TS ECET
-
ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ వైపే..
సాక్షి, హైదరాబాద్: ఈసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్ సెకండియర్‌లో 89 శాతం మందికి సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్ కౌన్సెలింగ్‌లోనూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 19,558 మంది ఈసెట్‌లో అర్హత సాధించగా తొలి దశ కౌన్సెలింగ్‌కు 13,429 మంది ఆప్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో రెండో ఏడాదిలో ప్రవేశానికి 11,260 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 9,968 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఫార్మసీలో 1,174 సీట్లు అందుబాటులో ఉంటే, 50 సీట్లు కేటాయించామన్నారు. సీట్లు దక్కించుకున్న అభ్య ర్థులు ఈ నెల 22లోగా ఆన్లైన్ చెల్లింపు ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, వచ్చే నెల 10లోగా అన్ని ధ్రువపత్రాలతో కాలేజీలో నేరుగా రిపోర్టు చేయాలని తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 19 భర్తీ అయ్యాయి. ఏఐఎంఎల్‌లో 127 సీట్లు ఉంటే, 105 కేటాయించారు. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 80 శాతంపైనే ఆప్షన్లు ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్‌లో 2,643 సీట్లు ఉంటే, 2470 సీట్లు కేటాయించారు. ఈసీఈలోనూ 2,060 సీట్లకు 1853 భర్తీ అయ్యాయి. ఈఈఈలో 1,096 సీట్లకు 1,066 కేటాయించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 886 సీట్లకు 860, సివిల్ ఇంజనీరింగ్‌లో 905 సీట్లకు 900 కేటాయించారు. -
Telangana: ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఎంసెట్) ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అదే సమయంలో ఈసెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఎంసెట్(ఇంజనీరింగ్) రిజల్ట్స్ కోసం.. ఎంసెట్(అగ్రికల్చర్) రిజల్ట్స్ కోసం.. ఈసెట్ రిజల్ట్స్ కోసం.. -
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు రీషెడ్యూల్.. తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్‌ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు.. 1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు -
TS ECET 2022: 13న జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా
కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13(బుధవారం)న జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే ఈనెల 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్, అగ్రికల్చర్ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ సైతం మీడియా సమావేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు -
టీఎస్ ఈసెట్ 2021: ముఖ్యసమాచారం
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీఎస్ ఈసెట్)–2021 నోటిఫికేషన్ వెలువడింది. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/బీఎస్సీ(మ్యాథ్స్) ఉత్తీర్ణులు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ విద్యార్థులకు బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం... అర్హతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండళ్లు గుర్తించిన డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/ఫార్మసీ ఉత్తీర్ణులు; మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌కు హాజరవ్వొచ్చు. బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులకు బీఫార్మసీలో ప్రవేశానికి అర్హత లేదు. ఆయా కోర్సులు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కోర్సులో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత 40 శాతం. పరీక్ష స్వరూపం ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు ఈ స్ట్రీమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ► మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్(విభాగం) మాత్రం అభ్యర్థి బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది. బీఎస్సీ(మ్యాథ్స్) బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు పరీక్ష స్వరూపం కింది విధంగా ఉంటుంది. ఫార్మసీ స్ట్రీమ్ అర్హత మార్కులు అభ్యర్థులు నాలుగు సబ్జెక్టుల్లో(బీఎస్సీ అభ్యర్థులకు మూడు సబ్జెక్టులు) కలిపి సగటున కనీసం 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు వర్తించవు. అర్హత– బ్రాంచ్‌లు ► టీఎస్ ఈసెట్ సబ్జెక్టు పేపర్లు వారీగా అర్హత డిప్లొమా స్పెషలైజేషన్స్.... ► కెమికల్ ఇంజనీరింగ్ పేపర్: సిరామిక్, లెదర్, టెక్స్టైల్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్–పెట్రోకెమికల్,కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్–షుగర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► సివిల్ ఇంజనీరింగ్ పేపర్: సివిల్, సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పేపర్: కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పేపర్: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ► మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ,డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్: మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్. ► మైనింగ్ ఇంజనీరింగ్ పేపర్: మైనింగ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ముఖ్యసమాచారం ► ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 17,2021 ► దరఖాస్తు ఫీజు: జనరల్ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400. ► పరీక్ష తేదీ: జూలై 1, 2021 ► ఉదయం సెషన్ (ఉ.9 గం–మ.12 గం)–ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ పేపర్లు ► మధ్యాహ్నం సెషన్ (మ.3 గం–సా.3 గం)–సీఐవీ, సీహెచ్ఈ, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం పేపర్లు. ► వెబ్సైట్: https://ecet.tsche.ac.in -
97.58 శాతం మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే టీఎస్ ఈసెట్–20 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. సెట్‌కు హాజరైనవారిలో ఏకంగా 97.58 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ పరీక్ష కోసం 28,041 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 25,448 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 24,832 మంది అర్హత సాధించారు. ఇక అర్హత పొందిన వారు ఎంపిక చేసుకున్న కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లో చేరాల్సి ఉంటుంది. ఈసెట్ ద్వారా 11 కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 9 కోర్సులు, ఫార్మసీ, డిగ్రీ (మ్యాథమెటిక్స్) కోర్సులున్నాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో బీఎస్సీ (మ్యాథమెటిక్స్)కు సంబంధించి 100 శాతం అర్హత సాధించగా, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మైనింగ్ ఇంజనీరింగ్‌లో 99.87%, సీఎస్ఈ–98.67%, ఈసీఈ–98.62%, ఈఐఈ– 98.58%, సివిల్–97.25%, ట్రిపుల్ఈ–97.14%, మెకానికల్–96.91%, మెటలార్జికల్–96.84%, కెమికల్–96.40%, ఫార్మసీ–96.21% మంది విద్యార్థులు అర్హత సాధించారు. 16 నుంచి టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్.. ఇక టీఎస్ ఈసెట్–20 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 16న తొలి దశ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అక్టోబర్ 12వ తేదీతో అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు శుక్రవారం సెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తేదీలు ప్రకటించారు. ఈసెట్ అభ్యర్థులకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలు అక్టోబర్ 10వ తేదీన స్పాట్ బుకింగ్ నిర్వహించుకోవచ్చని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెబ్సైట్లో అందుబాటులో పెట్టినట్లు వెల్లడించారు. ఈసెట్ ద్వారా అడ్మిషన్లు పొందిన అభ్యర్థులకు అక్టోబర్ 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రాథమికంగా నిర్ణయించినట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈసెట్–20 వెబ్‌సైట్‌ను చూడవచ్చని సూచించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. తొలిదశ..: ► ఆన్లైన్ ఫైలింగ్, పేమెంట్, స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ ఎంపిక, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు తేదీ, సమయం ఖరారుకు గడువు: 16–09–2020 నుంచి 23–09–2020 వరకు ► స్లాట్ బుక్ చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన: 19–09–2020 నుంచి 23–09–2020 వరకు ► సర్టిఫికెట్ల పరిశీలన చేసుకున్న విద్యార్థుల ఆప్షన్ల ఎంపిక: 19–09–2020 నుంచి 25–09–2020 వరకు ► ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 25–09–2020 ► ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్: 28–09–2020 ► ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 28–09–2020 నుంచి 03–10–2020 వరకు తుదిదశ: ► ఆప్షన్ల ఎంపిక: 06–10–2020 నుంచి 07–10–2020 వరకు ► ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 07–10–2020 ► ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్: 09–10–2020 ► ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు ► కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు.. -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో గత నెల 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలోనూ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం శుభపరిణామం అని అన్నారు. పరీక్ష నిర్వహణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. -
ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసు కున్నారు. ఈ నిర్ణయాలను హైకోర్టుకు తెలిపి కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఈ సెట్ మినహా మిగిలిన పరీక్షలను వచ్చే నెలలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. అనంతరం వారు మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ తరగతులు (వీడియో పాఠాలు) ప్రారంభమవుతాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తారు. అవకాశం ఉన్న చోట ఆన్లైన్ తరగతులు చేపడతారు. ప్రభుత్వం జారీ చేసే నిబంధనలను ప్రైవేటు స్కూళ్లు అమలు చేయాల్సిందే. డిజిటల్, ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆన్లైన్ తరగతులను కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఉన్నత తరగతులకు 3 గంటలకు మించడానికి వీల్లేదు. నాలుగు పీరియడ్లు ఉంటాయి. ప్రాథమిక తరగతులకు 2 గంటలకు మించి ఉండానికి (3 పీరియడ్లు) వీల్లేదు. అయితే వీటికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 3–5 తరగతుల వరకు విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 17 నుంచి 50 శాతం మంది టీచర్లు పాఠశాలలకు హాజరు కావాల్సిందే. డిజిటల్ తరగతులు, ఇతరత్రాకార్యక్రమాలను పర్యవేక్షించాలి. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక్కో తరగతికి ఒక రోజును కేటాయించాలి. ప్రాథమిక స్థాయి వారికి అవసరమైన సహకారం అందించాలి. ఈ నెల 17 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్, ఆన్లైన్ తరగతులు నిర్వహించాలి. సెప్టెంబర్ 1 తరువాత ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. అగ్రికల్చర్ ఎంసెట్‌కు సంబంధించిన తేదీలను వచ్చే నెల 13న నీట్ పరీక్ష తరువాత ఖరారు చేస్తారు. ఈ నెల 20 నుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తారు. -
నేటి నుంచి వెబ్సైట్లో ఈసెట్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ పూర్తిచేసి ఇంజనీరింగ్ సెకండియర్‌లో ప్రవేశానికి (లాటరల్ఎంట్రీ) నిర్వహించే టీఎస్–ఈసెట్ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్–ఈసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి 9వ తేదీ వరకు ecet.tsche.ac.in నుంచి హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 11న ఉదయం 10 నుంచి 11 వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాలులోకి అనుమతించరని తెలిపారు. ఈ పరీక్షకు 28,020 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం మొత్తం 22 ప్రాంతీయ కేంద్రాలను (17 తెలంగాణలో, 5 ఏపీలో) ఏర్పాటుచేశారు. ప్రాంతీయ కేంద్రాల్లో అన్నింట్లో కలిపి 85 పరీక్షా కేంద్రాలున్నాయి. అభ్యర్థులంతా పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు తదితర ఎలక్ట్రిక్ ఉపకరణాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష రాసే అభ్యర్థులు చేతులకు మెహిందీ, గోరింటాకు వంటివి పెట్టుకోకూడదని సూచించారు. -
బాలురదే హవా
హైదరాబాద్: టీఎస్‌ఈసెట్‌లో బాలురే పైచేయి సాధించారు. మూడు బ్రాంచీలు మినహా మిగతా అన్ని బ్రాంచీల్లోనూ బాలురే అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. టీఎస్ఈసెట్–2018 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి గురువారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్లోని యూజీసీ అకడమిక్ స్టాఫ్ కళాశాల ఆడిటోరియంలో జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, ఈసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్, కో కన్వీనర్ చంద్రమోహన్, కో ఆర్డినేటర్ సమ్మూలాల్‌తో కలసి పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల సీడీని, పాస్‌వర్డ్‌ను, బ్రాంచీల వారీగా మొదటి ఐదు ర్యాంకులను సాధించిన విద్యార్థుల జాబితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది చోటుచేసుకున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా ఈసెట్ పరీక్షను సజావుగా నిర్వహించామన్నారు. గతేడాదితో పోల్చి తే రెండువేలకు పైగా విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు హాజరైనట్టు తెలిపారు. మొత్తం 27,652 మంది విద్యార్థులు ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 26,883 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. వీరిలో 24,746 మంది (92.05 శాతం) ఉత్తీర్ణత సాధించిన ట్టు తెలిపారు. ఇంజనీరింగ్ పది, ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌తో కలసి 12 బ్రాంచీలలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కెమికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో మినహా అన్ని బ్రాంచీల్లోనూ బాలురే పైచేయి సాధించారు. ఫలితాలను చూసుకునేందుకు PROGRESSIVETS@ 2018 పాస్‌వర్డ్‌ను సైతం విడుదల చేశారు. జూన్ 10 నుంచి కౌన్సెలింగ్.. ఈసెట్ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 10 నుంచి చేపట్టనున్నట్టు పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడా రు. జూన్ 10 నుంచి కౌన్సెలింగ్ చేపట్టి ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారు. -
రేపు ఈసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు ఈ నెల 6న నిర్వహించిన ఈ–సెట్ ఫలితాలు శని వారం విడుదల కానున్నాయి. ఈ మేరకు సెట్ కమిటీ అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. -
జూలై 4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్) ర్యాంకర్లకు జూలై 4 వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. జూలై 6వ తేదీ వరకు సాగే ధ్రువపత్రాల పరిశీలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ర్యాంకులను బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవచ్చు. వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోగల సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం జూలై 5 వ తేదీ నుంచి 8వ తేదీ లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని సాంకేతిక విద్యా మండలి పేర్కొంది.