
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 102 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. 1,43165 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని.. ఈ నెల 7 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. (చదవండి: సెషన్‌కు సెషన్‌కు మధ్య 3 గంటలు..)
శానిటైజర్లు విద్యార్థులు తెచ్చుకోవచ్చని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలన్నారు. ముందురోజే వెళ్లి పరీక్ష కేంద్రం నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు. అక్టోబర్ మొదటివారంలో ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నామని గోవర్ధన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment