మే 14న తెలంగాణలో ఎంసెట్, 28న ర్యాంకులు
ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్న ఎంసెట్ తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణలో మే 14న ఎంసెట్ నిర్వహిస్తారు. మే 28న ర్యాంకులు ప్రకటిస్తారు. ఈమేరకు ఎంసెట్ షెడ్యూలును శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి...
* ఎంసెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 25
* ఆన్లైన్లో అప్లికేషన్ల స్వీకరణ - ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు
* అప్లికేషన్ల పరిశీలన - ఏప్రిల్ 15 నుంచి 20 వరకు
* హాల్టికెట్ల డౌన్లోడ్ - మే 8 నుంచి 12 వరకు
* 500 అపరాధ రుసుంతో దరఖాస్తు - ఏప్రిల్ 15 వరకు
* 1000 అపరాధ రుసుంతో దరఖాస్తు - ఏప్రిల్ 22 వరకు
* 5000 అపరాధ రుసుంతో దరఖాస్తు - మే 5 వరకు
* 10000 అపరాధ రుసుంతో దరఖాస్తు - మే 12 వరకు
* ఎంసెట్ పరీక్ష నిర్వహణ - మే 14
* ఇంజనీరింగ్ పరీక్ష - ఉదయం 10 నుంచి 1గంట వరకు
* అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష - మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు
* ఎంసెట్ కీ విడుదల - మే 16
* కీలో అభ్యంతరాలకు గడువు - మే 23
* ర్యాంకుల ప్రకటన - మే 28