Papi reddy
-
97.58 శాతం మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే టీఎస్ ఈసెట్–20 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. సెట్‌కు హాజరైనవారిలో ఏకంగా 97.58 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ పరీక్ష కోసం 28,041 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 25,448 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 24,832 మంది అర్హత సాధించారు. ఇక అర్హత పొందిన వారు ఎంపిక చేసుకున్న కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లో చేరాల్సి ఉంటుంది. ఈసెట్ ద్వారా 11 కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 9 కోర్సులు, ఫార్మసీ, డిగ్రీ (మ్యాథమెటిక్స్) కోర్సులున్నాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో బీఎస్సీ (మ్యాథమెటిక్స్)కు సంబంధించి 100 శాతం అర్హత సాధించగా, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మైనింగ్ ఇంజనీరింగ్‌లో 99.87%, సీఎస్ఈ–98.67%, ఈసీఈ–98.62%, ఈఐఈ– 98.58%, సివిల్–97.25%, ట్రిపుల్ఈ–97.14%, మెకానికల్–96.91%, మెటలార్జికల్–96.84%, కెమికల్–96.40%, ఫార్మసీ–96.21% మంది విద్యార్థులు అర్హత సాధించారు. 16 నుంచి టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్.. ఇక టీఎస్ ఈసెట్–20 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 16న తొలి దశ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అక్టోబర్ 12వ తేదీతో అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు శుక్రవారం సెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తేదీలు ప్రకటించారు. ఈసెట్ అభ్యర్థులకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలు అక్టోబర్ 10వ తేదీన స్పాట్ బుకింగ్ నిర్వహించుకోవచ్చని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెబ్సైట్లో అందుబాటులో పెట్టినట్లు వెల్లడించారు. ఈసెట్ ద్వారా అడ్మిషన్లు పొందిన అభ్యర్థులకు అక్టోబర్ 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రాథమికంగా నిర్ణయించినట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈసెట్–20 వెబ్‌సైట్‌ను చూడవచ్చని సూచించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. తొలిదశ..: ► ఆన్లైన్ ఫైలింగ్, పేమెంట్, స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ ఎంపిక, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు తేదీ, సమయం ఖరారుకు గడువు: 16–09–2020 నుంచి 23–09–2020 వరకు ► స్లాట్ బుక్ చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన: 19–09–2020 నుంచి 23–09–2020 వరకు ► సర్టిఫికెట్ల పరిశీలన చేసుకున్న విద్యార్థుల ఆప్షన్ల ఎంపిక: 19–09–2020 నుంచి 25–09–2020 వరకు ► ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 25–09–2020 ► ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్: 28–09–2020 ► ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 28–09–2020 నుంచి 03–10–2020 వరకు తుదిదశ: ► ఆప్షన్ల ఎంపిక: 06–10–2020 నుంచి 07–10–2020 వరకు ► ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 07–10–2020 ► ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్: 09–10–2020 ► ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు ► కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు.. -
వారంలోగా వర్సిటీలకు ఈసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వారం రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను (ఈసీ) నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండగా, అక్టోబరులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించింది. మిగతా వర్సిటీలకు ఈసీలు లేకపోవడంతో పాలన స్తంభించిపోయింది. దీంతో వర్సిటీల ఈసీల్లో ఉండే సభ్యుల పేర్లతో కూడిన ఫైలును ప్రభుత్వానికి గతంలోనే పంపించామని, వారం రోజుల్లోగా ఈసీల నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గురువారం వెల్లడించారు. -
దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మానవ వనరులు మెండుగా ఉన్నాయని, దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం అవుతుందని అమెరికా ఎమోరి యూనివర్సిటీ ప్రొఫెసర్ జగదీశ్ ఎన్.. సేథ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘ఇండియా ఇన్ ది న్యూ వరల్డ్ ఆర్డర్, ఆపర్చునిటీస్ ఫర్ తెలంగాణ’నే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సేథ్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను భారత్‌లో ఏర్పాటు చేసుకోవడం అవసరమన్నారు. ప్రపంచీకరణలో భాగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దగ్గర ఉన్న ప్రాంతీయ వనరులను ఉపయోగించి అభివృద్ధి సాధించాలన్నారు. దేశంలో తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు, రకరకాల పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందించేలా ఆన్ లైన్ విద్యను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పేదవర్గాలు ఉన్నత స్థితికి ఎదిగేందుకు స్వచ్చంధ సంస్థలను వినియోగించుకోవాలని, వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. త్వరలో హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్స్, ఐటీ సెక్టార్లలో బెంగళూరును దాటేస్తుందని అభిప్రాయపడ్డారు. మల్టీ నేషనల్ కంపెనీలు రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్ల కోసం పెట్టుబడులు పెడుతున్నాయని, త్వరలోనే హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు సంబంధించి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఆగస్టులో హాజరు మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
1 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం నుంచి చేపట్టాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం కారణంగా ప్రవేశాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాత్రం గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించేలా రివైజ్డ్ షెడ్యూల్ జారీ చేసింది. ఫీజుల ఖరారులో గందరగోళంతో... రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్లకు వార్షిక ఫీజు ఖరారు చేయాల్సిన టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించడంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో టీఏఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి ఫీజుల ఖరారు కోసం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని కాలేజీలు ఫీజులు ఖరారు చేయాలని కోర్టును ఆశ్రయించడంతో టీఏఎఫ్ఆర్సీ చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పు వెలువరిం చింది. అనంతరం ఆయా ఫీజుల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే తర్వాత సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే తల్లిదండ్రులపై భారం పడుతుందని, తర్వాత సర్దుబాటు చేసే అవకాశం ఉన్నా ముం దుగా ఆ భారం భరించాల్సిన పరిస్థితి వస్తుం దని భావించిన విద్యాశాఖ ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించింది. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకం జరిగి ఫీజులు ఖరారు చేసేవరకు పాత ఫీజులను అమలు చేయాలని కోరుతూ అప్పీలుకు వెళ్లనుంది. కాగా, తీర్పు కాపీ బుధవారం రాత్రి అందిందని, దీనిపై గురువారం అప్పీల్‌కు వెళ్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకానికి ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేయాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ప్రతిపాదన పంపించనున్నట్టు తెలిపారు. ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. యథావిధిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం బుధవారం వరకు 45,156 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లుæ బుక్ చేసుకున్నారు. గురువారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు జూలై ఒకటో తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. -
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 23, 24 తేదీల్లో నిర్వహించిన ఐసెట్–2019 ఫలితాలు విడుదలఅయ్యాయి. వరంగల్ అర్బన్ కాకతీయ యూనివర్సిటీ హాల్లో సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి.. కేయూ వీసీ ఆచార్య ఆర్.సాయన్న, టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఆచార్య సీహెచ్ రాజేశం, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తంతో కలిసి ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. 92.01 శాతం ఉత్తీర్ణత..: టీఎస్ ఐసెట్‌కు మొత్తం 49,565 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 44,561మంది అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్షలు రాశారు. వీరిలో 41,002మంది అభ్యర్థులు(92.01శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 22,362 మంది పరీక్షకు హాజరుకాగా 20,696 మంది (92.55శాతం), మహిళలు 22,191 మంది హాజరుకాగా 20,299 మంది (91,47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక ట్రాన్స్‌జెండర్స్ ఎనిమిది మందిలో ఏడుగురు (87.50 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన మండవ హనీస్ సత్య 160 మార్కులు సాధించి మొదటి ర్యాంకు, హైదరాబాద్ మాచారానికి చెందిన ఎన్ఎస్వీ.ప్రకాశ్‌రావు 159 మార్కులు సాధించి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. కాగా, 20 ర్యాంకుల్లోను అబ్బాయిలదే పైచేయిగా ఉంది. ఇక 5, 11, 19, 20వ ర్యాంకులు మహిళలు సాధించారు. కాకతీయ వర్సిటీ ఎనిమిదోసారి టీఎస్ ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించడంపై వీసీ, రిజిస్ట్రార్, ఐసెట్ కన్వీనర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అభినందించారు. -
ఎంసెట్‌పై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ ఫలితాలు వెల్లడించాకే ఎంసెట్–2019 ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో పెద్ద ఎత్తున తప్పిదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియలకు కొంత సమయం పట్టనుండగా, ఆలోపే ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తే, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఫెయిలైన విద్యార్థులు ఎంసెట్‌లో సైతం ఫెయిల్ కానున్నారు. దీంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తర్వాతే ఎంసెట్ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించినట్లు తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వి.వెంకటరమణతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులెవరూ ఇంటర్ ఫలితాలపై బెంగ పెట్టుకోకుండా ఎంసెట్‌కు సిద్ధం కావాలని కోరారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ విషయంలో ఇంటర్ బోర్డుతో సమన్వయం చేసుకుని ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. విద్యార్థులెవరికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఇంజనీరింగ్, 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఎంసెట్ ప్రవేశపరీక్ష జరగనుందని, ఆ తర్వాత 28న ఫలితాలు ప్రకటించాలని భావించినట్లు తెలిపారు. అయితే ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పారు. ఎంసెట్ ఫలితాలు కొద్దిగా ఆలస్యమైనా, కౌన్సెలింగ్‌తో పాటు విద్యా సంవత్సరం అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలొచ్చిన తర్వాతే దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. డిగ్రీతో పాటు బీఈడీ చేసేందుకు 5 ఏళ్ల సమయం పట్టనుందని, కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో చేరితే నాలుగేళ్లలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేయొచ్చన్నారు. నాలుగేళ్ల బీఏ, బీఈడీ/బీకాం, బీఈడీ/ బీఎస్సీ, బీఈడీ కోర్సులను ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. లక్సెట్టిపేట, కల్వకుర్తి, నారాయణ్‌ఖేడ్, భూపాలపల్లిలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో తొలుత ఈ కోర్సు ప్రారంభం కానుందన్నారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు సాధారణ డిగ్రీతో సమానమన్నారు. -
యూనివర్సిటీల చట్టంలో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కామన్ యూనివర్సిటీ విధానం తీసుకొచ్చేందుకు ప్రస్తుతమున్న యూనివర్సిటీల చట్టాన్ని మార్చేందుకు త్వరలో ఉన్నత స్థాయి కమిటీ వేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. 1982లో చేసిన విద్యాచట్టం మేరకు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల చట్టాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ యూనివర్సిటీ, సాంకేతిక విద్య యూనివర్సిటీలు, అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీలు, హెల్త్ యూనివర్సిటీ వంటి వాటికి ప్రస్తుతం ఒక్కోదానికి ఒక్కో చట్టం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే తరహా యూనివర్సిటీలకు ఒకే చట్టం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి, సిఫారసులు చేసేందుకు నాలుగైదు రోజుల్లో చట్టం చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయా చట్టాల్లోనూ పలు మార్పులు అవసరమని చెప్పారు. తెలుగు యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కోర్సులను జేఎన్ఏఎఫ్ఏయూ పరిధిలోకి తేవడం, ఆర్జీయూకేటీకి చాన్స్‌లర్‌గా గవర్నర్ ఉండాలా.. మరెవరైనా ఉండాలా.. అన్న అంశాల్లో స్పష్టతతో చట్టాన్ని రూపొందించాల్సి ఉందని తెలిపారు. మరోవైపు కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి యూనివర్సిటీ పరిధిలో 200కు మించి అనుబంధ కాలేజీలు ఉండటానికి వీల్లేదని పేర్కొన్నారు. కొన్ని ప్రముఖ విద్యాలయాలను యూనివర్సిటీలుగా మార్చే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించి, సిఫారసులు చేస్తుందని వివరించారు. కమిటీ నివేదికను నెలరోజుల్లోగా అందజేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. స్టడీ సెంటర్లపై కాలేజీలకు లేఖలు రాష్ట్రంలో ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదని, అలాంటి వాటిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. వాటికి లేఖలు రాయనున్నట్లు తెలిపారు. -
వనపర్తిలో ట్రిపుల్ ఐటీ!
సాక్షి, వనపర్తి : రాష్ట్రంలో మరో ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కళాశాలను వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాపిరెడ్డి నేతృత్వంలోని బృందం సభ్యులు సోమవారం వనపర్తికి వచ్చారు. వనపర్తిలో ప్రభుత్వ భవనాలు, స్థలాలు, విద్యుత్, నీటివసతి, రహదారులు, ఇదివరకే ఇక్కడ ఉన్న విద్యాలయాల వివరాలను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వారికి వెల్లడించారు. తాత్కాలికంగా ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనాన్ని చూపించారు. అలాగే శాశ్వత భవనాల నిర్మాణాలకు కావాల్సిన ప్రభుత్వ స్థలాలు ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాల పక్కనే ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలపై పరిశీలనకు వచ్చిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే వనపర్తిలోని వసతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వెల్లడించారు. -
తెలంగాణ ఎంసెట్ షెడ్యుల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ - 2018 షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం ఎంసెట్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. మే 2నుంచి ఐదు రోజులపాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2, 3 న అగ్రికల్చరర్, ఫార్మాకు సంబంధించి, 4,5,7 తేదీల్లో ఇంజరీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 4 చివరి తేదీ. అపరాద రుసుముతో ఏప్రిల్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో 10, ఏపీలో నాలుగు సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. -
ఆన్లైన్లో టీఎస్ ఐసెట్
కేయూ క్యాంపస్: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌ను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి తెలిపారు. కేయూలో బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. టీఎస్ ఐసెట్–2018 నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయను న్నట్లు వెల్ల డించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని, ఈ ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అప రాధ రుసుము లేకుండా ఐసెట్ కు దర ఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఏప్రిల్ 30 వరకు ఉంటుందన్నారు. రూ.500 అపరాధ రసుముతో మే 5 వరకు, రూ.2,000 అపరాధ రుసుము తో మే 10 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు, రూ.1 వేలఅపరాధ రుసుముతో మే 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. దరఖాస్తు ఫారం ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.450, ఇత రులకు రూ.650 చెల్లించాల్సి ఉంటుం దన్నారు. మే 7న అభ్యర్థులు హాల్ టికె ట్లు డౌన్లోడు చేసుకోవచ్చని.. ప్రవేశ పరీక్ష మే 23, 24 తేదీల్లో మూడు సెషన్లలో బ్యాచ్‌లవారీగా ఆన్లైన్లో నిర్వహిం చనున్నట్లు వివరించారు. మే 23న ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ప్రిలిమినరీ కీని మే 27న వెల్లడిస్తామని చెప్పారు. ప్రిలి మినరీ కీపై అభ్యంతరాలను జూన్ 4 వరకు స్వీకరిస్తామని, జూన్ 6న ఐసెట్ ఫలితాలను, ఫైనల్ కీని విడుదల చేస్తా మన్నారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమ ణ, టీఎస్ ఐసెట్ చైర్మన్, కేయూ వీసీ సాయన్న, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.సుబ్రమణ్యశర్మ పాల్గొన్నారు. కామన్ ఎంట్రన్స్ కేయూ క్యాంపస్: తెలంగాణలోని అన్ని వర్సిటీల పరిధిలో 2018–19 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులో ప్రవేశా లకు కామన్ ఎంట్రన్స్ టెస్టును (పీజీ సెట్) నిర్వహించాలని యోచిస్తున్నా మని పాపిరెడ్డి వెల్లడించారు. -
మే 2 నుంచే ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను మే 2వ తేదీ నుంచే నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. గత షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని, 7వ తేదీని రిజర్వుగా పెట్టామన్నారు. మే 6న నీట్ పరీక్ష ఉన్నందునా ఆ రోజును మినహాయించి మిగతా తేదీల్లో పరీక్షలను నిర్వహిం చేలా రోజువారీ షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు. మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించే అవకాశముందన్నారు. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టే రోజువారీ పరీక్ష తేదీలు ఉంటాయన్నారు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల రోజువారీ పరీక్షల తేదీలు, వాటి ఫీజులు తదితర అంశాలపై ఎంసెట్ కమిటీ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కన్వీనర్లను మంగళవారం ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. వర్సిటీల జాబితాలో పేర్లను పరిశీలించిన మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి కన్వీనర్లను ప్రకటించారు. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్ష ఫీజులను ఆయా వర్సిటీలు, సెట్స్ కమిటీలు సమావేశమై ఖరారు చేస్తాయన్నారు. ఈనెలాఖరు నాటికి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఐసెట్, లాసెట్ మినహా 2018 సెట్స్ నిర్వహణ బాధ్యతలను 2017లో నిర్వహించిన వారికే అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. -
‘విపత్తు నిర్వహణ’ పాఠాలు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి విపత్తు నిర్వహణపై ఉన్నత విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా పాఠాలు ఉండాలన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఈ పాఠాలకు పరీక్షల్లో రెండు క్రెడిట్ పాయింట్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. పాఠ్యాంశాలను ఎలా పొందుపరచాలన్న అంశంపై ఈనెల 30, 31 తేదీల్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇనిస్టిట్యూషన్ ఆధ్వర్యంలో రాçష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో ఉన్నత విద్యా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వృత్తి విద్యా కోర్సులతో సహా అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ ఈ పాఠాలను ఏదేని ఒక సెమిస్టర్లో పొందుపరుస్తామన్నారు. -
ఐసెట్ పరీక్షకు ప్రశ్న పత్రం ఎంపిక
హన్మకొండ : ఐసెట్ ప్రశ్నపత్రం కోడ్ ను ఎంపికచేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోడ్ ను గురువారం ఉదయం ఎంపిక చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2017 ప్రవేశ పరీక్ష గురువారం ఉదయం 10 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షకు 77,422 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం 16 రీజినల్ సెంటర్లు, 132 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9:30 గంటల వరకు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని వివరించారు. సమస్యలుంటే 0870-238088 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
పాపిరెడ్డిని అరెస్ట్ చేయాలి: కొనగల
ఈసెట్ పరీక్ష ఆలస్యంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఈసెట్ పరీక్షను ఐదు గంటలు ఆలస్యంగా నిర్వహించడానికి కారుకులైన ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని అరెస్టు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం నిర్వహించిన ఈసెట్ పరీక్షపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక అనుమానాలున్నాయని చెప్పారు. -
మార్చి 2 నుంచి ఈసెట్ దరఖాస్తులు
షెడ్యూలు జారీ... ఆన్లైన్లో పరీక్ష సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈసెట్–2017 షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఈసెట్ నోటిఫికేషన్ ఈ నెల 27న ప్రకటించనున్నారు. మొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో మే 6 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించేందుకు ఈసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఆన్లైన్ పరీక్ష రిజిస్ట్రేసన్ కోసం ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాలి. మార్చి 2 నుంచి ఏప్రిల్ 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్లను ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ప్రాథమిక కీని మే 8న విడుదల చేస్తారు. అభ్యంతరాలను మే 11 వరకు స్వీకరించి, ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. మే 17 నుంచి ర్యాంకు కార్డులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
మండలి ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు!
మార్చి మొదటి లేదా రెండో వారంలో నోటిఫికేషన్ ఎన్టీఏ నేపథ్యంలో మార్కుల ఆధారంగా మిగులు సీట్లు భర్తీ ఉన్నత విద్యా మండలి యోచన.. పూర్తి పరిశీలన తర్వాతే నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ను విద్యా మండలి ఆధ్వర్యంలోనే చేపట్టాల ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిసింది. మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గతేడాది తొలి సారిగా డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలను కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. కానీ అనేక సమస్యలు తలెత్తాయి. దీంతో వృత్తి విద్యా కాలేజీల్లో మండలి ఆధ్వర్యంలో ప్రవే శాలు చేపడుతున్నట్లుగానే డిగ్రీలోనూ చేప ట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మార్చి ఒకటో వారం లేదా రెండో వారంలో ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. ప్రవేశాల్లో లోపాలపై అధ్యయనం యాజమాన్య కోటా సీట్ల భర్తీ, మైనారిటీ విద్యా సంస్థల్లో సొంత కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ వంటి విధానాల్లో లోపాలు, సమస్యలపై వైస్ చాన్స్లర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయాలని విద్యా మండలి పాలకవర్గం భేటీలో నిర్ణయించారు. ఇక కన్సార్షియం ఆఫ్ అసోసియేషన్స్ పేరుతో సొంతంగా చేసుకుంటున్న ప్రవేశాలను నియంత్రించాల ని, పక్కాగా నిబంధనలు పాటించేలా చర్య లు చేపట్టాలని యోచిస్తున్నారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలోనే అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం, జేఈఈ మెయిన్ ద్వారానే ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రవేశాలు చేపట్టేలా కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో... చివరకు మిగిలిపోతున్న సీట్లను మార్కుల ఆధారంగా భర్తీ చేయాలన్న అంశం చర్చకు వచ్చింది. దీనిపై మరింత లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇతర నిర్ణయాలు.. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హా జరును అమలు చేయాలని.. ప్రస్తుత రెండో సెమిస్టర్‌కు మినహాయింపు ఇ వ్వాలని నిర్ణయించారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలపై అన్ని వర్సిటీల మేధావులతో ఏప్రిల్‌లో జాతీయ సెమి నార్ నిర్వహించడంపై చర్చ జరిగింది. కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ ఆవశ్యక తపై మరోసారి ప్రభు త్వానికి సిఫారసు చేయాలని, వర్సిటీల అభివృద్ధి, కోర్సు లు తదితర అంశాలపై వీసీలతో కమి టీ ఏర్పాటు చేసి, నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. -
ఈ యూనివర్సిటీలు, కాలేజీలు నకిలీవే
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, రాష్ట్రానికి చెందిన పలు కాలేజీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, అవి నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలేనని రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వాటిల్లో చదివి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కోర్సును నిర్వహించే 3 యూనివర్సిటీలు, 8 కాలేజీలకు, వాటి స్టడీసెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కాని, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ గుర్తింపునివ్వలేదని, యూజీసీ కూడా వాటికి గుర్తింపు ఇవ్వలేదని వెల్లడించారు. యూనివర్సిటీలు/ప్రభుత్వం/ యూజీసీ గుర్తింపు లేని కాలేజీల్లో చదివితే నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇతర వివరాలను యూజీసీ వెబ్సైట్లో (ugc.ac.in) పొందవచ్చని వివరించారు. ఇవీ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలు ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ⇒ సంఘానియా యూనివర్సిటీ, ఝుంఝును రాజస్తాన్ ⇒ జేఎస్ యూనివర్సిటీ, ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా యాప్రాల్, హైదరాబాద్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, తూముకుంట, సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ ఎదురుగా, శామీర్‌పేట్, రంగారెడ్డి ⇒ గ్రీన్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సుందర్‌నగర్ కాలనీ, మెయిన్‌రోడ్ సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్ ⇒ గ్రీన్‌ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ , సాయినగర్ రోడ్, రాజధాని హోటల్ లేన్ ఎదురుగా, హైదరాబాద్ ⇒ తెలంగాణ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్ట్రీట్ నెంబర్-2 బిగ్ బజార్ దగ్గర తార్నాక, హైదరాబాద్ ⇒ మాగ్జిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, నంజిని ఎన్క్లేవ్, ప్రశాంత్‌నగర్, ఉప్పల్ పోలీసుస్టేషన్ పక్కన, ఉప్పల్ ⇒ గ్రీన్ ప్లాంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, వివేకానందనగర్, కెనరా బ్యాంకు ఎదురుగా, కూకట్పల్లి, హైదరాబాద్ ⇒ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, హిల్ కాలనీ, రిలయన్స్ డిజిటల్ ఎదురుగా వనస్థలిపురం, హైదరాబాద్ -
ఇంజనీరింగ్ కాలేజీల షట్‌డౌన్
-
ఇంకా పెత్తనం చెలాయిస్తే ఊరుకోం
టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఏపీ ఉన్నత విద్యావుండలిపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలపై ఆజమాయిషీ అధికారం తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్ అధికారం కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలికే ఉంటుంది’ అని టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. వివిధ రకాల కోర్సులకు సాధ్యమైనంత త్వరగా మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలు పూర్తి చేసి తెలంగాణ ఉన్నత విద్యా మండలికే ర్యాటిఫికేషన్ ఫైళ్లను పంపించాలని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఏపీ మండలికి పంపితే తరువాత పరిణావూలకు కాలేజీలే బాధ్యతవహించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి ఇంకా పెత్తనం చలాయిస్తే ఊరుకోబోమని తెలిపారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఉన్నత విద్యా మండలి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. పాలన పరమైన సమస్యల వల్ల ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తి చేసేందుకు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, ఆగస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేస్తామంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి కేసులో ఇంప్లీడ్ అయి మరీ సుప్రీంకోర్టుకు చెప్పిందని గుర్తుచేశారు. ఇపుడేమో మళ్లీ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అంటున్నారెందుకని ప్రశ్నించారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని చెప్పిన ఏపీ ఉన్నత విద్యా మండలి ఇపుడు మొదటి దశ కౌన్సెలింగ్ అరుున వారికి తరగతులు ప్రారంభిస్తే, రెండో దశవారి సంగతేమిటని ప్రశ్నించారు. పైగా రెండో విడత ప్రవేశాలు చేపట్టాలంటే మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించి, కోర్టు అనుమతిస్తేనే చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పారని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. -
రాజుకుంటున్న విద్యామండళ్ల మద్య వివాదం
-
సైన్స్ అభివృద్ధితోనే సమాజ పురోగతి
విద్య అంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాదు... ‘ఇన్స్పైర్’ శిక్షణ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కేయూ క్యాంపస్ : సైన్సపై ఆసక్తి పెంచుకుని నిర్దేశిత లక్ష్యంతో భవిష్యత్‌లో రాణించేలా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విద్యార్థులకు సూచించారు. సైన్స అభివృద్ధితోనే సమాజ పురోగతి కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నా రు. ఇన్స్పైర్ ఇంటర్న్‌షిప్ సైన్స్ క్యాంపు శిక్షణ కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పరిపాలన భవనం సెనేట్ హాల్లో శిక్షణను పాపిరెడ్డి ప్రారంభించి మాట్లాడా రు. విజ్ఞానాన్ని అందిస్తూనే భవిష్యత్‌లో ఉపాధి కల్పించేందుకు విద్య ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తుండడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ కోర్సులపై ఆసక్తి చూపిస్తుండడంతో విద్యార్థులు తప్పనిసరిగా ఆ కోర్సుల్లో చేరినా నైపుణ్యాలు లేకపోవడంతో చిరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని పాపిరెడ్డి తెలిపారు. టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివి కొంతమేర కష్టపడిన వారికే ఉపాధి లభిస్తోందన్నారు. ఈ మేరకు చదువంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాకుండా పలు సైన్స్ కోర్సులు ఉన్నాయని గుర్తించాలని సూచించారు. ఇన్స్పైర్ శిక్షణకు వచ్చిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థు లు ఉన్నారని, ఐదు రోజుల శిక్షణలో వారికి సైన్స్‌పై అవగాహన పెరుగుతుందని పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. విషయ పరిజ్ఞానం ఉండడం లేదు.. విద్యార్థులకు ఇంటర్లో మార్కులు ఎక్కువగానే వస్తున్నా సబ్జెక్టుల పరంగా విషయ పరిజ్ఞానం ఉండడం లేదని భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ జి.నరహరశాస్త్రి అన్నారు. ఈ మేర కు ఆసక్తి ఉన్న కోర్సుల్లోనే చేరి అందులో రాణించాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా పరిశోధన రంగంలో అనుకున్న మేర పురోగతి లేదని.. దీన్ని అధిగమించేందుకు దేశంలోని ప్రసిద్ధ సైంటిస్టుల జీవిత చరిత్రలు చదివి విద్యార్థులు ఉత్తేజం పొందాలని కోరారు. కేయూ ఇన్చార్జ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ. సింగరాచార్య, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య నేటి సమాజానికి అవసరమన్నారు. ఇన్స్పైర్ కోఆర్డినేటర్ ఎం.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల కోసం కేయూలో ఇన్స్పైర్ నిర్వహించడం ఇది మూడోసారని తెలిపారు. ప్రస్తుతం 150మంది విద్యార్థులు పాల్గొంటుం డగా, వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జువాలజీ విభాగాధిపతి ఎం.స్వామి, సైన్స్ డీన్ ఎ.సదానందం, డాక్టర్ వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి, నరహరిశాస్త్రిని నిర్వాహకులు సన్మానించారు. -
విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు: పాపిరెడ్డి
హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ పాపిరెడ్డి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజులుగా విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ అంశంపై శుక్రవారం సమావేశం నిర్వహిస్తామని ఆయన మీడియా తెలిపారు. సీఎం కేసీఆర్, అధికారులతో చర్చించి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఓ ప్రశ్నకు పాపిరెడ్డి సమాధానమిచ్చారు. ఎంసెట్, ఇంజినీరింగ్ అడ్మిషన్ల వ్యవహరంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ను మేమే నిర్వహించుకుంటాం అని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే ఏపీ అధికారులతో చర్చిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు.