'ఎంసెట్-2 కు మళ్లీ ఫీజు సరికాదు' | exam fee for telangana eamcet-2 | Sakshi
Sakshi News home page

'ఎంసెట్-2 కు మళ్లీ ఫీజు సరికాదు'

Published Fri, May 27 2016 7:09 PM | Last Updated on Sat, Aug 11 2018 7:23 PM

exam fee for telangana eamcet-2

హైదరాబాద్: తెలంగాణలో జూలై9 న నిర్వహించే ఎంసెట్-2 ప్రవేశ పరీక్షకు రెండవసారి పరీక్ష రుసుమును వసూలు చేయడం సరికాదని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మరలా పరీక్ష రుసుమును చెల్లించాలనే నిబంధన  పెట్టడం అన్యాయమన్నారు. ఈ నెల 15 న జరిగిన ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్ధులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల నుండి పరీక్ష రుసుము వసూలు చేసుకుంటే సమంజసమని.. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సామల విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement