Telangana EAMCET
-
తెలంగాణ ఎంసెట్ పేరు మార్పు.. పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్‌ను ఈఏపీసెట్ (TS EAPCET)గా తెలంగాణ ఉన్నత విద్యా మండలి మార్పు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (TS EAPCET) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 6న ఈసెట్ మే 9 నుంచి 13 వరకు ఎంసెట్ మే 23న ఎడ్‌సెట్ జూన్ 3న లాసెట్ జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ ఇదీ చదవండి: TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే! -
TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సైతం పాల్గొన్నారు. పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. అలాగే.. రెండు కేటగిరీల్లో ఏపీకి చెందిన విద్యార్థులే టాప్ ఫైవ్ ర్యాంకుల్లో సత్తా చాటడం గమనార్హం. సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయినట్లు తెలిపారామె. అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ దక్కినట్లు ప్రకటించారు. అగ్రికల్చర్ పరీక్షలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు మంత్రి సబిత. అగ్రికల్చర్ & మెడిసిన్(AM) కేటగిరీ టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ ఇందులో టాపర్‌గా నిలిచాడు. ఇక.. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో విశాఖపట్నంకు చెందిన సానపాల అనిరుధ్ టాపర్‌గా నిలిచాడు. ఇందులోనూ టాప్ 5లో నలుగురు ఏపీవాళ్లే కావడం గమనార్హం. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. -
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌కు ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ను ఎత్తివేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్‌లో పొందే మార్కుల ఆధారంగానే ర్యాంకు ఇస్తారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో ఇంటరీ్మడియేట్ పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది వరకూ 70% సిలబస్‌ను అమలు చేశారు. దీంతో ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేకుండానే ఎంసెట్ ర్యాంకులు ఇచ్చారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్ మార్కులు ఎక్కువ రావడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అనేక కారణాల వల్ల తక్కువ మార్కులు వస్తుండటంతో ఎంసెట్ ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ సమీక్షించిన విద్యాశాఖ ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ని ఎత్తివేసింది. -
తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాల కారణంగా గురువారం, శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి బుధవారం వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎంసెట్ మెడికల్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
Telangana: ఎంసెట్ నిర్వహణపై.. ఉన్నత విద్యామండలి చైర్మన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. వర్షాలున్నా, పరీక్షకు ఇబ్బంది ఉండదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. 17 నుంచి 19 వరకూ ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ తేదీలను గతంలోనే ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం 3 రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పరీక్ష తేదీల మార్పుపై అధికారులు తొలుత కసరత్తు చేశారు. కానీ మండలి సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ మాత్రం ఎంసెట్ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో పలు పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకొని ఎంసెట్ తేదీలు ఖరారు చేసినందున ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని ఉన్నత విద్యామండలికి సూచించింది. ఇదే విషయాన్ని మండలి చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్‌కు హాజరుకాలేని విద్యార్థులుంటే ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 17 నుంచి జరిగే ఇంజనీరింగ్ ఎంసెట్ సమయానికి వర్షాలు తగ్గుతాయనే విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలో ఎంసెట్ వాయిదా వేస్తే ఇప్పటికే సిద్ధమైన విద్యార్థులు ఇబ్బంది పడే వీలుందని లింబాద్రి తెలిపారు. పేద విద్యార్థులకు నష్టం: విద్యార్థి సంఘాలు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఎంసెట్ వాయిదా కుదరదని ఓ సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ చెబితే ప్రభుత్వం వినడం ఏమిటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి ప్రశ్నించారు. -
తెలంగాణ ఎంసెట్: కంప్యూటర్ సైన్స్‌పైనే అందరి గురి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై విద్యార్థులు ఈసారి పెద్దఎత్తున ఆశలు పెంచుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో పోటీ పడుతున్నారు. ఆప్షన్ల గడువు బుధవారంతో ముగుస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 34 వేల మంది.. దాదాపు 15 లక్షలకుపైగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. గతంలో 25 వేల మందే రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా.. 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. వీరిలో 3 వేల మంది వచ్చిన సీటును గడువులోగా వదులుకున్నారు. వీళ్లంతా నచ్చిన కాలేజీ, బ్రాంచ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లు పొందిన వారు లేదా జాతీయ కాలేజీల్లో కచి్చతంగా సీటొస్తుందని భావించే వారు. చదవండి: తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కే ప్రాధాన్యత ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో హైకోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్ సీట్లు పెరిగాయి. ఇవి కన్వీనర్ కోటా కింద 4,404 వరకూ ఉన్నాయి. ఇందులో సింహభాగం కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. వీటిపైనే విద్యార్థులు ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. పెరిగిన సీట్లలో ఎక్కడో అక్కడ కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని ఆశిస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఉన్నత విద్యా మండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ వచి్చన ఆప్షన్స్‌లో 89 శాతం కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మొదటి దశలో సీటొచ్చిన అభ్యర్థులు పెరిగిన సీట్లను అంచనా వేసుకుని రెండో దశలో కంప్యూటర్ కోర్సుల కోసం పోటీ పడ్డారు. ఇందులోనూ మొదటి ప్రాధాన్యత ఆరి్టఫీషిÙయల్ ఇంటిలిజెన్స్‌కే ఇవ్వడం విశేషం. ఎట్టకేలకు జేఎన్టీయూహెచ్ అనుమతి పెరిగిన సీట్లపై తొలుత పేచీ పెట్టిన జేఎన్టీయూహెచ్ ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. విశ్వవిద్యాలయం గుర్తింపు ఉంటే తప్ప కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకాశం లేదని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఒకదశలో ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా పెరిగే సీట్లను భర్తీ చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వర్సిటీ కూడా మొత్తం సీట్లకు ఆమోదం తెలపకతప్పలేదు. అయితే, పెరిగిన సీట్లకు అనుకూలంగా వసతులు, ఫ్యాకల్టీని మెరుగుపరచాలని వర్సిటీ ప్రైవేటు కాలేజీలకు షరతు విధించింది. పెరిగిన సీట్లు ఇవీ... బ్రాంచ్ సీట్లు సీఎస్ఈ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 1,533 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాసైన్స్ 840 సీఎస్సీ (డేటాసైన్స్) 672 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 546 సీఎస్ఈ (సైబర్ సెక్యూరిటీ) 231 సీఎస్ఈ 168 కంప్యూటర్ సైన్స్ డిజైన్ 168 ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ 126 సీఎస్ఈ (ఐవోటీ) 42 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 21 ఈఈఈ 21 సివిల్ ఇంజనీరింగ్ 21 మైనింగ్ ఇంజనీరింగ్ 15 -
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా
సాక్షి, హైదరాబాద్, సాక్షి నెట్వర్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలోనూ ఏపీకి టాప్ టెన్‌లో నాలుగు దక్కాయి. ఫలితాలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 92.48 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఇంటర్మీడియట్ మార్కులను ఈసారీ వెయిటేజ్‌గా తీసుకోలేదు. ఇంటర్ సబ్జెక్టుల్లో కనీస మార్కుల అర్హత నిబంధనను ఎత్తివేశారు. ఎస్సీ, ఎస్టీలు మినహా కటాఫ్ మార్క్ 40గా నిర్ణయించారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,64,963 మంది దరఖాస్తు చేయగా.. 1,47,991 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,21,480 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86,641 మంది దరఖాస్తు చేయగా.. 79,009 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 73,070 మంది అర్హత సాధించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో శాస్త్రవేత్తనవుతా ఐఐటీ, ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో శాస్త్రవేత్తగా రాణించాలని ఉంది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక దేశంలోని ప్రముఖ మేనేజ్మెంట్ కళాశాలలో చదివేందుకు క్యాట్ పరీక్ష రాస్తా. – సత్తి కార్తికేయ, ఇంజనీరింగ్ ఫస్ట్ ర్యాంకర్, పాలకొల్లు 158.49 పర్సంటైల్‌తో ప్రథమ ర్యాంక్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సత్తి కార్తికేయ తెలంగాణ ఎంసెట్‌లో 158.497905 పర్సంటైల్ సాధించి ప్రథమ ర్యాంకర్‌గా నిలిచాడు. వ్యాపారి సత్తి త్రినాథరావు, కృష్ణకుమారి దంపతుల రెండో కుమారుడైన కార్తికేయ ఇప్పటికే 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ర్యాంక్‌లో ఉన్నాడు. ఆలిండియా ఒలింపియాడ్‌లో 5వ ర్యాంకు సాధించాడు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లోనూ సత్తా చాటాడు. ఐఐటీ చేయాలని.. తెలంగాణ ఎంసెట్‌లో వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం శెవనవారిపల్లికి చెందిన దుగ్గినేని వెంకట ప్రణీత్ ఇంజనీరింగ్ విభాగంలో రెండో ర్యాంక్ సాధించాడు. ప్రణీత్ తండ్రి దుగ్గినేని యుగంధర్ ఏపీఎస్పీడీసీఎల్లో డీఈఈగా గుంతకల్లులో పని చేస్తున్నారు. ఇటీవల రాసిన జేఈఈ మెయిన్స్‌లో నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ముంబైలో ఐఐటీ చేయాలన్నది తన లక్ష్యమని ప్రణీత్ చెప్పాడు. అమ్మా, నాన్నల బాటలోనే.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో అనంతపురం రామచంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస కార్తికేయ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకుతో సత్తా చాటాడు. మొత్తం 160 మార్కులకు గాను 150.04 మార్కులు సాధించాడు. ఇతని తల్లి పద్మజ, తండ్రి సుధీంద్ర ఇద్దరూ వైద్యులే. ప్రస్తుతం నీట్‌కు సిద్ధమవుతున్నానని, మెడిసిన్ చదవాలనేది తన లక్ష్యమని శ్రీనివాస కార్తికేయ తెలిపాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ర్యాంకు సాధించగలిగానని చెప్పాడు. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ చెందిన చందం విష్ణువివేక్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఐదో ర్యాంకు సాధించాడు. పదో తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన విష్ణు వివేక్ చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు అతడి తల్లి లక్ష్మి తెలిపింది. ప్రస్తుతం విష్ణు నీట్‌కు సిద్ధమవుతున్నాడు. డాక్టర్ కావడమే తన లక్ష్యమని తెలిపాడు. వైద్యుడిగా రాణించాలని.. కాకినాడకు చెందిన కోలా పవన్‌రాజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 149.63 మార్కులతో 6వ ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి కేఎస్వీవీఎస్ రాజు రైల్వేలో అసిస్టెంట్ సెక్షన్ ఇంజినీర్. తల్లి గంగాభవాని గృహిణి. నీట్ పరీక్ష రాసి వైద్య కోర్సు అభ్యసించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది తన జీవిత లక్ష్యమని పవన్ తెలిపాడు. సత్తా చాటిన క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ విభాగంలో విజయనగరం పట్టణానికి చెందిన మిడతాన ప్రణయ్ 7వ ర్యాంకు, ఎస్.దివాకర్ సాయి 9వ ర్యాంకు సాధించారు. ఇద్దరూ ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు విజయనగరంలో చదివారు. టెన్త్, ఇంటర్ విజయవాడలో చదువుకున్నారు. అక్కడ ఇద్దరూ రూమ్ మేట్స్ కూడా. మిడతాన ప్రణయ్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తల్లి వి.జ్యోతి గంట్యాడ మండలం రామవరం జెడ్పీ హైస్కూల్లో తెలుగు టీచర్ కాగా.. తండ్రి ఎంవై రామారావు లక్కిడాం జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు. ఐఐటీ ముండైలో కంప్యూటర్ సైన్స్ చేయాలన్నదే లక్ష్యమని ప్రణయ్ తెలిపారు. 9వ ర్యాంకరైన దివాకర్ సాయి తండ్రి శ్రీనివాసరావు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెడ్ కానిస్టేబుల్. తల్లి కాసు మల్లేశ్వరి గృహిణి. ఐఐటీలో చేరాలన్న లక్ష్యంతో చదివినట్టు దివాకర్ సాయి తెలిపాడు. 8వ ర్యాంక్ సాధించిన నెల్లూరు విద్యార్థి నెల్లూరు మాగుంట లేఅవుట్‌కు చెందిన డి.సాయిప్రణవ్ 8వ ర్యాంక్ సాధించాడు. ఇతడి తల్లిదండ్రులు మాధవ్, పద్మజ ఇద్దరూ వైద్యులు. తాను మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానని ప్రణవ్ చెప్పాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించానన్నాడు. -
ఈ నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరున జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో సాధారణంగా ముందు మూడ్రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 6 సెషన్లలో (రోజుకు 2 సెషన్లు) నిర్వహిస్తారు. అవసరమైతే 8వ తేదీన కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశముంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు(జూలై 3న), ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒకరోజు గడువే ఉంటోంది. మరోవైపు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి నీట్ తేదీలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో మరోసారి ఉన్నత విద్యామండలితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. ఇక, ఈసారి 160 ప్రశ్నలకు బదులు 180 ప్రశ్నలిస్తే విద్యార్థులకు 20 ప్రశ్నలు ఆప్షన్‌గా ఉండేలా కసరత్తు చేస్తోంది. వీటన్నింటిపై చేపట్టిన ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తయితే నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. లేదంటే వచ్చే నెల మొదటి వారంలో జారీ చేయనుంది. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లు వారంపాటు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2020 కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఇంకా ప్రభుత్వ అను మతి రాకపోవడం, ఇటు కాలేజీలకు యూని వర్సిటీ అఫిలియేషన్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఈమేరకు కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలు కాగా, సోమవారం (ఈనెల 12న) నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. బీటెక్‌లో కొత్త కోర్సులకు అనుమతి రాకపోవడంతో పాటు అఫిలియేషన్ల ప్రక్రియలో జాప్యం జరగడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వారం పాటు వాయిదా వేశారు. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి వెబ్ఆప్షన్లు ఇచ్చేకునేలా వెబ్సైట్లో అధికారులు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వరకు ఆప్షన్లు ఇచ్చేలా వీలు కల్పించారు. అదేరోజు ఆప్షన్లు ఫ్రీజ్ కావడంతో ఈనెల 24న సీట్ల అలాట్మెంట్ పూర్తవుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలి. కరోనా నేపథ్యంలో.. రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లో 1,10,873 సీట్లున్నాయి. ఈమేరకు ప్రతి కాలేజీకి ఏటా యూనివర్సిటీ అఫిలి యేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న కాలేజీలే కౌన్సెలింగ్‌లో పాల్గొం టాయి. వాస్తవానికి ఈ అఫిలియేషన్ ప్రక్రియ మే నెలాఖరు నాటికే పూర్తవుతుండటంతో ఆ తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీల పేర్లు కనిపిస్తాయి. కానీ ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో అఫిలియేషన్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అఫిలియేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. మరోవైపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోగా.. వీటికి ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. దీంతో బీటెక్‌లో కొత్తగా 15,690 సీట్లు పెరగనున్నాయి. అయితే ఈ కోర్సులు, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎంసెట్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అఫిలియేషన్, కొత్త కోర్సుల అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేశారు. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్లో అన్ని సబ్జెక్టుల్లో పాసైనా.. రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం వస్తోంది. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఎంసెట్ ఫలితాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్ అవుతున్పారు. (చదవండి : ఇంజనీరింగ్ ఎంసెట్‌లో టాపర్లంతా బాలురే) కాగా, తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను మంగళవారం హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజ నీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,43,326 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 89,734 మంది (75.20 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు. -
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా
సాక్షి, అమరావతి/విజయనగరం అర్బన్/గుడివాడ టౌన్: తెలంగాణ ఎంసెట్–2020లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ఫలితాలు విడుదలవ్వగా.. టాప్–10 ర్యాంకుల్లో అయిదింటిని ఏపీ విద్యార్థులే దక్కించుకున్నారు. రెండో ర్యాంక్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కాపెల్లి యశ్వంత్‌సాయికి రాగా.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన టి.మణివెంకటకృష్ణ మూడో ర్యాంకును సాధించాడు. కృష్ణా జిల్లా గుడివాడ గౌరీశంకరపురానికి చెందిన టి.కృష్ణ కమల్ 7వ ర్యాంక్‌ను, గుంటూరుకు చెందిన పెనగమూరి సాయిపవన్ హర్షవర్థన్ 9వ ర్యాంక్‌ను, విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన వారణాసి వచన్ సిద్దార్థ్ 10వ ర్యాంకును సాధించారు. ఫస్ట్ ర్యాంకర్ మనోడే.. విజయనగరానికి చెందిన వారణాసి సాయితేజ తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తల్లిదండ్రులు విజయరామయ్య, శాంతకుమారి విజయనగరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్లుగా పనిచేస్తుండగా.. సాయితేజ హైదరాబాద్‌లో ఇంటర్ చదువుకున్నాడు(విద్యార్థి చిరునామాను రంగారెడ్డి జిల్లా, తెలంగాణగా ఫలితాల జాబితాలో పేర్కొన్నారు). తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్ లభించడం ఆనందంగా ఉందని సాయితేజ చెప్పాడు. కంప్యూటర్ సైన్స్ చదివి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. చిరు వ్యాపారి కుమారుడికి టాప్ ర్యాంక్ గుడివాడకు చెందిన టి.ఈడీఎన్వీఎస్ కృష్ణకమల్ తెలంగాణ ఎంసెట్‌లో 7వ ర్యాంక్ సాధించాడు. కృష్ణ కమల్ తండ్రి చిరు వ్యాపారి కాగా.. తల్లి గృహిణి. తెలంగాణ ఎంసెట్‌లో టాప్–10లో నిలిచినందుకు సంతోషంగా ఉందని కృష్ణకమల్ చెప్పాడు. జేఈఈ కూడా రాశానని.. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివినట్లు తెలిపాడు. కృష్ణ కమల్‌కు స్వీటు తినిపిస్తున్న కుటుంబసభ్యులు -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యాశాఖ మండలి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ పరీక్ష రాసిన వారిలో 89,734 మంది(75%) ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈసారి మొదటి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు మొదటిఫస్ట్ ర్యాంక్ రాగా, యశ్వంత్ సాయి-రెండో ర్యాంక్, వెంకటకృష్ణ-మూడో ర్యాంక్ సాధించారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ జరిగిందన్నారు. విద్యార్థుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ముందుగా చెప్పినట్లు, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లతో పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థులు వచ్చి పరీక్షలు రాశారని తెలిపిన మంత్రి ఈ మేరకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కరోనా కారణంగా కోవిడ్ వచ్చినా విద్యార్థులకు ఈనెల 8న మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో అధికారులు ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 102 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్ పరీక్షలకు 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,19,183 మంది హాజరు అయ్యారు. -
రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రవేశాల కమిటీ పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకు 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించిన సమయంలో కరోనా బారిన విద్యార్థుల నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. వారికి ఈనెల 8వ తేదీన పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. -
తెలంగాణ ఎంసెట్ ‘కీ’ విడుదల..
సాక్షి, జేఎన్టీయూ: రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ‘కీ’ని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎంసెట్ కీ ఈ రోజు(శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 20 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్‌లో 1 లక్ష 19వేల187 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఎంసెట్ పరీక్షకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఎంసెట్ ప్రాథమిక కీతోపాటు విద్యార్థుల ఓఎంఆర్ పేపర్ స్కానింగ్ కాపీలనూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీను నిర్ణయిస్తుందని తెలిపారు. తుది ‘కీ’ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని, ఎంసెట్ ‘కీ’ సంబంధించిన వివరాలను అభ్యర్థులు https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని గోవర్ధన్ పేర్కొన్నారు. -
తెలంగాణ ఎంసెట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్‌ను కూడా నిర్వాహకులు ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్ చెక్ చేసి, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపుతున్నారు. పరీక్షా కేంద్రాలను కూడా శానిటైజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకోనున్నారు. తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ సెషన్లో ఈ మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుంది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ జరగనుంది. -
ఆన్లైన్లో ఎంసెట్ హాల్‌టికెట్లు..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 102 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. 1,43165 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆన్లైన్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని.. ఈ నెల 7 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. (చదవండి: సెషన్‌కు సెషన్‌కు మధ్య 3 గంటలు..) శానిటైజర్లు విద్యార్థులు తెచ్చుకోవచ్చని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలన్నారు. ముందురోజే వెళ్లి పరీక్ష కేంద్రం నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు. అక్టోబర్ మొదటివారంలో ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నామని గోవర్ధన్ పేర్కొన్నారు. -
సెషన్‌కు సెషన్‌కు మధ్య 3 గంటలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలైలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లలో ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా పరీక్షల సమయాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేందుకు, కుర్చీలు, బెంచీలు కెమికల్‌తో శుభ్రపరిచేందుకు, ఆన్లైన్ పరీక్షలు అయినందున కంప్యూటర్, కీ బోర్డు, మౌస్ వంటివి శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో కొన్ని ఒకే సెషన్‌తో ముగియనుండగా, మరికొన్ని ఎక్కువ సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎంసెట్ పరీక్షను తీసుకుంటే 6 సెషన్లలో (ప్రతిరోజు ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్) మూడ్రోజులపాటు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అలాగే అగ్రికల్చర్ పరీక్షలను రెండు, మూడు సెషన్లలో, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి వాటికి రెండేసి చొప్పున సెషన్లలో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఒక సెషన్‌కు మరో సెషన్ మధ్య 2 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడుతాజాగా పరీక్షల తేదీలను మార్పు చేసిన నేపథ్యంలో 3 గంటల వ్యవధి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో శానిటైజేషన్ చర్యల కోసం మధ్యలో 3 గంటల సమయం ఉండేలా ఉదయం సెషన్ పరీక్షల సమయాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. -
జూలై 6 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్ : జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జూలైలోనే ఇతర అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. శనివారం హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపైనా, ప్రవేశ పరీక్షలపైనా చర్చించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా నిబంధనలకు లోబడి, యూనివర్సిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడిం చారు. పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్, మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌కు 6.. అగ్రికల్చర్‌కు 3 సెషన్లు జూలై 6 నుంచి నిర్వహించే ఎంసెట్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 6, 7, 8 తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుందన్నారు. ఇక 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే 10న ఉదయం సెషన్ కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. 10న జరిగే లాసెట్‌కు విద్యార్థులు తక్కువే ఉంటారు కాబట్టి ఆ సదుపాయాలను కూడా దీనికి వినియోగించుకుంటామని చెప్పారు. ఇక రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్లో 25 వేల నుంచి 30 వేల మంది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఎంసెట్‌కు 2,10,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,35,974 మంది ఇంజనీరింగ్ కోసం, 74,567 మంది అగ్రికల్చర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. కాగా, కామన్ ఎంట్రెన్స్ టెస్టŠస్ దరఖాస్తుల గడువు వచ్చే నెల పది వరకు పెంచినట్టు పాపిరెడ్డి తెలిపారు. జూన్ 20 నుండి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తామని, మొదట ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఇవి ముగిసిన వారం తర్వాత బ్యాక్ లాగ్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్
-
తెలంగాణ ఎంసెట్ తేదీల ప్రకటన
తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాలెజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిఠ్ఠల్, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఫ్రొఫెసర్ వి.వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్‌ను విడుదల చేశారు. కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పడటంతో అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై శనివారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్, జులై 4న తెలంగాణ ఈసెట్, జులై 10న లాసెట్, జులై 1 నుంచి 3 వరకు టీఎస్ పీజీఈసెట్, జులై 1న టీఎస్ పాలిసెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. -
తెలంగాణ ఎంసెట్‌లో మన విద్యార్థులే టాప్
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/తిరుపతి ఎడ్యుకేషన్: తెలంగాణ ఎంసెట్–2019 ఫలితాల్లో మన రాష్ట్ర విద్యార్థులు ‘టాప్’ లేపారు. ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ విభాగాల్లో టాప్ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు టాప్ టెన్‌లో మొదటి, రెండో ర్యాంకుతో కలిపి మొత్తం ఐదు ర్యాంకులు సాధించి తమ ప్రతిభ చూపారు. అదేవిధంగా అగ్రి, మెడికల్ విభాగంలోనూ టాప్ టెన్‌లో ఐదు ర్యాంకులు సాధించారు. ఆదివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో విడుదలైన ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ ర్యాంక్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కురిశెట్టి రవి శ్రీతేజకు దక్కింది. ఇదే విభాగంలో రెండో ర్యాంకు విజయవాడకు చెందిన డి.చంద్రశేఖర ఎస్ఎస్ హేతహవ్యకు, నాలుగో ర్యాంకు నెల్లూరుకు చెందిన బట్టేపాటి కార్తికేయకు, ఐదో ర్యాంకు భీమవరానికి చెందిన గొర్తి భానుదత్తాకు, 8వ ర్యాంకు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గౌరుపెద్ది హితేందర్ కాశ్యప్‌కు లభించాయి. ఇక అగ్రి, మెడికల్ విభాగంలో రాజమహేంద్రవరంకు చెందిన దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో ర్యాంకును దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మూడో ర్యాంకు కాకినాడకు చెందిన మార్కాని వెంకట సాయి అరుణ్తేజకు, నాలుగో ర్యాంకు తిరుపతికి చెందిన సుంకర సాయి స్వాతికి, 8వ ర్యాంకు విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ భరద్వాజ్ బృందావనంకు, 9వ ర్యాంకు తిరుపతికి చెందిన పూజకు లభించాయి. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు తెలంగాణకు చెందిన ఎంపటి కుశ్వంత్‌కు దక్కింది. ఏపీ ఎంసెట్‌లోనూ అతడే టాప్ తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులు ఇటీవల వెల్లడైన ఏపీ ఎంసెట్–2019 ఫలితాల్లోనూ సత్తా చాటడం విశేషం. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కురిశెట్టి రవి శ్రీతేజ మొదటి ర్యాంక్ దక్కించుకోవడం విశేషం. అదేవిధంగా గొర్తి భానుదత్తా ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్ పొందాడు. అలాగే ఏపీ ఎంసెట్‌లో అగ్రి, మెడికల్ విభాగంలో రెండో ర్యాంక్ దక్కించుకున్న దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఎంసెట్‌లోనూ అదే స్థానంలో నిలిచాడు. అదేవిధంగా తిరుపతికి చెందిన సుంకర స్వాతి ఏపీ ఎంసెట్ మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఈ నెల 20 తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 తర్వాత ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్‌లో 90 వేల వరకు సీట్లు ఉన్నాయన్నారు. ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య మాట్లాడుతూ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’లపై అభ్యంతరాలను స్వీకరించగా 330 అభ్యంతరాలు వచ్చాయన్నారు. వాటిని నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి ఫైనల్ ‘కీ’ని విడుదల చేశామన్నారు. ఏపీ ఎంసెట్ ప్రవేశాలపై అధికారుల మల్లగుల్లాలు ఏపీ ఎంసెట్ ఫలితాలు వెలువడినా ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెల 18 లోపు ప్రవేశాలు కల్పించాలని భావించినా అందుకు సమయం చాలకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల అఫ్లియేషన్‌కు సంబంధించిన ప్రక్రియను కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రక్రియ ముగియడానికి మరో నాలుగు రోజులు పడుతుంది. అలాగే జేఈఈ మొదటి విడత ప్రవేశాలు చేపడితే జేఈఈతోపాటు ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించినవారు ఐఐటీ, ఎన్ఐటీ ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరతారు. అది పూర్తయ్యాక ఎంసెట్ ప్రవేశాలు ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు. అయితే.. ఇప్పటికే ప్రవేశాలు ఆలస్యమయ్యాయని, జేఈఈ ప్రవేశాల కంటే ముందే వీటిని ప్రారంభించడం మంచిదన్న అభిప్రాయంతో సాంకేతిక విద్యా శాఖ ఉంది. మొదటి విడతలో సీట్లు పొంది చేరని వారుంటే ఆ స్థానాల్లో రెండోసారి కౌన్సెలింగ్ సమయంలో అందరికీ అవకాశం కల్పిస్తే సరిపోతుందన్న ఆలోచనతో ఉంది. దీన్ని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ దృష్టికి తెచ్చి ఆయన సూచనల మేరకు ముందుకు వెళ్తామని మండలి వర్గాలు వివరించాయి. పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తా మాది కాకినాడ. నేను నీట్లో 1,292వ ర్యాంక్, ఏపీ ఎంసెట్‌లో 107వ ర్యాంకు సాధించాను. జాతీయ వైద్య విద్య కళాశాలల్లో చదువుకుని పేద ప్రజలకు సేవలందిస్తాను. –ఎం.వెంకట అరుణ్ తేజ, తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ విభాగం మూడో ర్యాంకర్ ఐఐటీలో సీటు సాధిస్తా.. నాకు ఇంటర్లో 985 మార్కులొచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 33వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ఐఐటీలో సీటు సాధిస్తా. – చంద్రశేఖర ఎస్ఎస్ హేతహవ్య, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) రెండో ర్యాంకర్ ఐఐటీయే లక్ష్యం మా నాన్న సురేష్ నాయుడు ఆక్వా రైతు, అమ్మ అమరావతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో, జేఈఈ మెయిన్‌లో 5వ ర్యాంకు సాధించా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం. – బట్టేపాటి కార్తికేయ, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) నాలుగో ర్యాంకర్ పరిశోధనలంటే ఇష్టం.. మా నాన్న నాగ వెంకట విశ్వనాథం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో, ఇంటర్లో 10 జీపీఏ సాధించా. ఏపీ ఎంసెట్‌లో, జేఈఈ మెయిన్‌లో 3వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం చూస్తున్నా. నాకు పరిశోధనలంటే ఇష్టం. – భాను దత్త, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) ఐదో ర్యాంకర్ సివిల్స్ సాధిస్తా.. నా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో 125వ ర్యాంకు సాధించా. సివిల్స్‌లో విజయం సాధించడమే నా లక్ష్యం. – గౌరిపెద్ది హితేందర్ కాశ్యప్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) ఎనిమిదో ర్యాంకర్ కార్డియాలజిస్టునవుతా.. నాన్న సూర్యభాస్కర రెడ్డి రైల్వే ఉద్యోగి. అమ్మ విజయశాంతి గృహిణి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంక్ సాధించగలిగాను. పదో తరగతిలో, ఇంటర్మీడియట్లో పదికి పది జీపీఏ సాధించాను. ఏపీ ఎంసెట్‌లో కూడా రెండో ర్యాంక్ వచ్చింది. కార్డియాలజిస్టునవుతా. – దాసరి కిరణ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ విభాగం రెండో ర్యాంకర్ -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రవిశ్రీ తేజ, సెకండ్ ర్యాంక్ డి.చంద్రశేఖర్ మూడో ర్యాంక్ ఆకాశ్ రెడ్డి (హైదరాబాద్), నాలుగో ర్యాంక్ కార్తీకేయ (హైదరాబాద్) సాధించారు. ఇక ఇంటర్ వెయిటేజ్ మార్కుల కారణంగా ఎంసెట్ ఫలితాలు విడుదలలో జాప్యం జరిగింది. కాగా గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో తొలి పది ర్యాంకర్లు 1. కురిచేటి రవి శ్రీతేజ (తాడేపల్లిగూడెం) 2. చంద్రశేఖర్ (హైదరాబాద్) 3. ఆకాశ్ రెడ్డి (హైదరాబాద్) 4. కార్తికేయ (హైదరాబాద్) 5. భాను దత్తా (భీమవరం) 6. సాయి వంశీ (హైదరాబాద్) 7. సాయి విజ్ఞాన్ (హైదరాబాద్) 8. ఐతేంద్ర కశ్యప్ (గిద్దలూరు) 9. వేద ప్రణవ్ (హైదరాబాద్) 10. అప్పకొండ అభిజిత్ రెడ్డి (హైదరాబాద్) అగ్రికల్చర్, ఫార్మసీలో.. 1.కుశ్వంత్ (భూపాల్పల్లి) 2. దాసరి కిరణ్ కుమార్ (రాజమండ్రి) 3. వెంకట సాయి తేజ (కాకినాడ) 4. సుంకర సాయి స్వాతి (తిరుపతి) 5. అక్షయ్ (హైదరాబాద్) 6. మోనిష ప్రియ (తమిళనాడు) 7. బుర్ర శివాని శ్రీవాత్సవ (నిజామాబాద్) 8. సిద్ధార్థ భరద్వాజ్ (విశాఖపట్నం) 9. పూజ (తిరుపతి) 10. హశిత (హైదరాబాద్) -
వచ్చే నెల మొదటివారంలో ఎంసెట్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల మొదటివారంలో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎంసెట్ ఫలితాలను వెల్లడించాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. రీవెరిఫికేషన్ ఫలితాల అనంతరం ఇంటర్మీడియట్ మార్కులకు ఎంసెట్ ర్యాంకుల ఖరారులో 25 శాతం వెయిటేజీని ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఇంటర్ బోర్డు ఆ ఫలితాలను వెల్లడిస్తే వచ్చే నెల మొదటి వారంలో ఎంసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు ఆలస్యమైతే ఎంసెట్ ర్యాంకుల వెల్లడి కూడా ఆలస్యం కానుంది. చివరి దశకు చేరుకున్న అనుబంధ గుర్తింపు ప్రక్రియ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాలేజీల్లోని లోపాలను గుర్తించి గత నెలలోనే వాటిని సరిదిద్దుకునేలా సమయం ఇచ్చిన జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను ఇటీవల చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 100 ఇంజనీరింగ్ కాలేజీలకు, 40 వరకు ఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేసినట్లు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.యాదయ్య తెలిపారు. ఈనెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని, అప్పటివరకు ఎన్ని కాలేజీలకు, ఎన్నిసీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్నది చివరలో తెలుస్తుందని వివరించారు. -
సులభంగా ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌లో ప్రశ్నల సరళి గతంలో పోల్చితే ఈసారి సులభంగానే ఉందని సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌లో గతంలో కంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ సులభంగానే ఉందని, గణితంలో మాత్రం కొన్ని ప్రశ్నలు విద్యార్థులను కొద్దిగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నట్లు తెలిపారు. అయితే గణితంలో 55వ ప్రశ్న నుంచి 65వ ప్రశ్న వరకు 10 ప్రశ్నలు కాస్త ఎక్కువ ఆలోచిస్తే జవాబు రాసేలా ఉండగా, 10వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు ఐదు ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎంసెట్ 2019 పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలోని మొదటి రోజు పరీక్ష సెట్ కోడ్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి డ్రా తీసి ఎంపిక చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, పరీక్షలు జరుగతున్న తీరును పరిశీలించారు. 83 కేంద్రాల్లో పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు రాష్ట్రంలోని 83 పరీక్ష కేంద్రాల్లో 25,023 మంది విద్యార్థులకు 23,543 మంది (94.1 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన పరీక్షకు 24,174 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 22,807 మంది (94.4 శాతం) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం జరిగిన పరీక్ష రాసేందుకు 3,480 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 2,715 మంది (78.1 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 4,229 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 3,315 మంది (78.4 శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 1,42,218 మందికి మొదటి రోజు 56,906 మందికి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయగా, 52,380 మంది హాజరయ్యారు. మిగిలిన వారికి ఈ నెల 4, 6 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య పేర్కొన్నారు. -
తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను రెండు గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు. తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. -
నేటి నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరగునున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులను 2 గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. -
రేపటి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు
-
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన టీఎస్ ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల కానుంది. 6వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 6 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తులలో సవరణ చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదువేల రూపాయలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు, పదివేల రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ పరీక్ష మే 3 నుంచి మే 6 వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1వరకు పరీక్ష ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ మే 8వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. నిమిషం ఆలస్యం అయిన పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన కడియం శ్రీహరి
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంటర్నల్స్ స్లైడింగ్ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు. ఫలితాలతో పాటు ఇంటర్ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. సీబీఎస్ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ర్యాంక్‌లు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీల్లో ప్రమాణలు పెరుగుదలతో ఇంజినీరింగ్ ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు. కాగా తెలంగాణ ఎంసెట్ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను Sakshi Education వెబ్సైట్ లో చూడవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ ర్యాంక్‌లు 1. వెంకట పాని వంశీనాథ్(మాదాపూర్) 2. గట్టు మైత్రేయ (మాదాపూర్) 3.వినాయక (రంగారెడ్డి) 4. హేమంత్ కుమార్ (విశాఖపట్నం) 5.మదన్ మోహన రెడ్డి (విజయవాడ) 6. భరత్ (శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం) 7. యస్కర్ (హైదరాబాద్ మదీనాగూడ) 8. రిశీయంత్ (హన్మకొండ) 9. షేక్ వాజిద్ (రంగారెడ్డి) 10.వెంకట మల్లిబాబు (రంగారెడ్డి) అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకులు 1. నమ్రత -కర్నూలు 2. సంజీవ్ కుమార్- హైదరాబాద్ 3. శ్రీఆర్యన్, ఆర్మూర్ 4.సంజన -మల్కాజ్గిరి 5. జయసూర్య-హైదరాబాద్ 6. గంజికుంట శ్రీవత్సావ్-ఆదోని 7. విచిత్- గోదావరి ఖని 8. అనగ లక్ష్మి- దిల్ సుఖ్ నగర్ 9. శ్రీ చైతన్య- కరీంనగర్ 10.సత్యశ్రీ సౌమ్య- ఖమ్మం -
ఎంసెట్: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్ ఉన్నందున 6వ తేదీ మినహా) ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకమైన ఎంసెట్ పరీక్షల కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు విద్యార్థులను అనుమతించడం లేదు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని ఇప్పటికీ అధికారులు ప్రకటించారు. ఎంసెట్ పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 2,21,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల్లోని 18 జోన్ల పరిధిలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2, 3 తేదీల్లో 75 కేంద్రాల్లో అగ్రికల్చర్ పరీక్ష... 4, 5, 7 తేదీల్లో 83 కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ పరీక్షలకు 73,106 మంది, ఇంజనీరింగ్ పరీక్షకు 1,47,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు పరీక్ష తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్లో 25 వేల మంది వరకు విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. ఆన్లైన్ ఎంసెట్ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేస్తున్నామని, నిర్ధారిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఏపీ నుంచి 29,356 మంది ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 29,356 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ పరీక్షకు 21,369 మంది, అగ్రికల్చర్ పరీక్షకు 7,987 మంది ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే ‘కీ’లు ఐదు రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నందున అన్ని పరీక్షలు పూర్తయ్యాక ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసే 7వ తేదీ రాత్రి లేదా 8న ‘కీ’లను విడుదల చేయనుంది. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ప్రశ్నపత్రం ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. అందువల్ల ‘కీ’లను విడుదల చేసే సమయంలో.. సంబంధిత కోడ్ ప్రశ్నపత్రం, ‘కీ’ రెండింటినీ విడుదల చేస్తారు. ఇక ప్రాథమిక ‘కీ’లపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మొత్తంగా ఈనెల 15వ తేదీ నాటికి ఫలితాలను, ర్యాంకులను ప్రకటించేలా చర్యలు చేపట్టారు. -
ముగిసిన ఎంసెట్ తుది దశ కౌన్సెలింగ్
-
ముగిసిన ఎంసెట్ తుది దశ కౌన్సెలింగ్
♦ 12,264 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ ♦ యూనివర్సిటీ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ ♦ ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతమే ♦ ఎంపీసీ కోటా ఫార్మా సీట్ల భర్తీ 4.9 శాతమే సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. తుది దశ కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపు శనివారం నాటితో పూర్తయింది. ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మాడీ కేటగిరీలో 77.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ మూడు కేటగిరీల్లో 317 కాలేజీల్లో 70,427 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా.. 54,784 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నాటితో పూర్తి కావడంతో మూడు కేటగిరీల్లో 15,643 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇందులో ఇంజనీరింగ్ కేటగిరీలో 12,264 సీట్లు ఖాళీగా ఉండగా.. బీ ఫార్మసీలో 2,925 సీట్లు, ఫార్మాడీలో 454 సీట్లు మిగిలాయి. 2,015 మందికి దక్కని సీట్లు.. తుది దశ కౌన్సెలింగ్‌లో మొత్తంగా 1,06,200 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోగా 65,745 మంది విద్యార్థులు మాత్రమే అర్హులుగా తేలారు. వీరిలో తొలి దశలో 63,588 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా, తుది దశలో 38,661 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తం 54,784 సీట్లు భర్తీ కాగా.. 2,015 మంది విద్యార్థులకు సీట్లు అలాట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క సీటు కూడా అలాట్ కాకపోగా.. 76 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కోటాలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ కాగా.. 187 ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఫార్మాసీ కాలేజీలు వెలవెల.. ఈ ఏడాది ఎంపీసీ కోటా విద్యార్థులు ఫార్మసీ కోర్సులపై అనాసక్తి చూపారు. ఎంపీసీ కోటాలో 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు ఉండగా.. కేవలం 24 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 113 ప్రైవేటు కాలేజీల్లో 2,997 సీట్లు ఉండగా.. వీటిలో 128 సీట్లు మాత్రమే అభ్యర్థులు దక్కించుకున్నారు. ఫలితంగా 2,869 సీట్లు మిగిలిపోయాయి. అలాగే ఎంపీసీ కోటాలో ఫార్మాడీ కేటగిరీలో 51 ప్రైవేటు కాలేజీల్లో 503 సీట్లు ఉండగా.. వీటిలో 49 మందికి మాత్రమే సీట్లు కేటాయించారు. దాంతో 454 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 29లోగా రిపోర్ట్ చేయాలి.. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో లేదా నగదు రూపంలో నిర్దేశిత బ్యాంకులో చలానా ద్వారా ఫీజు చెల్లించాలి. అనంతరం చలానా నంబర్ ఆధారంగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ నింపాలి. విద్యార్థులు ఈ నెల 28లోగా ఈ పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసి.. 29లోగా కాలేజీలో రిపోర్టు చేయాలని ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలి పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందే అభ్యర్థులు ఈ నెల 27లోగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని హెల్ప్‌లైన్ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. -
నేడు ఎంసెట్ ఫలితాలు
మధ్యాహ్నం 12 గంటలకు విడుదల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12 గం.కు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలి పారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. విద్యార్థుల మార్కులతోపాటు ర్యాంకులను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న నిర్వహించిన ఈ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగంలో 1,39,100 మంది... అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73,601 మంది విద్యార్థులు హాజరైనట్లు వివరించారు. ఫలితాలను sakshieducation. com, sakshi. com, eamcet. tsche. ac. in వెబ్సైట్లలో పొందవచ్చని తెలిపారు. -
ఫిజిక్స్ కాస్త కఠినం
ప్రశాంతంగా ఎంసెట్ పరీక్ష ► ఇంజనీరింగ్‌లో సరైన జవాబుల్లేని మూడు ప్రశ్నలు ► నిమిషం నిబంధనతో తిప్పలు ► ఇంజనీరింగ్‌లో 93.43 శాతం.. అగ్రికల్చర్, ఫార్మసీలో 92.97 శాతం హాజరు ► నేడు ప్రాథమిక కీ.. 18 వరకు అభ్యంతరాల స్వీకరణ ► 22న ఎంసెట్ ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ విభాగంలో 93.43 శాతం మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 92.97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్) ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎంసెట్ ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను ఉదయం 6 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 246 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. 1,41,190 మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 1,31,910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 154 కేంద్రాల్లో మధాహ్నం 2:30కు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ప్రారంభమైంది. దీనికి 79,061 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 73,501 మంది పరీక్ష రాశారు. కాగా.. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని శనివారం విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య తెలిపారు. వాటిపై ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 22వ తేదీన ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించారు. సులభంగానే ప్రశ్నపత్రం.. ఫిజిక్స్ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చినా.. మొత్తంగా గతేడాదితో పోల్చితే సులభంగానే ప్రశ్నలు వచ్చాయని సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని మరో సబ్జెక్టు నిపుణులు మూర్తి తెలిపారు. సెట్ ‘ఎ’కోడ్ ప్రశ్నపత్రంలోని 87, 98, 110 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబులు లేవని వివరించారు. దీంతో కొంతమంది విద్యార్థులు కొద్దిపాటి గందరగోళానికి గురయ్యారని చెప్పారు. సిలబస్‌లోని అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చాయన్నారు. గతేడాది ఎంసెట్‌లో ఎక్కువ సమయం తీసుకునే సుదీర్ఘ ప్రశ్నలు 15 వరకు ఇవ్వగా.. ఈసారి అలాంటివి నాలుగైదు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఇటీవల జరిగిన ఏపీ ఎంసెట్‌తో పోల్చినా.. రసాయన శాస్త్రం, గణితంలో 50 నుంచి 60 వరకు ప్రశ్నలు సులభంగా ఉన్నాయన్నారు. గణితంలో అత్యధికంగా 80 మార్కులు పొందగలుగుతారని, సాధారణ విద్యార్థి కూడా 40 నుంచి 50 మార్కులు పొందగలరని చెప్పారు. కన్నీళ్లు పెట్టించిన ‘నిమిషం’నిబంధన ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్న నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. పరీక్ష రాసేందుకు ఉరుకులు, పరుగుల మీద బయలుదేరినా.. పలు సమస్యల కారణంగా కొందరు విద్యార్థులు రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కారణంగా పలు చోట్ల అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. కానీ ఇలా ఆలస్యంగా వచ్చిన వారెవరినీ అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దాంతో విద్యార్థులు కంటతడిపెట్టారు. పరీక్ష రాయనివ్వాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. అయినా అనుమతించకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగారు. మరోవైపు పరీక్ష కేంద్రాల బయట కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ముందుగానే గేట్లు మూసివేత! హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న కేశవ మెమోరియల్ కళాశాల పరీక్షా కేంద్రం ప్రధాన గేటును ఉదయం 9.52 గంటలకే మూసివేయడంతో ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. హిమాయత్‌నగర్‌కు చెందిన మాధవి, సఫీలు 9.54 నిమిషాలకే కేశవ మెమోరియల్ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. గేటుకు తాళాలు వేసి ఉండడం, సెక్యురిటీ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఇద్దరినీ గేటు పైనుంచి ఎక్కించి లోపలికి పంపారు. కానీ వారు హాల్‌టికెట్ నంబర్‌తో పరీక్షాహాల్ను సరిచూసుకుని వెళ్లే సరికి 10.03 గంటలు కావడంతో పరీక్షాహాల్లోకి రానివ్వలేదు. ఎంతగా ప్రాధేయపడినా అనుమతించకపోవడంతో కన్నీటితో వెనుదిరిగారు. -
ప్రారంభమైన టీ.ఎంసెట్ ప్రవేశపరీక్ష
హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్–17 పరీక్ష శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఉదయం ఎంసెట్ కోడ్ జె-1ను విడుదల చేశారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న ఎంసెట్ 2017 అగ్రికల్చర్, ఫార్మసీ ఇతర విభాగాల పరీక్ష కోసం సెట్ కోడ్ S2 ను విడుదల చేశారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 41వేల 163 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రి, ఫార్మసీ, వెటర్నరీ పరీక్షకు 79,46 మంది హాజరు అవుతున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 246 పరీక్ష కేంద్రాలు, అగ్రి, ఫార్మాకు 154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను గంట ముందుగానే అనుమతి ఇచ్చారు. ఇక ఈ ఎంసెట్‌కు ఏపీ నుంచి 35 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. -
తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు
-
తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెలంగాణ ఎంసెట్-2 (2016) మెడికల్ పేపర్ల లీకేజి కేసులో ప్రధాన సూత్రధారులు శివబహదూర్ సింగ్, అనూప్ కుమార్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో అరెస్టు చేసిన వీళ్లిద్దరినీ ట్రాన్సిట్ వారంటు మీద హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలంగాణ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్ అలియాస్ పండిట్ ప్రధాన సూత్రధారి. తనకున్న పరిచయాలతో అతడు తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్‌ను బయటకు తీసుకొచ్చాడు. 2005 నుంచి అతడు ఈ తరహాలో వివిధ పేపర్లు లీక్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు లక్నోలో రైల్వే గ్రూప్-డి పేపర్ లీకేజి కేసు, 2008లో అలహాబాద్‌లో రైల్వే డ్రైవర్స్ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2015లో పంజాబ్‌లో టీఈటీ పరీక్ష లీకేజి కేసు, పీఎస్సీ పరీక్ష లీకేజికి సంబంధించి రెండు కేసులు, 2015లోనే జమ్ము కశ్మీర్ టీచర్ల ప్రవేశపరీక్ష లీకేజి కేసు, కోల్ ఇండియా కేసు, మహారాష్ట్రలో వార్ధా మెడికల్ కాలేజి పేపర్ లీకేజి కేసు, చండీగఢ్ టీచర్ల ప్రవేశ పరీక్ష కేసు, కోల్‌కతా టీఈటీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2016 డిసెంబర్లో డీఎంఆర్సీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, చివరగా 2016లో తెలంగాణ మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్ లీకేజి కేసు ఇతడి మీద ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలలో అనూప్ కుమార్ సింగ్ ఇతడికి సహాయకుడిగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. -
ఆయుష్ ప్రవేశాలెలా?
వైద్య ఆరోగ్య శాఖకు ఉన్నత విద్యా మండలి లేఖ సాక్షి, హైదరాబాద్: ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా చేపడతారా లేదా తెలంగాణ ఎంసెట్ ద్వారా చేపడతారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం లేఖ రాసింది. ఈ నెల 27న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఆలోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఆయుష్ పరిధిలోని ఆయుర్వేద (బీఏఎంఎస్), హోమియోపతి (బీహెచ్ఎంఎస్), నేచురోపతి, యోగా కోర్సుల్లో ప్రవేశాలను నీట్ ద్వారా చేపడితే ఎంసెట్‌లో వాటిని తొలగించి అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ, బీఫార్మా తదితర కోర్సులకే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని లేఖలో ఉన్నత విద్యా మండలి పేర్కొంది. 2017–18 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 7న నీట్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసిందని, కానీ అందులో ఈ కోర్సులు లేవని గుర్తుచేసింది. అయితే ఆయుష్ ప్రవేశాలనూ నీట్ ద్వారానే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం గత నెల 25న రాష్ట్రాలకు లేఖ రాసిందని వివరించింది. ఈ నేపథ్యంలో నీట్ పరిధిలోకి తెచ్చే కోర్సులపై సీబీఎస్ఈ నుంచి ఉన్న ఆదేశాలేమిటి... ఎంసెట్ పరిధి లోంచి వాటిని తొలగించాలా వద్దా... ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించా లా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. యునానిపై మరింత స్పష్టత అవసరం యునాని కోర్సులో ప్రవేశాలకు ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్లో ఉర్దూ ద్వితీయ భాషగా చదువు కున్న వారే దానికి అర్హులు కావడంతో ప్రత్యేక పరీక్ష ద్వారానే యునానిలోని 175 సీట్లను భర్తీ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో యునానిని నీట్లో చేరుస్తారా లేదా అనే అంశంపైనా మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను నీట్ నీట్ నోటిఫికేషన్లో చేర్చడమే మిగిలింది. సీబీఎస్ఈ ఈ దిశగా చర్యలు చేపడితే గందరగోళం ఉండదు. -
ఉస్మానియాలో చేరతా..
విజయవాడ (లబ్బీపేట) : మెడిసిన్ చేయాలనే ఆకాంక్ష నెరవేరడంతో పాటు ఏపీ తెలంగాణాల్లోని అత్యుత్తమ వైద్య కళాశాల ఉస్మానియాలో చేరనున్నట్లు తెలంగాణ ఎంసెట్ (మెడిసిన్) టాప్ ర్యాంకర్ రేగళ్ల ప్రపుల్ల మానస పేర్కొంది. ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్న మానసను తల్లిదండ్రులు రేగళ్ల కేశవరెడ్డి, సుధారాణి ఆనందంతో మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా మానస విలేకరులతో మాట్లాడుతూ తాను పదో తరగతి విశ్వభారతి స్కూల్లో చదవగా, ఇంటర్మీడియెట్ శ్రీచైతన్య నారాయణ కళాశాలలో పూర్తిచేశానని, ఏపీ ఎంసెట్‌లో 4వేలు ర్యాంకు వచ్చిందని, తెలంగాణ ఎంసెట్–2లో 126 ర్యాంకు సాధించినట్లు తెలిపింది. ప్రస్తుతం విడుదలైన ఎంసెట్–3 ఫలితాల్లో టాప్ ర్యాంకును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. తనకు కళాశాలలోని అధ్యాపకుల శిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, ఏపీ ఎంసెట్‌లో 4వేలు ర్యాంకు వచ్చినా నిరుత్సాహ పడకుండా పట్టుదలతో చదవడం వల్లే టాప్ ర్యాంకులు సొంతం చేసుకుని, ఉన్నతస్థాయి కళాశాలలో సీటు సాధించగలిగినట్లు పేర్కొంది. ప్రపుల్ల మానస తండ్రి, గుడ్లవల్లేరు మండలం ఎంపీడీవో రేగళ్ల కేశవరెడ్డి మాట్లాడుతూ మానస కచ్చితంగా ర్యాంకు సాధిస్తుందనే నమ్మకంతో చదివించామన్నారు. మెడిసిన్ చేయాలనే పట్టుదలను చూసి ప్రోత్సహించామని, టాప్‌ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తల్లి సుధారాణి మాట్లాడుతూ మానస ఫస్ట్ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రూ.లక్ష చెక్కు అందజేసిన భవిష్య అకాడమీ కానూరు (పెనమలూరు) : ప్రపుల్ల మానసకు కానూరులోని భవిష్య అకాడమీ నిర్వాహకులు గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఈ అకాడమీలో మానస షాట్టర్మ్ ఎంసెట్ కోచింగ్ తీసుకుంది. ఈ సందర్భంగా గురువారం అకాడమీలో జరిగిన విలేకరుల సమావేశంలో మానస మాట్లాడుతూ అకాడమీ అధ్యాపకుల ప్రోత్సాహంతో తాను పట్టుదలతో చదివానని, తాను తెలంగాణ ఎంసెట్‌లో 152 మార్కులు సాధించి ఫస్టు ర్యాంకు సాధించానని పేర్కొంది. కార్డియాలజిస్టు కావాలనేది తన కోరిక అని తెలిపింది. ఈ సమావేశంలో భవిష్య అకాడమీ అధ్యాపకులు జి.వెంకటరావు, సాయిబాబు, డి.రామ్మూర్తి పాల్గొన్నారు. -
తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష కోడ్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగనున్న ఎంసెట్-3 పరీక్షకు ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఆదివారం ఉదయం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40,168 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 96 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ పరీక్ష జరుగనుంది. -
తెలంగాణ ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల
-
తెలంగాణ ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 11న ఎంసెట్-3 పరీక్ష నిర్వహించనున్నారు. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ రిజస్ట్రార్ యాదయ్యను నియమించారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసెట్ కన్వీనర్ ను మార్చాలని నిర్ణయించారు. మళ్లీ జేఎన్టీయూకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని, పాత హాల్ టికెట్లతోనే పరీక్షకు అనుమతించాలని సీఎం సూచించారు. కొంత మంది చేసిన తప్పులకు వేలాది మందిని ఇబ్బంది పెట్టాల్సిరావడం బాధాకరమని, ఎంసెట్-3కి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు దర్యాప్తు చేసి లీక్‌కు కారకులైన వారిపై కేసు నమోదు చేసి కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ మొత్తంలో డబ్బు చెల్లించి పేపర్‌ను కొనుగోలు చేశారు. ఉన్నతాధికారులో చర్చించిన అనంతరం ఎంసెట్-2ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా ఎంసెట్-3 పరీక్షకు షెడ్యూల్ విడుదల చేశారు. -
ఎంసెట్-2 అధికారికంగా రద్దు
-
ఎంసెట్-2 అధికారికంగా రద్దు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 అధికారికంగా రద్దైంది. ఎంసెట్-3 షెడ్యూల్ ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసెట్ కన్వీనర్ ను మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. మళ్లీ జేఎన్టీయూకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని, పాత హాల్ టికెట్లతోనే పరీక్షకు అనుమతించాలని సీఎం సూచించారు. కొంత మంది చేసిన తప్పులకు వేలాది మందిని ఇబ్బంది పెట్టాల్సిరావడం బాధగా ఉందన్నారు. ఎంసెట్-3కి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బ్రోకర్లతో చేతులు కలిపిన తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు అందజేశారు. -
ఎంసెట్ కుంభకోణం జరిగింది ఇలా...
తీగ లాగితే ఏకంగా డొంకే కదిలింది. ఎంసెట్-2 ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులకు ఎంసెట్-1 ప్రశ్నపత్రం కూడా లీకైందన్న విషయం తెలిసింది. ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక పెద్ద ముఠా హస్తమే ఉందని తేలింది. ప్రశ్నపత్రాలను ముద్రణ కేంద్రం నుంచి చాకచక్యంగా తీసుకురావటం మొదలు వాటిని అత్యంత పకడ్బందీగా విద్యార్థులకు చేర్చటం, వారి నుంచి డబ్బు వసూలు చేయటం వరకు జరిగిన ఈ కుంభకోణంలో రాజగోపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ నిర్ధారించింది. కేసు నమోదుచేసిన మూడు రోజుల్లోనే సీఐడీ మొత్తం కుట్రను ఛేదించింది. 2014లో సంచలనం సృష్టించిన పీజీ మెడికల్ కుంభకోణంలో సూత్రధారిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీలోనూ చక్రం తిప్పాడు. ముద్రణసంస్థ నుంచి చాకచక్యంగా ప్రశ్నపత్రాలను తప్పించి, ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థులను బెంగళూరు, ముంబై నగరాలకు తరలించి పరీక్షకు సిద్ధం చేశాడు. తొలుత కోచింగ్ కేంద్రాలు, వైద్య కళాశాలల్లో సీట్లు ఇప్పించే దళారులను రాజగోపాల్ ఆకట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా తనకు నెట్వర్క్ ఉందని, ప్రశ్నపత్రం తెప్పిస్తానని, విద్యార్థులను చూస్తే మంచి కమీషన్ ఇస్తానని ఆశపెట్టాడు. వీరు విద్యార్థులను సంప్రదించి రూ.40 - 70 లక్షలు చెల్లిస్తే సీటు గ్యారంటీగా వస్తుందని, పరీక్షకు ముందు రూ.10 లక్షలు చెల్లిస్తేచాలని, ర్యాంకు వచ్చిన తర్వాత మిగతా డబ్బు చెల్లించాలని నమ్మించారు. తమకు బాగా నమ్మకమైన, డబ్బు ఇవ్వగలిగిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మంచి కమీషన్ ముడుతుందన్న ఆశతో దళారులు మొత్తం 72 మంది విద్యార్థులను ఒప్పించగలిగారు. వారి నుంచి అడ్వాన్సుగా దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశారు. మొత్తంగా రూ. 50 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదిరిన విద్యార్థులను రాజగోపాల్ ముఠా తొలుత హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో ఉంచి కొద్ది రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రాంతాల వారీగా బ్యాచ్‌లుగా విభజించారు. పరీక్షకు రెండురోజుల ముందు విమానాల్లో బెంగళూరు, ముంబై, గోవా తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు. కొందరిని హైదరాబాద్‌లోని వివిధ రిసార్టుల్లో ఉంచారు. అయితే ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని నిబంధన పెట్టారు. ప్రశ్నపత్రాలు తీసుకొచ్చిన మరో ముఠా అక్కడకు చేరుకుని విద్యార్థులకు వాటిని చూపించింది తప్ప వారి చేతికి ఇవ్వలేదు. మొత్తం రెండు సెట్ల ప్రశ్నలకూ విద్యార్థులకు జవాబులు చెప్పి సిద్ధం చేయించారు. ఎంసెట్-2కు ముందు రోజు వారి వారి పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. తర్వాత అంతా అనుకున్నట్లే అయ్యింది. -
పరీక్ష రద్దు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం
-
ఎంసెట్-2 పేపర్ లీక్‌పై సీఐడీ విచారణ వేగవంతం
-
ఎంసెట్-2 పేపర్ లీక్‌పై సీఐడీ విచారణ వేగవంతం
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ వేగవంతంగా విచారణ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలను సేకరించే పనిలో ఉంది. పేపర్ లీకైందనే కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. పేపర్ లీక్ ఘటనపై సీఐడీ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. సీఐడీ అధికారులు విజయవాడ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విచారణ చేశారు. బ్రోకర్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన కాల్ డేటాను సేకరించారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ.. ఎంసెట్ కన్వీనర్ రమణారావును పిలిపించి మాట్లాడారు. -
తెలంగాణ ఎంసెట్‌లో 'అనంత' విద్యార్థికి ఏడో ర్యాంకు
జేఎన్టీయూ: తెలంగాణ ఎంసెట్-2లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విని మెడిసిన్‌లో రాష్ట్రస్థాయి ఏడో ర్యాంకు సాధించింది. తెలంగాణ ఎంసెట్-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో తేజస్విని 154 మార్కులు (97.19 శాతం) సాధించింది. మే 21న విడుదలైన ఏపీ ఎంసెట్‌లోనూ ఈ విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 29వ ర్యాంకు సాధించడం గమనార్హం. తేజస్విని తండ్రి శ్రీబాలాజీ బీఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
ప్రారంభమైన ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్ష శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి 38,245 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది (31.93 శాతం) విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఇక ఏపీ విద్యార్థుల కోసం 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాగా ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అధికారులు ముందు నుంచి సూచించినప్పటికీ పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని లోనికి అనుమతించకపోవటంతో గేటు వద్ద నుంచే వెనుదిరిగారు. కాగా ప్రాథకమిక కీని ఈరోజు సాయంత్రం, ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. కాగా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సెట్ కోడ్ 'ఆర్'ను ఎంపిక చేశారు. -
ఎంసెట్-2కు ‘ఆర్’ ప్రశ్నాపత్రం ఎంపిక
-
ఎంసెట్-2కు ‘ఆర్’ ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్: తెలంగాణలో శనివారం జరగనున్న ఎంసెట్-2 ప్రశ్నాపత్రం కోడ్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి రెడ్డి విడుదల చేశారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం పేపరు కోడ్‌గా ‘ఆర్’ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్ష నిర్వాహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 63 కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వినర్ చెప్పడంతో.. బయోమెట్రిక్ కోసం విద్యార్థులను గంట ముందునుంచే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
'ఎంసెట్-2 కు మళ్లీ ఫీజు సరికాదు'
హైదరాబాద్: తెలంగాణలో జూలై9 న నిర్వహించే ఎంసెట్-2 ప్రవేశ పరీక్షకు రెండవసారి పరీక్ష రుసుమును వసూలు చేయడం సరికాదని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మరలా పరీక్ష రుసుమును చెల్లించాలనే నిబంధన పెట్టడం అన్యాయమన్నారు. ఈ నెల 15 న జరిగిన ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్ధులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల నుండి పరీక్ష రుసుము వసూలు చేసుకుంటే సమంజసమని.. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సామల విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సచివాలయంలో డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు ర్యాంకులను విడుదల చేశారు. మొత్తం 77.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో తాళ్లూరి సాయితేజకు ఫస్ట్ ర్యాంక్ (160 మార్కులు), చేతన్ సాయి (159) రెండో ర్యాంక్, నిఖిల్ సామ్రాట్ (158) మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో విఘ్నేష్ రెడ్డి (158), అయిదో స్థానంలో రాహుల్ (158), ఆరో ర్యాంక్ వెంకటసాయి గణేష్ (157), ఏడో ర్యాంక్ తన్మయి (157) ఎనిమిదో ర్యాంక్ గంటా గౌతమ్ (156), 9వ ర్యాంక్ జయకృష్ణ వినయ్ (156), పదో ర్యాంక్ వంశీకృష్ణారెడ్డి (156). విద్యార్థులు తమ ర్యాంకులను www.sakshieducation.com, http://www.tseamcet.in సైట్లలో పొందవచ్చు. ఎంసెట్‌లో సాధించిన మార్కులు, ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 % వెయిటేజీ కలిపి ఇచ్చే తుది ర్యాంకుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 15న జరిగిన ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు 1,33,442 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 89,792 మంది హాజరయ్యారు. కాగా జూన్ 9 లేదా 10న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అగ్రికల్చర్ లో మొదటి ర్యాంక్ ప్రదీప్ రెడ్డి (160 మార్కులు) 2.ప్రత్యుష (160) 3.అర్బాస్ (160) 4.ప్రణతి (160) 5.యజ్ఞప్రియ (160) 6.అహ్మద్ జలీల్ (160) 7.ఆర్. ఉజ్వల్ (159) 8.టి.శివ (159) 9.పి.శైలజ (159) 10.నిధి (159) -
నేడు ఎంసెట్ ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు ఈనెల 26న విడుదల కానున్నాయి. సచివాలయంలో డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ర్యాంకులను విడుదల చేస్తారు. విద్యార్థులు తమ ర్యాంకులను www.sakshieducation.com, http://www.tseamcet.in సైట్లలో పొందవచ్చు. ఎంసెట్‌లో సాధించిన మార్కులు, ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 % వెయిటేజీ కలిపి ఇచ్చే తుది ర్యాంకుల వివరాలను వెల్లడిస్తారు. ఈ నెల 15న జరిగిన ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు 1,33,442 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 89,792 మంది హాజరయ్యారు. కాగా జూన్ 9 లేదా 10న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
రేపు ఎంసెట్ ర్యాంకులు
విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకుల ను గురువారం (26న) విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. సచివాలయంలోని ‘డి’ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ర్యాంకులను విడుదల చేస్తారని చెప్పారు. ర్యాంకులను విద్యార్థులు www.sakshieducation.com, http://www.tseamcet.in వెబ్సైట్ల ద్వారా పొందవచ్చు. విద్యార్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులతోపాటు ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీ కలిపి తుది ర్యాంకుల వివరాలను వెల్లడిస్తారు. ఈ నెల 15న జరిగిన ఎంసెట్ రాసేందుకు 2,46,522 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో ఇంజనీరింగ్ పరీక్ష కోసం 1,44,510 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష కోసం 1,02,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,33,442 మంది హాజరవగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 89,792 మంది హాజరయ్యారు. కాగా, ఫలితాల విడుదల అనంతరం ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ 10 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. -
తెలంగాణ ఎంసెట్ ప్రశాంతం
5,085 మంది గైర్హాజరు పెనమలూరు : తెలంగాణ ఎంసెట్ విజయవాడ రీజియన్‌లో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో గైర్హాజరయ్యారు. కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎవీ రత్నప్రసాద్ వివరాలు తెలిపారు. విజయవాడ రీజియన్‌లో తెలంగాణ ఎంసెట్‌ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని చెప్పారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరిగిన ఇంజినీరింగ్‌కు 8,954 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 6,345 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 2,609 మంది గైర్హాజరైనట్లు వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన మెడికల్ పరీక్షకు 11,247 మందికి గాను 8,771 మంది పరీక్ష రాశారని, 2,476 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇంజినీరింగ్‌కు 19 పరీక్ష కేంద్రాలు, మెడికల్‌కు 22 మొత్తం కలిపి 41 కేంద్రాల్లో పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు. -
తెలంగాణ ఎంసెట్
- ఇంజనీరింగ్, ఆయుష్, వ్యవసాయ కోర్సులకే తెలంగాణ ఎంసెట్ - రద్దుకానున్న ప్రైవేట్ మెడికల్ ప్రవేశ పరీక్షలు - ప్రైవేటులోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లన్నీ నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశానికి సుప్రీంకోర్టు ‘నీట్’ తప్పనిసరి చేయడంతో ఈ నెల 15న నిర్వహించే ఎంసెట్ (మెడికల్) ప్రవేశ పరీక్షపై నీలినీడలు అలుముకున్నాయి. వైద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎంసెట్ (మెడికల్) ప్రవేశ పరీక్ష రాయనవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఇక ఉండదని అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కోరే విద్యార్థులంతా జూలైలో జరుగబోయే నీట్-2 ప్రవేశ పరీక్షకే సిద్ధం కాక తప్పదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒక్కసారికి ఎంసెట్‌కు అవకాశం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నీట్ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ద్వారానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లతోపాటు.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లు, 35 శాతం బీ కేటగిరీ సీట్లు, 15 శాతం ఎన్నారై కోటా సీట్లన్నీ భర్తీ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ మెడికల్ కాలేజీలు కూడా దీన్నే అనుసరించాల్సి ఉంటుంది. స్థానిక భాషలోనూ నీట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు సుప్రీం అవకాశం కల్పించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. అయితే ఆయుర్వేద, హోమియో, యునాని, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించాలనుకున్న ప్రభుత్వ ఎంసెట్‌కు 1.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేటు మెడికల్ ప్రత్యేక ప్రవేశ పరీక్షకు 10 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2,600 ఎంబీబీఎస్ సీట్లు.. 1,140 బీడీఎస్ సీట్లు తెలంగాణలో మొత్తం 17 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో మొత్తం 2,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. ఇవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తోంది. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం 1,450 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం (725) ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్న వారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తున్నారు. మరో 35 శాతం (507) బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం (218) సీట్లను ఎన్నారై కోటా కింద కాలేజీ యాజమాన్యాలే నేరుగా భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తమ ఆధ్వర్యంలోని బీ కేటగిరీ సీట్లను, ఎన్నారై (సీ కేటగగిరీ) సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీం తీర్పును శిరసా వహిస్తాం సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహిస్తాం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలి. నీట్‌పై అవగాహన కల్పించేందుకు, సిలబస్ పట్ల స్పష్టత ఇచ్చేందుకు పేద విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అవసరమైతే నీట్‌పై పుస్తకాలను కూడా పంపిణీ చేస్తాం. - సి.లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వారు ఎంసెట్ రాయాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. అయితే ఆయుష్ కోర్సులు, వ్యవసాయం దాని అనుబంధ కోర్సుల్లో చేరాలనుకునే వారు మాత్రం ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్షనే రాయాల్సి ఉంటుంది. - డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్ -
2 లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు
28తో ముగియనున్న గడువు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుదారుల సంఖ్య గతేడాది కంటే పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 1,97,604 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య శనివారం ఉదయం కల్లా 2 లక్షలు దాటుతుందని అధికారులు పేర్కొన్నారు. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 28తో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో 40 వేల మంది దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ 4 ప్రాంతాల్లో ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్రి, మెడికల్‌కు పెరగనున్న దరఖాస్తులు ఇంజనీరింగ్‌తో సమానంగా అగ్రికల్చర్, మెడికల్‌కు దర ఖాస్తులు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.గతేడాది ఇంజనీరింగ్ కోసం 1,39,677 మంది దరఖాస్తు చేసుకోగా 2016 ఎంసెట్ కోసం శుక్రవారం వరకు 1,12,568 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అగ్రికల్చర్, మెడికల్ కోసం 92,368 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి 83,402 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మూడు రోజుల్లో గతేడాది కన్నా ఈ సంఖ్య మించనుంది. రూ.500 ఆలస్య రుసుంతో వచ్చే నెల 3 వరకు, రూ.1000తో వచ్చే నెల 13 వరకు, రూ.5 వేలతో వచ్చే నెల 22 వరకు, రూ.10 వేలతో వచ్చే నెల 29 వరకు దరఖాస్తు చేసుకునేవీలుంది. ఏపీ నుంచి మెడికల్‌కే ఎక్కువ దరఖాస్తులు తెలంగాణ ఎంసెట్‌కు ఏపీ నుంచి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్, మెడికల్ దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రా యూనివర్సిటీ పరిధి నుంచి 23,770 మంది దరఖాస్తు చేసుకోగా అందులో అగ్రికల్చర్, మెడికల్ కోసం 15,198 దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్ కోసం 8,444 మంది దరఖాస్తు చేశారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధి నుంచి 15,609 మంది దరఖాస్తు చేసుకోగా అందులో అగ్రికల్చర్, మెడికల్ కోసం 11,341 మంది, ఇంజనీరింగ్ కోసం 4,216 మంది దరఖాస్తు చేశారు. రెండింటి కోసం 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
ఏపీలో తెలంగాణ ఎంసెట్ కేంద్రాలు!
హైదరాబాద్: తెలంగాణలోని ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి టీ-ఎంసెట్ పరీక్ష కేంద్రాలను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాల ఏర్పాటుపై ఏపీ అధికారులు టీ-ఎంసెట్ కన్వీనర్ రమణారావుతో చర్చించారు. ఏపీ ఎంసెట్-2016 కేంద్రాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లే... టీ-ఎంసెట్ కేంద్రాలను ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిల్లో ఏర్పాటుచేయాలని కన్వీనర్‌ను కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి తీసుకొని ఏపీలో టీ-ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కన్వీనర్ సానుకూలం వ్యక్తం చేసినట్లు ఏపీ అధికారవర్గాలు వివరించాయి. గతేడాది హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహించినా... తెలంగాణ మాత్రం టీ-ఎంసెట్ కేంద్రాలను ఆ రాష్ట్రానికే పరిమితం చేసింది. -
22 నాటికి ఎంసెట్ నోటిఫికేషన్
♦ రాష్ట్ర విద్యామండలి కసరత్తు ♦ వెనువెంటనే దరఖాస్తుల స్వీకరణ ♦ ఆ తర్వాత వరుసగా మిగతా సెట్లకు నోటిఫికేషన్లు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2016 నోటిఫికేషన్‌ను ఈ నెల 22వ తేదీ నాటికి విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఎంసెట్‌తో సహా ఇతర సెట్స్ నిర్వహించే యూనివర్సిటీలను, సెట్స్‌కు కన్వీనర్లను ఎంపిక చేసిన మండలి నోటిఫికేషన్ల జారీపై దృష్టి సారిం చింది. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. తెలంగాణలో మాత్రం ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదు. రాష్ట్ర విద్యార్థులతోపాటు ఏపీకి చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థులంతా తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 25న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతో పోలిస్తే ఈసారి ఆలస్యమేమీ కానప్పటికీ త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. మరో రెండు మూడ్రోజుల్లో ఎంసెట్ కమిటీని ఏర్పాటు చేసి, 22వ తేదీ నాటికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యా మండలి కసరత్తు చేస్తోంది. 22న వీలు కాకపోతే 25లోగా నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎంసెట్ విధివిధానాలు, ఫీజు తదితర వివరాలతో కూడిన నివేదికను ఎంసెట్ కన్వీనర్ ప్రొ. ఎన్వీ రమణరావు ఉన్నత విద్యా మండలికి అందజేసినట్లు తెలిసింది. ఇతర సెట్స్ (ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర) నోటిఫికేషన్లను కూడా ఒక్కొక్కటిగా జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఒకట్రెండు రోజుల నుంచే దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టాలని విద్యా మండలి భావిస్తోంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని ఎంసెట్ కన్వీనర్‌ను ఆదేశించింది. పెరగనున్న దరఖాస్తుల సంఖ్య తెలంగాణ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, అనవసరపు ఆందోళనలు, అపోహలు తొలగిపోవడంతో ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తుండటంతో రాష్ట్రం నుంచి కూడా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. గతేడాది తెలంగాణ ఎంసెట్‌కు 2,32,047 మంది (ఇంజనీరింగ్‌కు 1,39,682, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 92,365 మంది) దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఏపీకి చెందిన వారు 43,169 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 9,458 మంది, తెలంగాణకు చెందిన వారు 1,79,420 మంది ఉన్నారు. -
మే తొలి వారంలోనే తెలంగాణ ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు తేదీలు ఖరారైన నేపథ్యంలో తెలంగాణ లోనూ ఎంసెట్, ఐసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ఏపీలో మే 5న ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించగా.. అంతకంటే ముందుగానే రాష్ట్రంలో ఎంసెట్‌ను నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, ఇతర అధికారులు, ఆ తరువాత వర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ఈ సమావేశానంతరం పోటీ పరీక్షల తేదీల్ని నిర్ణయించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో ప్రకటించాలని మండలి భావిస్తోంది. ఒకవేళ వీలైతే మే 2న ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది. -
జేఎన్ టీయూలో కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్: ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం తెలంగాణలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్-2015 లో జాప్యం జరిగింది. మధ్యాహ్నం రమ్మన్న అధికారులు ఇప్పటివరకూ తమను కౌన్సిలింగ్ కు పిలువకపోవడంతో కౌన్సిలింగ్‌కు వచ్చిన కొందరు వారిని ప్రశ్నించారు. రాత్రంతా కౌన్సెలింగ్ జరుగుతుందని వారు బదులివ్వడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాత్రంతా తాము ఎక్కడ ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
హైదరాబాద్ : తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 20 హెల్ప్‌లైన్ సెంటర్లలో ధృవ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఎంసెట్ కౌన్సింగ్‌కు 90,556 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లు, ర్యాంక్ కార్డు, ఆదాయ పత్రం, ఇంటర్ మార్క్ మెమో, కుల ధృవీకరణ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
ఆ ఇంటి కూతుళ్లు ముగ్గురూ డాక్టర్లే!
కూతురంటే గుండెమీద కుంపటి కాదు.. కూతురంటే కొండంత అండ. అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు కూతుళ్లుంటే..! అది కూడా ముగ్గురూ డాక్టర్లయితే.. ఇంకేం కావాలా తండ్రికి? తాజాగా విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో.. పటాన్‌చెరుకు చెందిన మందముల నివార్తిదేవ్ కుమార్తె ఎం.చరిష్మా 390 ర్యాంకు సాధించింది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన చరిష్మా... స్థానిక కార్పొరేటర్ సపాన్‌దేవ్ సోదరుడి కుమార్తె. నివార్తిదేవ్‌కు ముగ్గురు కూతుళ్లు. మొదటి కూతురు షాలిని గాంధీలో హౌస్ సర్జన్‌గా చేస్తున్నారు. రెండో అమ్మాయి శ్రవంతి గాంధీలోనే ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. మూడో కుమార్తె చరిష్మా. తాజాగా ఈమె కూడా మెడిసిన్‌లో చేరబోతోంది. అంటే ఈ ఇంట్లో ముగ్గురూ డాక్టర్లేనన్నమాట. నివార్తిదేవ్ పటాన్చెరు ఉపసర్పంచ్‌గా పనిచేశారు. 'ఒక కూతురన్నా డాక్టరైతే బాగుండనుకున్నా. కానీ... ముగ్గురూ అదే రంగంలోకి రావడం సంతోషంగా ఉంది. వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా పీజీ చేయిస్తా. మిగిలింది కుమారుడు సాయికౌశిక్... సివిల్స్ సాధించాలని కోరుకుంటున్నాం' అన్నారు నివార్తిదేవ్. 'ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అక్కలే స్ఫూర్తి, అమ్మానాన్నల ఆశీస్సులతో ఈ ఘనత సాధించా. గైనకాలజిస్టునయ్యి నిస్వార్థ సేవ చేయాలని కోరుకుంటున్నా. అందుకు అహర్నిశలూ శ్రమిస్తా' అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది చరిష్మా. -
మెడి‘సీన్ రివర్స్’!
* తెలుగు రాష్ట్రాల ఎంసెట్లలో ఆసక్తికర ఫలితాలు * టీఎంసెట్‌లో ‘మెడిసిన్’ టాపర్ ఏపీ విద్యార్థి.. * ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు * ఇంజనీరింగ్‌లో రెండు చోట్లా తెలంగాణ విద్యార్థులకే మొదటి స్థానం * టీఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి * నేటి నుంచి వెబ్సైట్లో ఓఎంఆర్ జవాబు పత్రాలు * ఉత్తీర్ణత: మెడిసిన్‌లో 85.98%, ఇంజనీరింగ్‌లో 70.65% * జూలై 7 నుంచి ఇంజనీరింగ్ తరగతులు * ప్రవేశాలకు వచ్చే నెల 12న షెడ్యూల్ రెండు రాష్ట్రాల ఎంసెట్లలో ఆసక్తికర ఫలితాలు సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా నిర్వహించిన ఎంసెట్‌ల ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలోనైతే ఏపీ పరీక్షలో తెలంగాణకు చెందిన అబ్బాయి టాప్ ర్యాంకు సాధించగా.. తాజాగా గురువారం విడుదలైన తెలంగాణ పరీక్షలో ఏపీకి చెందిన అమ్మాయి మొదటి ర్యాంకు సాధించింది. అంతేకాదు రాష్ట్ర విభజన తరువాత మొదటిసారిగా వేర్వేరుగా జరిగిన ఈ రెండు ఎంసెట్‌లకు పలువురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో కొందరు రెండు చోట్లా మంచి ర్యాంకు సాధించారు కూడా. గురువారం ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి ఉప్పల పాటి ప్రియాంక మొదటి ర్యాంకు సాధించింది. అదే ఈనెల 21న ప్రకటించిన ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగం ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి కాడ శ్రీవిధుల్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోవడం గమనార్హం. ఇంజనీరింగ్ విభాగంలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ తెలంగాణ విద్యార్థులే మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరిం గ్ విభాగంలో తెలంగాణకు చెందిన మోపర్తి సాయి సందీప్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా... అటు ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనూ హైదరాబాద్‌కు చెందిన కొండపల్లి అనిరుధ్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తంగా తెలంగాణ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో టాప్-10 ర్యాంకులు సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణకు చెంది న వారు కాగా.. మరో ఐదుగురు ఏపీకి చెందిన విద్యార్థులు. తెలంగాణ ఇంజనీరింగ్‌లో మాత్రం టాప్-10లో ఎనిమిది మంది రాష్ట్ర విద్యార్థులు కాగా.. ఇద్దరే ఏపీ వారు. ర్యాంకులు విడుదల చేసిన కడియం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులు గురువారం ప్రకటించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ర్యాంకులను విడుదల చేశారు. విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన స్కోర్‌కు వారు ఇంటర్ సాధించిన మార్కుల వెయిటేజీ (25 శాతం) కలిపి ఈ ర్యాంకులను ప్రకటించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజారామయ్యార్, సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, ఎంసెట్ కన్వీనర్ రమణరావు, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జేన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 70.65 శాతం.. తెలంగాణ ఎంసెట్ కోసం మొత్తంగా 2,32,047 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈనెల 14న నిర్వహించిన పరీక్షకు 1,28,162 మం ది హాజరయ్యారు. ఇందులో 90,556 మంది విద్యార్థులు (70.65 శాతం) అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,365 మంది దరఖాస్తు చేసుకోగా.. 84,659 మంది పరీక్ష రాశారు. అందులో 72,794 మంది (85.98 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు. వెబ్సైట్లో జవాబు పత్రాలు.. విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. 29వ తేదీ సాయంత్రం 5 నుంచి వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 5 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిలో ఏమైనా తేడాలుంటే వెంటనే వెబ్సైట్ ద్వారా తెలియజేయాలి. 3వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గణితంలో మారిన ఆప్షన్.. ఎంసెట్ గణితం సబ్జెక్టు కోడ్-ఏలో 23వ ప్రశ్నకు (కోడ్-బీలో 60వ, కోడ్-సీలో 24వ, కోడ్-డీలో 68వ ప్రశ్నగా వచ్చింది) ప్రాథమిక కీలో 3వ ఆప్షన్‌ను సరైన సమాధానంగా పేర్కొనగా.. దానిపై అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ 2వ ఆప్షన్‌ను సరైన సమాధానంగా ఖరారు చేసింది. ఇక మెడి సిన్ పరీక్ష కోడ్-ఏలో 43వ ప్రశ్నకు 1, 3గా సమాధానాలుగా మార్చారు. టాపర్ల మనోగతం: మెడిసిన్ విభాగం కష్టపడి చదివాను ‘‘ చాలా కష్టపడి చదివాను. ఇంటర్లో 98శాతం మార్కులు సాధించా. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు వచ్చినా కూడా తెలంగాణలోనే చదువుతా. పేద ప్రజలకు సేవలందిస్తా. ’’ - కాడ శ్రీవిధుల్, 2వ ర్యాంకు కార్డియాలజిస్ట్ అవుతా.. ‘‘ఎంసెట్‌లో 160 మార్కులకు 159 మార్కులు సాధించా. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదవాలని ఉంది. కార్డియాలజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పేదలకు వైద్యం అందించాలనేది నా లక్ష్యం..’’ - వంగాల అనూహ్య, 3వ ర్యాంకు మెడిసిన్ చేయాలనేది కోరిక.. ‘‘మెడిసిన్ చేయాలన్నది ఎప్పటి నుం చో నా కోరిక. ఎయిమ్స్‌లో సీటు సాధించేందుకు శాయశక్తులా కష్టపడతా. ఏపీ ఎంసెట్‌లో 85వ ర్యాంకు వచ్చింది. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో 4వ ర్యాంకు వచ్చింది. ఇంటర్లో 984 మార్కులు వచ్చాయి’’ - సాయితేజ, 4వ ర్యాంకు న్యూరాలజిస్టునవుతా.. ‘‘ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేయాలన్నది నా కోరిక. గొప్ప న్యూరాలజిస్టు కావడం నా లక్ష్యం. రోజుకు 8 నుంచి 10 గంటలు చదివా. కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించాను’’ - చెన్నూరి సాయిరెడ్డి, 5వ ర్యాంకు నిజాయితీగా సేవలందిస్తా... ‘‘అమ్మా నాన్న కష్టజీవులు. వారికి అండగా నిలవాలనేది నా అభిలాష. వైద్య వృత్తిలో స్థిరపడి నిజాయతీగా పనిచేసి ప్రజలకు సేవలు చేయాలనేది లక్ష్యం. మా అమ్మనాన్నల కల కూడా అదే. దానిని నెరవేర్చేదిశగా చదువుల్లో ముందుకు సాగుతున్నా..’’ - పైడి తేజేశ్వరరావు, 6వ ర్యాంకు పేదలకు సేవ చేస్తా.. ‘‘తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం మొదటి నుంచి ఉంది. ఓయూలో చదివి కార్డియాలజిస్ట్ కావడం నా లక్ష్యం. పేదలకు సేవ చేయాలని ఉంది.’’ - నాగసత్య వరలక్ష్మి, 7వ ర్యాంకు మెడిసిన్ చదవాలని ఉంది ‘‘మంచి ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉంది. జాతీయ స్థాయిలో ఏఐఎం, జిప్మర్లో మంచి ర్యాంకు సాధించి, జాతీయ స్థాయి సంస్థలో మెడిసిన్ చదవాలని ఉంది. అందుకోసం ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతున్నాను. ఇంటర్లో 987 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 20వ ర్యాంకు వచ్చింది..’’ - బి.కీర్తన షణ్ముఖ, 8వ ర్యాంకు గొప్ప వైద్యుడిని కావాలని ఉంది ‘‘ న్యూరాలజిస్టు కావాలన్నదే నా లక్ష్యం. ఏపీ ఎంసెట్‌లో ఆరో ర్యాంకు సాధించా. మా అమ్మ, నాన్న, తాత వైద్యులే. వారి ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించా. మంచి వైద్యుడిని కావాలని ఉంది..’’ - అన్ష్గుప్తా, 9వ ర్యాంకు సివిల్స్ సాధించడమే లక్ష్యం.. ‘‘సివిల్స్ సాధించి దేశసేవ చేస్తా. ఐఏఎస్ కావడం నా చిన్నప్పటి కోరిక. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలనుంది.’’ - సాయిప్రీతమ్, 10వ ర్యాంకు ఇంజనీరింగ్ విభాగం కంప్యూటర్ సైన్స్ చదువుతా.. ‘‘ఎంసెట్‌లో మొదటి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో నాకు 6వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 326 మార్కులు సాధించాను. ముంబై ఐఐటీ సీఎస్సీ చేస్తా...’’ - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకు మా నాన్నే స్ఫూర్తి.. ‘‘ఎంసెట్‌లో రెండో ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. మా నాన్న నాగేశ్వరరావు నాకు స్ఫూర్తి. ఆయన అనుక్షణం నన్ను ప్రోత్సహించారు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేస్తా. సాఫ్ట్వేర్ సంస్థకు సీఈవో కావడమే లక్ష్యం..’’ - రౌతు నిహార్ చంద్ర, రెండో ర్యాంకు ఆనందంగా ఉంది ‘‘మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. 3వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. మా నాన్న మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఏపీ ఎంసెట్‌లో 18వ ర్యాంకు వచ్చింది..’’ - బి.కీర్తన, 3వ ర్యాంకు ఐఐటీలో చదవాలని ఉంది.. ‘‘ఐఐటీలో చేరి సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో కష్టపడి చదువుతున్నాను. 4వ ర్యాంకు సంతృప్తిని ఇచ్చింది.’’ - జి.సాయితేజ, 4వ ర్యాంకు సేవ చేయాలని ఉంది ‘‘మంచి ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించా. ఇంటర్లో 978 మార్కులు వచ్చాయి. మంచి ఉద్యోగం చేస్తూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఉంది..’’ - వి.హేమంత్ రెడ్డి, 5వ ర్యాంకు ఎమ్మెస్సీ చేస్తా.. ‘‘తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సాహంతోనే 6వ ర్యాంకు సాధిం చాను. ఐఐటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజ నీరింగ్ చదవాలని ఉంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ, ఎంబీయే చేయాలని నా కోరిక.’’ - తన్నీరు శ్రీహర్ష, 6వ ర్యాంకు గొప్ప ఇంజనీర్ కావాలనుంది ‘‘మా అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. విజయనగరం జిల్లా ఎం.కొత్తవలస మా స్వస్థలం. గొప్ప ఇంజనీర్ కావాలని ఉంది..’’ - ఎం.సందీప్‌కుమార్, 7వ ర్యాంకు కంప్యూటర్ ఇంజనీర్ అవుతా.. ‘‘ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడమే నా లక్ష్యం. 8వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఇంటర్లో 975 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 7వ ర్యాంకు సాధించా..’’ - గార్లపాటి శ్రీకర్, 8వ ర్యాంకు ఐఏఎస్ కావడమే లక్ష్యం.. ‘‘ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ప్రస్తుతం ఐఐటీ ముంబైలో సీటు సాధించి చదువుతా.. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మం చి ర్యాంకు సాధించాను.’’ - అక్షిత్‌రెడ్డి, 9వ ర్యాంకు ముంబై ఐఐటీలో చేరుతా.. ‘‘ఐఐటీ ముంబైలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనేది నా లక్ష్యం. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. ఇంటర్లో 971 మార్కులు వచ్చాయి..’’ - కె.అనిరుధ్‌రెడ్డి, పదో ర్యాంకు -
ఎంసెట్‌లో రికార్డుల పంట
ఎంసెట్‌లో శ్రీచైతన్య నారాయణ రికార్డు హైదరాబాద్: గురువారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య నారాయణ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారని ఆ విద్యా సంస్థల డెరైక్టర్లు సుష్మా, పి.సింధు నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో సాయి సందీప్ మొదటి ర్యాంకు, నిహార్ చంద్ర 2వ, కీర్తన 3వ ర్యాంకు ఇలా టాప్ పది ర్యాంకుల్లో పది ర్యాంకులను, టాప్-25లో 25, టాప్-50లోపు 47 ర్యాంకులను శ్రీచైతన్య నారాయణ విద్యార్థులే కైవసం చేసుకుని నంబర్ వన్‌గా నిలిచారని పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా వారు అభినందించారు. చరిత్ర సృష్టించిన నారాయణ శ్రీచైతన్య హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో నారాయణశ్రీచైతన్య విద్యార్థులు అత్యంత అద్భుతమైన ఫలితాలు సాధించి, రికార్డు సృష్టించారని ఆ విద్యా సంస్థల డెరైక్టర్లు పి.సింధు నారాయణ, సుష్మా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడిసిన్ విభాగంలో ఉప్పలపాటి ప్రియాంక మొదటి ర్యాంకు, కాడ శ్రీవిధుల్ 2వ, వంగల అనూహ్య 3వ ర్యాంకు ఇలా టాప్ పది ర్యాంకుల్లో పది ర్యాంకులను, టాప్-25లో 24, టాప్-50లోపు 48 ర్యాంకులను నారాయణ శ్రీచైతన్య విద్యార్థులే కైవసం చేసుకున్నారని వారు చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు. ఎంసెట్‌లో శ్రీగాయత్రి విజయకేతనం హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో శ్రీగాయత్రి విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ పీవీఆర్కే మూర్తి ఒక ప్రకటనలో వెల్లడించారు. కొత్త రాష్ట్రం తొలి ఎంసెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి సంచలనం సృష్టించి.. టాప్-10లో నిలిచారని చెప్పారు. ఈ ఘన విజయాలకు తాము ప్రతిష్టాత్మకంగా రూపొందించిన శ్రీగాయత్రి లక్ష్య ఇంటెన్సివ్ ప్రోగామే కారణమని పేర్కొన్నారు. అలాగే జాతీయస్థాయిలో బిట్‌శాట్, క్లాట్ సహా అన్ని పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారన్నారు. ఈ విజయం సాధించిన విద్యార్థులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. టాప్ లేపిన ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థులు గుంటూరు: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో స్టేట్ టాప్ స్థాయిలో సీట్లు పొందేలా వేలాది ర్యాంకులను ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థులు సాధించారని ఆ సంస్థ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్, డెరైక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 80వ ర్యాంకు, 91వ ర్యాంకు ఇలా.. 7,850కు పైగా సీట్ గెటింగ్ ర్యాంకులను, మెడిసిన్ విభాగంలో 40వ ర్యాంకు, 42, 70.. ఇలా 280కి పైగా సీట్లు పొందగల ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని చెప్పారు. తమ విద్యా ప్రణాళిక, బోధనా సరళి, అనుభవం గల ఫ్యాకల్టీయే ఈ విజయాలకు కారణమన్నారు. ఈ సందర్భంగా ఎంసెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమ విద్యార్థులను, అధ్యాపకులను వారు అభినందించారు. పావుగంట ముందుగానే ఫలితాలు! ఎంసెట్ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించడానికి పావుగంట ముందే ఎంసెట్ వెబ్సైట్లో వచ్చాయన్న వార్తలు కలకలం రేపాయి. ఇదే విషయాన్ని మంత్రి ముందు ప్రస్తావించగా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇదేమీ ప్రశ్నాపత్రం కాదు కదా.. ఫలితాలు ఎలాగూ విద్యార్థులకు చేరేవే కదా అని చివరికి పేర్కొనడం గమనార్హం. ఎంసెట్ వచ్చినా.. ఇంటర్ పోయింది! వారు ఎంసెట్‌లో ఉత్తీర్ణులు అయ్యారు.. కానీ ఇంజనీరింగ్లోనో, మెడిసిన్లోనో చేరలేరు.. ఎందుకంటే ఇంటర్‌లోనే ఫెయిలయ్యారు. ఇలాంటి 17,338 మంది విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకులను కేటాయించలేదు. మరో 2,558 మంది విద్యార్థులు ఇంటర్ ఉత్తీర్ణులయ్యారా, లేదా అన్న వివరాలు ఎంసెట్ కమిటీకి అందకపోవడంతో వారికి ర్యాంకులు కేటాయించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ రాసినవారు 13,817 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 6,079 మందికి నిరుత్సాహమే మిగిలింది. సంక్షేమ గురుకులాల్లో మంచి ఫలితాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ విద్యార్థులు ఎంసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మెడిసిన్ విభాగంలో పదివేలలోపు ర్యాంకులను పదిమంది విద్యార్థులు సాధించారు. ఐఐటీ గౌలిదొడ్డికి చెందిన ఇద్దరు విద్యార్థులు 2,569, 2,690 ర్యాంకులు సాధించారు. కరీంనగర్ సీడీఈకి చెందిన విద్యార్థి 3,379 ర్యాంకు సాధించాడు. ఇంజనీరింగ్ విభాగంలోనూ గురుకులాల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. పదివేల లోపు ర్యాంకులను 16 మంది విద్యార్థులు సాధించారు. కరీంనగర్ సీడీఈకి చెందిన విద్యార్థి 2,848 ర్యాంకు, ఐఐటీ గౌలిదొడ్డికి చెందిన ఇద్దరు విద్యార్థులు 4,835, 4,933 ర్యాంకులను సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురుకులాల సొసైటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఎంసెట్‌లో ఎస్టీ గురుకుల విద్యార్థుల ప్రతిభ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించారు. మెడికల్ విభాగంలో రాజేంద్రనగర్ ఐఐటీ స్టడీసెంటర్‌కు చెందిన లాలూనాయక్ 6,223 ర్యాంకు సాధించాడు. వరంగల్ సీవోఈలో చదువుకున్న ముడావత్ శ్రీకాంత్ 8,443 ర్యాంకు, రాజేంద్రనగర్ సెంటర్‌కు చెందిన కె.అశోక్ 9,782 ర్యాంకు సాధించారు. 10 నుంచి 20 వేల మధ్యలో మరో ఏడుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో రాజేంద్రనగర్ ఐఐటీ సెంటర్‌కు చెందిన చంద్రా 4,407 ర్యాంకు సాధించాడు. 5-10 వేల మధ్య 9 మంది, 10-20 వేల మధ్య 21 మంది ర్యాంకులు సాధించారు. ఆ విద్యార్థులకు మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందనలు తెలిపారు. అసత్య ఆరోపణలు మానుకోవాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఎంసెట్లు నిర్వహిస్తే ఏపీ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని చేసిన అసత్య ఆరోపణలను ఇప్పటికైనా మానుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యలో ప్రాంతీయ వివక్ష లేదనడానికి ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడమే నిదర్శనమన్నారు. ఈ ఫలితాలతో ఏపీ రాజకీయ నాయకుల ఆరోపనలు అవాస్తవమని తేలిపోయిందని చెప్పారు. విభజన చట్టం ప్రకారమే ప్రవేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. 85.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ లో 85.98, ఇంజినీరింగ్ లో 70.65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇవ్వగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు. విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా విడుదల చేశారు. -
నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు
-
నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు
* విడుదల చేయనున్న కడియం శ్రీహరి * ఇంటర్ వార్షిక పరీక్షల మార్కుల వెయిటేజీతో ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను గురువారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొ. ఎన్వీ రమణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ర్యాంకులను హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని వెల్లడించారు. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇస్తుండగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు. ఫలితాల కోసం www.sakshieducation.com www.tseamcet.in www.results.cgg.gov.in -
రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
-
రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ - 2015 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జేఎన్టీయూలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈమేరకు మంత్రి బుధవారం విలేకరులకు సమాచారం అందించారు. ఎంసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు www.sakshieducation.com, www.teamct.in వెబ్ సైట్ లో చూడవచ్చని ఆయన తెలిపారు. -
100 శాతం కచ్చితత్వంతో సాక్షి ఎంసెట్ కీ
హైదరాబాద్: మే 16న ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ తో పోల్చితే.. పరీక్ష జరిగిన మరుసటి రోజే సాక్షి ప్రచురించిన ఎంసెట్ మెడికల్ కీ 100% కచ్చితత్వంతో, ఇంజనీరింగ్ కీ 98.12% కచ్చితత్వంతో ఉంది. విభజన తర్వాత టీ సర్కార్ తొలిసారిగా విడిగా ఈ నెల 14న ఎంసెట్‌ను నిర్వహించింది. ఇంజనీరింగ్ పరీక్షకు 1,28,174 మంది, మెడికల్‌కు 64,678 మంది హాజరయ్యారు. అభ్యర్థులకు ఉపయోగపడేలా సబ్జెక్టు నిపుణుల బృందం సహాయంతో సాక్షి మే 15న ఎంసెట్ కీ ప్రచురించింది. అంతేకాకుండా పరీక్ష జరిగిన రోజే కీతోపాటు కొశ్చన్ పేపర్స్‌ను సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్‌లో అందుబాటులో ఉంచింది. -
తెలంగాణ ఎంసెట్
-
'క్యూ' సెట్ తో తెలంగాణ ఎంసెట్
-
'క్యూ' సెట్ తో తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సెట్ 'క్యూ' విడుదల చేశారు. తెలంగాణలో 423 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,31,998 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ కు 251 సెంటర్లు, మెడికల్ అగ్రికల్చర్ కు 172 సెంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. మెడిసిన్ పరీక్షను మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు అన్నారు.