సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 19 నుంచి చేపట్టనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారు ఈ నెల 19న వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. చివరిదశ కౌన్సెలింగ్‌లో మొత్తంగా 27,075 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఇంజనీరింగ్‌లో 23,640 సీట్లు, బీ ఫార్మసీలో 2,964 సీట్లు, ఫార్మ్–డీలో 471 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 22న సీట్లు కేటాయిస్తామని వివరించారు.
ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని వారు, ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు రాని వారు, సీటు వచ్చినా ఆ కాలేజీల్లో వద్దనుకునే వారు తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. కాగా, కన్వీనర్ కోటాలో 64,300 సీట్లు అందుబాటులో ఉండగా మొదటి దశలో 56,046 మందికి సీట్లు కేటాయించారు. అందులో 42,529 మంది కాలేజీల్లో చేరారు. 8,254 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక చివరి దశ నాటికి మరో 1,869 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చివరి దశలో 23,640 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
నేటి నుంచి ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్
Published Wed, Jul 19 2017 8:58 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
Advertisement
Advertisement