'కొందరు తప్పుడు కూతలు కూస్తున్నారు' | kadiyam srihari against motkupalli statement | Sakshi
Sakshi News home page

'కొందరు తప్పుడు కూతలు కూస్తున్నారు'

Published Thu, Jan 29 2015 9:33 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

'కొందరు తప్పుడు కూతలు కూస్తున్నారు' - Sakshi

'కొందరు తప్పుడు కూతలు కూస్తున్నారు'

హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు  ఆరోపణలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. తాను డిప్యూటీ సీఎం కావడం నచ్చకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొందరు తప్పుడు మనుషులు.. తప్పుడు కూతలు కూస్తున్నారని ... చిత్తశుద్ధితో పని చేసే వ్యక్తిని అని, తాను తప్పు చేసే వ్యక్తిని కాదని.. తప్పు చేస్తే ఉరి శిక్షకు అయినా సిద్ధమేనన్నారు.

తాను మాదిగ ఉప కులానికి చెందిన వ్యక్తిని అని ఆయన స్పష్టం చేశారు   తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందనే అసూయతోనే కొందరు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. కాగా కడియం శ్రీహరి ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement