తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రవిశ్రీ తేజ, సెకండ్ ర్యాంక్ డి.చంద్రశేఖర్ మూడో ర్యాంక్ ఆకాశ్ రెడ్డి (హైదరాబాద్), నాలుగో ర్యాంక్ కార్తీకేయ (హైదరాబాద్) సాధించారు. ఇక ఇంటర్ వెయిటేజ్ మార్కుల కారణంగా ఎంసెట్ ఫలితాలు విడుదలలో జాప్యం జరిగింది.