97.58 శాతం మందికి అర్హత  | TS ECET Counselling From 16/09/2020 | Sakshi
Sakshi News home page

97.58 శాతం మందికి అర్హత 

Published Sat, Sep 12 2020 3:46 AM | Last Updated on Sat, Sep 12 2020 3:46 AM

TS ECET Counselling From 16/09/2020 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ పూర్తి చేసి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే టీఎస్‌ ఈసెట్‌–20 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్‌ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. సెట్‌కు హాజరైనవారిలో ఏకంగా 97.58 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్‌ పరీక్ష కోసం 28,041 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 25,448 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 24,832 మంది అర్హత సాధించారు. ఇక అర్హత పొందిన వారు ఎంపిక చేసుకున్న కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లో చేరాల్సి ఉంటుంది. ఈసెట్‌ ద్వారా 11 కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 9 కోర్సులు, ఫార్మసీ, డిగ్రీ (మ్యాథమెటిక్స్‌) కోర్సులున్నాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌)కు సంబంధించి 100 శాతం అర్హత సాధించగా, ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో 99.87%, సీఎస్‌ఈ–98.67%, ఈసీఈ–98.62%, ఈఐఈ– 98.58%, సివిల్‌–97.25%, ట్రిపుల్‌ఈ–97.14%, మెకానికల్‌–96.91%, మెటలార్జికల్‌–96.84%, కెమికల్‌–96.40%, ఫార్మసీ–96.21% మంది విద్యార్థులు అర్హత సాధించారు. 

16 నుంచి టీఎస్‌ ఈసెట్‌ కౌన్సెలింగ్‌.. 
ఇక టీఎస్‌ ఈసెట్‌–20 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 16న తొలి దశ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి అక్టోబర్‌ 12వ తేదీతో అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు శుక్రవారం సెట్‌ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ తేదీలు ప్రకటించారు. ఈసెట్‌ అభ్యర్థులకు ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు అక్టోబర్‌ 10వ తేదీన స్పాట్‌ బుకింగ్‌ నిర్వహించుకోవచ్చని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్లు వెల్లడించారు. ఈసెట్‌ ద్వారా అడ్మిషన్లు పొందిన అభ్యర్థులకు అక్టోబర్‌ 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రాథమికంగా నిర్ణయించినట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈసెట్‌–20 వెబ్‌సైట్‌ను చూడవచ్చని సూచించారు. 

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా.. తొలిదశ..: 
► ఆన్‌లైన్‌ ఫైలింగ్, పేమెంట్, స్లాట్‌ బుకింగ్, హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఎంపిక, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు తేదీ, సమయం ఖరారుకు గడువు: 16–09–2020 నుంచి 23–09–2020 వరకు 
► స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన: 19–09–2020 నుంచి 23–09–2020 వరకు 
► సర్టిఫికెట్ల పరిశీలన చేసుకున్న విద్యార్థుల ఆప్షన్ల ఎంపిక: 19–09–2020 నుంచి 25–09–2020 వరకు 
► ఆప్షన్ల ఫ్రీజింగ్‌ తేదీ: 25–09–2020 
► ప్రొవిజినల్‌ సీట్‌ అలాట్‌మెంట్‌: 28–09–2020 
► ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీ: 28–09–2020 నుంచి 03–10–2020 వరకు

తుదిదశ: 
► ఆప్షన్ల ఎంపిక: 06–10–2020 నుంచి 07–10–2020 వరకు 
► ఆప్షన్ల ఫ్రీజింగ్‌ తేదీ: 07–10–2020 
► ప్రొవిజినల్‌ సీట్‌ అలాట్‌మెంట్‌: 09–10–2020 
► ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు 
► కాలేజీలో రిపోర్ట్‌ చేయాల్సిన తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు..   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement