టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీసెట్‌ షెడ్యూల్‌లో మార్పు | Change In Ts Icet And Eamcet Schedule | Sakshi
Sakshi News home page

టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీసెట్‌ షెడ్యూల్‌లో మార్పు

Published Fri, Mar 22 2024 9:17 PM | Last Updated on Sat, Mar 23 2024 5:19 PM

Change In Ts Icet And Eamcet Schedule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్‌ ఈఏపీ సెట్‌తో పాటు ఐసెట్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్‌ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్‌ చేసింది.  మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 4, 5న జరగాల్సిన ఐసెట్‌ జూన్‌ 5, 6 తేదీలకు మార్పు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement