
'అర్చకుల వేతనాలపై సీఎంతో చర్చిస్తా'
సాక్షి, హైదరాబాద్: అర్చకుల వేతనాల విషయంలో ముఖ్య మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అర్చక సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ అర్చక సమాఖ్య ముద్రించిన కొత్త డైరీని మంగళవారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, దేవాలయ ఉద్యోగుల సంఘం నేత మోహన్ తదితరులు పాల్గొన్నారు.