బీఈడీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: బీఈడీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 21 నుంచి 28వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరపనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 23వ తేదీ నుంచి ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుంది.
అక్టోబర్ 3న అభ్యర్ధులకు సీట్లు కేటాయిస్తారు. అక్టోబర్ 6 నుంచి తరగతులు ప్రారంభవుతామయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కౌన్సెలింగ్ కోసం తెలంగాణ 23, ఆంధ్రప్రదేశ్ 17 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు.