోందన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా రానున్న నాలుగేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం ఆసరా పింఛన్ పథకం ప్రారంభించి వికలాంగులకు నెలకు రూ.1500, మిగతా వారికి రూ.1000 ఇస్తూ ఆదుకుంటోందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నామని తెలిపారు. పగటిపూట విద్యుత్ రానున్న ఖరీఫ్‌లో రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు కావల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. అక్టోబర్ నాటికి జిల్లాలో కేటీపీపీ వద్ద మరో 600 మెగావాట్ల విద్యత్ అందుబాటులోలోకి వస్తుందన్నారు. జిల్లాలో రూ.50 కోట్లతో 17 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. 50 యూనిట్ల లోపు విద్యత్ వాడుకున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వమే కరంట్ చార్జీలు చెల్లిస్తోందని.. అందుకోసం రూ.19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. వాటర్ గ్రిడ్‌ను జిల్లాను 5 జోన్లుగా విభజించి రూ.4 వేల కోట్ల ప్రణాళికలతో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉందని శ్రీహరి వివరించారు. నగర అభివృద్ధి వరంగల్ నగరంలో రానున్న 50 ఏళ్ల అవసరాలు గుర్తించి రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. 183 మురికివాడల అభివృద్ధికి రూ.26.45 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.80 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అదేవిదంగా కాళోజి కళాక్షేత్రం నిర్మాణానికి రూ. 15 కోట్లు, రూ.4 కోట్లతో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ ని ర్మించేందకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. నగరం లో 4 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.400 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, అంబేద్కర్‌నగర్, ఎస్సార్‌నగర్‌లలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 1000 పడకల ఆస్పత్రిగా ఉన్న ఎంజీఎం 2 వేల పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించుటకు పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 12 నూతన పీహెచ్సీ భవనాలు, రూ.1.80 కోట్లతో 20 సబ్‌సెంటర్ భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారత మహిళా సాధికారతలో భాగంగా జిల్లాలోని 7,834 మహిళా గ్రూపులకు రూ.162.59 కోట్లతో బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 73 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.50.95 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఐసీడీఎస్ ద్వారా అమలవుతున్న ధనలక్ష్మి పథకం ద్వారా 8,170 మంది లబ్ధిదారులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. జిల్లాలో రహదారులు భవనాల శాఖ ద్వారా రూ.964.38 కోట్లతో 116 పనుల ద్వారా 877 కిలోమీటర్ల రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారి పేట నుంచి మల్లంపల్లికిరూ.158.85 కోట్లతో, పస్రా నుంచి ఏటూరునాగారం వరకు రూ.49.68 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరంలో కేజీ టు పీజీ విద్యను అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కడియం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వాకాటి కరుణ, డీఐజీ మల్లారెడ్డి, సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, జేసీ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వంకర్నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అభివృద్ధికి పునరంకి తమవుదాం హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హన్మకొండలోని ఇన్డోర్ స్టేడియంలో సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఉత్సహబరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో కడియం పాటలు, ఆటలతో సందడి చేశారు. అంత్యాక్షరి, ఆటలు, ప్రసంగాలతో కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతనిధులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో డీఐజీ మల్లారెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అధికారులు, పురజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణలో టీచర్స్ Vs సర్కారు
-
సకాలంలో ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తాం
హైదరాబాద్: హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆయనతో పాటు మండలి ఉన్నతాధికారులు, జేఎన్టీయూ అధికారులు బుధవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసి సుప్రీం గైడ్ లెన్స్ ప్రకారమే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. -
ఆ స్వరం.. నూటికి వెయ్యిశాతం బాబుదే
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు ఆడియో టేపులోని స్వరం నూటికి వెయ్యి శాతం ఏపీ సీఎం చంద్రబాబుదేనని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆయనతో తనకు 30 ఏళ్ల అనుబంధముందని, తప్పు చేసినప్పుడు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్, వణకుతూ ఊగిపోవడం తన అనుభవంలో చాలాసార్లు చూశానన్నారు. ఢిల్లీలో గురువారం శ్రీహరి, ఎంపీ వినోద్ కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతిభద్రతలు, సెక్షను 8 అమలు, గవర్నర్‌కు అధికారాలనేవి అసలు ఇప్పుడు అంశాలు కానేకావన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఫోను ట్యాప్ చేసిందని చంద్రబాబు పచ్చి అబద్దాలాడుతున్నారని, ఆధారాలుంటే ఎందుకు ఫిర్యాదు చేయడంలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోందని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. సాయంత్రం రైల్వేమంత్రి సురేష్ ప్రభును కలిసి కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్-ఛత్తీస్‌గఢ్ నాలుగులేన్ల రహదారి నిర్మాణ పనుల శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. -
ఫీజుల పథకానికి మార్గదర్శకాలు రెడీ!
డిప్యూటీ సీఎం కడియం నేతృత్వంలో సిద్ధమైన గైడ్‌లైన్స్ సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కొత్త మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాయి. ఈ విద్యాసంవత్సరం (2015-16)లో నూతన గైడ్‌లైన్స్‌తో ఫీజుల పథకాన్ని అమలుచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 20వ తేదీ నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉన్నందున ఆ లోగానే వీటిని విడుదల చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. కొత్త మార్గదర్శకాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ కసరత్తును పూర్తిచేసి ఆయా నిబంధనలను రూపొందించింది. ఐదువేల ర్యాంకులపైన పర్సంటేజ్ ఐదు వేల కంటే అధిక ర్యాంకు వచ్చేవారికి ఫీజు చెల్లించే విషయంలో కోర్సుల వారీగా నిర్ణీత కనీస మొత్తాన్ని (మినిమమ్ ఫీజు) చెల్లించడమా? ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సంటేజీ ఫీజును చెల్లించడమా? అన్న కోణంలో ఈ కమిటీ కసరత్తు చేసింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్థారించిన ప్రకారం ఒక కాలేజీలో రూ. లక్ష ఉంటే.. మరో కాలేజీలో రూ. 25 వేలే ఉంది. ఈ పరిస్థితుల్లో కనీస కోర్సులో కనీస ఫీజు (మినిమమ్) చెల్లించడం కంటే ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సెంటేజీ ఫీజునే ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యార్థుల స్థానికత నిర్థారణకు మాత్రం రాజ్యాంగంలోని 371-డీ ప్రకారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతినెలా విద్యార్థుల అటెండెన్స్ పరిశీలన ప్రతినెలా తప్పనిసరిగా విద్యార్థుల అటెండెన్స్‌ను పంపితేనే స్కాలర్షిప్లు చెల్లించాలని భావిస్తోంది. వీరి అటెండెన్స్ 75 శాతానికి తగ్గకుండా ఉంటే... ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలోనే నేరుగా ఆ డబ్బును జమచేయాలని, ఇతర విద్యార్థులకు ఆయా కాలేజీల అకౌంట్లకు డబ్బు పంపించాలనే ఆలోచనతో ఉంది. ఎంసెట్‌లో 5వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది(ఉమ్మడి రాష్ట్రంలో పదివేల ర్యాంకు వరకు ఉండేది). కోర్సుల వారీగా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించే ఫీజులపై సీలింగ్ విధించాలని భావిస్తోంది. -
ప్రజల ఆకాంక్ష మేరకు పనులు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొరిపెల్లి (కొడ కండ్ల) : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలో ని కొరిపెల్లి పెద్దచెరువు పూడికతీత పనులు, ఆర్సీ తండా నుంచి పోచారం వరకు రూ.1.40 కోట్లతో నిర్మించే బీటీరోడ్డు పనులకు శుక్రవారం కడియం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో రాజకీయూలకతీ తంగా భాగస్వాములు కావాలన్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ అర్థంలేని విమర్శలు చేస్తున్నాడని అన్నారు. కొరపెల్లి యూపీఎస్‌కు కాంపౌం డ్‌వాల్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు, కొరిపెల్లి చెరువుకట్ట నుంచి రం గాపురానికి రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణా న్ని ఏడాదిలోగా చేరుుస్తానని కడియం హామీ ఇచ్చారు. వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేసేందుకు 15 రోజుల్లో 10 కరెంట్ స్తంభాలు ఇప్పిస్తానని, గొలుసుకట్టు చెరువుల ఫీడర్‌చానల్ నిర్మాణాన్ని వచ్చే సీజన్ కల్లా పూర్తి చేరుుస్తానని, మండలకేంద్రంలో ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుతోపాటు జూనియర్ కళాశాలకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములై చెరువులు అభివృద్ధి చేసుకోవాలని, జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ సంబరాలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్రావు, ఎంపీపీ భానోత్ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యురాలు బాకి లలిత, ఐబీ ఎస్ఈ పద్మారావు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ విశ్వనాథుల జ్ఞానేశ్వరాచారి, తహసీల్దార్ నారాయణ, కొరిపెల్లి సర్పంచ్ జ్ఞానేశ్వరుచారి పాల్గొన్నారు. -
కడియం, ఎర్రబెల్లి వాగ్వాదం
⇒ ఆంధ్రావాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్నారన్న కడియం ⇒ నీవు ఆంధ్రా పార్టీలో పని చేయలేదా... కూర్చో అన్న ఎర్రబెల్లి రాయపర్తి: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీటీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆది వారం వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపల్లి పెద్దచెరువు పూడికతీత పనుల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పనులను ప్రారంభించి మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే దయాకర్‌రావు వచ్చారు. వెంటనే ఆయనను సభావేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయను ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లులో తనను దూషిస్తూ మాట్లాడడం సరికాదని కడియంను ఉద్దేశించి ఎర్రబెల్లి అన్నారు. తర్వాత దీనిపై డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ ‘ఏనుగల్లులో మాట్లాడింది నిజమే... అప్పుడు అదే మాట్లాడాను ఇప్పుడు అదే మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇంకా ఆంధ్రావాళ్ల మోచేతినీళ్లు తాగుతూ ఉన్నవాళ్లు ఉన్నారని అన్నా’నని చెబుతుండగా వెంటనే ఎర్రబెల్లి లేచి ‘నీవు ఆంధ్రాపార్టీలో పని చేయలేదా.. ఏం మాట్లాడుతున్నావ్.. కూర్చో’ అన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు ‘జై తెలుగుదేశం’ అని నినాదాలు చేయడంతో వాగ్వాదం నిలిచిపోయింది. -
ఫీజుల చెల్లింపుల్లో ఇబ్బంది వాస్తవమే
విద్యా సంవత్సరం పూర్తికాక ముందే చెల్లిస్తాం: కడియం ఆ 26 బీసీ కులాల విద్యార్థులకు కోర్సుల కొనసాగింపు కోసం ఫీజులు వచ్చే ఏడాది కోసం కొత్త విధానం రూపకల్పన ప్రతి జిల్లాకో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం కారణంగా విద్యార్థులు, కళాశాలలకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అంగీకరించారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పూర్తికాక ముందే విడతల వారీగా ఫీజులు విడుదల చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్(బీజేపీ), కొప్పుల ఈశ్వర్(టీఆర్ఎస్), భట్టి విక్రమార్క(కాంగ్రెస్) తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చారు. గ్రేడింగ్ విధానం వల్ల ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు వేర్వేరుగా ఉన్నా, అందుకు తగ్గట్లు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామన్నారు. 10 వేలకు లోపు ర్యాంకులు సాధించిన బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు సైతం పూర్తి ఫీజులు చెల్లిస్తామన్నారు. విద్యార్థుల స్థానికత నిర్ధారణ కోసం 371డీ ఆర్టికల్ అమలు మినహా ఈ సంవత్సరం ఫీజుల పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, కళాశాలలకు ఇబ్బంది కలగకుండా ఫీజుల పథకానికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 15.77 లక్షల విద్యార్థులకు సుమారు రూ.2,300 కోట్ల ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. బీసీ కులాల జాబితా నుంచి 26 కులాలను తొలగించినా.. ఇప్పటికే ప్రవేశాలు పొందిన ఆ కులాల విద్యార్థులకు సంబంధిత కోర్సులు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లిస్తామన్నారు. హైదరాబాద్‌లో విద్యార్థులకు కుల సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేయగా.. ఇబ్బందులు తొలగిస్తామని కడియం హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కేజ్ కల్చర్‌లో చేపల సాగు: పోచారం రాష్ట్రంలో కేజ్ కల్చర్ విధానంలో మత్స్య సంపద పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. జార్ఖంఢ్లోని చండియా జలాశయంలో విజయవంతమైన ఈ కేజ్ కల్చర్ విధానంపై స్వయంగా అధ్యయనం చేయగా లాభసాటిగా ఉన్నట్టు తేలిందన్నారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది కోయిల్‌సాగర్, లోయర్ మానేరు, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టుల్లో కేజ్ కల్చర్ విధానంలో చేపల సాగును ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. మత్స్య కారుల అంశంపై చిలమల మదన్‌రెడ్డి(టీఆర్ఎస్) అడిగిన ప్రశ్నకు మంత్రి పోచారం ఈ మేరకు సమాధానమిచ్చారు. మెట్రో విస్తరణపై ఆలోచన: తుమ్మల హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఏడు మార్గాల్లో పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్‌నగర్, ఫలక్‌నుమా-శంషాబాద్, తార్నాక-ఈసీఐఎల్, నాగోల్-ఎల్.బి.నగర్-ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు మార్గాల్లో మెట్రో పొడిగింపుపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెట్రోపై టీఆర్ఎస్ సభ్యులు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌తో పాటు కె.లక్ష్మణ్ (బీజేపీ), ముంతాజ్ అహమ్మద్ ఖాన్(ఎంఐఎం) తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. 2017 జూలై లోగా మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. నాగోల్-మెట్టుగూడ మార్గంలో ఉగాది రోజున ప్రారంభం కావాల్సిన మెట్రో రైలు సర్వీసును నిర్మాణ సంస్థే వాయిదా వేసుకుందన్నారు. సికింద్రాబాద్ వరకు లైను పొడిగించిన తర్వాత సేవలను ప్రారంభించాలని నిర్ణయించిందన్నారు. -
తాజా - మాజీల అలయ్.. బలయ్!
వరంగల్: ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఇలా అలయ్.. బలయ్ ఇచ్చుకున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల శాసనమండలి ఎన్నికల సందర్భంగా హన్మకొండలో ఆదివారం నిర్వహించిన సభలో ఈ దృశ్యం చోటుచేసుకుంది. గతం నుంచే అంటీముట్టనట్లుగా ఉండే రాజయ్య, శ్రీహరిల మధ్య.. ఇటీవలి పరిణామాలతో ఇంకాస్త దూరం పెరిగింది. పదవీచ్యుతుడైన తర్వాత డాక్టర్ రాజయ్య తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పరోక్షంగా హెచ్చరికలు సైతం చేశారు. ‘నా నియోజకవర్గంలో వేలుపెడితే సహించేది లేదు.. రుద్రశక్తినవుతా’ అని ఘాటుగా ప్రసంగించారు. ఈ క్రమంలో ఇద్దరూ షేక్హ్యాండ్తోపాటు అలయ్.. బలయ్ ఇచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
బంగారు తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
వరంగల్: 60 ఏళ్ల ప్రజల ఆకాంక్ష, ఎంతో మంది మేధావుల కల, అమరవీరుల ఆత్మబలిదానాలతో దక్కించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాపత్ర యం పడుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో రకాల దోపిడీకి గురైన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతోనే ప్రణాళికలను రూపొందిస్తున్నారన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల శాసనమండలి ఎన్నికల సందర్భంగా హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన సభలో శ్రీహరి ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎంగా కేసీఆర్ తొమ్మిది నెలల పాలనపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఎలా దోపిడీకి గురైందన్న విషయాలను పట్టభద్రులకు తెలియజెప్పి కేసీఆర్ ఆశ్వీర్వాదంతో ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజేశ్వర్‌రెడ్డి ధర్మసాగర్ మండలం సోడషపల్లిలో పుట్టి, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యనభ్యసించి, ఉన్నత విద్య హైదరాబాద్‌లో పూర్తి చేసి, నల్లగొండలో విద్యాసంస్థలను నెలకొల్పి, ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేసిన విషయాలను పట్టభద్రుల ఓటర్లకు విశదీకరించాల్సిన బాధ్యత తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌పై ఉందన్నారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వర్గానికి ప్రయోజనాలు కల్పిస్తున్న గొప్ప వ్యక్తి కే సీఆర్ అని కొనియాడారు. నేటి విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందని, దీన్ని ప్రక్షాళన చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. తెలంగాణలోని పేద బిడ్డకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు విద్యావేతలతో చర్చిస్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నామన్నారు. సీఎం ఆమోదించిన అనంతరం జిల్లాల వారిగా సమీక్షలు ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం ఈ బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. 2018 చివరి నాటికి ప్రతి ఇంటికి నీరు అందించకుంటే ఎన్నికలకు పోను అన్న సీఎంను మొదటిసారిగా చూశామన్నారు. సన్నాహక సమావేశంలో విద్యావేత్తలు, సంఘాల నాయకుల సూచనలు తీసుకోలేకపోయిందుకు క్షమించాలన్నారు. మొదటి వారంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు అందరి సూచనలు తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. అంధ్రావాళ్లను తరిమికొట్టి రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా...ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని, అందుకోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నావంతు పాత్ర ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటిలో నిర్వహించిన యాత్రలో అరెస్టు అయినట్లు తెలిపారు. 11కేసులు, 22 సెక్షన్లు పెట్టి చంచల్‌గూడ జైల్లో విద్యార్థి జేఏసీతో కలిసి ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థలు అంటే వ్యాపారం నిజం అయినప్పటికీ... కాలేజీలు స్థాపించి 1500మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. సోషలిజం వచ్చి ప్రైవేటు సంస్థలను జాతీయం చేయాలంటే ముందు వరసలో తాను ఉంటానన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవీ ఉన్నప్పుడే టీఆర్ఎస్లో చేరానని, పదవీ లేకున్నా కేసీఆర్ సూచనలే శిరోధార్యంగా ముందుకు వెళతానని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాజే శ్వర్రెడ్డిని గెలిపించాలని జెడ్పీ చైర్పర్సన్ పద్మ కోరారు. పార్టీలోని నేతలు, పట్టభధ్రులు, తెలంగాణ సంఘాల నేతలంతా ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేసుకుంటూ రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని మాజీ జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు అన్నారు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, కొండా సురేఖ, అరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యీ సత్యవతి రాథోడ్, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్యయాదవ్, అర్భన్ పార్టీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, ఎల్లావుల లలితాయాదవ్, వాసుదేవరెడ్డి, జోరుక రమేష్‌లతో పాటు పలువురు నాయకులు, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
'కొందరు తప్పుడు కూతలు కూస్తున్నారు'
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. తాను డిప్యూటీ సీఎం కావడం నచ్చకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొందరు తప్పుడు మనుషులు.. తప్పుడు కూతలు కూస్తున్నారని ... చిత్తశుద్ధితో పని చేసే వ్యక్తిని అని, తాను తప్పు చేసే వ్యక్తిని కాదని.. తప్పు చేస్తే ఉరి శిక్షకు అయినా సిద్ధమేనన్నారు. తాను మాదిగ ఉప కులానికి చెందిన వ్యక్తిని అని ఆయన స్పష్టం చేశారు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందనే అసూయతోనే కొందరు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. కాగా కడియం శ్రీహరి ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.