తొర్రూరు : పాలకుర్తి నియోజకవర్గానికి డిప్యూటీ సీఎంగా అనేకసార్లు వచ్చిన కడియం శ్రీహరి ఎన్ని కోట్ల నిధులు తెచ్చిండో ప్రజలకు చెప్పాలని టీటీడీపీ శాసన సభాపక్షనేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి వచ్చిన రూ.25 కోట్లు నిలిపివేసింది నిజం కా దా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి డిప్యూటీ సీఎంగా రోడ్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం, పాలకుర్తి గుట్ట రోడ్డు వంటి వాటికోసం ఇచ్చిన ఒక్క హమీకి కుడా నిధులు కేటాయించకుండా అమలు చేయాలేకపోయాడన్నారు.
కేజీ టూ పీజీ వంటి అనేక పథకాలు అమలు చేయాడంలో కడి యం శ్రీహరితోపాటు మంత్రులంత పూర్తిగా విఫలం చెందరన్నారు. ప్రభు త్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా తను పాల్గొనే హక్కు ఉందని, ప్రతి శిలాఫలకంలో ప్రొటోకాల్ ప్రకారం ఉండాలన్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తే స్వాగతిస్తామే తప్ప, వచ్చిన నిధులను అడ్డుకుంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ నాయకులు జాటోతు నేహ్రునాయక్, లింగాల వెంకటనారాయణగౌడ్, రామచంద్రయ్య, ఎన్.ప్రవీణ్‌రావు, నరేందర్‌రెడ్డి, సోమన్న, విక్రంరెడ్డి, అంకూస్, నాగన్న, కిషన్‌యాదవ్, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌రావు, విక్రమ్‌యాదవ్ పాల్గొన్నారు.
‘పాలకుర్తికి ఎన్ని నిధులు తెచ్చిండో చెప్పాలి’
Published Wed, Aug 26 2015 2:35 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement