పండిట్ల కౌన్సెలింగ్‌ నేటికి వాయిదా | today pandits councelling | Sakshi
Sakshi News home page

పండిట్ల కౌన్సెలింగ్‌ నేటికి వాయిదా

Published Fri, Aug 4 2017 9:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

today pandits councelling

అనంతపురం ఎడ్యుకేషన్‌: పండిట్ల బదిలీ కౌన్సెలింగ్‌ శనివారం నాటికి వాయిదా పడింది. కౌన్సెలింగ్‌ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైన్స్‌ సెంటర్‌లో శుక్రవారం అన్ని ఏర్పాట్లూ  చేశారు. సీనియార్టీ జాబితా మేరకు తెలుగు, హిందీ పండిట్లు ఉదయాన్నే చేరుకున్నారు. అయితే ముందురోజు జరిగిన పదోన్నతుల నేపథ్యంలో సీనియార్టీ, ఖాళీల జాబితాల్లో మార్పులు చేసేందుకు అధికారులు ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ ఇవ్వలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాయిదా వేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. ఇదిలా ఉండగా సాయంత్రం ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ ఇచ్చారు. దీంతో తుది సీనియార్టీ జాబితా కూడా తయారవుతుందని శనివారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని డీఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement