తెలంగాణ ఎంసెట్-3 పరీక్షకు ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగనున్న ఎంసెట్-3 పరీక్షకు ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఆదివారం ఉదయం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40,168 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 96 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ పరీక్ష జరుగనుంది.