TS Icet
-
టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్ ఈఏపీ సెట్‌తో పాటు ఐసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్ చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4, 5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు చేశారు. -
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2024–2025)లో ప్రవేశాలకుగాను ప్రవేశ పరీక్ష (టీ ఎస్‌ఐసెట్) నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ వీసీ, టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్, కన్వినర్ ఆచార్య నర్సింహాచారి మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు హనుమకొండలోని యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో తొలుత సెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీనుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో మే 17వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చునని, మే 20వ తేదీనుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. టీఎస్ ఐసెట్‌ను జూన్ 4, 5వ తేదీల్లో నిర్వహిస్తారని చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టుగానే నిర్వహిస్తారని పేర్కొన్నారు. జూన్ 4న రెండు సెషన్లలో, 5న ఒక సెషన్లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. కాగా, జూన్ 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంత రాలు స్వీకరిస్తారు. ఫలితాలను జూన్ 28న విడుదల చేస్తారు. కార్యక్రమంలో కేయూ రిజి్రస్టార్ పి.మల్లారెడ్డి, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, డీన్ పి.అమరవేణి, బీఓఎస్ చైర్మన్ కట్ల రాజేందర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సదానందం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ రాధిక పాల్గొన్నారు. -
TS: విడుదలైన ఐసెట్ ఫలితాలు.. తొలి పది ర్యాంకులు అబ్బాయిలవే
తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ టీఎస్ ఐసెట్ 2023 ఫలితాలను జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో విడుదల చేశారు. ఈ ఫలితాలలో పాటు ఫైనల్ 'కీ' ని కూడా విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఫలితాల విడుదల ఆలస్యంగా గురువారం (జూన్ 29)న విడుదల చే అయింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023 పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. 70,900 మంది హాజరయ్యారు. ఈ సారి ఐసెట్‌లో తొలి 10 ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. వీరిలో మొదటి ర్యాంకు నూకల శరణ్‌కుమార్ కైవసం చేసుకోగా.. నాగులపల్లి సాయి నవీన్ రెండు, రవితేజ సజ్జ మూడో ర్యాంకులో సాధించారు. టాప్ 10లో ఆ తర్వాతి ర్యాంకుల్లో ఎస్.సాయి ఫణి ధనుష్, గోపి మల్లికంటి, తిరుగుడు సుమంత్ కుమార్ రెడ్డి, ఆయాచితుల నితీశ్‌కుమార్, వి. సాయి వెంకట కార్తిక్, ఎస్.నాగసాయి కృష్ణవంశీ, బి.సాయిగణేష్ నిలిచారు. చదవండి: Hyderabad: అమ్మో ఫాస్ట్‌ఫుడ్! పంది కొవ్వు కొని నూనెగా మార్చి తక్కువ ధరకు విక్రయం -
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఈ విద్యాసంవత్సరం (2023–2024) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 6 నుంచి మే 6వ వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550, ఇతరులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఇలా... టీఎస్ ఐసెట్ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. ►26న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెషన్ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, నాలుగో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ►14 ప్రాంతీయ కేంద్రాలు, సుమారు 75 పరీక్షకేంద్రాలను కూడా గుర్తించారు. ►ప్రాథమిక కీని జూన్ 5న విడుదల చేస్తారు. ►ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది. ►ఫలితాలు జూన్ 20న విడుదల చేస్తారు. 25 శాతం అర్హత మార్కులు టీఎస్ ఐసెట్‌లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు లేవని, మిగతా కేటగిరీలవారికి అర్హత మార్కులు 25%గా నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. సిలబస్, మోడల్ పేపర్, సూచనలు, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ విధాన, ఆన్లైన్ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్ టెస్టుల సమాచారం జ్టి్టpట//జీఛ్ఛ్టి.్టటజ్ఛి.్చఛి.జీn లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ పి.వరలక్ష్మి తెలిపారు. -
ఐసెట్‌కు 90% హాజరు
సాక్షి, హైదరాబాద్/ కేయూ క్యాంపస్ (వరంగల్): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూని వర్సిటీ రెండ్రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఐసెట్)కు 90.56% హాజరైనట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి తెలి పారు. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో 27, 28 తేదీల్లో ఐసెట్ జరిగింది. మొత్తం 75,952 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 68,781 (90.56%) హాజర య్యారని, 7171 (9.44 శాతం) గైర్హాజరైనట్లు అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. ఐసెట్ ప్రాథమిక కీ ఆగస్టు 4న విడు దల చేస్తారని, అభ్యంతరాలు 8వ తేదీ వరకు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు. ఫైనల్ కీ, ఫలితాలు ఆగస్టు 22న విడుదల చేస్తారని తెలిపారు. -
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు తేదీని పొడిగించింది. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్ ఐసెట్‌కు 67,361 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే 1,700 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్‌టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్–2022 నిర్వహించనున్నట్లు తెలిపారు. -
టీఎస్ ఐసెట్, లాసెట్ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తు గడువును ఆలస్య రుసుముతో వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఇకపై గడువు పొడిగించలేమని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2022–2023)లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అపరాధ రుసుము లేకుండా జూలై 4 వరకు గడువు పొడిగించినట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా సోమవారంతో గడువు ముగియడంతో మరోసారి పొడిగించినట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్‌ను జూలై 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (చదవండి: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..) -
ఈ నెల 23న టీఎస్ఐసెట్ ఫలితాలు
కేయూ క్యాంపస్: రాష్ట్రం లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్–2021 ఫలితాలను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది అగస్టు 19, 20వ తేదీల్లో మూడు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి 56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు. -
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. అర్హులైన వారు ఎలాం టి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీ నర్, కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు కె.రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియగా, మళ్లీ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఆర్జేసీసెట్–21 అర్హుల జాబితా విడుదల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల కోసం ఆర్జేసీసెట్–21కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా అర్హత కల్పిస్తూ రూపొందించిన ప్రాథమిక జాబితాను బుధవారం విడుదల చేశారు. ఈ జాబితా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీలోపు హాల్‌టికెట్, కుల ధ్రువీకరణ, బదిలీ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ, పాస్‌ఫొటోలు తదితర ధ్రువపత్రాలతో ఎంపికైన కాలేజీలో రిపోర్టు చేయాలని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రిపోర్టు చేయకుంటే ఆ విద్యార్థి అనర్హుడవుతారని స్పష్టంచేశారు. జూలై 18న గురుకుల ప్రవేశ పరీక్ష సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీజీసెట్–21)ను వచ్చేనెల 18న నిర్వహించాలని సెట్ కన్వీనర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్ల లో ఐదోతరగతికి సంబంధించి 47వేల సీట్లున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఆన్లైన్ దర ఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 1.35లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు గురుకుల సొసైటీ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
Telangana: సెట్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాసెట్ తెలంగాణలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీలాసెట్ – 2021 దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. విద్యార్థులు వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా వారు ఎంచుకున్న సమీప ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలు ఉంటుందని చెప్పారు. పీఈసెట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. టీఎస్ ఐసెట్ కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. పరీక్షకు ఈ నెల 23వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండడం, కొన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు జరగకపోవడంవల్ల ఈ నెల 15వ తేదీతో ముగియనున్న గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలతో పెంచామని ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్‌ను ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో ఈసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇందు కోసం ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లోనే ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. స్లాట్ బుక్ చేసుకున్న తేదీల్లోనే ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చామని తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు స్పెషల్ కేటగిరి విద్యార్థు లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, వారు కూడా ఫీజు చెల్లించినప్పుడే స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 26, 27వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ఎంపిక, 28వ తేదీన ఆప్షన్లు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. ఈనెల 29న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులంతా 31వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని పేర్కొంది. 31వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. రేపు ఐసెట్ సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 15న సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. ప్రవేశాల కోసం 16,800 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, అందులో 15,067 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీట్ల కేటాయింపు వివరాలను tsicet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. -
ఇదీ ఐసెట్ ప్రవేశాల షెడ్యూల్..!
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 6వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. దీంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీలను ఆదేశించింది. కరోనా కారణంగా ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ఆలస్యమైనందునా ఇప్పటివరకు ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించలేదు. అయితే ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు యూనివర్సిటీలు అన్ని డిగ్రీ కోర్సుల ఫలితాలను వెల్లడించాయి. అయితే ఇప్పటికీ కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థుల మెమోల ముద్రణ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానంపై మండలి దృష్టి సారించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను (ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్లలోని మిగతా సెమిస్టర్లకు సంబంధించిన బ్యాక్‌లాగ్స్ సహా) పూర్తి విద్యార్థుల సమగ్ర డేటాను సీడీల రూపంలో ఇవ్వాలని ఆదేశించింది. దీంతో యూనివర్సిటీలు ఆ డేటాపై కసరత్తు చేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో యూనివర్సిటీల నుంచి డేటా వస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ మిగతా సెట్లకు వెనువెంటనే.. ఇటు ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసిన వెంటనే ఎడ్‌సెట్, లాసెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు ఒక్కొక్క నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. అయితే ముందుగా డిగ్రీ రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన (బ్యాక్‌లాగ్స్ లేకుండా) విద్యార్థులందరికీ మొదటి దశ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని వివరించారు. ఆ తర్వాత ఆన్లైన్లో తరగతుల ప్రారంభానికి చర్యలు చేపడతామని తెలిపారు. మరోవైపు బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయా విద్యార్థులకు కూడా చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మొత్తానికి ఈ నెలాఖరులోగా ప్రవేశాలు అన్నింటినీ పూర్తి చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రవేశాల కోసం 90 వేల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎడ్‌సెట్‌లో 29,861 మంది, లాసెట్‌లో 16,572 మంది, ఐసెట్‌లో 41,506 మంది అర్హత సాధించారు. పీఈసెట్లోనూ మరో 6 వేల మంది వరకు అర్హత సాధించారు. వారందరికీ త్వరలోనే ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇదీ ఐసెట్ ప్రవేశాల షెడ్యూల్.. 6–12–2020 నుంచి 11–12–2020 వరకు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ 8–12–2020 నుంచి 12–12–2020 వరకు: స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 8–12–2020 నుంచి 13–12–2020 వరకు: వెబ్ ఆప్షన్లు 15–12–2020న: సీట్ల కేటాయింపు 15–12–2020 నుంచి 19–12–2020 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్.. 22–12–2020: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ 23–12–2020: స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 22–12–2020 నుంచి 24–12–2020 వరకు: వెబ్ ఆప్షన్లు 26–12–2020: సీట్ల కేటాయింపు.. 26–12–2020 నుంచి 29–12–2020: సీట్లు పొందిన వారు ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, మొదటి, చివరి దశలో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయడం. 28–12–2020: వెబ్సైట్లో (https://tsicet.nic.in) స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు. -
23, 24న టీఎస్ ఐసెట్
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో 2018–19 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు మొత్తం 62,400 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఎం. సుబ్రమణ్యశర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన పరీక్ష వివరాలను వెల్లడించారు. గతేడాది 73 వేల వరకు దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 62,400 వచ్చాయని, గతేడాదితో పోలిస్తే 11వేలకు పైగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణలో 58 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి విశాఖపట్నం, మరొకటి విజయవాడలో ఉన్నాయని తెలిపారు. తొలిసారిగా ఐసెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించం ఈ నెల 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుంద న్నారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక షిఫ్ట్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతోపాటు ఫొటోపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకుని తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అలాగే ఐడీ ప్రూఫ్ కార్డు కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. కరీంనగర్‌ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల్లో కొందరికి అక్కడే సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ మరో 700 మందికి వేరే జిల్లాల్లో కేటాయించామన్నారు. జూన్ 7న ఐసెట్ ఫలితాలను విడుదల చేస్తామని కన్వీనర్ సుబ్రమణ్యశర్మ తెలిపారు. -
31న టీఎస్ ఐసెట్ ఫలితాలు
► కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ వెల్లడి వరంగల్: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈనెల 18న నిర్వహించిన టీఎస్ ఐసెట్-2017 పరీక్ష ఫలితాలు ఈనెల 31న విడుదల చేయనున్నట్టు టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం వెల్లడించారు. ఈనెల 30వ తేదీనే ఫలితాలను విడుదల చేయాలని తొలుత షెడ్యూల్లో ప్రకటించామని, కానీ, ఈనెల 31న సాయంత్రం 4 గంటలకు హైదారాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తామన్నారు. ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,172 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఈనెల 21న ప్రాథమిక కీ విడుదల చేసి 27వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించామన్నారు. 60 నుంచి 70 వరకు అభ్యంతరాలు వచ్చాయని ప్రొఫెసర్ ఓంప్రకాశ్ చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టిపాపిరెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న ఫలితాలు విడుదల చేస్తారని, అదేరోజు ఫైనల్ కీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
ఐసెట్ పరీక్షకు ప్రశ్న పత్రం ఎంపిక
హన్మకొండ : ఐసెట్ ప్రశ్నపత్రం కోడ్ ను ఎంపికచేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోడ్ ను గురువారం ఉదయం ఎంపిక చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2017 ప్రవేశ పరీక్ష గురువారం ఉదయం 10 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షకు 77,422 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం 16 రీజినల్ సెంటర్లు, 132 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9:30 గంటల వరకు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని వివరించారు. సమస్యలుంటే 0870-238088 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు.