ప్రజల ఆకాంక్ష మేరకు పనులు | works according to the expectation of the public | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్ష మేరకు పనులు

Published Sat, May 30 2015 2:41 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

works according to the expectation of the public

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  కొరిపెల్లి (కొడ కండ్ల) : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలో ని కొరిపెల్లి పెద్దచెరువు పూడికతీత పనులు, ఆర్‌సీ తండా నుంచి పోచారం వరకు రూ.1.40 కోట్లతో నిర్మించే బీటీరోడ్డు పనులకు శుక్రవారం కడియం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో రాజకీయూలకతీ తంగా భాగస్వాములు కావాలన్నారు.

 టీడీపీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ అర్థంలేని విమర్శలు చేస్తున్నాడని అన్నారు. కొరపెల్లి యూపీఎస్‌కు కాంపౌం డ్‌వాల్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు, కొరిపెల్లి చెరువుకట్ట నుంచి రం గాపురానికి రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణా న్ని ఏడాదిలోగా చేరుుస్తానని కడియం హామీ ఇచ్చారు. వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేసేందుకు 15 రోజుల్లో 10 కరెంట్ స్తంభాలు ఇప్పిస్తానని, గొలుసుకట్టు చెరువుల ఫీడర్‌చానల్ నిర్మాణాన్ని వచ్చే సీజన్ కల్లా పూర్తి చేరుుస్తానని, మండలకేంద్రంలో ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుతోపాటు జూనియర్ కళాశాలకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు.

జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములై చెరువులు అభివృద్ధి చేసుకోవాలని, జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ సంబరాలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్‌రావు, ఎంపీపీ భానోత్ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యురాలు బాకి లలిత, ఐబీ ఎస్‌ఈ పద్మారావు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ విశ్వనాథుల జ్ఞానేశ్వరాచారి, తహసీల్దార్ నారాయణ, కొరిపెల్లి సర్పంచ్ జ్ఞానేశ్వరుచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement