హన్మకొండ : ఐసెట్ ప్రశ్నపత్రం కోడ్ ను ఎంపికచేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోడ్ ను గురువారం ఉదయం ఎంపిక చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2017 ప్రవేశ పరీక్ష గురువారం ఉదయం 10 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షకు 77,422 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం 16 రీజినల్ సెంటర్లు, 132 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9:30 గంటల వరకు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని వివరించారు. సమస్యలుంటే 0870-238088 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
ఐసెట్ పరీక్షకు ప్రశ్న పత్రం ఎంపిక
Published Thu, May 18 2017 8:26 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
Advertisement
Advertisement