అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం స్థానిక సైట్స్ సెంటర్‌లో ప్రారంభం కానుంది. ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు నమోదు చేసుకున్న వివిధ పాయింట్లకు సంబంధించిన సర్టిఫికెట్లను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. రీజనరేట్ అయిన పాయింట్లకు సంబంధించి తప్పనిసరిగా సర్టిఫికెట్లు ఉండాలని డీఈఓ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మండల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అర్హత ఉండి పాయింట్లు రీజనరేట్ కాని టీచర్లు నేరుగా డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో ఫిర్యాదులు చేయొచ్చన్నారు. కమిషనర్ కార్యాలయానికి పంపి సమస్య పరిష్కరిస్తామని డీఈఓ తెలిపారు. తక్కిన టీచర్లకు పాయింట్లు పడి తమకు రాలేదనే టీచర్లు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల ద్వారానే ఫిర్యాదు చేయాలి తప్ప నేరుగా సైన్స్ సెంటర్‌కు రాకూడదని డీఈఓ స్పష్టం చేశారు. అలా వస్తే పరిగణించబడదన్నారు.
నేడు బదిలీ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
Published Sun, Jul 9 2017 11:19 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement