ఏడాదిలో అన్ని చెరువుల్లోకి గోదావరి నీరు
► చెరువుల బాగుతోనే గ్రామాలకుమహర్దశ
► రెండో విడత ‘మిషన్ కాకతీయ’ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి
కొడకండ్ల : ఏడాదిలోగా నియోజకవర్గ వ్యాప్తం గా అన్ని చెరువుల్లోకి గోదావరి జలాలు చేరేలా కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని మొండ్రాయి, లక్ష్మక్కపెల్లి, రామవరం, కొడకండ్ల, కొరిపెల్లి గ్రామాల్లోని చెరువుల్లో రెండో విడత మిషన్ కాకతీయ కింద పూడిక తీత పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దయూకర్‌రావు మాట్లాడుతూ గడిచిన ఏడేళ్లలో ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేకపోయానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పాలకుర్తిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ది పధంలో పయనింపజేసేందుకు టీ ఆర్‌ఎస్‌లో చేరాన ని అన్నారు. గతంలో పాల కుర్తి ప్రాంతంలో ప్రణాళికలు లేకుండా సాగునీటి కాల్వలు నిర్మించడం ద్వారా చెరువుల్లోకి నీరు రాని పరిస్థితి ఉందని, అందుకే ప్రణాళిక ప్రకారం అవకాశాలను బట్టి ప్రతీ చెరువును దేవాదుల ద్వారా గోదావరి జలాలలో నింపేం దుకు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సహకారంతో కృషి చేసున్నట్లు తెలిపారు. వాటర్‌గ్రిడ్ ట్యాం క్‌ల నిర్మాణం ఆలస్యమైతే, డెరైక్ట్ పంపింగ్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి సరఫరా, చెరువులను గోదావరి జలాలతో నింపడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో ఎంపీ పీ బానోత్ జ్యోతి, జెడ్పీటీసీ బాకీ లలిత, సర్పంచ్, ఎంపీటీసీలు దౌపాటి నర్సయ్య, కాటూరి సుశీల, సిందె నిర్మల, విజయమ్మ, జ్ఞానేశ్వరాచారి, ధీకొండ రమేష్, బొబ్బిలి కోమలత, వాంకుడోత్ పుల్సీంగ్‌నాయక్, యాట ప్రసేన్‌కుమార్, మోర్తాల రమ, గుగులోత్ సుభద్ర, నాయకులు గాంధీనాయక్, రామచంద్రయ్య శర్మ, యాదగిరిరావు, సల్దండి సుధాకర్, పేరం రాము, రాజిరెడ్డి, రాధాకృష్ణ, పసునూరి మధు, సోమ రాములు, గునిగంటి వెంకటేశ్వర్‌రావు, సిందె రామోజీ, వేముల వెంకన్న పాల్గొన్నారు.