'తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలు అవుతాయి'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ పథకంతో తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలుగా రూపాంతరం చెందుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లిలోని నక్కలకుంట చెరువును మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పోలీసులు దత్తత తీసుకున్నారు.
అందులోభాగంగా పూడికతీత పనులను మంత్రి ఈటెల ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మిషన్ కాకతీయ పథకం తెలంగాణ బతుకులు బాగు చేసే పథకం అని ఆయన అభివర్ణించారు. సామాజిక సేవలో భాగంగా చెరువులను దత్తత తీసుకుంటున్న పోలీసు శాఖను మంత్రి ఈటెల అభినందించారు.