జూలై 4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన | TS ECET certificates verification will start from July 4th onwards | Sakshi
Sakshi News home page

జూలై 4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన

Published Sun, Jun 28 2015 10:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

TS ECET certificates verification will start from July 4th onwards

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్) ర్యాంకర్లకు జూలై 4 వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. జూలై 6వ తేదీ వరకు సాగే ధ్రువపత్రాల పరిశీలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ర్యాంకులను బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవచ్చు.

వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్ మాసబ్‌ ట్యాంక్‌లోగల సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం జూలై 5 వ తేదీ నుంచి 8వ తేదీ లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని సాంకేతిక విద్యా మండలి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement