MLA ERRABELLI dayakarravu
-
ఏడాదిలో అన్ని చెరువుల్లోకి గోదావరి నీరు
► చెరువుల బాగుతోనే గ్రామాలకుమహర్దశ ► రెండో విడత ‘మిషన్ కాకతీయ’ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి కొడకండ్ల : ఏడాదిలోగా నియోజకవర్గ వ్యాప్తం గా అన్ని చెరువుల్లోకి గోదావరి జలాలు చేరేలా కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని మొండ్రాయి, లక్ష్మక్కపెల్లి, రామవరం, కొడకండ్ల, కొరిపెల్లి గ్రామాల్లోని చెరువుల్లో రెండో విడత మిషన్ కాకతీయ కింద పూడిక తీత పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దయూకర్‌రావు మాట్లాడుతూ గడిచిన ఏడేళ్లలో ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేకపోయానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాలకుర్తిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ది పధంలో పయనింపజేసేందుకు టీ ఆర్ఎస్లో చేరాన ని అన్నారు. గతంలో పాల కుర్తి ప్రాంతంలో ప్రణాళికలు లేకుండా సాగునీటి కాల్వలు నిర్మించడం ద్వారా చెరువుల్లోకి నీరు రాని పరిస్థితి ఉందని, అందుకే ప్రణాళిక ప్రకారం అవకాశాలను బట్టి ప్రతీ చెరువును దేవాదుల ద్వారా గోదావరి జలాలలో నింపేం దుకు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సహకారంతో కృషి చేసున్నట్లు తెలిపారు. వాటర్‌గ్రిడ్ ట్యాం క్ల నిర్మాణం ఆలస్యమైతే, డెరైక్ట్ పంపింగ్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి సరఫరా, చెరువులను గోదావరి జలాలతో నింపడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ బానోత్ జ్యోతి, జెడ్పీటీసీ బాకీ లలిత, సర్పంచ్, ఎంపీటీసీలు దౌపాటి నర్సయ్య, కాటూరి సుశీల, సిందె నిర్మల, విజయమ్మ, జ్ఞానేశ్వరాచారి, ధీకొండ రమేష్, బొబ్బిలి కోమలత, వాంకుడోత్ పుల్సీంగ్నాయక్, యాట ప్రసేన్కుమార్, మోర్తాల రమ, గుగులోత్ సుభద్ర, నాయకులు గాంధీనాయక్, రామచంద్రయ్య శర్మ, యాదగిరిరావు, సల్దండి సుధాకర్, పేరం రాము, రాజిరెడ్డి, రాధాకృష్ణ, పసునూరి మధు, సోమ రాములు, గునిగంటి వెంకటేశ్వర్రావు, సిందె రామోజీ, వేముల వెంకన్న పాల్గొన్నారు. -
4న దేవరుప్పులకు హరీశ్‌రావు రాక
► మంత్రి పర్యటనను విజయవంతం చేయూలి ► ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దేవరుప్పుల : పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఈనెల 4వ తేదీన మంత్రి హరీశ్‌రావు దేవరుప్పులకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దయాకర్‌రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల నల్లకుంట చెరువులో తలపెట్టిన మిషన్ కాకతీయ చెరువు పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మండల టీఆర్ఎస్ నాయకులతో సమీక్ష జరిపారు. తాగు, సాగు నీరు అందించి పాలకుర్తిని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలో భాగంగానే మంత్రి హరీశ్‌రావు పర్యటన ఖరారు అయినట్లు పేర్కొన్నారు. దేవరుప్పులకు వచ్చే దేవాదుల కాల్వ నీరును చెరువులు నింపేందుకు తూములు, వాగు పరివాహాక ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు కోసం చెక్‌డ్యామ్‌లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు ఊరూరా పంచాయతీ తీర్మానాల ద్వారా వినతి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానని, త్వరలో సమన్వయ కమిటీల నియమాకం చేపడుతానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఈదునూరి న ర్సింహరెడ్డి, మొలుగూరి రమేష్, బస్వ మల్లేశం, ఎంపీపీ సోమనర్సమ్మ, వైస్ ఎంపీపీ సోమయ్య, నాయకులు సాయిలు, మేకపోతుల ఆంజనేయులు, సోమనర్సయ్య, బిక్షపతి, జలంధర్‌రెడ్డి, వెంకన్న సర్పంచ్‌లు సునిత, హన్మంతు, భీముడు, భీమ్లా, వజ్రమ్మ, నర్సింహ్మరెడ్డి, సోమయ్య పాల్గొన్నారు. -
‘పాలకుర్తికి ఎన్ని నిధులు తెచ్చిండో చెప్పాలి’
తొర్రూరు : పాలకుర్తి నియోజకవర్గానికి డిప్యూటీ సీఎంగా అనేకసార్లు వచ్చిన కడియం శ్రీహరి ఎన్ని కోట్ల నిధులు తెచ్చిండో ప్రజలకు చెప్పాలని టీటీడీపీ శాసన సభాపక్షనేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి వచ్చిన రూ.25 కోట్లు నిలిపివేసింది నిజం కా దా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి డిప్యూటీ సీఎంగా రోడ్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం, పాలకుర్తి గుట్ట రోడ్డు వంటి వాటికోసం ఇచ్చిన ఒక్క హమీకి కుడా నిధులు కేటాయించకుండా అమలు చేయాలేకపోయాడన్నారు. కేజీ టూ పీజీ వంటి అనేక పథకాలు అమలు చేయాడంలో కడి యం శ్రీహరితోపాటు మంత్రులంత పూర్తిగా విఫలం చెందరన్నారు. ప్రభు త్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా తను పాల్గొనే హక్కు ఉందని, ప్రతి శిలాఫలకంలో ప్రొటోకాల్ ప్రకారం ఉండాలన్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తే స్వాగతిస్తామే తప్ప, వచ్చిన నిధులను అడ్డుకుంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ నాయకులు జాటోతు నేహ్రునాయక్, లింగాల వెంకటనారాయణగౌడ్, రామచంద్రయ్య, ఎన్.ప్రవీణ్‌రావు, నరేందర్‌రెడ్డి, సోమన్న, విక్రంరెడ్డి, అంకూస్, నాగన్న, కిషన్‌యాదవ్, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌రావు, విక్రమ్‌యాదవ్ పాల్గొన్నారు. -
ఇంత దారుణమా..?
పంజగుట్ట,న్యూస్‌లైన్: వెంకటరమణకాలనీలోని వివాదాస్పద పార్కు విషయమై అసెంబ్లీలో చర్చించి తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధే దోచుకోవడం దారుణమని వాపోయారు. ఆదివారం పంజగుట్ట డివిజన్ వెంకటరమణకాలనీ కబ్జాకు గురైన పార్కును అఖిలపక్ష నాయకులు, ప్రజా, కులసంఘాల నాయకులు సందర్శించారు. అనంతరం కమ్యూనిటీ హాల్లోసమావేశం నిర్వహిం చారు. దీనికి ఎర్రబెల్లితోపాటు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, మాజీఎంపీ మధు, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త పి.విజయారెడ్డి, లోక్‌సత్తా పార్టీ నగర అధ్యక్షుడు దోసపాటి రాము, మాలమహానాడు తెలంగాణ జిల్లాల ఇన్చార్జి పాలడుగు అనిల్‌కుమార్, మాలలసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, బీజేపీ నాయకురాలు ఛాయాదేవి, అమ్ఆద్మీ పార్టీ నాయకులు, యూత్ ఫర్ బెటర్ హైదరాబాద్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఈ పార్కు విషయమై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కాలనీవాసులకు న్యాయం జరిగేలా పోరాడుతానని భరోసాఇచ్చారు. దత్తాత్రేయ మాట్లాడుతూ నగరంలో కబ్జావుతున్న పార్కులు,శ్మశానవాటికలు, ప్రభుత్వ స్థలాల వివరాలు సేకరించి ప్రజాప్రతినిధులంతా కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లను కలుస్తామని చెప్పారు. మాజీఎంపీ మధు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధి పార్కును కబ్జా చేస్తుంటే..నగరానికి చెందిన ఓ మంత్రి ఆయనకు వత్తాసు పలకడం హేయమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ పార్కు స్థలాన్ని వెంటనే శుభ్రం చేయిస్తానని టీవీ చానెల్లో బహిరంగంగా చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని వాపోయారు.