Eamcet schedule
-
టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్ ఈఏపీ సెట్‌తో పాటు ఐసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్ చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4, 5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు చేశారు. -
TS EAMCET: ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. -
ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన
అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ -
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వ తేదీ వరకు, రూ.1000 ఫైన్‌తో ఏప్రిల్ 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.5వేల ఫైన్‌తో ఏప్రిల్ 20 తేదీ వరకు, రూ.10వేల జరిమానాతో ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మే 4,5,6వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే9,11వ తేదీల్లో అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలుజరగనున్నాయి. -
ఎంసెట్ షెడ్యూల్ నేడు విడుదల
బాలాజీచెరువు (కాకినాడ) : మే ఎనిమిదిన జరిగే ఎంసెట్ షెడ్యూల్‌ను బుధవారం వెల్లడించనున్నట్లు కన్వీనర్ చల్లాబత్తుల సాయిబాబు మంగళవారం తెలిపారు. పరీక్ష ఫీజు, దరఖాస్తు స్వీకరణ తదితర వివరాలను తెలియజేస్తామన్నారు. -
మే 14న తెలంగాణలో ఎంసెట్, 28న ర్యాంకులు
ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్న ఎంసెట్ తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణలో మే 14న ఎంసెట్ నిర్వహిస్తారు. మే 28న ర్యాంకులు ప్రకటిస్తారు. ఈమేరకు ఎంసెట్ షెడ్యూలును శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి... * ఎంసెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 25 * ఆన్లైన్లో అప్లికేషన్ల స్వీకరణ - ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు * అప్లికేషన్ల పరిశీలన - ఏప్రిల్ 15 నుంచి 20 వరకు * హాల్‌టికెట్ల డౌన్లోడ్ - మే 8 నుంచి 12 వరకు * 500 అపరాధ రుసుంతో దరఖాస్తు - ఏప్రిల్ 15 వరకు * 1000 అపరాధ రుసుంతో దరఖాస్తు - ఏప్రిల్ 22 వరకు * 5000 అపరాధ రుసుంతో దరఖాస్తు - మే 5 వరకు * 10000 అపరాధ రుసుంతో దరఖాస్తు - మే 12 వరకు * ఎంసెట్ పరీక్ష నిర్వహణ - మే 14 * ఇంజనీరింగ్ పరీక్ష - ఉదయం 10 నుంచి 1గంట వరకు * అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష - మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు * ఎంసెట్ కీ విడుదల - మే 16 * కీలో అభ్యంతరాలకు గడువు - మే 23 * ర్యాంకుల ప్రకటన - మే 28 -
నేడు ఎంసెట్ షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన షెడ్యూలు ఈనెల 20న జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఎంసెట్ కమిటీ సమావేశం తర్వాత ఈ షెడ్యూలును ప్రకటించనుంది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తుల ప్రారంభం, ముగింపు, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తులు చేసుకునే విధానం వంటి వివరాలను అందులో ప్రకటించనుంది.