Mission Kakatiya Works
-
ఆహ్లాదం.. వేగిరం
నీటివనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసాతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చేపట్టిన మినీ ట్యాంక్బండ్ల నిర్మాణాలు జిల్లాలో పూర్తికావొచ్చాయి. సివిల్ వర్క్స్ పూర్తి కాగా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తుదిమెరుగులు దిద్దనున్నారు. మరో నెల, రెండు నెలల్లో అంటే వర్షాకాలంలో మెతుకు సీమ ఆహ్లాదసీమగా మారనుంది. దీంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, మెదక్ : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రతిష్టాత్మకంగా మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్న పెద్ద చెరువులను ఎంపిక చేసి.. విడతల వారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కేంద్రం, మెదక్ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్‌బండ్ పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. దీంతోపాటు నర్సాపూర్‌లోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. సకాలంలో వర్షాలు కురిస్తే... జూన్ లేదా జూలై నుంచి ప్రతి రోజూ ‘మినీ’జాతరేనని అధికారులు భావిస్తున్నారు. పిట్లం, గోసముద్రం కలిపి.. మెదక్ పట్టణ సమీపంలోని పిట్లం, గోసముద్రం చెరువులు రెండింటినీ కలిపి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు 2016లో అనుమతులు వచ్చాయి. ఈ మేరకు రూ.9.52 కోట్లు మంజూరు కాగా.. మిషన్ కాకతీయ పథకంలో సివిల్ వర్క్స్ చేపట్టారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల వ్యయమైనట్లు అధికారులు చెబుతున్నారు. కట్టల బలోపేతం, వెడల్పు, జంక్షన్ పాయింట్ల నిర్మాణాలు చేశారు. కట్టపైన రెయిలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ లెక్కన సివిల్ వర్క్స్ పూర్తయినట్లే. ఆ తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రీనరీ, అలంకరణ, వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఇది పూర్తయితే పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి వచ్చినట్లే. మల్లెచెరువుకు మహర్దశ మరోవైపు మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో ఉన్న మల్లెచెరువును సైతం మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొదటి దఫాలో రూ.3 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కాగా.. పనులు గత నెలలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కట్టపై బ్రిడ్జి నిర్మాణంతోపాటు కట్ట వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఇది కూడా నెల, రెండు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే పట్టణ ప్రజలకు ప్రధానంగా మురికి నీటి సమస్య తొలగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది. ‘రాయరావు’ అందం చూడతరమా.. నర్సాపూర్ నియోజకవర్గంలోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్‌కు తొలివిడతగా రూ.2.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువు కట్ట బలోపేతం, పంట కాల్వల నిర్మాణంతోపాటు బతుకమ్మ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నర్సాపూర్‌కు చెందిన జెడ్పీ చైర్పర్సన్ రాజమణిమురళీధర్ యాదవ్ దంపతులు తమ కుమారుడు అజయ్ యాదవ్ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో చెరువు కట్టపై పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం సహకారంతో కట్టపై విద్యుద్దీకరణ, వాకింగ్ ట్రాక్, కట్టపై గ్రిల్స్ ఏర్పాటు, మొక్కలు నాటడం, బెంచీల ఏర్పాటు, ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ పూర్తి కాగా.. మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించే యోచనలో ఉన్నారు. కౌడిపల్లి చెరువు.. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలోని పెద్దచెరువును సైతం మినీట్యాంక్ బండ్‌గా మార్చే పనులు సాగుతున్నాయి. గతంలోనే రూ.4 కోట్లు మంజూరు కాగా.. కట్ట బలోపేతం వంటి తదితర పనులు చేపట్టారు. కట్టపై సీసీ రోడ్డు నిర్మాణం తదితర పనులు అలాగే ఉన్నాయి. ఇది మిషన్ కాకతీయ పథకంలో లేనందున నిధుల లేమి సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తూప్రాన్ పెద్దచెరువు.. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్ మండలం జిల్లాల విభజనలో మెదక్‌లో చేరింది. ఇక్కడ పెద్దచెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చాలని సంకల్పించారు. రూ.7 కోట్ల వ్యయంతో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. తాజాగా.. మినీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు రూ.4 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నిధులు విడుదల కాగానే.. మిగిలిన పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
‘పెండింగ్ ’ పరుగులు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ క్షణమైనా ప్రభుత్వ రద్దు నిర్ణయం వెలువడనుందన్న సమాచారం నేప థ్యంలో.. నీటి పారుదల శాఖలో పెండింగ్ ఫైళ్లకు అనుమతులు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తమ నియోజకవర్గంలోని పనులను ఆ మోదించాలని ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అధికారులు ఫైళ్ల దుమ్ముదులిపారు. బుధవారం ఒక్కరోజే నీటి పారుదల శాఖలో ఏకంగా రూ.7,829 కోట్ల విలువైన పనులను కేబినెట్లో పెట్టి ఆమోదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఇందులో ఆరు ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఆరు ఎత్తిపోతల పథకాలు.. గురువారం ప్రభుత్వ రద్దు ఖాయమనే ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులన్నీ క్లియర్ చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. ఇక ఆయా శాఖల పరిధిలో ఉన్న పెండింగ్ ఫైళ్లను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నీటి పారుదల శాఖపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను ప్రభుత్వానికి పంపేలా చేశారు. నల్లగొండ జిల్లాలోని అయిటిపాముల ఎత్తిపోతల పథకాన్ని ఆమోదించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరగా.. అధికారులు రూ.111 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మరో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఒత్తిడి మేరకు బొత్తలపాలెం–వాడపల్లి ఎత్తిపోతలను రూ.241 కోట్లు, కేశవపురం–కొండ్రపోల్ ఎత్తిపోతలకు రూ.77.25 కోట్లు, దున్నపోతుల గండి ఎత్తిపోతలకు రూ.249 కోట్లతో ప్రతిపాదనలను అధికారులు కేబినెట్ ఆమోదం కోసం పంపారు. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ కాల్వలపై జకోరా, చండూరు ఎత్తిపోతలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు. జకోరాను రూ.40 కోట్లు, చండూరును రూ.22.94 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. ఇదే జిల్లాలో రూ.476 కోట్లతో జూకల్ నియోజకవర్గంలో మంజీరా ఎత్తిపోతలకు మంగళవారమే ప్రభుత్వం అనుమతించింది. 47 రిజర్వాయర్లు.. రూ.4,179 కోట్లు గద్వాల నియోజకవర్గంలో గట్టు ఎత్తిపోతల పథకంలో 4 టీఎంసీల సామర్ధ్యంతో పెంచికల్ పహాడ్ రిజర్వాయర్ నిర్మించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో రూ.1,597 కోట్ల కొత్త అంచనాతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. దీంతో పాటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కొత్తగా 47 ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను 16.11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదనలు రాగా, వీటికి ఏకంగా రూ.4,179 కోట్లతో అంచనా వేశారు. ఇందులో ఏకంగా కాల్వల నిర్మాణానికే రూ.1,276 కోట్లు ప్రతిపాదించగా, వీటికి కేబినెట్ ఆమోదం రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దిగువన పూర్వ మెదక్ జిల్లాలో 1.26 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే సంగారెడ్డి కెనాల్ వ్యవస్థ కోసం వేసిన అంచనాలు కేబినెట్ ఆమోదం కోసం పంపారు. రూ.1,326.34 కోట్లతో అంచనాలు సిద్ధం చేయగా, వీటిని కేబినెట్ ఆమోదిస్తే, మూడు రీచ్‌లుగా విడగొట్టి పనులకు టెండర్లు పిలిచేందుకు నీటి పారుదల శాఖ సమాయత్తమైంది. ఈ పనులకు సంబంధించి గురువారం నాటి కేబినెట్ భేటీలో చర్చ జరిగితే.. ఆమోదం లాంఛనమే అని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. పలు ఎత్తిపోతల పథకాలకు నిధులు బుధవారం రాత్రి పలు ఎత్తిపోతల పథకాలు, వాటి పరిధిలోని పనులకు సంబంధించి జీవోలు వెలువడ్డాయి. వనపర్తి జిల్లాలో చిన్నబావి మండల పరిధిలో గోప్లాపూర్ ఎత్తిపోతల పథకం పనుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.17 కోట్లు కేటాయించింది. ఇదే మండల పరిధిలోని చిన్నమారూర్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.6.47 కో ట్లు కేటాయించింది. నిర్మల్ జిల్లా పరిధిలో వెంకటాపూర్ ఎత్తిపోతల పథకం పరిధిలో అదనపు పనులు చేపట్టేందుకు వీలుగా రూ.62.50 లక్షలు కేటాయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని పెద్దచెరువు పునరుద్ధరణకు రూ.2.36 కోట్లు కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చా రు. నాలుగో విడత మిషన్ కాకతీయలో భాగంగా దుర్గం చెరువు రూ.40.25 కోట్లు, మల్క చెరువు రూ.6.68 కోట్లు, నల్లగండ్ల చెరువు రూ.15.49 కోట్లు కలిపి మొత్తంగా రూ.62.54 కోట్లతో సవరించిన అంచనాలకు అనుమతులు ఇచ్చారు. -
నాలుగో విడత ‘మిషన్’కు రెడీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ నాలుగోవిడత పనులను చేపట్టేందుకు సిద్ధం కావాలని నీటిపారుదలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సర్వేలు చేసి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగోవిడత కింద 641 చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అధికారులు నాలుగోవిడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులు ఉమ్మడి జిల్లాలో మూడు విడతలుగా సాగాయి. జిల్లాల పునర్విభజనకు ముందు 5,998 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్అర్బన్ జిల్లాలకు వెళ్లినవి మినహాయించగా, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 4,445 మిగిలాయి. ఇందులో నుంచి మూడువిడతల్లో 2171 చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. నాలుగో విడతగా 641 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపగా.. ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేగం పెంచితేనే లక్ష్యం నెరవేరేది.. అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్ల కట్టడి.. 2014లో చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం జరగగా.. అదే ఏడాదిలో అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాల పునర్విభజన తర్వాత నాలుగు జిల్లాల్లో 4,445 చెరువులు, కుంటలు మిగలగా.. మొదటి, రెండు, మూడు విడతల్లో 2,171 చెరువుల పనులకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. ఈ పనుల కోసం రూ.795.95 కోట్లు అంచనావేశారు. మొదటి విడతలో 643 చెరువులకుగాను 631 పనులు పూర్తయ్యాయి. రెండోవిడతలో 863 చెరువులకు ఆమోదం లభించగా.. 859 చెరువుల పనులు ప్రారంభించారు. ఇందులో 581 చెరువులు పూర్తయ్యాయి. మూడో విడతలో 664 చెరువులకు ఆమోదం లభించగా, 654 చెరువులకు టెండర్లు పిలిచి 649 పనులను మొదలుపెట్టారు. మొత్తం మూడు విడతల్లో 2171 చెరువులకు 1212 చెరువులు పూర్తి కాగా, 959 పనులు వివిధస్థాయిల్లో ఉన్నాయి. ఈ పనులపై అధికారులు కాంట్రాక్టర్లకు రూ.213.95 కోట్లు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. వివిధ స్థాయిల్లో ఉన్న 959 పనులతోపాటు నాలుగో విడతలో 641 చెరువుల పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావాలంటే పర్యవేక్షణ, వేగం పెంచడంతో పాటు అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్లను కట్టడి చేయాలని పలువురు సూచిస్తున్నారు. పనులపై ఆదినుంచీ ఆరోపణలే మిషన్ కాకతీయ పథకం ప్రారంభం నుంచి చాలాచోట్ల పనులు జరుగుతున్న తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూము, కాలువలు, అలుగు, కట్ట నిర్మాణాల్లో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులు పలు గ్రామాల నుంచి వచ్చాయి. అధికార పార్టీ నేతలు తమ అనుయాయులకే టెండర్లను కట్టబెట్టడం వల్ల పనులు ఎలా చేసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపించాయి. వీటిలో కొన్నింటిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విచారణ కూడా జరిపారు. కరీంనగర్, జగిత్యాల డివిజన్లలో చాలాచోట్ల పనుల్లో నాణ్యత లేదని, నామమాత్రంగానే మట్టితరలింపు చేపట్టి బిల్లులు పొందారని తేలింది. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయంతో ఈ అవినీతి జరిగిందన్న విమర్శలు కూడా వచ్చాయి. చెరువులకు సంబంధించిన తూములు, అలుగుల నిర్మాణంలో నాణ్యత సరిగా ఉండడం లేదు. చెరువు కట్టలు ఎత్తు పెంచడంలో మొరం నింపుతూ పనులు ముగించారన్న ఫిర్యాదులున్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులను ఇతరులకు అప్పగించి తప్పించుకున్న సంఘటనలూ ఉన్నాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వచ్చిన ఆరోపణలపైనా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పట్లో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం సక్సెస్ కోసం అధికారులు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
మిషన్ కాకతీయకు బ్రేక్
మూడో దశ అమలు సందేహం నీళ్లతో నిండిన చెరువులు .. పనులు చేయలేని పరిస్థితి నిధులకూ కొరత.. మార్చి తర్వాతే స్పష్టత సాక్షి, వరంగల్ : చిన్న నీటి వనరుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ మూడో దశ అమలు సందేహంగా మారింది. భారీ వర్షాలతో దాదాపు అన్ని చెరువుల్లో నిండా నీళ్లు చేరాయి. వచ్చే వానాకాలం వర కు ఇదే పరిస్థితి ఉండనుంది. చెరువు అభివృద్ధి పనులు చేసేందుకు డిసెంబర్ నుంచి మే వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అన్ని చెరువుల్లోనూ నీళ్లు ఉండడంతో మూడో దశ పనులు చేపట్టే పరిస్థితి లేదని సాగునీటి శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. చెరువులు నిండుకుండల్లా ఉండడంతో పూడికతీతలు చేపట్టలేని పరిస్థితులున్నాయి. దీంతో అధికారులు చెరువులకు వచ్చే ఫీడర్ చానళ్ల పనులు చేపట్టనున్నారు. వరద నీరు చెరువుల్లోకి వచ్చే విధంగా ఫీడర్ చానళ్లను పునరుద్ధరించే పనులపై దృష్టిసారించనున్నారు. మిషన్ కాకతీయ మొదటి, రెండో దశ టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో పనుల్లోనూ జాప్యం జరిగింది. ఈ పరిస్థితిని నివారించేందుకు మూడో దశ పనులను పకడ్బందీ గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరులోపే చెరువుల అభివృద్ధికి సంబంధించిన టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించిం ది. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. భారీ వర్షాలతో చెరువులు పూర్తిగా నిండడంతో పనులు చేసే పరిస్థితి లేదు. మరోవైపు మిషన్ కాకతీయ కార్యక్రమానికి నిధుల సమస్య సైతం ఉంది. 2015–16లో చేపట్టిన మొదటి దశ పనులకు పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రెండో దశ పూర్తయి బిల్లులు ఆన్ లైన్ చేసినప్పటికీ చెల్లింపులు జరగడం లేదు. చెరువుల్లో నిండా నీళ్లు ఉండడంతో పాటు ఇప్పుడు నిధుల కొరత కూడా ఉండడంతో మార్చి తర్వాతే మిషన్ కాకతీయ మూడో దశ పనుల ప్రక్రియ మొదలయ్యే పరిస్థితి ఉందని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ ప్రణాళిక... దశ చెరువులు మొదటి దశ 1070 రెండో దశ 1258 మూడో దశ 1367 -
నామమాత్రంగా ‘మిషన్’ పనులు
దెబ్బతిన్న చెరువు కట్టలు లీకేజీలతో వృథాగా పోతున్న నీరు భారీ వర్షాలతో బట్టబయలు భీమారం : మిషన్ కాకతీయ కింద చెరువు పనులను కాంట్రాక్టర్లు నామమాత్రంగా చేస్తున్నారు. మెుదటి విడతలో ఇలా చేసిన పనులకు బిల్లులు డ్రా చేసుకున్నారు. రెండో విడతలోనూ ఇలాగే చేసి బిల్లులు పొందాలనుకునే సమయంలో ఈ పనుల్లో అవినీతి భారీ వర్షాలతో బట్టబయలైం ది. హసన్‌పర్తి మండలంలో మిషన్ కాకతీయ కింద మెుదటి విడతలో 20 చెరువులు, రెండో దశలో 10 చెరువులను ఎంపికయ్యాయి. ఇందు లో కొన్ని చెరువుల పునరుద్ధరణ పనులు నామమాత్రంగా చేయగా, మరికొన్నింటి పనులు అసలే చేపట్టలేదు. అయినా కాంట్రాక్టర్లు బిల్లు లు పొందారు. ఇందుకు అధికారులు పూర్తిగా సహకరించారు. భారీ వర్షాలు కురవగా ఈ అవి నీతి బహిర్గతమైంది. ప్రస్తుతం కొన్ని చెరువుల కట్టలకు బుంగలు పడగా, మరికొన్ని చెరువుల తూములు లీకయ్యాయి. కాంట్రాక్టర్లు మెురం పోసి క్యూరింగ్, రోలింగ్ సరిగా చేయకపోవడంతో దెబ్బతిన్నాయి. మెుదటి విడతలో మెు రం పోసి ఎలాంటి రోలింగ్ చేయకపోవడంతో హసన్‌పర్తి, సీతంపేట, వంగపహాడ్, దేవన్నపేట (పడమర చెరువు), ముచ్చర్ల (భీమునికుంట) చెరువుల కట్టలు దెబ్బతిన్నాయి. ముచ్చర్ల (భీమునికుంట) చెరువు నిర్మాణానికి రూ. 44.82లక్షలు ప్రతిపాదించగా, 34.55లక్షలకు అగ్రిమెంట్ జరిగింది. కట్ట నిర్మాణానికి రూ.6.34లక్షలు బిల్లు చెల్లిం చారు. తూము నిర్మాణానికి రూ.2.76లక్ష లు కేటాయించగా ఎలాంటి పనులు చే యలేదు. తూముకు షెట్టర్లు కూడా ఏర్పా టు చేయకపోవడంతో నీరు వృథా పోతోం ది. రైతులు నీటి లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. కట్టకు సరైన క్యూరింగ్, రోలింగ్ చేయకపోవడంతో కిందికి కుంగి పగుళ్లు ఏర్పడ్డాయి. దేవన్నపేట పడమటి చెరువు కట్ట నిర్మాణ పనులు అయ్యిందన్నట్లుగా చేసినా రూ. 5.49లక్షలు బిల్లులు చెల్లించారు. మరో భారీ వర్షం కురిస్తే ఈ చెరువు కట్ట తెగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హసన్‌పర్తి పెద్ద చెరువు మత్తడి ప్రాంతంలోని తూము లీకై నీరు వృథాగా పోతోంది. స్థానికులు ఇసుక బస్తాలు అడ్డుగా వేశారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన మెట్ల కింది భాగంలో నీటి తాకిడికి కంకర తేలింది. చెరువు కట్ట నిర్మాణానికి రూ.17.63లక్షలు కేటాయించారు. రెండో విడత పనులు మరీ అధ్వానం రెండో విడత మిషన్ కాకతీయ పనులు మరీ అధ్వానంగా మారాయి. ముచ్చర్లలోని ఉరచెరువు కట్ట వర్షానికి దెబ్బతిన్నది. ఈచెరువు అభివృద్ధికి రూ.72లక్షలు కేటాయించగా, కట్ట నిర్మాణానికి సుమారు రూ.15.95లక్షలు ఖర్చు చేశారు. కోమటిపల్లి చెరువు కట్టకు సరైన రోలింగ్ చేయకపోవడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ చెరువు అభివృద్ధికి రూ.25లక్షలు మంజూరయ్యాయి. కాగా ఈ పనుల్లో జరిగిన అవినీతిపై కలెక్టర్ స్పందించి ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
'తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలు అవుతాయి'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ పథకంతో తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలుగా రూపాంతరం చెందుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లిలోని నక్కలకుంట చెరువును మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పోలీసులు దత్తత తీసుకున్నారు. అందులోభాగంగా పూడికతీత పనులను మంత్రి ఈటెల ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మిషన్ కాకతీయ పథకం తెలంగాణ బతుకులు బాగు చేసే పథకం అని ఆయన అభివర్ణించారు. సామాజిక సేవలో భాగంగా చెరువులను దత్తత తీసుకుంటున్న పోలీసు శాఖను మంత్రి ఈటెల అభినందించారు. -
'నాణ్యత లేకపోతే క్రిమినల్ కేసులు'
పుల్కల్: మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బాబూ మోహన్ హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం చక్రియాల్‌లో మిషన్ కాకతీయ పనులను అయన ప్రారంభించారు. కామని చెరువుకు రూ.27 లక్షలు, నల్లకుంటకు రూ.23 లక్షలతో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు లాభాల కోసం కాకుండా సేవాభావంతో పనులు చేయాలని సూచించారు. -
'నాణ్యత లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లోకే..'
టేక్మాల్ (మెదక్) : మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ హెచ్చరించారు. శనివారం మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామంలోని గటంగారోల్ల కుంటలో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పనులను నాణ్యంగా, త్వరితగతిన చేయకుంటే లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. పనులపై అశ్రద్ధ వద్దని, ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. టేక్మాల్ మండలంలో రెండో విడత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 35 చెరువుల పనులకు రూ.17.23 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. -
ఇరుక్కుపోయారు!
* ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు * హౌసింగ్ నుంచి ఇరిగేషన్‌కు బదలాయింపు * పని పొంతన లేదు.. పనికి వేతనం లేదు.. * ఇబ్బందిని అధిగమించి మిషన్‌కాకతీయ పనులు * ఐదు నెలలు గడుస్తున్నా అందని వేతనాలు సాక్షి, మంచిర్యాల : మిషన్ కాకతీయ.. ఇప్పటి వరకు ఎలాంటి సత్ఫలితాలిచ్చిందో తెలియదు.. రైతులకు ఎలాంటి మేలు చేకూర్చిందో దేవుడే ఎరుగు. కానీ.. జిల్లాలో 49 మంది కుటుంబాలను మాత్రం అయోమయంలో నెట్టేసింది. ఈ పథకం పుణ్యమా అని ఐదు నెలల క్రితమే గృహనిర్మాణ శాఖ నుంచి మైనర్ ఇరిగేషన్‌కు బదిలీ అయిన ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. గృహనిర్మాణ శాఖలో ని ర్వర్తించిన విధులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులకు పొంతన అసలే లేదు. అనేక కష్టాలకోర్చి మి షన్ కాకతీయ పనుల్ని పర్యవేక్షిస్తున్నా పాలకులు మాత్రం వీరిపై కనికరం చూపడం లేదు. ఐదు నె లలుగా వేతనాలు లేక.. అసలు అవి వస్తాయో రా వోననే బెంగతో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి వే తనాల విషయంలో సంబంధిత ఏజెన్సీ పట్టింపులేకుండా వ్యవహరించడం.. అధికారులూ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మొదటి 32.. తర్వాత 68 మంది.. ఇందిరమ్మ మొదటి విడతలో భాగంగా జిల్లాకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించేం దుకు 2007-08లో అప్పటి ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పద్ధతిలో తొలుత 32 మంది వర్క్ఇన్స్పెక్టర్లను నియమించింది. క్రమంగా జిల్లాకు ఎక్కువ ఇళ్లు మంజూరు కావడం.. పనులు పర్యవేక్షించే వా రు కొరతగా ఉండడంతో వివిధ సందర్భాల్లో మొ త్తం 68 మంది వర్క్ఇన్స్పెక్టర్లను తీసుకుంది. పనిభారాన్ని బట్టి పలు మండలాలకు అధికారులు ముగ్గురు చొప్పున బాధ్యతలు అప్పగించారు. తొ లుత సికింద్రాబాద్‌కు చెందిన శక్తి అనే ఏజెన్సీకి కాంట్రాక్టు అప్పగించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఎన్కే ఎంటర్‌ప్రైజెస్‌కు వీరి బాధ్యతలు ఇచ్చారు. ఆయా సంస్థలు ప్రతి నెలా రూ.8,500 వేతనం ఖరారు చేశాయి. అందులో 11 శాతం పీఎఫ్ కోత విధించి.. రూ.7,345 చెల్లిస్తూ వచ్చాయి. కష్టాలు మొదలయ్యాయి ఇలా.. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూ రులో అవకతవకలు జరిగాయి. ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణాల మంజూరుకు బ్రేక్ వేసింది. ఇదే క్రమంలో అప్పటి వరకు హౌసింగ్‌లో కొనసాగుతున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు లేకపోవడంతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీ య పనుల్లో వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. వీరిని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేస్తూ.. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మూడ్రోజుల్లో నిర్మల్‌లోని ఎస్ఈ ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి మిషన్‌కాకతీయ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. వీ రిలో 49 మంది మాత్రమే విధుల్లో చేరారు. మే 20 నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇరిగేషన్ ఏఈ ల కింద బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. గ తంలో వారు చేసిన పనికి ప్రస్తుతం చేయాల్సిన పనికి పొంతన లేకున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్ వర్క్స్‌పై అవగాహన ఉన్న ఉద్యోగులు పలుచోట్ల ఏఈల స్థాయి లో పనులు చేస్తున్నారు. అయినా.. వీరికి వేతనాల విషయంలో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై ‘సాక్షి’ మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ భగవంతరావు వివరణ కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు. -
ముచ్చటగా మూడోసారి !
♦ నేడు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ వేల్పూరులో బస చేయనున్న సీఎం ♦ ఎల్లుండి మొక్కలునాటే కార్యక్రమం ♦ నిజామాబాద్‌లో సీఎం బహిరంగసభ ♦ హరితహారంలో రెండు రోజుల టూర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు రోజులు జిల్లాలో గడపనున్నారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ఆదివారం సాయంత్రం జిల్లాకు చేరుకోనున్న ఆయన సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి వస్తున్నారు. హరితహారంలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న ఆయన సాయంత్రం నిర్మల్ నుంచి వేల్పూరుకు చేరుకుంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి సీఎం రెండు రోజుల టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం జిల్లా అధికారులకు పంపించారు. జిల్లాలో మూడేళ్లలో 10.05 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఈ ఏడాది 3.35 కోట్లు నాటుతు న్నారు. మూడునప్రారంభమైన ఈ కార్యక్రమం చురుకుగా సాగుతుండగా, 5, 6 తేదీలలో సీఎం పాల్గొననుండటం ప్రతిష్టాత్మకంగా మారింది. కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా అధికారయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం రాత్రి సీఎం నిర్మల్ నుంచి నేరుగా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరుకు చేరుకుంటారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం నుంచి హరితహారం కార్యక్రమంలో పా ల్గొంటారు. ఈ మేరకు రెండు రోజులుగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం పర్యటన ఏ ర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిని పరిశీలించారు. సీఎం నిద్రించే గది, ఆయన కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సౌకర్యాల గురించి ఎమ్మె ల్యేను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాలలో సీఎం పర్యటించే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. టూర్ షెడ్యూల్ ఇదీ అధికారులు వెల్లడించిన ప్రకారం సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు వేల్పూరుకు చేరుకుని రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వేల్పూరు ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన అనంతరం అక్కడి రైతులతో మాట్లాడుతారు. వేల్పూర్ హైస్కూల్ ఆవరణలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మొ క్కలు నాటుతారు. అక్కడి నుంచి బయలుదేరి ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రా ంగణం) సీఎం మొక్కలు నాటుతారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి నిజామా బాద్‌కు చేరుకునే సీఎం కేసీఆర్ పాలిటెక్నిక్ మైదానం, గిరిరాజ్ కళాశాల మైదానంలో మొక్కలు నాటుతారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరం గ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు కేంద్రమంత్రి ప్రకాశ జవదేవకర్ ముఖ్యఅతిధిగా హాజరవుతారు. తర్వాత ఈద్గా, రఘునాథ చెరువు వద్ద సీఎం మొక్కలు నాటుతా రు. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించి మొక్కలు నాటుతారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంట్లో ఏ ర్పాటు చేసిన భోజన కార్యక్రమం తర్వాత తెలంగాణ యూనివర్సిటీకి చేరుకోనున్న సీఎం తెలంగాణ హరితహారంలో పాల్గొంటారు. యూనివర్శిటీపై అధికారులు, ప్ర జాప్రతినిధులతో మాట్లాడి సదాశివనగర్ మండలకేంద్రంలోని పాతచెరువును కేసీఆర్ సందర్శిస్తారు. అక్కడ తాను ప్రారంభించిన మిషన్ కాకతీయ పనులను పరిశీ లించి ఆ చెరువులో మొక్కలు నాటుతారు. అక్కడి నుంచి బయలుదేరి కామారెడ్డికి చేరుకోనున్న ఆయన ప్రభుత్వ డిగ్రీ, డైరీ కళాశాలల్లో మొక్కులు నాటే కార్యక్రమంలో పాల్గొని మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్తారు. -
‘మిషన్’ పనులకు రాజకీయ రంగు
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల్లో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం ఓ వైపు ఘాటుగా హెచ్చరిస్తున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం దాని ప్రభావం కనిపించడంలేదు. టెండర్లు, ఒప్పందాలు పూర్తయిన చెరువు పనుల ఆరంభానికి రాజకీయ రంగు అంటుకుంటోంది. పనులను తమ చేతుల మీదుగా ప్రారంభించాలంటూనే కొంతమంది ఎమ్మెల్యేలు సమయమివ్వకపోవడంతో కొన్ని చోట్ల, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట అధికారపక్ష నేతల అభ్యంతరాలు, అడ్డంకులతో మరికొన్ని చోట్ల చెరువుల పనులు ఆరంభం కాలేదు. దీంతో అటు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేషీకి, ఇటు ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి చొరవ కారణంగా అధికారులు హడావుడిగా మూడు రోజుల్లో 180 చోట్ల పనులను ప్రారంభింపజేశారు. 586 చెరువుల్లో ఆరంభం కాని పనులు.. రాష్ట్రంలో ఈ జూన్ నాటికి మొత్తంగా 9,627 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా అందులో ఇప్పటికే 8,115 చెరువులకు రూ.2,550 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో 7,207 చెరువులకు టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 6,621 చెరువుల్లో మాత్రమే పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం వర్షాలు మొదలవుతున్నా మరో 586 చెరువుల్లో ఇంకా పనుల ఆరంభమే జరగలేదు. దీనికి ప్రధానంగా ఆయా చెరువుల పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయాలే కారణమని తెలుస్తోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు తామే స్వయంగా పనులకు శంకుస్థాపనచేయాలని, తమపేరుతో శిలాఫలకం ఉండాలని పట్టుబట్టడమే కారణంగా తెలుస్తోంది. స్థానిక నేతలు ఎవరైనా పనుల ప్రారంభానికి చొరవ చూపినా అక్కడి ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను జరుగనీయకపోవడంతో అవి మొదలవలేదు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంగనర్‌లో మరో 70 చెరువుల పనులు చేపట్టాల్సి ఉండగా ఇందులో ఎక్కువగా చొప్పదండి, మానుకొండూరు నియోజకవర్గాల్లోనే ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఎల్లారెడ్డి, బోధన్‌లలోనూ ఎమ్మెల్యేలు సమయమివ్వని కారణంగా పనులు ప్రారంభం కావట్లేదు. ఇక మహబూబ్‌నగర్‌లో గద్వాల, వనపర్తి, కొడంగల్ వంటి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు, స్థానిక నేతలకు మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం పనులకు అడ్డంకిగా మారింది. దీంతో మహబూబ్‌నగర్ లో 928 చెరువుల పనులకు ఒప్పందాలు కుదిరినా 802 పనులే ఆరంభమయ్యయి. మరో 126 పనులు నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్ని నియోజకవర్గాలపైనా మంత్రి పేషీకి, హెల్ప్‌లైన్‌కు ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అధికారులు రాజకీయ జోక్యాన్ని తగ్గించి పనులను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. -
వేగంలేని ‘మిషన్’
1,061 చెరువులకు నిధులు మంజూరు 942 చెరువులకు 933 పనులు ప్రారంభం 85లక్షల కూ.మీ. పూడికతీత రోడ్ల నిర్మాణానికి తరలుతున్న మట్టి వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. జిల్లాలో మొత్తం 5,839 చెరువులు ఉన్నారుు. అందులో ఈ ఏడాది 1,173 చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు 1,061 చెరువులకు నిధులు కేటాయించింది. నిధులు మంజూరైన చెరువుల టెండర్ల ప్రక్రియను నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టారు. టెండర్లు ఖరారు అయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. 942 చెరువులకు అగ్రిమెంటు చేసుకోగా.. 933 పనులు ప్రారంభం అయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పనులు చేపట్టిన చెరువుల నుంచి పూడికతీత ద్వారా సుమారు 85లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసినట్లు అధికారులు వెల్లడించారు. మట్టికి భలే గిరాకీ.. చెరువుల్లో తీసిన పూడికమట్టిని సొంత ప్లాట్లలో పోసుకునేందుకు పోటీపడడంతో కాంట్రాక్టర్ల పంట పండింది. సాగు భూముల్లో పోసుకుంటే సారవంతంగా తయారై అధిక దిగుబడి వస్తుందని ఊదరగొట్టిన ప్రభుత్వం బహిరంగంగా ప్రైవేటు భూములకు తరలుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవు. చెరువుల వద్ద రియల్టర్లు పెద్ద పెద్ద వాహనాలు పెట్టడంతో వారికి మాత్రమే మట్టి పోసి రైతుల ట్రాక్టర్లను పట్టించుకోని పరిస్థితులు జిల్లావ్యాప్తంగా కోకొల్లలు. ఏమిటి ఈ పరిస్థితి అని స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే.. ఆ పనుల్లో వారు భాగస్వాములు కావడంతో రైతులకు నిరాశే ఎదురువుతోంది. కొందరు చెరువు మట్టి పొలాలకు పనికి రాదన్న నివేదికలను డూప్లికేట్ తయారు చేయించి మట్టిని రహదారుల నిర్మాణాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులన్నీ ప్రారంభం.. కాగా, వరంగల్, మహబూబాబాద్, ములుగు, స్పెషల్ ఎంఐ డివిజన్లలో చేపట్టిన పనులన్నీ ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. అరుుతే మహబూబాబాద్ పట్టణంలోని బంధం చెరువు పనులు నిలిచిపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పనులు ప్రారంభం కాలేదు. నెల్లికుదురు మండలంలో 13 పనులకు టెండర్లు కాగా.. ప్రస్తుతం 5 చెరువుల్లో పనులు సాగుతున్నాయి. గూడూరు మండలంలో మొత్తం చెరువుల పనులు సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అటవీ శాఖ అభ్యంతరాలతో పనులు ఆగినట్లు చెబుతున్న కొత్తగూడ, గూడూరు, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, భూపాలపల్లి మండలాల్లో పనులు మొత్తం పురోగతిలో ఉన్నట్లు నివేదికల చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో జరగడం లేదని తె లిసింది. కేసముద్రం మండలంలో 16 చెరువులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం నాలుగు చెరువుల్లో పనులు నిలిచిపోయాయి. రఘునాథపల్లి మండలంలో 19 చెరువులకు నిధులు మంజూరు కాగా.. 5 చెరువుల పనులు ప్రారంభం కాలేదు. 4 చెరువుల పనులు ప్రారంభం అయిన వివిధ కారణాలతో నిలిచిపోయూరుు. 6 చెరువుల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో మంజూరైన చెరువుల్లో 5 చె రువులకు టెండర్లు కాలేదు. మరో 8 చెరువుల్లో పనులు జరగడం లేదు. ఏటూరునాగారంలో 32 చెరువులకు.. 12 చెరువుల పనులు నిలిచిపోయాయి. దీనికి అటవీ శాఖ అధికారులే కారణమని ఐబీ అధికారులు అంటున్నారు. మంగపేట మండలంలో ఐబీలో 13 మంజూరుకాగా.. 2 చెరువుల్లో పనులు జరగడం లేదు. ఎంఐలో 12 చెరువులు మంజూరు కాగా.. 8 చెరువుల్లో పనులు జరగడం లేదు. కొత్తగూడ మండలంలో ఎంఐ డివిజన్లో 92 మంజూరు కాగా.. 70 చెరువుల పనులు పురోగతిలో ఉన్నారుు. ఐబీలో 42 మంజూరు కాగా.. 20 పురోగతిలో ఉన్నాయి. ఈ మండలంలోని చెరువులన్నీ అటవీ ప్రాంతంలో ఉన్నందున శాఖ ప్రతిబంధకంగా తయారైందని ఐబీ అధికారులు వాపోతున్నారు. -
‘మిషన్’కు మావోల బెదిరింపులు
కొత్తగూడలో కాంట్రాక్టర్‌కు బెదిరింపులు తాజాగా వెంకటాపురంలో... పోలీసుల అదుపులో మాజీ మిలిటెంట్లు ములుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టన మిషన్ కాకతీయ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను కొందరు మావోరుుస్టుల పేరుతో బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో మిష న్ కాకతీయ కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు సమాచారం. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో పూర్తి సమాచారంతో కథనం ప్రచురితం కావడంతో వారు కాస్త వెనకడుగు వేశారు. తాజాగా శుక్రవారం వెంకటాపురం మండ లం బూర్గుపేట చెరువు వద్ద పనులు చేస్తున్న జేసీబీని మావోలు దగ్ధం చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం మాజీలు మావోల పేరుతో కాంట్రాక్టర్‌ను కలిశారు. దీంతో వారు ఎదురుతిరగడంతో వెనుదిరిగినట్లు సమాచారం. డబ్బులు దండుకోవడానికే ప్రణాళిక కేకేడబ్ల్యూ కార్యదర్శి, గణపురం మండలం కొండాపురం గ్రామానికి చెందిన మర్రి నారాయణ అలియాస్ యాదన్న అలాయాస్ సుధాకరన్న, భార్య పుష్పక్క 2013లో జరిగిన ప్రత్యేక బలగాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ఏజెన్సీలో మావోల కదలికలు పూర్తిగా స్తంభించిపోయూరుు. అయితే నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి కొందరు ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో వివిధ రకాల పదవుల్లో కొనసాగుతున్నారు. వీరిలో వెంకటాపురం మండలానికి చెందిన తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, గోవిందరాపుపేట మండలం పస్రాకు చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కోటి అభిలాష్ అలియాస్ చందర్, ములుగు మండలానికి చెందిన గోలి శ్రీనివాస్, కునుకుంట్ల రాజు, అలియాస్ స్వామి ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. వీరిపై ప్రభుత్వం భారీగా రివార్డులు సైతం ప్రకటించింది. కాగా వెంకటాపురం మండలానికి చెందిన చెరువు కాం ట్రాక్టర్‌ను శుక్రవారం పోలీసులు విచారించినట్లు తెలిసిం ది. వారు ఇచ్చిన సమాచారంతో అనుమానం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పొక్లెరుున్ దహనం వెంకటాపురం: మండలంలోని బూర్గుపేట శివారులోని మారేడుగొండ చెరువులో మిషన్ కాతీయ పనులు చేస్తున్న పొక్లెరుున్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి దగ్ధం చేశారు. మారేడుగొండ చెరువులో రాత్రి 9 గంటల వరకు మట్టి పనులు చేపట్టి పొక్లెరుున్‌ను తూము సమీపంలో డ్రైవర్ నిలిపి వేసి భోజనానికి వెళ్లాడు. 9.50 నిమిషాలకు మిషన్ వద్ద నుంచి మంటల వస్తుండడంతో డ్రైవర్ గమనించాడు. అప్పటికే న లుగురు వ్యక్తులు మిషన్‌పై డీజిల్ చల్లి మిషన్‌ను దగ్ధం చేసి పారిపోయారు. శుక్రవారం వెంకటాపురం ఎస్సై భూక్య రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పొక్లెయిన్ కాలిపోవడంతో చెరువు పనులు ఆగిపోయాయి. -
ప్రజల ఆకాంక్ష మేరకు పనులు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొరిపెల్లి (కొడ కండ్ల) : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలో ని కొరిపెల్లి పెద్దచెరువు పూడికతీత పనులు, ఆర్సీ తండా నుంచి పోచారం వరకు రూ.1.40 కోట్లతో నిర్మించే బీటీరోడ్డు పనులకు శుక్రవారం కడియం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో రాజకీయూలకతీ తంగా భాగస్వాములు కావాలన్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ అర్థంలేని విమర్శలు చేస్తున్నాడని అన్నారు. కొరపెల్లి యూపీఎస్‌కు కాంపౌం డ్‌వాల్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు, కొరిపెల్లి చెరువుకట్ట నుంచి రం గాపురానికి రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణా న్ని ఏడాదిలోగా చేరుుస్తానని కడియం హామీ ఇచ్చారు. వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేసేందుకు 15 రోజుల్లో 10 కరెంట్ స్తంభాలు ఇప్పిస్తానని, గొలుసుకట్టు చెరువుల ఫీడర్‌చానల్ నిర్మాణాన్ని వచ్చే సీజన్ కల్లా పూర్తి చేరుుస్తానని, మండలకేంద్రంలో ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుతోపాటు జూనియర్ కళాశాలకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములై చెరువులు అభివృద్ధి చేసుకోవాలని, జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ సంబరాలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్రావు, ఎంపీపీ భానోత్ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యురాలు బాకి లలిత, ఐబీ ఎస్ఈ పద్మారావు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ విశ్వనాథుల జ్ఞానేశ్వరాచారి, తహసీల్దార్ నారాయణ, కొరిపెల్లి సర్పంచ్ జ్ఞానేశ్వరుచారి పాల్గొన్నారు. -
‘పట్టా భూముల్లో మిషన్ కాకతీయ పనులు’
ఉట్నూర్ : గిరిజనుల పట్టా భూముల్లో మిషన్ కాకతీయ పనులు చేపడుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందోర్ ప్రభాకర్ విమర్శించారు. సోమవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు అవసరం లేనిచోట అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించి నిధులు మంజూరయ్యేలా చేశారని ఆరోపించారు. కెరమెరి మండలం చింతకర్ర గ్రామంలో శ్యాంరావ్‌కు చెందిన మూడెకరాల పట్టా భూమిలో కాంట్రాక్టర్ పుడిక తీత పనులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. సదరు రైతు భూమి తనదేనని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ఆ భూమి రైతుకు చెందేలా చూడాలని ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో గిరిజనులకు చెందిన పట్టా భూములను అధికారులు చెరువు భూములుగా చూపడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్ కాకతీయ’కు మచ్చ
నిండుగా నీళ్లున్న చెరువుకు టెండర్ చెరువు ఖాళీచేసి పని చేయించడానికి నిర్ణయాలు జూరాల : రాజుల కాలం నాటి నుంచి నేటి వరకు ఆదరణకు నోచుకోని చెరువులు, కుంటలను పునరుద్ధరించి పల్లెప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలన్న మంచి ఆశయంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుట్టింది. కానీ అధికారులు తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్లుగా నిరంతరంగా నీటి నిల్వ ఉన్న ఉప్పేరు పెద్ద చెరువును మిషన్ కాకతీయలో చేర్చి పనులు చేయిస్తామంటూ టెండర్లకు పిలిచారు. ప్రజలు, ఆయకట్టు రైతులు నీళ్లున్న చెరువులో పనులు ఎలా చేస్తారనే సందేహం వ్యక్తం చేస్తున్నా అధికారులకు అవేమీ పట్టలేదు. కేవలం 50 ఎకరాలకు మించి ఆయకట్టు లేని ఉప్పేరు పెద్ద చెరువును నీళ్లున్నప్పటికీ * 22లక్షల వ్యయంతో అధికారులు బాగు చేస్తాంమంటున్నారు. గద్వాల నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2012లో మొదటి, రెండో పంప్‌హౌస్‌లు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి మొదటి పంప్‌హౌస్ వద్ద ఉన్న గుడ్డెందొడ్డి ఆన్లైన్ రిజర్వాయర్ ఏనాడూ నీళ్లు లేని స్థితికి రాలేదు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌కు దిగువన ఉన్న ఉప్పేరు పెద్ద చెరువుకు సీపేజీ నిరంతరంగా కొనసాగుతుంది. దీంతో మూడేళ్లుగా ఈ చెరువు జలకళతో ఉంది. ఉప్పేరు పెద్ద చెరువు పరిధిలో వాస్తవానికి 200 ఎకరాల ఆయకట్టు ఉండగా, జూరాల రిజర్వాయర్ దాదాపు 150 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మిగతా 10 నుంచి 15 ఎకరాల్లో జమ్ము పెరిగి పంటలు సాగు చేయడానికి వీలులేకుండా మారింది. మిగిలిన కొద్దిపాటి 30 నుంచి 40 ఎకరాల ఆయకట్టు మాత్రమే రైతులకు అందుబాటులో ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న ఉప్పేరు పెద్ద చెరువును అధికారులు ముందుచూపులేకుండా మిషన్ కాకతీయలో చేర్చారు. * 22లక్షల వ్యయంతో చెరువు కట్టను బలోపేతం చేయడంతో పాటు చెరువులో ఒండ్రుమట్టిని తొలగించేందుకు నిర్ణయించారు. రైతులు అభ్యంతరం తెలిపినా అధికారులు టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. నీళ్లున్న ఉప్పేరు పెద్ద చెరువులో పనులెలా చేస్తారో ప్రజలకు అర్థం కాకపోయినా అధికారులు మాత్రం నీళ్లు తీయించి పనులు చేస్తామంటున్నారు. దీంతో ప్రజలు అధికారుల తీరును విమర్శిస్తున్నారు. ఈ విషయమై ధరూరు చిన్ననీటి పారుదల ఏఈ లక్ష్మినారాయణను వివరణ కోరగా చెరువు నీటిని విడుదల చేసి నీళ్లు తగ్గిన ప్రాంతంలో పనులు చేయిస్తామని, అలాగే కట్టకు కూడా మరమ్మతులు పనిచేస్తామని తెలిపారు. -
మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి
తూప్రాన్: మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి జరిగింది. చెరువులో కొలతలు తీస్తున్న కూలీ విద్యుదాఘాతానికి గుైరె మరణించాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పాలాట గ్రామానికి చెందిన చాకలి మంచె లక్ష్మయ్య (45) కూలీ. లింగారెడ్డిపేట పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో కొలతలు తీయడానికి బుధవారం కూలీగా వచ్చాడు. ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు ప్రారంభించారు. చెరువు మత్తడిపై నిలబడి సిల్వర్‌తో తయారు చేసిన స్కేల్‌ను పట్టుకుని ఉండగా పైనే ఉన్న 33/11 విద్యుత్ వైరు తగిలి స్పృహ కోల్పోయాడు. చెరువు కాంట్రాక్టర్ కడపాల రాజు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇంద్రతో పాటు మరికొందరు కలసి 108లో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. అయితే, ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తూప్రాన్ ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. -
అధికార పార్టీ నేతలకే మిషన్ కాకతీయ పనులు
►ఒక్కో కాంట్రాక్టర్‌కు దక్కిన మూడు, నాలుగు చెరువులు ►బినామీ పేర్లపైనా పనులు అల్లాదుర్గం రూరల్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనులు పక్కదారి పడుతున్నాయి. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచినా కాంట్రాక్టు పనులు మాత్రం టీఆర్ఎస్ నేతలకే దక్కాయి. టెండర్లలో ఎవరికి పనులు దక్కినా పనులు చేస్తున్నది మాత్రం టీఆర్ఎస్ నాయకులే. మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరిస్తున్నా ఫలితం శూన్యం. ఒక్కో కాంట్రాక్టర్ మూడు, నాలుగు చెరువులు దక్కించుకొని బీనామి పేర్లపై పనులు చేపడుతున్నారు. అల్లాదుర్గం మండలంలో 12 చెరవులకు టెండర్లు పూర్తికాగా, 8 చెరువుల్లో మాత్రమే పనులు కొనసాగుతున్నాయి. అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రారంభించిన మిషన్ కాకతీయ పనులు ముందుకు సాగడం లేదు. ఈ నెల 11న కెరూర్ పీర్ల కుంట చెరువు పనులను ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రారంభించారు. ఆయినప్పటికీ పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్‌కు రెండు మూడు చెరువులు దక్కడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. అప్పాజిపల్లి గిద్దమ్మ చెరువుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. నామమాత్రంగా చెరువులో ముళ్ల పొదలు, చె ట్ల తొలగింపు పనులు చేపట్టి నిలిపి వేశారు. చెరువులోని పూడిక మట్టిని తరలించే పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. శిథిలావస్థకు చేరుకున్న చెరువు ఆలుగు, తూముల పనులు ఇంకా మొదలు పెట్టలేదని రైతులు తెలిపారు. ఎలాంటి అనుభవం లేని కాంట్రాక్టర్లు పనులు చేపడుతుండటం గమనార్హం. కాయిదంపల్లి చెరువుకు రూ. 30 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ పూర్తయి కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్ అయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. నిధులు దుర్వియోగం చేసేందుకే కాంట్రాక్టర్లు పనులు ఆలస్యంగా చేపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పనులపై జిల్లా అధికారులు పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలని రైతులు కోరుతున్నారు. ఏఈ వివరణ: ఈ విషయమై ఏఈ చక్రవర్తిని వివరణ కోరగా చెరువుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. మండలంలో 12 చెరవులకు టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయ్యాయని పనులు కొనసాగుతున్నాయన్నారు. -
కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.!
అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ పుల్కల్ : మిషన్ కాకతీయ కమీషన్ల కార్యక్రమంగా మారిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పనులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎక్కడైనా కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. మంగళవారం మిన్పూర్, పుల్కల్, పోచారం గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన సింగూర్ ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు చేస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు జరుగకుండానే రూ. కోట్లు దండుకుంటున్నారని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికీ చెరువుల పూడికతీత పనులు పూర్తయినా బిల్లులు చెల్లించలేదని, ఇరిగేషన్‌శాఖ అధికారుల కొలతల ఆధారంగా చెల్లింపులు జరగవన్నారు. పూర్తయిన చెరువులపై విజిలెన్స్ బృందం తనిఖీ చేసిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తేనే బిల్లులు చెల్లిస్తారన్నారు. ఈ కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించేందుకు దాతలు ఒకవైపు ముందుకొస్తుంటే జీర్ణించుకోలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ పనుల ద్వారా భూగర్భజలాలు పెరగడంతో పాటు మత్స్య కార్మికులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో 132 చెరువులు మిషన్ కాకతీయ కింద ఎంపిక కాగా 104 చెరువుల టెండర్లు పూర్తయ్యాయని మరో 28 చెరువులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తారన్నారు. గత నెలలో ప్రారంభించిన చెరువు పనుల్లో 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఈ విషయంలో అందోల్ నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 132 చెరువులకు గాను రూ. 29 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. పోచారం చెరువుకు రూ. 34, పుల్కల్కు రూ.34, మిన్పూర్కు రూ.51 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, జిల్లా నాయకులు, పల్లె సంజీవయ్య, పార్టీ మండల నాయకులు గోవర్థన్, కనకారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్ కాకతీయ’లో అపశ్రుతి
మేడ్చల్: మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కొలతలు తీసుకుంటున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గిర్మాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి కథనం ప్రకారం.. గిర్మాపూర్ గ్రామంలోని పంతులు చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కల్లూర్ గ్రామానికి చెందిన మల్లేష్(26) చెరువులో పనిచేసే కార్మికులు, అధికారులకు భోజనాలు తీసుకొచ్చే టాటా మొబైల్ వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం అతడు మేడ్చల్ నుంచి భోజనాలు తీసుకొని చెరువు వద్దకు వెళ్లాడు. చెరువులో ఎంత మట్టి తీశారు, ఇంకా ఎంత తీయాల్సి ఉం ది.. తదితర విషయాలను అధికారులు స్టీల్ స్కేల్‌తో కొలతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి మల్లేష్ వెళ్లాడు. కార్మికులు కోరడంతో అతడు స్కేల్ పట్టుకొని కొలతలకు సహకరిస్తున్నాడు. సైట్ ఇంజినీర్ కొలతలు తీసుకునే క్రమంలో కొద్దిగా వెనక్కు వెళ్లాలని మల్లేష్‌కు సూచిం చాడు. దీంతో మల్లేష్ పట్టుకున్న స్టీల్ స్కేల్ ప్రమాదవశాత్తు 33/11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుదాఘాతమై అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంట నే కార్మికులు అతడిని స్థానిక ఘనాపూర్ మెడిసిటి ఆస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమించడంతో మల్లేష్ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. అయ్యో...పాపం.. మల్లేష్‌కు 20 రోజుల క్రితం వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం అతడు స్వగ్రామం నుంచి భార్యను తీసుకొచ్చి మండల పరిధిలోని బండమాదారం గ్రామంలో కాపురం పెట్టాడు. ఇటీవలే పెళ్లి.. అంతలోనే మల్లేష్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మల్లేష్ భార్య రోదించిన తీరు హృదయ విదారకం. కాగా, నిర్వాహకులు మృతుడి కుటుంబానికి పరిహారం అందజేసినట్లు సమాచారం. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా..
నిర్మాణాత్మక సలహాలివ్వాలి గజ్వేల్ : అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి పార్టీలకతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రతిపక్షాలను కోరారు. గురువారం గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌లోని పెద్దచెరువులో రూ.31.34 లక్షల వ్యయంతో చేపట్టనున్న మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్వామిగౌడ్ మాట్లాడారు. పేద, బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. స్వయం సహాయక బృందాలకు రుణాలను రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబనవైపు పయనించాలని పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎం ఆశయాలకనుగుణంగా ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య ఉన్నా హన్మంతరావుకు చెబితే క్షణాల్లో ఆయన సీఎం దృష్టికి వెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపుతారన్నారు. బంగ్లా వెంకటాపూర్ సర్పంచ్ విజ్ఞప్తి మేరకు గ్రామంలో మురుగునీటి కాల్వల నిర్మాణం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయాలని ‘గడా’ ఓఎస్డీకి స్వామిగౌడ్ సూచించారు. కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు జేజాల వెంకటేశ్‌గౌడ్, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు, బంగ్లావెంకటాపూర్ సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ సభ్యులు అంజిరెడ్డి, నాయకులు బురాన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే సభలో పలువురు మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని మండలి చైర్మన్‌ను వేడుకున్నారు. అంతకుముందు మండలి చైర్మన్‌కు బోనాలతో స్వాగతం పలికారు. -
మినీ ట్యాంక్‌బండ్‌గా కిసాన్‌సాగర్
కంది గ్రామంలోని కిసాన్‌సాగర్ చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మారుస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. బుధవారం ఎస్పీ నేతృత్వంలో పోలీసులు దత్తత తీసుకున్న ఈ చెరువు పనులను మంత్రి ప్రారంభించారు. సంగారెడ్డి రూరల్ : ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీయ పనులు ప్రజల భాగస్వామ్యంతోనే కొనసాగుతున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎస్పీ సుమతి నేతృత్వంలో జిల్లా పోలీసులు దత్తత తీసుకున్న సంగారెడ్డి మండలం కంది గ్రామంలోని కిసాన్‌సాగర్ చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన పనులకు రైతులు, ప్రజలు, అధికారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఏళ్ల తరబడి వారసత్వ సంపదగా ఉన్న చెరువులు నిర్లక్ష్యానికి గురైనట్లు చెప్పారు. మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో ప్రజలు భాగస్వాములవుతున్నట్లు తెలిపారు. పోలీసులు ప్రజల రక్షణ బాధ్యతతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం అభినందనీయమన్నారు. హైవేలపై సీసీ కెమెరాలను అమర్చిన తొలి జిల్లా మెదక్ అవుతుందన్నారు. ఓవైపు ఐఐటీ మరోవైపు జాతీయ రహదారి పక్కన ఉన్న కిసాన్‌సాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కిసాన్‌సాగర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు మిషన్ కాకతీయ పనుల కోసం వివిధ వర్గాల నుంచి రూ.43.16 కోట్లు విరాళంగా అందినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఒకరోజు వేతన మొత్తం రూ.32.12 కోట్లు వచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పోలీసులు చెరువులను దత్తత తీసుకోవటం అభినందనీయమన్నారు. కిసాన్‌సాగర్‌ను భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రైతులకు మేలు చేసేలా చేపడుతున్న పనరుద్ధరణ పనులకు అన్నివర్గాల వారు అండగా నిలవాలని కోరారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ చెరువుల పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. చెరువు శిఖంలో నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ సుమతి మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించటంతోపాటు అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్న సంకల్పంతో కిసాన్‌సాగర్ చెరువును దత్తత తీసుకున్నామన్నారు. కిసాన్‌సాగర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి, కలెక్టర్‌ను కోరారు. దీనిపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ వెంటనే రూ.50 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటంతో ఎస్పీ సుమతి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఓఎస్డీ జ్యోతిప్రకాశ్, డీఎస్పీలు తిరుపతన్న, కిషన్‌రావు, సీఐలు వెంకటేష్, ఆంజనేయులు, రఘు, శ్రీనివాస్‌నాయుడు, ఎస్ఐలు రాజశేఖర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.సత్యనారాయణ, సర్పంచ్ ఉమారాణిశంకర్‌గౌడ్, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎంపీటీసీ క్రిష్ణాగౌడ, టీఆర్ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, అశోక్, బాబా, లక్ష్మీ, చెర్యాల ప్రభాకర్, శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు. -
అందరి సహకారం అవసరం
మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ రూరల్: మిషన్ కాకతీయకు అన్ని వర్గాల సహకారం అవసరమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలోని పాతచెరువు పునరుద్ధరణ పనులను నిర్మల్ డివిజన్ పోలీసులు అధికారులు, సిబ్బంది దత్త తీసుకుని మంగళవారం శ్రమదానం చేశారు. మంత్రి, జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. పోలీసులు చెరువును దత్తత చేసుకోవడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖను ఆదర్శంగా తీసుకోని అన్ని శాఖాల అధికారులు ఒక్కో చెరువు దత్తత తీసుకుని కాకతీయ మిషన్‌ను విజయవంతం చేయాలన్నారు. త్వరలో అమలు చేయబోయే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ఎల్లపెల్లిలో ప్రారంభించనున్నామన్నారు. అనంతరం ఎస్పీ తరున్‌జోషి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతోందన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం పథకాలకు తమ శాఖ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. డీఎస్పీ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ అల్లోల సుమతిరెడ్డి, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, సర్పంచ్ భీంరావు, సీఐలు పురుషోత్తమచారి, జీవన్‌రెడ్డి, ఎస్సైలు రమణమూర్తి, మహేంధర్‌రెడ్డి, సునీల్‌కుమార్, మల్లేష్, రాంనర్సింహారెడ్డి, నవీన్, శ్రీనివాస్, నాయకులు ముత్యంరెడ్డి, తుల శ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ‘మిషన్’
వర్ని: గ్రామాలను సస్యశ్యామలం చేయడానికే ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులు చేపట్టిందని, పనులు పారదర్శకత కోసం ఆన్లైన్ కేంద్రాల ద్వారా పనులు కేటాయించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వర్ని మండలం జలాల్పూర్ శివారులో రూ.1.35 కోట్లతో చేపట్టనున్న సైద్పూర్ రిజర్వాయర్ పూడికతీత పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు జాకోరా గ్రామంలో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వర్నిలో వికలాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. అనంతరం జలాల్పూర్ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మొదటి విడతలో 601 చెరువుల పూడికతీతకు రూ.231 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే పనులు కల్పించారని, తమ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్ట్యా మిషన్ పనులు ప్రారంభించిందని చెప్పారు. పనుల్లో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పనులు నాసిరకంగా చేస్తే ఆయూ కాంట్రాక్టర్లను నిలదీయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఈ కాల్ సెంటర్ నెం.23472233కు ఫోన్ చేయాలన్నారు. చెరువు మట్టిని పొలాల్లో పోస్తే భూసారం పెరుగుతుందని, మట్టి తరలింపులో తొలి ప్రాధాన్యత రైతులకే ఇవ్వాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కొందరు ప్రతిపక్ష నాయకులు కమీషన్ కాకతీయ అంటూ విమర్శిస్తున్నారని, ఇప్పటికి కాంట్రాక్టర్‌కు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కమీషన్ల కోసమే పనులు మంజూరు చేశాయని, వారికి ప్రతిపని కమీషన్ లాగానే కనిపిస్తుందని విమర్శించారు. చెరువు శిఖం కబ్జాదారులను ఉపేక్షించం.. చెరువుల శిఖం కబ్జా చేసిన వారిని ఉపేక్షించేదిలేదని హరీశ్‌రావ్ స్పష్టం చేశారు. రబీలో వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఆరు గంటల విద్యుత్‌ను అందజేశామన్నారు. బాన్సువాడ, జుక్కల్ కాలువల లైనింగ్‌కు రూ. 26 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పనుల్లో రైతులు దగ్గర ఉండి పనులు చేయించుకోవాలని సూచించారు. బాన్సువాడ నియోజక వర్గంలో 57 చెరువులకు రూ. 31 కోట్లు మంజూరయినట్లు తెలిపారు. చెరువు శిఖం భూములు ఖాళీ చేయించడానికి అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గంలోనూ హరీష్‌రావు పర్యటించి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆయూ కార్యక్రమాలలో జడ్పీ చైర్మన్ ద ఫేదార్ రాజు, వర్ని, కోటగిరి ఎంపీపీలు చింగ్లీభాయి,సులోచన, జడ్పీటీసీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ అన్నం సాయిలు, ఎంపీటీసీ సాయాగౌడ్, టీఎన్జీవోస్ అద్యక్షుడు గైని గంగారాం పాల్గొన్నారు.