
నేడు ఎంసెట్ ఫలితాలు
మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12 గం.కు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలి పారు. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. విద్యార్థుల మార్కులతోపాటు ర్యాంకులను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 12న నిర్వహించిన ఈ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగంలో 1,39,100 మంది... అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73,601 మంది విద్యార్థులు హాజరైనట్లు వివరించారు. ఫలితాలను sakshieducation. com, sakshi. com, eamcet. tsche. ac. in వెబ్‌సైట్‌లలో పొందవచ్చని తెలిపారు.