Certificates Verification
-
TSPSC: ఏ క్షణమైనా సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (175), డ్రగ్ ఇన్స్పెక్టర్ (18), హార్టీకల్చర్ ఆఫీసర్ (22), ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్ (77), అసిస్టెంట్ మోటార్ Ððవెహికిల్ ఇన్స్పెక్టర్ (117), గ్రూప్–4 (8180) పోస్టులకు సంబంధించి వెబ్సైట్లో జీఆర్ఎల్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కేటగిరీల వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను కమిషన్ అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది జాబితాలు విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవి ధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవా లి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్పీఎస్సీ తెలిపింది. మున్సిపల్ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్ఎల్ విడుదల పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పోటెత్తిన యువత
సాక్షి కర్నూలు(అర్బన్) : సచివాలయ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులతో జిల్లా పరిషత్ ప్రాంగణం కిటకిటలాడింది. దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా సందడి కన్పించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శుక్రవారం తొమ్మిది రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు భారీగా తరలివచ్చారు. అభ్యర్థులతో పాటు వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో జెడ్పీ ప్రాంగణం కిక్కిరిసింది. స్థానిక డీపీఆర్సీ భవనంలో ఆరు రకాల పోస్టులకు, మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ సర్వేయర్ పోస్టులకు, పీఆర్ ఎస్ఈ కార్యాలయం (విశ్వేశ్వరయ్యభవన్)లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగింది. ముఖ్యంగా ఏఎన్ఎం/ వార్డు హెల్త్ సెక్రటరీ గ్రేడ్–3 పోస్టులకు ఎంపికైన∙వారి జాబితాను ఈ నెల 26న సాయంత్రం అప్లోడ్ చేయడంతో వారంతా 27వ తేదీన ఉదయానికే జెడ్పీకి చేరుకున్నారు. ఈ పోస్టులతో పాటు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు అమెనిటీస్ సెక్రటరీ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2, వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు డీపీఆర్సీ భవనంలో వెరిఫికేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల అభ్యర్థులు అధిక సంఖ్యలో అక్కడికే రావడంతో భవనం కిక్కిరిసింది. వెరిఫికేషన్ నిదానం కావడంతో.. ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన నిదానం కావడంపై అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఇతర పోస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసిన అధికారులతో వారి సర్టిఫికెట్లను పరిశీలింపజేయాలని జెడ్పీ సీఈఓ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహులును కోరగా, ఎంత రాత్రయినా సరే తమ శాఖకు చెందిన వారితోనే వెరిఫికేషన్ చేయిస్తామని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ బయట జరుగుతున్న వివిధ రకాల ప్రచారాలను అభ్యర్థులు నమ్మవద్దని, కాల్‌లెటర్లు అందిన అభ్యర్థులందరి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తామని అన్నారు. అవసరమైతే 28వ తేదీన ఉదయం 9 గంటల నుంచి వెరిఫికేషన్ ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్నానికే పూర్తి విశ్వేశ్వరయ్యభవన్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శుక్రవారం మధ్యాహ్నానికే పూర్తి చేశారు. మొత్తం 760 పోస్టులకు గాను 26వ తేదీన 400 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవగా 322 మంది హాజరయ్యారు. అలాగే శుక్రవారం 360 మందిని పిలవగా.. 337 మంది హాజరయ్యారు. పీఆర్ ఎస్ఈ సీవీ సుబ్బారెడ్డి స్వయంగా వెరిఫికేషన్ జరిగే బోర్డుల వద్దే ఉండి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీడని సస్పెన్స్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. జిల్లాలో 473 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –5 పోస్టులు, 1,181 మహిళా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం భారీగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదనే ఉద్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలను ఒకటికి రెండు సార్లు సరిచూస్తున్నారు. ఫలితంగా ఈ జాబితా అప్లోడ్ చేసే విషయంలో జాప్యం కొనసాగుతూనే ఉంది. 28వ తేదీ మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వస్తే సాయంత్రానికి జాబితాను అప్లోడ్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
23 కాలేజీలు.. 7,199 సీట్లు కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన వాటిల్లోనే 23 కాలేజీలతోపాటు 7,199 సీట్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని 168 పాలిటెక్నిక్ కాలేజీల్లో 42,100 సీట్లకు ఏఐసీటీఈ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో కొన్ని కాలేజీలు సీట్లను తగ్గించుకోగా, కొన్ని కాలేజీలు ప్రవేశాలకు ముందుకు రాలేదు. మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇలా 23 కాలేజీలు, 7,199 సీట్లకు కోత పడింది. ఈసారి ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 145 కాలేజీల్లో 34,901 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించామని తెలిపారు. దీంతో 12,511 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని, అందులో 12,303 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లను బుక్ చేసుకున్నట్లు ఆయన వివరించారు. 24 వరకు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు.. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని బి.శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఈనెల 24 వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈనెల 27న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీ, వికలాంగులు, సాయుధ దళాల కుటుంబాలకు చెందిన పిల్లలు/ఆంగ్లో ఇండియన్ కుటుంబాలకు చెందిన పిల్లలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌లో మాసాబ్‌ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. కులీకుతుబ్ షాహి అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతం లోని విద్యార్థులు అక్కడి క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న సీట్లను ఎంచుకోవచ్చని, అయితే వారు తమ రేషన్‌కార్డు జిరాక్స్ కాపీ తప్పక సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడి విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్‌లో క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వెళ్లే విద్యార్థులు వెంట తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలను తమ వెబ్సైట్లో (https://tspolycet. nic.in) చూడొచ్చని తెలిపారు. -
‘స్కోచ్’ అవార్డుకు గురుకుల సొసైటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీలు ప్రతిష్టాత్మక స్కోచ్ మెరిట్ అవార్డ్‌కు ఎంపికయ్యాయని గిరిజన సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. సమ్మర్ సమురాయ్ సాఫ్ట్వేర్ ద్వారా గురుకులాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావటం వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నారు. ఈ అవార్డు రావటం ఆనందంగా ఉందని, ఇందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ భాగస్వాములే కారణమని ఆయన పేర్కొన్నారు. ‘ఫారెస్ట్ పోస్టు’లకు 31నుంచి టెస్టులు సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పీఈటీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురువారం నుంచి జూన్ 4వరకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉదయం 9 గంటలకు పరీక్షలు ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు హాల్‌టికెట్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఏదైనా గుర్తింపు కార్డు కచ్చితంగా తమ వెంట తెచ్చుకోవాల్సిందిగా సూచించింది. వివరాలకు ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి. జీn వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఓయూలో విదేశీవిద్యార్థులకు ప్రవేశాలు హైదరాబాద్: 2018–19 విద్యా సంవత్సరానికిగాను ఉస్మానియా వర్సిటీ, అనుబంధ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఓయూ ఫారిన్ రిలేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఈ ప్రవేశాలకు విదేశీయులతో పాటు, ఎన్ఆర్ఐ విద్యార్థులు అర్హులని వెల్లడించారు. ప్రతి కోర్సులో 10 నుంచి 15 శాతం సీట్లను వీరికోసం కేటాయించామన్నారు. వచ్చేనెల 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ‘వెరిఫికేషన్‌కు 15 వేల మంది హాజరు’ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా మొదటి రెండు రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 15,557 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మొదటి ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు 5,905 మంది, 10,001వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకు వరకు 9,652 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తంగా 1,540 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని వెల్లడించారు. ఈనెల 30 న 25,001వ ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమయం వారీగా వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన వారి వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. ‘స్త్రీ–శిశు సంక్షేమ’ రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: స్త్రీ–శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్, అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల పోస్టులకు గురువారం రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో వెరిఫికేషన్ జరుగుతుందని టీఎస్పీఎస్సీ మంగళవారం తెలిపింది. మరిన్ని వివరాలు ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి.జీn వెబ్సైట్లో చూడొచ్చని సూచించింది. -
ఏఈవో పోస్టులకు 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : గ్రేడ్–2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(ఏఈవో) పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు మార్చి 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినట్లు పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, ఇతర వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. -
నేటి నుంచి ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 19 నుంచి చేపట్టనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారు ఈ నెల 19న వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. చివరిదశ కౌన్సెలింగ్‌లో మొత్తంగా 27,075 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఇంజనీరింగ్‌లో 23,640 సీట్లు, బీ ఫార్మసీలో 2,964 సీట్లు, ఫార్మ్–డీలో 471 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 22న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని వారు, ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు రాని వారు, సీటు వచ్చినా ఆ కాలేజీల్లో వద్దనుకునే వారు తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. కాగా, కన్వీనర్ కోటాలో 64,300 సీట్లు అందుబాటులో ఉండగా మొదటి దశలో 56,046 మందికి సీట్లు కేటాయించారు. అందులో 42,529 మంది కాలేజీల్లో చేరారు. 8,254 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక చివరి దశ నాటికి మరో 1,869 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చివరి దశలో 23,640 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. -
నేడు బదిలీ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం స్థానిక సైట్స్ సెంటర్లో ప్రారంభం కానుంది. ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు నమోదు చేసుకున్న వివిధ పాయింట్లకు సంబంధించిన సర్టిఫికెట్లను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. రీజనరేట్ అయిన పాయింట్లకు సంబంధించి తప్పనిసరిగా సర్టిఫికెట్లు ఉండాలని డీఈఓ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మండల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అర్హత ఉండి పాయింట్లు రీజనరేట్ కాని టీచర్లు నేరుగా డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఫిర్యాదులు చేయొచ్చన్నారు. కమిషనర్ కార్యాలయానికి పంపి సమస్య పరిష్కరిస్తామని డీఈఓ తెలిపారు. తక్కిన టీచర్లకు పాయింట్లు పడి తమకు రాలేదనే టీచర్లు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల ద్వారానే ఫిర్యాదు చేయాలి తప్ప నేరుగా సైన్స్ సెంటర్‌కు రాకూడదని డీఈఓ స్పష్టం చేశారు. అలా వస్తే పరిగణించబడదన్నారు. -
సీట్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ
♦ కన్వీనర్ కోటాలో గతేడాది కన్నా తగ్గిన సీట్లు ♦ సీట్లు 62,746.. వెరిఫికేషన్ చేయించుకున్న వారు 64,340 ♦ గతేడాది 5 వేల సీట్లు అదనం.. ఈసారి 1,594 సీట్లు తక్కువ ♦ కన్వీనర్ కోటా ప్రవేశాలకు ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ♦ నేడు వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. 28న సీట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఈసారి ఇంజనీరింగ్‌లో విద్యార్థులకు కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిం చడం కొంచెం కష్టంగా మారింది. కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు తక్కువగా ఉండటం.. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది కన్వీనర్ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య కన్నా 5 వేలకు పైగా ఎక్కువ సీట్లున్నాయి. ఈ సారి విద్యార్థుల సంఖ్య కంటే 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభించడం కాస్త కష్టమే. గతేడాది కన్వీనర్ కోటాలో 71,066 సీట్లు అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 66,566 విద్యార్థుల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో 57,789 మందికే సీట్లు లభించాయి. ఈ సారి కన్వీనర్ కోటాలో 62,746 సీట్లు అందుబాటులో ఉండగా, గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముగిసే సమయానికి 64,340 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్ కు హాజరైన విద్యార్థుల కన్నా 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన ఎంత మందికి మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభి స్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మేనేజ్మెంట్ కోటా వైపు మొగ్గు..! కన్వీనర్ కోటాలో కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయో లేదోనన్న అనుమానంతో డబ్బు చెల్లించగలిన వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతేడాది కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు మొత్తం 1.04 లక్షలుండగా, ఎంసెట్‌లో 1.06 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. కానీ ఈ సారి మొత్తం సీట్లు 92,700 వరకు ఉండగా, అర్హులు మాత్రం 1.03,500 మంది ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 11 వేల సీట్లు తగ్గిపోయాయి. దీనివల్ల కూడా మేనేజ్మెంట్ కోటాకు డిమాండ్ ఏర్పడింది. వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. ఇంజనీరింగ్ ఎంసెట్ వెరిఫికేషన్ గురువారంతో ముగిసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోనివారు ఈ నెల 23న ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు శుక్రవారం తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 28న రాత్రి 8కు సీట్లు కేటాయించనున్నారు. జ్టి్టpట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో వివరాలను ఉంచుతామని వివరించారు. -
పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సర్టిఫికెట్ల పరిశీలన
విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు మళ్లీ ఈ విద్యా సంవత్సరంలో విధుల్లోకి తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి జిల్లా సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లలో ఆర్ట్, వర్క్, ఫిజికల్ ఎడ్యూకేషన్ విభాగాలల్లోని అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం హన్మకొండలోని సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు. సబ్జెక్టు నిపుణులతో ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించారు. గత విద్యాసంవత్సరం (2015-16)లో సుమారు 300 మంది పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు తమకు కేటాయించిన పాఠశాలల్లో విధులను నిర్వర్తించారు. వీరిని ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుంచి విధుల నుంచి తొలగించారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలవుతున్నా మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవటంతో ఆయా పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు తమను కొనసాగించాలంటూ ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరికి మళ్లీ వారిని కొనసాగించేందుకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఆయా కేటగిరీలోని పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన కేటగిరీల్లో వారి విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించాకే విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలతో వారి ఒరిజనల్ సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం చేపట్టారు. దీంతో ఆయా అభ్యర్థులు హన్మకొండలోని సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు అకాడమిక్ మానటరింగ్ కోఆర్డినేటర్ వేణుఆనంద్, ఆయా కేటగిరీల సబ్జెక్టు నిపుణులు సర్టిఫికెట్లను పరిశీలించారు. అయితే వంద మంది విద్యార్థులు కలిగిన ఉన్నత, యూపీఎస్‌లలోనే ఆయా పార్ట్‌టైం ఇన్‌స్ట్రకర్టర్లను నియమించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 14వ తేదీ నుంచి పాఠశాలల్లో విధులను నిర్వర్తిస్తారు. ప్రతినెల వీరికి రూ.6వేల చొప్పున వేతనం ఇస్తారు. -
మెడికల్ కళాశాల్లో ఎంసీఐ ఆకస్మిక తనిఖీ
డాక్టర్ల సర్టిఫికెట్ల పరిశీలన నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంగళవారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఎంబీబీఎస్ కోర్సులో రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగిడుతున్న విద్యార్థులకు వసతులు పరిశీలించి సీట్లు మంజూరు చేసేందుకు ఎంసీఐ బృందం తనిఖీలు చేపట్టింది. ముందస్తు సమాచారం లేకుండా ఎంసీఐ సభ్యులు మెడికల్ కళాశాలకు తనిఖీకి రావడంతో వి«ధుల్లో లేని, సెలవుపై వెళ్లిన డాక్టర్లు, ప్రొఫెసర్లను ప్రిన్సిఫల్ రవిప్రభు హడావుడిగా పిలిపించారు. పాట్నా మెడికల్ కళాశాల నుంచి వచ్చిన ఎంసీఐ టీం చైర్మన్, ఫిజియాలజీ హెడ్ డాక్టర్ ఎస్.ఎన్.శర్మ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కళాశాలలో ఫ్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగినంతమంది ఉన్నారా.. లేరా అని ఆరా తీశారు. విద్యార్థులకు సరిపడా భవనాలు, ల్యాబొరేటరీలు, వసతిగృహాలు, నర్సింగ్ కళాశాల, వివిధ డిపార్ట్మెంట్లను తనిఖీ చేశారు. రాత్రి వరకు డాక్టర్ల సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం ఉదయం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి విభాగాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రిన్సిపల్, అధికారులతో ఎంసీఐ బృందం ప్రత్యేక సమావేశమైంది. ఈ కార్యక్రమంలో ఎంసీఐ టీం చైర్మన్ ఎస్.ఎన్.శర్మ, రాయ్‌పూర్‌కి చెందిన జేఎన్ఎం మెడికల్ కళాశాల గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నళినిమిశ్రా, సేలంకు చెందిన మోహన్‌కుమార్‌మంగళం, మెడికల్ కళాశాల పథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.తెన్మాజి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణరాజు(అకడమిక్). వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ సీకే.లక్ష్మీదేవి(అడ్మిన్), పెద్దాస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ భారతి పాల్గొన్నారు. -
నేటి నుంచి డీసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
బుక్కపట్నం: డీసెట్ (2016) అభ్యర్థులకు ఈ నెల 7 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్నిరెండు రోజులు పొడిగించారన్నారు. అభ్యర్థులు పీడీఎఫ్ ఆన్లైన్ దరఖాస్తు, హాల్టి కెట్, ర్యాంకు కార్డు, 10, ఇంటర్ ఇతర విద్యార్హతలు, టీసీ, స్టడీ, కు లం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. ప్రిన్సిపాళ్లు హాజరు కావాలి:జిల్లాలోని అన్ని కొత్త, పాత డీఎడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్ల పరిశీలనకు ఆదివారం బుక్కపట్నం డైట్లో హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. -
ఎల్పీ సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
బుక్కపట్నం: బుక్కపట్నం డీఎడ్ కళాశాలలో మంగశవారం 72 మంది లాంగ్వేజ్ పండిట్ (ఎల్పీ) సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎల్పీ సెట్ ద్వారా తెలుగు, హిందీ పండిట్ కోర్సుకు అర్హత సాధించిన మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
రేపట్నుంచే ఏఈఈ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గత సెప్టెంబరు 20న నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఏఈఈ) పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 16 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న ఉదయం 8.30 గంటల నుంచి జేఎన్టీయూహెచ్ (కూకట్పల్లి) క్యాంపస్‌లో రోజూవారీ షెడ్యూలు ప్రకారం వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలను గత డిసెంబర్ 31న వెల్లడించామని, ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తమవెంట వయసు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, బీసీలైతే తాజాగా తీసుకున్న క్రీమీలేయర్ సర్టిఫికెట్ తదితరాలను ఒరిజినల్‌తోపాటు అటెస్టేషన్ చేసిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని, లేనిపక్షంలో సదరు అభ్యర్థులను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. -
నేటి నుంచి ‘బీఈడీ’సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణా కోర్సు బీఈడీ ప్రవేశాలలో 2015-16 విద్యా సంవత్సరానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీఎస్ఎడ్సెట్ కన్వీనర్ ప్రొ.పి.ప్రసాద్ ఓ ప్రకనటనలో తెలి పారు. దీనికోసం జంటనగరాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాల కోసం టీఎస్ఎడ్సెట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
జూలై 4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్) ర్యాంకర్లకు జూలై 4 వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. జూలై 6వ తేదీ వరకు సాగే ధ్రువపత్రాల పరిశీలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ర్యాంకులను బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవచ్చు. వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోగల సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం జూలై 5 వ తేదీ నుంచి 8వ తేదీ లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. -
రేపటి నుంచి పాలీసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో విద్యార్థులు వెరిఫికేషన్‌కు హాజరు కావాలని తెలిపారు. ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండు దఫాలుగా ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. ఇక విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 2వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని వివరించారు. 5వ తేదీన సీట్లను కేటాయించి, తమ వెబ్సైట్ (https://tspolycet.nic.in)లో అందుబాటులో ఉంచ నున్నట్లు తెలిపారు. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొన్నారు. వికలాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలకు చెందిన వారికి ఈ నెల 25, 26 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 60 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. -
బీఈడీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: బీఈడీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 21 నుంచి 28వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరపనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 23వ తేదీ నుంచి ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్ 3న అభ్యర్ధులకు సీట్లు కేటాయిస్తారు. అక్టోబర్ 6 నుంచి తరగతులు ప్రారంభవుతామయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కౌన్సెలింగ్ కోసం తెలంగాణ 23, ఆంధ్రప్రదేశ్ 17 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. -
సర్టిఫికెట్లతో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ
కమలనాథన్ కమిటీ నిర్ణయం ఉద్యోగుల సర్వీస్ రికార్డులతో పాటే పరిశీలన ఆప్షన్లు దుర్వినియోగం కాకుండా గట్టి చర్యలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో స్థానికతను నిర్ధారించడానికి సర్వీసు రికార్డులతోపాటు, ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఆప్షన్ల విధానం దుర్వినియోగం కాకుండా చూసేందుకు అవసరమైన ఇతర చర్యలకూ సిద్ధమైంది. విభజన తేదీకి ముందు ఉద్యోగులు లేదా వారి కుటుంబసభ్యుల్లో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, అంగవైకల్యం ఉన్నట్లు నమోదైన వారినే పరిగణనలోకి తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులపై మెడికల్ బోర్డుతో పరిశీలన చేయించాలని కూడా కమిటీ అభిప్రాయపడుతోంది. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీ బుధవారం తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అర్చనావర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో పాటు తెలంగాణ ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రామకృష్ణారావు, ఏపీ అధికారులు ఎల్వీ సుబ్రమణ్యం, డాక్టర్ పీవీ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల స్థానికతను సర్వీసు రికార్డుల ఆధారంగా తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వాదించారు. మరోవైపు ఉద్యోగుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని తెలంగాణ సీఎస్ సూచించారు. దీంతో ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఈ కమిటీ గత నెల 25న జారీ చేసిన మార్గదర్శకాలపై వంద వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ఎక్కువగా 18(ఎఫ్) నిబంధనపై అభ్యంతరాలు వచ్చాయి. ఒక కేడర్‌లో స్థానికత ఆధారంగా సీనియర్లందరినీ భర్తీ చేశాక.. మిగిలిన వాటిని స్థానికతతో సంబంధం లేకుండా ఏ రాష్ర్టంలోని జూనియర్లతోనైనా భర్తీ చేయొచ్చని 18(ఎఫ్) నిబంధనలో ఉంది. దీనిపైనే ఎక్కువగా అభ్యంతరాలు రావడంతో స్వల్ప మార్పులు చేయడానికి కమిటీ నిర్ణయించింది. తప్పనిసరి ఆప్షన్స్ ఉన్న ఉద్యోగుల్లో భార్యాభర్తలు, ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తదితర అంశాలను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక ఉద్యోగుల విభజన సెల్లో తెలంగాణ అధికారులకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ఆంధ్రా సచివాలయానికి సంబంధించి మొత్తం సమాచారం సీజీజీ విభాగం నుంచి రానున్న నేపథ్యంలో.. దానికి డీజీగా ఉన్న తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా విభజన ప్రక్రియలో భాగస్వామిని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, చివరి గ్రేడ్ ఉద్యోగులైన అటెండర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు తదితరులను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఈ ఉద్యోగులు ఆప్షన్స్ ఇస్తే ఆ ప్రకారమే విభజిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం కేడర్ పోస్టులను ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టనున్నారు. తుదకు ఖరారు చేసిన మార్గదర్శకాలు కేంద్ర హోం, న్యాయ శాఖల ద్వారా ప్రధాని ఆమోదం కోసం వెళతాయి. అక్కడ ఆమోదముద్ర పడగానే ఇరు రాష్ట్రాలకు కేడర్ పోస్టులను కేటాయిస్తారు. వీటి ఆధారంగా తుది మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుంది. భౌగోళికంగా కచ్చితంగా ఉండాల్సిన పోస్టులను ఆయా రాష్ట్రాలకే కేటాయించనున్నారు. ఉదాహరణకు పోర్టులు, ఈఎస్ఐ సంస్థలు ఉన్న చోట మొత్తం ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకే కేటాయిస్తారు. ఇక్కడ 58:42 నిష్పత్తిని పాటించరు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తాత్కాలికంగా పూర్తయ్యాక ఏ ప్రభుత్వం ఎన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించడానికి అంగీకరిస్తుందో తెలుస్తుందని, దాని ఆధారంగా శాశ్వత విభజన చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు ఎలాంటి ప్రతిపాదనలు చేయనట్లు సమాచారం. -
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
రాష్ట్రంలో రేపట్నుంచి ‘ఎంసెట్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 23 వరకు ప్రక్రియ పూర్తి.. తర్వాతే ఆప్షన్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ రెండు రాష్ట్రాల్లో విడివిడిగా వెరిఫికేషన్.. ఉమ్మడిగా ప్రవేశాలు.. నేడు ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీల ఖరారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గురువారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 వరకూ ఇది కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేర్వేరుగా జరుగుతున్నప్పటికీ.. వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపును మాత్రం ఉమ్మడిగానే చేపట్టాలని తెలంగాణ, ఏపీ ఉన్నత విద్యా మండళ్లు దాదాపుగా అంగీకారానికి వచ్చాయి. మొత్తానికి సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెల 31లోగానే ప్రవేశాలను పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ కౌన్సెలింగ్ ప్రక్రియను మొదలుపెడుతూ ఎంసెట్ ప్రవేశాల కమిటీ మిగతా మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీలను ఖరారు చేసేందుకు బుధవారం నాడు ఇరు రాష్రాల ఉన్నత విద్యా మండళ్లతో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని ప్రకటి ంచింది. దీనికి హాజరు కావాలంటూ తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్‌కు లేఖ రాసినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూడా వెల్లడించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల్లోనూ గడువులోగా పూర్తి చేస్తాం: పాపిరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ నాటికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై విద్యా శాఖ అధికారులు వికాస్ రాజ్, శైలజా రామయ్యార్‌తో మంగళవారం ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23 నాటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తామని, తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఇందుకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈ విషయంలో ఏపీ ఉన్నత విద్యా మండలితో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. నోటిఫికేషన్ వివరాలు తెలంగాణలో రోజుకు 25 వేల మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కోకన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎంసెట్-2014 (ఎంపీసీ విభాగం) పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల వివరాలను ఎంసెట్ వెబ్సైట్లో (https://eamcet.nic.in) అందుబాటులో ఉంచారు. రోజూ ఉదయం 9 గంటలకు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెరిఫికేషన్‌కు విద్యార్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్ల కాపీలను తీసుకురావాలి. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ తత్సమాన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి ఒకటి 2014 తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్/ఎన్సీసీ/స్పోర్ట్స్ తదితర సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలి. ఓసీ బీసీ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీలు రూ. 300 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. కాలేజీల ట్యూషన్ ఫీజుల వివరాలు, కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండే సీట్ల వివరాలను వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ముందు ప్రకటిస్తారు. విద్యార్థుల ఆప్షన్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. కాగా, వికలాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్/గేమ్స్ తదితర కేటగిరీల వారికి హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లోనే ఈ నెల 14, 16, 17, 18 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ల తేదీలను తర్వాత వెల్లడిస్తారు. -
రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ!
సంక్షోభం దిశగా ఇంజనీరింగ్ కళాశాలలు 2.17 లక్షల మంది అర్హులు ఉన్నా 1.30 లక్షల మందే వెరిఫికేషన్‌కు హాజరు గత ఏడాది మిగిలిన సీట్లు 1.75 లక్షలు.. ఈ ఏడాది మిగలనున్న 2 లక్షల సీట్లు విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాలకు వెళుతుండటమే కారణం రాష్ర్టంలో కాలేజీల డొల్లతనం, ఫీజుల భారం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటమూ కారణమే గత ఏడాది పెద్ద సంఖ్యలో మూతపడ్డ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు ఈ ఏడాది కూడా విద్యార్థులు లేక మరిన్ని కాలీజీలు మూతపడే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలు ఈ ఏడాది గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా కలిపి రాష్ట్రంలో 3.40 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు లక్షా 30 వేల మంది మాత్రమే ఉండటం కళాశాలలను కలవరపెడుతోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గత ఏడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత తగ్గింది. దాదాపు 2.17 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు 1,30,278 మంది మాత్రమే వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. గత ఏడాది దాదాపు 1.75 లక్షల సీట్లు మిగలగా ఈ ఏడాది 2 లక్షల పైచిలుకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంకృతాపరాధం కారణంగానే కళాశాలలు ఇలాంటి సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటున్నాయని పలు యాజమాన్య సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయం నాటికి కోర్టుల్లో కేసులు వేస్తుండటంతో కాలాతీతమై ఏటా వేలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల వైపు వెళుతున్నారు. గత ఏడాది ఫీజుల నిర్ధారణలో జాప్యం జరిగి 30 వేల మంది బయటికివెళ్లగా.. ఈ ఏడాది కళాశాలల ఎత్తుగడలను ఊహించని ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శించటం.. కోర్టుల్లో కేసులు ఎదురుకావడంతో ప్రవేశాల షెడ్యూలు రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. దీంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉంటారని కళాశాలలు అంచనా వేస్తున్నాయి. ఏటా ఇంజనీరింగ్ కళాశాలలు ఆలస్యంగా ప్రారంభమవటం, ఉత్తీర్ణత శాతాలు ఆశాజనకంగా లేకపోవటం, ఫీజులు భారమవటం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటం కారణంగా విద్యార్థులు సాంప్రదాయక డిగ్రీల వైపు మొగ్గుచూపుతున్నట్టు అంచనావేస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో ఇంజ నీరింగ్ కళాశాలల డొల్లతనం బయటపడటంతో రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోందని విద్యావేత్తలు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది కేవ లం అగ్రశ్రేణి క ళాశాలల్లోనే కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మూసివేత దిశగా కాలేజీలు... ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేలాది సీట్లు మిగిలిపోతుండటంతో పలు కళాశాలలు ఏకంగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. గత ఏడాది 678 ప్రైవేటు కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా 50 శాతానికి పైగా సీట్లు నిండిన కళాశాలలు కేవలం 339 మాత్రమే. కనీసం 50 శాతం సీట్లు నిండనిపక్షంలో కళాశాల నిర్వహణ కష్టమేనని యాజమాన్యాలు చెప్తున్నాయి. 2013-14కు కొత్త ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క దరఖాస్తు రాగా మూతపడిన కాలేజీలే ఎక్కువగానే ఉన్నాయి. ప్రవేశాలు లేక 14 ఇంజనీరింగ్ కళాశాలలు, 3 ఫార్మసీ, 40 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు మూతపడ్డాయి. మరో 134 కాలేజీలు ఐటీ కోర్సును రద్దు చేసుకున్నాయి. పలు కళాశాలలు సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్ బ్రాంచీలను కూడా రద్దు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త కళాశాలలు వద్దని, ఇన్‌టేక్ 420కి పరిమితం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి ఏఐసీటీఈకి పంపింది. అయితే ఏఐసీటీఈ దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల సీట్లు మిగిలిపోతుండటంతో మరిన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం ఈ నెల 17న సీట్ల కేటాయింపు జాబితా వెలువడిన తరువాత కళాశాలల భవితవ్యం తేటతెల్లమవుతుంది. -
వెబ్ కౌన్సెలింగ్‌లో.. ఐదోరోజు 12,047 మంది హాజరు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి నిర్వహిస్తున్న వెబ్ కౌన్సెలింగ్‌లో భాగమైన సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియలో ఐదోరోజు 12,047 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీమాంధ్రలోని 38 కేంద్రాల్లో 18 కేంద్రాలే పనిచేస్తుండగా, వీటిలో 6,018 మంది హాజరయ్యారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 6,029 మంది హాజరయ్యారు. కాగా విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల తనిఖీకి శుక్రవారం ఏర్పా టైన సహాయక కేంద్రంలో షెడ్యూలును సవరించారు. కొత్త షెడ్యూలు ప్రకారం 24న 10,001 నుంచి 20,000 వరకు, 25న 20,001 నుంచి 30,000 వరకు, 26న 30 వేల నుంచి 40 వేల వరకు, 27న 40 వేల నుంచి 50 వేల వరకు, 28న 50 వేల నుంచి 60 వేల వరకు, 29న 60 వేల నుంచి 70 వేల వరకు, 30న 70 వేల నుంచి 80 వేల వరకు ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావచ్చని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నేటినుంచి కర్నూలు రాయలసీమ వర్సిటీలో సర్టిఫికెట్ల తనిఖీ కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. ఇక్కడ 24న 60 వేల నుంచి 80 వేల వరకు, 25న 80 వేల నుంచి 90 వేల వరకు, 26న 90 వేల నుంచి లక్ష వరకు, 27న లక్ష నుంచి లక్షా 10 వేల వరకు, 28న లక్షా 10 వేల నుంచి లక్షా 20 వేల వరకు, 29న లక్షా 20 వేల నుంచి లక్షా 30 వేల వరకు, 30న లక్షా 30 వేల నుంచి లక్షా 40 వేల వరకు గల ర్యాంకర్లకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ షెడ్యూలు అనంతరం సమీక్ష జరిపి 29న తదుపరి ర్యాంకర్లకు షెడ్యూలు ప్రకటిస్తామన్నారు. విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రారంభమైన గంటకే సర్వర్ మొరాయించింది. దీంతో గంటసేపు జాప్యం జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 8 వేల ర్యాంకులకు 262 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం దృష్ట్యా ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కౌన్సెలింగ్ కేంద్రం వద్ద పారా మిలటరీ బలగాలను మోహరించారు.