ముచ్చటగా మూడోసారి ! | Mucchataga mudosari | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి !

Published Sun, Jul 5 2015 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ముచ్చటగా మూడోసారి ! - Sakshi

ముచ్చటగా మూడోసారి !

♦ నేడు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్
♦ వేల్పూరులో బస చేయనున్న సీఎం
♦ ఎల్లుండి మొక్కలునాటే కార్యక్రమం
♦ నిజామాబాద్‌లో సీఎం బహిరంగసభ
♦ హరితహారంలో రెండు రోజుల టూర్
 

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు రోజులు జిల్లాలో గడపనున్నారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ఆదివారం సాయంత్రం జిల్లాకు చేరుకోనున్న ఆయన సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి వస్తున్నారు. హరితహారంలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న ఆయన సాయంత్రం నిర్మల్ నుంచి వేల్పూరుకు చేరుకుంటారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి సీఎం రెండు రోజుల టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం జిల్లా అధికారులకు పంపించారు. జిల్లాలో మూడేళ్లలో 10.05 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఈ ఏడాది 3.35 కోట్లు నాటుతు న్నారు. మూడునప్రారంభమైన ఈ కార్యక్రమం చురుకుగా సాగుతుండగా, 5, 6 తేదీలలో సీఎం పాల్గొననుండటం ప్రతిష్టాత్మకంగా మారింది.

 కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
 ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా అధికారయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం రాత్రి సీఎం నిర్మల్ నుంచి నేరుగా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరుకు చేరుకుంటారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం నుంచి హరితహారం కార్యక్రమంలో పా ల్గొంటారు. ఈ మేరకు రెండు రోజులుగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం పర్యటన ఏ ర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిని పరిశీలించారు. సీఎం నిద్రించే గది, ఆయన కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సౌకర్యాల గురించి ఎమ్మె ల్యేను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాలలో సీఎం పర్యటించే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

 టూర్ షెడ్యూల్ ఇదీ
 అధికారులు వెల్లడించిన ప్రకారం సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు వేల్పూరుకు చేరుకుని రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వేల్పూరు ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన అనంతరం అక్కడి రైతులతో మాట్లాడుతారు. వేల్పూర్ హైస్కూల్ ఆవరణలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మొ క్కలు నాటుతారు. అక్కడి నుంచి బయలుదేరి ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రా ంగణం) సీఎం మొక్కలు నాటుతారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పరిశీలిస్తారు.

అక్కడి నుంచి నిజామా బాద్‌కు చేరుకునే సీఎం కేసీఆర్ పాలిటెక్నిక్ మైదానం, గిరిరాజ్ కళాశాల మైదానంలో మొక్కలు నాటుతారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరం గ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు కేంద్రమంత్రి ప్రకాశ జవదేవకర్ ముఖ్యఅతిధిగా హాజరవుతారు. తర్వాత ఈద్గా, రఘునాథ చెరువు వద్ద సీఎం మొక్కలు నాటుతా రు. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించి మొక్కలు నాటుతారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంట్లో ఏ ర్పాటు చేసిన భోజన కార్యక్రమం తర్వాత తెలంగాణ యూనివర్సిటీకి చేరుకోనున్న సీఎం తెలంగాణ హరితహారంలో పాల్గొంటారు. యూనివర్శిటీపై అధికారులు, ప్ర జాప్రతినిధులతో మాట్లాడి సదాశివనగర్ మండలకేంద్రంలోని పాతచెరువును కేసీఆర్ సందర్శిస్తారు. అక్కడ తాను ప్రారంభించిన మిషన్ కాకతీయ పనులను పరిశీ లించి ఆ చెరువులో మొక్కలు నాటుతారు. అక్కడి నుంచి బయలుదేరి కామారెడ్డికి చేరుకోనున్న ఆయన ప్రభుత్వ డిగ్రీ, డైరీ కళాశాలల్లో మొక్కులు నాటే కార్యక్రమంలో పాల్గొని మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement